
ఐస్‌క్రీములు అమ్మిన సుమంత్
ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ జీవన పోరాటం చేస్తున్న నిస్సహాయులకు అండగా టాలీవుడ్ తారలు, జెమినీ టీవీ ‘మేము సైతం’ కార్యక్రమం ద్వారా చేస్తున్న సేవ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఈ వారం నేను సైతం అంటూ సుమంత్ ముందుకొచ్చారు.
పిల్లలు పుట్టలేదని భర్త వదిలి వేయడంతో పుట్టింటికి చేరిన సుల్తానా, అప్పటికే కూతుళ్ల పెళ్లిళ్లు చేసి, అప్పుల ఊబిలో కూరుకుపోయిన సుల్తానా తల్లి... ఈ నిరుపేద తల్లీకూతుళ్లకు అండగా హీరో సుమంత్ ఐస్‌క్రీమ్స్ అమ్మారు. నిస్సహాయ తల్లీకూతుళ్లను ఆదుకోవడానికి సుమంత్ చేసిన వినూత్న సేవతో ‘మేము సైతం’ కార్యక్రమం ఈ శనివారం రాత్రి 9:30 ని.లకు జెమినీ టీవీలో ప్రసారం కానుంది.