mega housing scheme
-
మెగా హౌసింగ్ గ్రౌండింగ్ లో సిక్కోలు నెం1
శ్రీకాకుళం: కొత్త ఊళ్లకు పునాదులు పడ్డాయి. పేదల ఆశలకు, సర్కారు ఆశయానికి సత్తువనిస్తూ శంకుస్థాపనలు జోరుగా జరిగాయి. మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళాలో సిక్కోలు మెగా సక్సెస్ అయ్యింది. లక్ష్యం కంటే అధికంగా శంకుస్థాపనలు చేసి అధికారులు జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టారు. రాష్ట్ర స్థాయిలో మన జిల్లాకు మూడు రో జులు మెగా గ్రౌండింగ్‌లో లక్ష్యంగా 24,125 ఇళ్లకు శంకుస్థాపన చేయాలని తెలిపారు. అయితే మూడు రోజుల్లో 52,541 ఇళ్లకు శంకుస్థాపన చేసి టార్గెట్ కంటే 200 శాతం ఎక్కువగా చేసిన ఘనత జిల్లాకు దక్కింది. గ్రాండ్‌గా గ్రౌండింగ్.. జగనన్న పేదల ఇళ్ల నిర్మాణ పథకం నిర్వహణలో జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. పేదల ఇళ్ల శంకుస్థాపనకు జూలై 1, 3, 4వ తేదీల్లో ప్రభుత్వం మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళా నిర్వహించింది. కార్యక్రమంలో 200 శాతానికి పైగా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి సిక్కోలు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని గృహ నిర్మాణ శాఖ పథక సంచాలకులు టి.వేణుగోపాల్ వెల్లడించారు. ఈ మెగా గ్రౌండింగ్ మేళా కార్యక్రమం విజయవంతం కావడానికి వలంటీర్ల దగ్గర నుంచి ఉన్నతాధికారుల వరకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్, సంయుక్త కలెక్టర్లు డాక్టర్ కె.శ్రీనివాసులు, ఆర్.శ్రీరాములు నాయుడు, గృహ నిర్మాణ శాఖ సంయుక్త కలెక్టర్ హిమాంశు కౌశిక్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. జూలై 3న పొన్నాడలో నిర్వహించిన గ్రౌండింగ్ మే ళా కార్యక్రమంలో ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజ య్ జైన్ వీడియో కాల్ ద్వారా నేరుగా లబ్ధిదారుల తో మాట్లాడి జిల్లా యంత్రాంగం చేపట్టిన ఏర్పాట్లను తెలుసుకొని సంతోషాన్ని వ్యక్తపరిచారని చెప్పారు. ఇదే స్ఫూర్తి కొనసాగిద్దాం: కలెక్టర్ జిల్లాలో లక్ష్యానికి మించి గ్రౌండింగ్ చేశామని కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ తెలిపారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించా లని ఆయన ఆకాంక్షించారు. మౌలిక సౌకర్యాల కల్పనలో సంబంధిత మండల ప్రత్యేక అధికారులు, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి త్వరితగతిన వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న గృహనిర్మాణ పథకాన్ని జిల్లాలో దిగ్విజయం చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. -
పీఎఫ్ చందాదారులకు చౌక ధరల్లో గృహాలు!
మెగా హౌసింగ్ స్కీమ్‌పై కేంద్రం కసరత్తు న్యూఢిల్లీ: పీఎఫ్ చందాదారులకు చౌకధరల్లో ఇళ్లు అందించే మెగా హౌసింగ్ స్కీమ్‌ను కార్మిక మంత్రిత్వ శాఖ సిద్ధం చేస్తోంది. ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ)లోని 5 కోట్ల మంది చందాదారులకు అందుబాటు ధరల్లో గృహాలను అందించడం కోసం ఈ స్కీమ్‌ను రూపొందిస్తున్నారని సమాచారం. 2022 నాటికి అందరికీ ఇళ్లు అనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా కార్మిక శాఖ ఈ ప్రయత్నాలు చేస్తోంది. ఈపీఎఫ్ఓ తన చందాదారుల కోసం అందుబాటు ధరల్లో గృహాలను నిర్మించాలని, ఈపీఎఫ్ఓ నిధులను ఇందుకోసం వినియోగించాలని ఇటీవలనే ప్రధాని కార్యాలయం ఈపీఎఫ్ఓను కోరింది. ఈపీఎఫ్ఓ నిధుల్లో 15 శాతాన్ని అందుబాటు ధరల్లో గృహా రుణాల కోసం కేటాయిస్తే, రూ.70,000 కోట్ల రుణాలను, 3.5 లక్షల అదనపు చౌక-ధర గృహాలను అందించవచ్చని అంచనా. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ రూ.6.5 లక్షల కోట్ల నిధులను నిర్వహిస్తోంది. ప్రతీ ఏటా ఉపాంత డిపాజిట్లు రూ.70,000 కోట్ల మేర పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈపీఎఫ్ఓలో నెలకు రూ.15,000 మూల వేతనం కంటే త క్కువగా ఆర్జించేవారి సంఖ్య 70% ఉంది. ఈ మెగా హౌసింగ్ స్కీమ్ కోసం ఆర్ధిక సంస్థలు తక్కువ వడ్డీరేట్లకే రుణాలిచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్కీమ్ ఎలా ఉండొచ్చు.. ఈ స్కీమ్ కోసం ప్రభుత్వ రంగ బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఎన్బీసీసీ వంటి ప్రభుత్వ నిర్మాణ రంగ కంపెనీలు, డీడీఏ, పుడా, హుడా వంటి సంస్థలతో కలసి పనిచేయాలని కార్మిక శాఖ యోచిస్తోంది. తక్కువ ఆదాయ వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని కార్మిక శాఖ ఈ స్కీమ్‌ను రూపొందిస్తోంది. ఇంటి ధరలో కొంత మొత్తాన్ని చెల్లించడానికి పీఎఫ్ డిపాజిట్లను విత్‌డ్రా చేసుకోవడానికి చందాదారులను అనుమతించవచ్చు. తక్కువ ఆదాయ వర్గాలకు సబ్సిడీలను కూడా అందించే అవకాశాలున్నాయి. సదరు స్కీమ్ కోసం ఈపీఎఫ్ఓ చందాదారులను-తక్కువ ఆదాయం, మధ్య ఆదాయం, అధిక ఆదాయం... ఇలా మూడు కేటగిరీలుగా వర్గీకరిస్తారు. ఇళ్లు, ఇతర ప్రోత్సాహాకాలను ఈ ఆదాయాలను బట్టి అందిస్తారు. సభ్యులు తమ పీఎఫ్ అకౌంట్ల ద్వారానే గృహ రుణాల ఈఎంఐల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.