meri pyaari bindu
-
'నా సినిమాను బాహుబలి 2 మింగేసింది'
ముంబయి: తన సినిమా బిజినెస్‌ను బాహుబలి 2 మింగేసిందని ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా అన్నారు. తన చిత్రం మేరి ప్యారీ బిందు బాక్సాపీస్ వద్ద రాబట్టిన వసూళ్లు చిత్రంపై ప్రేక్షకులు ప్రతిస్పందనవంటి విషయాలను ఆయన వద్ద ప్రస్తావించగా ఆయన పై విధంగా స్పందించారు. 'నా చిత్రానికి నా కుటుంబం నుంచి మిత్రుల నుంచి ప్రేక్షకుల నుంచి భిన్న స్పందన వచ్చింది. కొంతమంది నచ్చిందని చెప్పారు. కొంతమంది నచ్చలేదని చెప్పారు. ఏదేమైనా వ్యాపారపరంగా నా సినిమాపై బాహుబలి 2 ప్రభావం కొద్దిగా పడిందనే చెప్పగలను. నా సినిమా విడుదలయ్యే సమయానికి థియేటర్లలో బాహుబలి 2 లేకుంటే కచ్చితంగా నా సినిమా మరిన్ని వసూళ్లు రాబట్టేది. నా చిత్ర బిజినెస్‌ను బాహుబలి 2 మింగేసింది' అని ఆయన తెలిపారు. బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28న విడుదల కాగా మేరి ప్యారీ బిందు మాత్రం మే నెలలో విడుదలైంది. -
ఒక్క మాటలో రివ్యూ చెప్పాలంటే..
బాలీవుడ్లో శుక్రవారం రెండు సినిమాలు ప్రధానంగా విడుదలయ్యాయి. వాటిలో ఒకటి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించినది కావడంతో దానిమీద ఎంత లేదన్నా భారీగానే అంచనాలు ఉన్నాయి. ఆ రెండు సినిమాలకు ఒక్కొక్క మాటలోనే రివ్యూ చెప్పాలంటే.. అంటూ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్, సీనియర్ పాత్రికేయుడు తరణ్ ఆదర్శ్ చెప్పేశాడు. సర్కార్ 3: డిజప్పాయింటింగ్ (నిరాశాజనకం), మేరీ ప్యారీ బిందు: బోరింగ్ అని తన రివ్యూ ఇచ్చేశాడు. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో సర్కార్ సిరీస్‌లో మూడోదిగా వచ్చిన సర్కార్ 3 సినిమాకు కొందరు విమర్శకులైతే కేవలం ఒకటిన్నర స్టార్ రేటింగ్ ఇచ్చారు. అమితాబ్ లాంటి అగ్రనటుడు ఉన్నా కూడా ఆ సినిమాను పెద్దగా కాపాడలేకపోయారని చెప్పారు. #OneWordReview...#Sarkar3: Disappointing#MeriPyaariBindu: Boring — taran adarsh (@taran_adarsh) 12 May 2017 -
కష్టాలు ఎదురైనా సాధించేశాను: హీరోయిన్
ముంబై: లావుగా ఉందంటూ ఒకప్పుడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా. ఆ తర్వాత సన్నబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా ఆమె మీద ఎన్నో విమర్శలొచ్చిన విషయం తెలిసిందే. బికినీ వేసుకుని సినిమాల్లో దర్శనమివ్వడానికి సన్నబడేందుకు కసరత్తులు చేసిందని ఎంతో మంది ఆమె మీద వ్యాఖ్యలు చేశారు. అయినా ఆమె అనుకున్నది మాత్రం సాధించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం చాలా మంది అమ్మాయిలు ఆమె బాటలో నడుస్తున్నారట. స్వయంగా ఈ విషయాన్ని పరిణీతి వెల్లడించింది. కష్టాలు ఎదురైనా తాను అనుకున్నది ప్లాన్ చేసినట్లు పక్కాగా జరగడంతో ఈ విషయంలో విజయం సాధించినట్లు అభిప్రాయపడింది. గతంలో చాలా మంది మహిళలు స్థూలకాయం కారణంగా సమస్యలు ఎదుర్కొవడాన్ని గమనించాను. అయితే ప్రస్తుతం తనను కలిసిన కొందరిలో చాలా స్పష్టమైన మార్పును గమనించినట్లు పేర్కొంది. ఆమె లాగానే తాము కూడా సన్నగా అవ్వాలని అమ్మాయిలు ప్రయత్నాలు మొదలెట్టారని, ఈ విషయంపై కొందరు తనతో మాట్లాడారని చెప్పుకొచ్చింది. ఆరోగ్యం కోసం చాలా శ్రమించిన విషయాన్ని అభిమానులతో పాటు చాలా మంది గుర్తించారని, అందుకే తనదారిలో నడుస్తున్నవారికి ధన్యావాదాలు చెప్పింది.బరువు తగ్గడానికి ఏ చిట్కాలు పాటించాలని అడుగుతుంటే చాలా గర్వంగా ఉందని చెప్పింది. ప్రస్తుతం ఆమె 'మేరీ ప్యారీ బిందు' షూటింగ్ లో బిజిబిజీగా ఉంటోంది.