Medical insurance scheme
-
ఏపీకి ఆరోగ్య సిరి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఆరోగ్యశ్రీది ఒక చరిత్ర. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ నేడు కోట్లాది మంది పేద ప్రజల ప్రాణాలను కాపాడుతోంది. దేశంలోనే పలు రాష్ట్రాలకు రోల్‌మోడల్‌గా నిలిచింది. వైద్యం కోసం ప్రభుత్వమే బీమా చెల్లిస్తూ ఉచితంగా వైద్యం అందిస్తున్న పరిస్థితి ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. తరువాత స్థానంలో తెలంగాణ ఉంది. ఆరోగ్యశ్రీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించారు కాబట్టి దీన్ని రాష్ట్రం విడిపోయాక కూడా తెలంగాణలో కొనసాగిస్తున్నారు. ఈ పథకం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో పేద కుటుంబాలకు వరప్రసాదిని అయిందని తాజాగా జాతీయ శాంపిల్ సర్వేలో తేలింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వం కల్పించే ఉచిత వైద్య బీమా పథకంలో ఇంతగా లబ్ధిపొందిన దాఖలాలు లేవని తేల్చారు. నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం.. ► దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 85.9 శాతం మందికి ఎలాంటి బీమా వర్తించడం లేదు.. పట్టణ ప్రాంతాల్లో 80.9 శాతం మందికి ఉచిత బీమా లేదు ► ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ లాంటి పథకం వల్ల భారీగా పాకెట్ ఎక్స్పెండిచర్ (వైద్యానికయ్యే జేబు ఖర్చు) తగ్గింది. ► దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక, తమిళనాడు, కేరళతో పోల్చుకుంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పేదలు ఎక్కువగా లబ్ధిపొందుతున్నారు. లబ్ధిపొందుతున్న వారిలో ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువమంది ఉన్నారు. ప్రభుత్వాలే ఉచితంగా బీమా కల్పించి వైద్యం అందించడం వల్ల కొన్ని లక్షల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకుండా నిలబడగలిగాయి. ► చాలా రాష్ట్రాల్లో జీవనశైలి జబ్బులైన క్యాన్సర్, గుండె, నరాల జబ్బులతో కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నమయ్యాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ వంటి పథకం ఉండటం వల్ల పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు మరింతమంది లబ్ధిదారులు జాతీయ శాంపిల్ సర్వే అనంతరం రాష్ట్రంలో మరిన్ని మార్పులు జరిగాయి. గతంలో తెల్లరేషన్ కార్డు ఉన్న వారికే ఆరోగ్యశ్రీ కార్డు మంజూరు చేసేవారు. అయితే ఇప్పుడు తెల్లకార్డుతో సంబంధం లేకుండా వార్షికాదాయం రూ.5 లక్షలలోపు ఉన్న వారందరికీ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు మంజూరు చేశారు. జబ్బుల సంఖ్యను 1,059 నుంచి 2వేలకు పైగా పెంచారు. దీంతో ఇటీవలి కాలంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల సంఖ్య మరింతగా పెరిగింది. రాష్ట్రంలో 95 శాతం కుటుంబాలు పైగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చాయి. ఆస్పత్రిలో బిల్లు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే వెసులుబాటుతో మరింతగా జేబు ఖర్చులు తగ్గినట్టు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తుండటంతో లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరగనున్నట్టు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. -
మహిళలకు ‘మై హెల్త్ ఉమెన్ సురక్షా’ ప్లాన్
మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సమగ్ర వైద్య బీమా పథకం ‘మై హెల్త్ ఉమెన్ సురక్షా’ను ప్రముఖ బీమా సంస్థ హెచ్డీఎఫ్సీ ఎర్గో ఆవిష్కరించింది. మహిళల జీవితంలో వైద్య పరంగా అత్యవసర పరిస్థితులు, అనారోగ్య సమస్యల సమయంలో ఆర్థిక సాయంతో అదుకునేలా ఈ పాలసీని కంపెనీ రూపొందించింది. పాలసీ రెన్యువల్ సమయంలో మహిళల ఫిట్నెస్ (శారీరక, మానసిక ధృడత్వం) ఆధారంగా తగ్గింపు ఇస్తుంది.వ్యాధి నిరోధక ముందస్తు వైద్య పరీక్షలు, హెల్త్ కోచింగ్, పోషకాహారం, సరైన స్థాయిలో బరువు ఉండేలా చూడడం తదితర అంశాల్లో వివరాలు అందిస్తుంది. ఫార్మసీ కొనుగోళ్లపైనా తగ్గింపులు ఇస్తుంది. గర్భధారణ సమ యంలో కౌన్సెలింగ్, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం.. ఇలా ఎన్నో అంశాల్లో హెచ్డీ ఎఫ్‌సీ ఎర్గో ‘మై హెల్త్ ఉమెన్ సురక్షా’ పాలసీ దారులకు చేదోడుగా ఉంటుంది. 18–65 సంవత్సరాల వయసు లోని వారు పాలసీకి అర్హులు. ‘‘మహిళలు భిన్న వయసుల్లో ఎన్నో రిస్క్‌లను ఎదుర్కొం టున్నారు. వీటిల్లో కేన్సర్, గుండె జబ్బులు, గర్భధారణ సమయంలో ప్రాణ ప్రమాదం ఇలా ఎన్నో అవసరాల్లో మద్దతుగా నిలిచేలా మై హెల్త్ ఉమెన్ సురక్షా ప్లాన్ ను రూపొం దించాం’’ అని హెచ్డీఎఫ్సీ ఎర్గో ఎండీ, సీఈవో రితేష్ కుమార్ తెలిపారు. -
బీమా పాలసీలు ప్రత్యేకం..
కోటికి వైద్య బీమా సిగ్నా టీటీకే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘ప్రో హెల్త్’ పేరుతో కొత్త వైద్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. కనిష్టంగా రూ. 2.5 లక్షల నుంచి గరిష్టంగా కోటి రూపాయల వరకు బీమా రక్షణ కల్పించడం ఈ పాలసీలోని ప్రత్యేకత. ప్రొటెక్ట్, ప్లస్, ప్రిఫర్డ్, ప్రీమియర్ పేరుతో ఈ పాలసీ నాలుగు రకాల ఆప్షన్లు అందిస్తోంది. ప్రీమియం భారం తగ్గించుకోవడానికి కో-పేమెంట్ అవకాశాన్ని కల్పిస్తోంది. అదే 65 ఏళ్లు దాటిన వారికి కో-పేమెంట్ తప్పనిసరి. మ్యాక్స్ లైఫ్ శిక్షా సూపర్ ప్లస్ ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీ మ్యాక్స్ లైఫ్ పిల్లల ఆర్థిక లక్ష్యాలను చేరుకునే విధంగా ‘శిక్షా ప్లస్ సూపర్’ పేరుతో యులిప్ పాలసీని ప్రవేశపెట్టింది. పిల్లల ఉన్నత చదువులకు అక్కరకు వచ్చే విధంగా తీర్చిదిద్దిన ఈ పథకం గ్యారంటీ లాయల్టీ అడిషన్‌తో పాటు అవసరమైతే 5 ఏళ్ల తర్వాత నుంచి కొంత మొత్తం వెనక్కి తీసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. తల్లిదండ్రులకు ఏమైనా అనుకోని సంఘటన జరిగితే పాలసీ మొత్తం చెల్లించడంతోపాటు, పిల్లల భవిష్యత్తు ఫీజులను కూడా బీమా కంపెనీయే భరిస్తుంది. కొటక్ ‘జిఫి’ అకౌంట్ కొటక్ మహీంద్రా బ్యాంక్ ‘జిఫి’ పేరుతో సోషల్ నెట్వర్క్ బ్యాంక్ అకౌంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సోషల్ నెట్‌వర్క్‌లో ఉన్న వారికోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఈ అకౌంట్‌ను రూ.5,000తో ప్రారంభించొచ్చు. కనీస నిల్వ అవసరం లేదు. సేవింగ్స్ ఖాతాపై ఎటువంటి వడ్డీ ఉండదు. అకౌంట్లో ఉన్న నగదు రూ.25,000 దాటితే అది ఆటోమేటిక్‌గా ఫిక్స్డ్ డిపాజిట్‌గా మారిపోతుంది.