Mexico-US border
-
చిన్నారి శరణార్థి
అమెరికా–మెక్సికో సరిహద్దులో ఫొటోగ్రాఫర్ జాన్ మూరే తీసిన ఈ ఫొటో ప్రతిష్టాత్మక ‘వరల్డ్ ప్రెస్ ఫొటో స్టోరీ ఆఫ్ ది ఇయర్’ అవార్డును గెలుచుకుంది. హోండురస్‌కు చెందిన శాండ్రా, తన రెండేళ్ల కూతురు యనేలాతో కలిసి 2018 జూన్ 12న అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తుండగా బోర్డర్ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా తల్లిని తనిఖీ చేస్తుండగా చిన్నారి యనేలా భయంతో ఏడ్వడం మొదలుపెట్టింది. ఈ ఫొటో వైరల్ కావడంతో అక్రమవలసదారుల పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరుచేసే నిబంధనన అధ్యక్షుడు ట్రంప్ రద్దుచేయాల్సి వచ్చింది. -
షట్డౌన్కు తాత్కాలిక బ్రేక్
వాషింగ్టన్: అమెరికాలో గత 35 రోజులుగా కొనసాగుతున్న షట్డౌన్కు పాక్షికంగా తెరపడింది. రాజకీయ ఒత్తిడికి తలొగ్గిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫిబ్రవరి 15 వరకూ ప్రభుత్వం నడిచేందుకు అవసరమైన నిధుల విడుదలకు ఆమోదముద్ర వేశారు. ఈ బిల్లును కాంగ్రెస్‌లోని ఉభయసభలు మూజువాణీ ఓటుతో ఆమోదించగా, ట్రంప్ సంతకం చేయడంతో చట్టంగా మారింది. దీంతో దాదాపు 8,00,000 మంది ఫెడరల్ ఉద్యోగులకు ఈ నెల వేతనాలు అందనున్నాయి. రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం 3 వారాల్లోగా అమెరికా–మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణం, వలసవిధానంపై ఇరుపార్టీలు ఓ అంగీకారానికి రావాలి. డెమొక్రాట్లకు మినహాయిపు కాదు.. షట్‌డౌన్ ముగిసిన నేపథ్యంలో వైట్‌హౌస్‌లో శుక్రవారం(స్థానిక కాలమానం) నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘వలసల్ని సమీక్షించే హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి ఏడాది కాలానికి అవసరమైన నిధుల్ని కేటాయించే విషయమై ఉభయ సభలతో త్వరలోనే చర్చిస్తా. 35 రోజులుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న 8 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులకు పూర్తి నెల జీతాన్ని అందిస్తాం. షట్‌డౌన్‌ను ఎత్తివేస్తూ నేను తీసుకున్న నిర్ణయం డెమొక్రాట్లకు ఇచ్చిన మినహాయింపు కానేకాదు. సరిహద్దులో బలమైన గోడ లేదా ఉక్కు కంచె నిర్మించడం తప్ప మనకు మరో ప్రత్యామ్నాయం లేదు. ఫిబ్రవరి 15లోగా ఆమోదయోగ్య ఒప్పందం కుదరకుంటే మళ్లీ షట్‌డౌన్ తప్పదు’ అని అన్నారు. హెచ్1బీ ప్రీమియం ప్రాసెసింగ్ రేపటి నుంచే హెచ్–1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌ను సోమవారం నుంచి పునఃప్రారంభించనున్నట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్సీఐఎస్) ప్రకటించింది. వార్షిక పరిమితి (మొత్తం 85,000) కిందకు వచ్చే అన్ని రకాల హెచ్–1బీ వీసా కోటాలకు ప్రీమియం ప్రాసెసింగ్ సోమవారం నుంచి ప్రారంభమవుతుందని యూఎస్సీఐఎస్ తెలిపింది. ఈ పరిమితి కిందకు రాని పలు ఇతర ఉద్యోగాలకు సంబంధించిన హెచ్–1బీ ప్రీమియం ప్రాసెసింగ్ ఫిబ్రవరిలో తిరిగి ప్రారంభమవుతుందని సమాచారం. ప్రీమియం ప్రాసెసింగ్ కింద దరఖాస్తుదారులు నిర్దిష్ట మొత్తంలో ఎక్కువ రుసుమును చెల్లిస్తే కేవలం 15 రోజుల్లోనే వారి దరఖాస్తుపై నిర్ణయం తీసుకుంటారు. -
స్పీకర్ విదేశీ పర్యటనకు ట్రంప్ చెక్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెమొక్రటిక్ పార్టీ నేత, ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీకి షాకిచ్చారు. అమెరికా–మెక్సికో సరిహద్దు గోడకు నిధుల్ని అడ్డుకుంటున్నందుకు ప్రతీకారంగా ఆమె బ్రస్సెల్స్, ఈజిప్టు, అఫ్గానిస్తాన్ పర్యటనకు మిలటరీ విమానాన్ని ఇచ్చేందుకు సర్వసైన్యాధ్యక్షుడి హోదాలో నిరాకరించారు. ఈ మేరకు ట్రంప్ ఆమెకు లేఖ రాశారు. ‘షట్‌డౌన్ కారణంగా మీ విదేశీ పర్యటన వాయిదా పడింది. షట్‌డౌన్ ముగిశాక పర్యటనను రీషెడ్యూల్ చేస్తాం. కానీ మీరు ఈ పర్యటనకు ప్రైవేటుగా వెళ్లాలని అనుకుంటే నిరభ్యంతరంగా వెళ్లొచ్చు. అమెరికాకు చెందిన 8 లక్షల మందికిపైగా గొప్ప ఉద్యోగులకు 27 రోజులుగా వేతనాలు అందడం లేదన్న విషయాన్ని మీరు ఒప్పుకుంటారనే అనుకుంటున్నా. మన సరిహద్దుకు అత్యవసరంగా కావాల్సిన భద్రత, నిధుల విషయంలో మిమ్మల్ని త్వరలోనే కలుసుకుంటానని ఆశిస్తున్నా’ అని ట్రంప్ లేఖలో తెలిపారు. మరోవైపు, షట్‌డౌన్ నేపథ్యంలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఐదురోజులపాటు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు అమెరికా ప్రతినిధుల బృందం పర్యటనను ట్రంప్ రద్దుచేశారు. -
గోడను అడ్డుకుంటే ఎమర్జెన్సీనే!
వాషింగ్టన్: మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి ట్రంప్ తన ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. కాంగ్రెస్ అనుమతి లేకుండానే ఇందుకు అవసరమైన నిధులు పొందడానికి జాతీయ అత్యవసర పరిస్థితి విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గోడ నిర్మాణానికి 5.6 బిలియన్ డాలర్లు మంజూరు చేయాలని ట్రంప్ ప్రభుత్వం కోరగా డెమొక్రాట్లు అడ్డుపడిన సంగతి తెలిసిందే. గోడ నిర్మాణ ప్రణాళికలకు మద్దతు కూడగట్టేందుకు ట్రంప్ టెక్సస్‌లో పర్యటించారు. అత్యవసర పరిస్థితి ప్రకటించే అవకాశాలపై మీడియా ప్రశ్నించగా..ఆ దిశగా ఆలోచిస్తున్నామని సమాధానమిచ్చారు. గోడకు రోనిల్ సోదరుడి మద్దతు.. ఇటీవల అక్రమ వలసదారుడి చేతిలో హత్యకు గురైన భారత సంతతి పోలీసు అధికారి రోనిల్ రాన్ సింగ్ సోదరుడు రెగ్గీ సింగ్..ట్రంప్ గోడ నిర్మాణ ప్రతిపాదనకు మద్దతిచ్చారు. తమ కుటుంబం మాదిరిగా ఇతరులు బాధపడకూడదంటే సరిహద్దును పటిష్టపరచాలని అన్నారు. టెక్సాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రెగ్గీ సింగ్.. ట్రంప్ పక్కనే కూర్చుని కాసేపు ముచ్చటించారు. ‘నా సోదరునిలా మరో పోలీసు అధికారి బలికావొద్దు. ఈ ముప్పును తగ్గించడానికి ఏం చేయాలో చేయండి. మా కుటుంబం మద్దతుగా నిలుస్తుంది’ అని ట్రంప్‌తో రెగ్గీ అన్నారు. మీడియానే ప్రతిపక్షం.. ‘సరిహద్దుల్లో ఏం జరుగుతుందో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే డెమొక్రాట్లు వినడం లేదు. అక్కడ కృత్రిమ సంక్షోభం ఉందని కొత్తగా చెబుతున్నారు. నకిలీ మీడియా సంస్థల సృష్టే ఇది. వారు ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తున్నారు’ అని సరిహద్దు భద్రత, వలసలపై టెక్సాస్‌లో జరిగిన సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆర్మీ డబ్బులతో గోడ నిర్మాణం? ఆర్మీ కోర్ ఇంజినీర్ల విభాగంలో నిరుపయోగంగా ఉన్న నిధులతో గోడ నిర్మాణం చేపట్టాలని ట్రంప్ యోచిస్తున్నట్లు తెలిసింది. గోడ నిర్మాణానికి కాంట్రాక్టులు కుదుర్చుకోవడానికి ఎంత సమయం పట్టొచ్చు? నిర్మాణం 45 రోజుల్లో ప్రారంభించొచ్చా? అనే విషయాలు తేల్చాలని ఆర్మీ కోర్‌ను ట్రంప్ ఆదేశించారు. మరోవైపు, కాంగ్రెస్ అనుమతి లేకుండానే నిధులు పొందేందుకు ట్రంప్ జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటిస్తే ఏం చేయాలని డెమొక్రాట్లు, రిపబ్లికన్లు యోచిస్తున్నారు. ట్రంప్ ఎమర్జెన్సీ విధిస్తే ఆ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయడానికి ఉన్న అవకాశాలను ప్రతిపక్ష డెమొక్రాటిక్ నాయకత్వం పరిశీలిస్తోంది. -
బస్సు - రైలు ఢీ: 16 మంది మృతి
మెక్సికో: అమెరికా - మెక్సికో దేశ సరిహద్దు ప్రాంతంలోని అన్నాహాక్ పట్టణంలో శుక్రవారం సాయంత్రం ఘోరం చోటు చేసుకుంది. కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద రైల్వే ట్రాక్ దాటుతున్న బస్సును రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 16 మంది మరణించారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగ్రాతులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దుర్ఘటన స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.