Memusaitam
-
సుధీర్‌బాబు సైతం...
సమస్యల్లో చిక్కుకుని, వాటి నుండి బయటకు రాలేక జీవన పోరాటం చేస్తున్న నిస్సహాయులను ఆదుకుంటోంది ‘మేము సైతం’. ఈ కార్యక్రమం ద్వారా తెలుగు సినిమా తారలు జెమినీ టీవీలో చేస్తున్న వినూత్న సేవ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ వారం హీరో సుధీర్‌బాబు గెస్ట్‌గా వచ్చి నిస్సహాయులకు సేవ చేయబోతున్నారు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న కన్నకొడుకును కాపాడడం కోసం చికిత్సకి ఉన్నదంతా పెట్టినా సరిపోక కొడుకును ఎలా కాపాడు కోవాలో తెలియక దయనీయ పరిస్థితిలో ఉన్న సత్యనారాయణని ఆదుకోవడం కోసం హీరో సుధీర్‌బాబు బేకరీలో పని చేయబోతు న్నారు చిన్నారిని కాపాడడం కోసం సుధీర్ బాబు చేస్తున్న ఈ సేవ ఈ శనివారం రా.9:30ని.లకు జెమినీలో ప్రసారం కానుంది. -
ఐస్‌క్రీములు అమ్మిన సుమంత్
ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ జీవన పోరాటం చేస్తున్న నిస్సహాయులకు అండగా టాలీవుడ్ తారలు, జెమినీ టీవీ ‘మేము సైతం’ కార్యక్రమం ద్వారా చేస్తున్న సేవ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఈ వారం నేను సైతం అంటూ సుమంత్ ముందుకొచ్చారు. పిల్లలు పుట్టలేదని భర్త వదిలి వేయడంతో పుట్టింటికి చేరిన సుల్తానా, అప్పటికే కూతుళ్ల పెళ్లిళ్లు చేసి, అప్పుల ఊబిలో కూరుకుపోయిన సుల్తానా తల్లి... ఈ నిరుపేద తల్లీకూతుళ్లకు అండగా హీరో సుమంత్ ఐస్‌క్రీమ్స్ అమ్మారు. నిస్సహాయ తల్లీకూతుళ్లను ఆదుకోవడానికి సుమంత్ చేసిన వినూత్న సేవతో ‘మేము సైతం’ కార్యక్రమం ఈ శనివారం రాత్రి 9:30 ని.లకు జెమినీ టీవీలో ప్రసారం కానుంది. -
బాధితులకు బాసటగా తెలుగు చిత్ర పరిశ్రమ
-
బాధితులకు బాసటగా... మేము సైతం
‘‘ఎప్పుడు, ఎక్కడ ప్రకృతి విపత్తు సంభవించినా ప్రజలను ఆదుకోవడానికి తెలుగు సినిమా పరిశ్రమ ముందుంటుంది. ఇటీవల హుదుహుద్ తుపాను బీభత్సంతో గ్రీన్ సిటీ లాంటి వైజాగ్ కాస్తా బ్రౌన్ సిటీ అయిపోయింది. వైజాగ్ తుపాను బాధితుల కోసం సినిమా ఇండస్ట్రీ అంతా ఒక్కతాటిపై ‘మేము సైతం’ అంటూ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది’’ అని సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి అన్నారు. ఈ నెల 30న ‘మేము సైతం’ పేరుతో తెలుగు చిత్రపరిశ్రమ ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పలు రకాల వినోద కార్యక్రమాల ద్వారా విరాళాలు సేకరించి ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేయనుంది. ఈ వివరాలు తెలియజేయడానికి హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవితో పాటు నాగార్జున, వెంకటేశ్, శ్రీకాంత్, మురళీ మోహన్, అల్లు అరవింద్, డి. సురేశ్‌బాబు, కేఎల్ నారాయణ, అశోక్ కుమార్, జీవిత, మద్దినేని రమేశ్ తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. రెండు రోజుల తారాసందోహం... ‘మేము సైతం’ కార్యక్రమంలో భాగంగా 29వ తేదీ శనివారం రాత్రి హైదరాబాద్‌లో ‘తారలతో విందు’ నిర్వహించనున్నారు. విందులో పాల్గొనదలిచిన ఒక్కో జంట టికెట్ ఖరీదు కింద రూ. లక్ష వంతున విరాళం ఇవ్వాల్సి ఉంటుంది. అలా మొత్తం 250 జంటలకు అవకాశం ఉంటుంది. ఇక, 30వ తేదీ ఆదివారం ఉదయం నుంచి రాత్రి దాకా అన్నపూర్ణా స్టూడియోలో వినోద కార్యక్రమాలుంటాయి. అదే రోజున తారల క్రికెట్ మ్యాచ్, తంబోలా మొదలైనవి కూడా జరుగుతాయి. ఆదివారం నాటి కార్యక్రమానికి రూ. 500 చెల్లించి టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మొత్తం లక్ష టికెట్లు అమ్మి, కేవలం 104 మందిని లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేస్తారు. అలా ఎంపికైన వారికే ఆ కార్యక్రమంలో ప్రవేశం ఉంటుంది. -
మేముసైతం