microfinance business
-
ఎన్బీఎఫ్సీ, సూక్ష్మ రుణాలకు మరింత మద్దతు!
బ్యాంక్‌లు మంజూరు చేసే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), సూక్ష్మ రుణాలపై రిస్క్ వెయిటేజీని ఆర్బీఐ తగ్గించింది. కన్జ్యూమర్ మైక్రోఫైనాన్స్ రుణా లు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఇచ్చే రుణాలపై 25 శాతం తగ్గించడంతో రిస్క్ వెయిట్ 100కు దిగొచ్చింది. దీంతో ఆయా రుణాల కోసం బ్యాంక్‌లు పక్కన పెట్టాల్సిన నిధుల పరిమాణం తగ్గుతుంది. తద్వారా బ్యాంక్‌ల లిక్విడిటీ మెరుగవుతుంది. ఆయా విభాగాలకు రుణ వితరణ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.2023 నవంబర్‌లో ఎన్బీఎఫ్సీలు, సూక్ష్మ రుణ సంస్థలకు రిస్క్ వెయిటేజీని ఆర్బీఐ పెంచడం గమనార్హం. అప్పటి నుంచి వాటి రుణ వితరణ కుంటుపడింది. ఎన్‌బీఎఫ్‌సీలకు వాణిజ్య బ్యాంక్‌ల రుణాలపై రిస్క్ వెయిట్‌ను 25 శాతం పాయింట్లను పెంచింది. అదే ఏడాది వ్యక్తిగత రుణాలకు సైతం 25 శాతం మేర వెయిట్‌ను పెంచి 125 చేసింది. గృహ రుణాలు, విద్యా రుణాలు, వాహన రుణాలు, బంగారం రుణాలకు మాత్రం మినహాయింపునిచ్చింది. కఠిన నిబంధనలతో ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంక్‌ల నుంచి రుణాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఎన్బీఎఫ్సీలు, సూక్ష్మ రుణాలకు గతంలో పెంచిన మేర వెయిటేజీని తాజా తగ్గించగా, దీన్ని నిపుణులు స్వాగతిస్తున్నారు.భారత్‌పై టారిఫ్‌ల ప్రభావం తక్కువేఆసియా పసిఫిక్ ప్రాంతంలోని (ఏపీఏసీ) ఇతర దేశాలతో పోలిస్తే ఎగుమతుల కోసం అమెరికాపై భారత్ ఆధారపడటం తక్కువగానే ఉంటోంది కాబట్టి, కొన్ని రంగాలు మినహా చాలా రంగాలపై ప్రతిపాదిత టారిఫ్‌ల ప్రభావం మరీ అంతగా ఉండకపోవచ్చని మూడీస్ రేటింగ్స్ ఒక నివేదికలో పేర్కొంది. ఆహారోత్పత్తులు, జౌళి, ఫార్మా మొదలైన ఉత్పత్తులకు టారిఫ్ రిసు్కలు ఉండొచ్చని వివరించింది.ఇదీ చదవండి: రూ.8.6 లక్షల కోట్ల ఎగుమతులుతాము రేటింగ్ ఇచ్చే భారతీయ కంపెనీలు చాలా మటుకు దేశీ మార్కెట్‌పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయని, అవి అమెరికా మార్కెట్‌పై ఆధారపడటం తక్కువేనని పేర్కొంది. టారిఫ్‌ల విషయంలో అమెరికాతో అత్యధిక వ్యత్యాసాలున్న ఏపీఏసీ దేశాల్లో భారత్, వియత్నాం, థాయ్‌లాండ్ మొదలైనవి ఉన్నట్లు వివరించింది. ఎల్రక్టానిక్స్, మోటర్ సైకిల్స్, ఫుడ్, టెక్స్టైల్స్ విభాగాలు ఎక్కువగా అమెరికాపై ఆధారపడి ఉన్నాయని పేర్కొంది. అమెరికాతో వివాదానికి తావివ్వకుండా, ద్వైపాక్షిక చర్చల ద్వారా బేరసారాలాడుకోవడం ద్వారా ప్రభుత్వాలు టారిఫ్‌ల విషయంలో వివేకవంతంగా వ్యవహరించే అవకాశం ఉందని మూడీస్ రేటింగ్స్ తెలిపింది. -
తెలుగు రాష్ట్రాల్లో ముత్తూట్ మైక్రోఫిన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మైక్రోఫైనాన్స్ రంగంలో ఉన్న ముత్తూట్ మైక్రోఫిన్ తెలంగాణలో అడుగుపెడుతోంది. భువనగిరి, జనగాం, హన్మకొండ, పరకాలలో శాఖలను ఈ నెలలో తెరుస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. జూన్‌లోగా ఆంధ్రప్రదేశ్‌కు సేవలను విస్తరిస్తామని ముత్తూట్ మైక్రోఫిన్ సీఈవో సదాఫ్ సయీద్ వెల్లడించారు. కొచ్చి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ముత్తూట్ మైక్రోఫిన్ 18 రాష్ట్రాలకు విస్తరించింది. 1,424 శాఖలతో సేవలు అందిస్తోంది. సుమారు 33 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. -
11 శాతం పెరిగిన సూక్ష్మ రుణాలు
న్యూఢిల్లీ: సూక్ష్మ రుణ పరిశ్రమ (మైక్రోఫైనాన్స్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో 11 శాతం అధికంగా రూ.71,916 కోట్ల రుణాలను పంపిణీ చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రుణాల పంపిణీ రూ.64,899 కోట్లుగా ఉంది. మొత్తం రుణాల సంఖ్య 1.81 కోట్లుగా కాగా, క్రితం ఏడాది ఇదే కాలంలో మొత్తం పంపిణీ చేసిన రుణాల సంఖ్య 1.85 కోట్లుగా ఉంది. ద్వితీయ త్రైమాసికానికి సంబంధించి గణంకాలను మైక్రో ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ నెట్వర్క్ (ఎంఫిన్) విడుదల చేసింది. పరిశ్రమ మొత్తం రుణ పోర్ట్‌ఫోలియో విలువ రూ.3 లక్షల కోట్లకు చేరింది. మొత్తం 12 కోట్ల రుణ ఖాతాలకు సేవలు అందిస్తోంది. ‘‘మైక్రోఫైనాన్స్ పరిశ్రమ స్థూల రుణ పోర్ట్‌ఫోలియో (జీఎల్పీ) రూ.3,00,974 కోట్లకు చేరింది. 2021 సెప్టెంబర్ చివరికి ఉన్న రూ.2,43,737 కోట్లతో పోలిస్తే 23.5 శాతం వృద్ధి చెందింది’’ అని ఈ నివేదిక వెల్లడించింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో పంపిణీ చేసిన ఒక్కో రుణం సగటున రూ.40,571గా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 12 శాతం పెరిగింది. ఒక వంతు వాటా పీఎస్‌బీలదే ఈ మొత్తం రుణాల్లో 13 ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) సంయుక్తంగా 37.7 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఎన్బీఎఫ్సీ మైక్రోఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ (ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐ) 36.7 శాతం వాటా (రూ.1,10,418 కోట్లు) కలిగి ఉన్నాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు సూక్ష్మ రుణాల్లో 16.6 శాతం వాటా (రూ.50,029) ఆక్రమించాయి. ఇక ఎన్బీఎఫ్సీలు 7.9 శాతం, ఇతర సూక్ష్మ రుణ సంస్థలు 1.1 శాతం మేర రుణాలను పంపిణీ చేసి ఉన్నాయి. మైక్రోఫైనాన్స్ యాక్టివ్ (సకాలంలో చెల్లింపులు చేసే) రుణ ఖాతాలు గత 12 నెలల్లో (సెప్టెంబర్‌తో అంతమైన చివరి) 14.2 శాతం పెరిగి 12 కోట్లకు చేరాయి. తూర్పు, ఈశాన్యం, దక్షిణాది ప్రాంతాలు మొత్తం సూక్ష్మ రుణాల్లో 63.9 శాతం వాటా కలిగి ఉన్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే తమిళనాడు ఎక్కువ వాటా ఆక్రమిస్తోంది. -
జోరుగా వడ్డీ దందా
గ్రామాల్లో విస్తరిస్తున్న మైక్రోఫైనాన్స్ వ్యాపారం మోసపోతున్న అమాయక గిరిజనులు అందినకాడికి దండుకుంటున్న వ్యాపారులు ఉట్నూర్ రూరల్ : ఏజెన్సీ గ్రామాల్లో వడ్డీ వ్యాపారం జోరుగా సాగుతోంది. మండలానికో మేనేజర్, ఏజెంట్ల నియామకంతో గ్రామాలు, తండాల వరకు దందా విస్తరించింది. మైక్రో ఫైనాన్స్ భూతం అమాయక గిరిజనులు, ప్రజల నడ్డి విరుస్తోంది. గిరిజనుల అమాయకత్వం.. అవసరం ఆంధ్రా వ్యాపారులకు పెట్టుబడిగా మారింది. వారం వారం వసూళ్ల పేరిట ఇంటింటికీ తిరిగి మరీ రుణాలు ఇస్తున్నారు. రూ.10 వేలు రుణం తీసుకున్న వారి నుంచి వారానికి రూ.100 చొప్పున 12 వారాల్లో రూ.1,200 వసూలు చేస్తున్నారు. మెుదటిసారి రుణం తీసుకున్న సమయంలో ప్రామిసరీ నోటుపై సంతకం తీసుకుంటున్నారు. కనిష్టంగా రూ.వెయ్యి నుంచి గరిష్టంగా రూ.10 వేల వరకు రుణంగా ఇస్తున్నారు. రూ.వెయ్యి తీసుకుంటే వారానికి రూ.100 చొప్పున, రూ.10 వేలు తీసుకుంటే వారానికి రూ.వెయ్యి చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా కారణంతో చెల్లింపు వారం ఆలస్యమైతే పది శాతం వడ్డీతో కలిపి చెల్లించాలి. గ్రామాల్లో కూలీలు, రైతులు, చిన్న చిన్న కిరాణ దుకాణాల నిర్వాహకులు మైక్రో ఫైనాన్షియర్ల వద్ద రుణాలు తీసుకుంటున్నారు. క్రమపద్ధతిలో.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కృష్ణ, ఒంగోలు ప్రాంతాలకు చెందిన నాలుగు వ్యాపార సంస్థలు మైక్రో ఫైనాన్స్‌లు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఉట్నూర్, నార్నూర్, జైనూర్, ఇంద్రవెల్లి, జన్నారం, ఖానాపూర్, కడెం మండలాల్లో ఓ క్రమపద్ధతిలో వడ్డీ వ్యాపారం సాగుతోంది. మండలానికో మేనేజర్‌ను నియమించుకున్నారు. అతడి పరిధిలో గ్రామాల్లో తిరిగి రుణాలు ఇవ్వడానికి, వసూలు చేయడానికి మరికొంత మంది ఏజెంట్లు ఉన్నారు. గ్రామాల్లో ఒకరిద్దరిని మచ్చిక చేసుకుని మిగితా వారూ రుణాలు తీసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఒక గ్రామంలో పది మంది రూ.10వేల చొప్పున అప్పు తీసుకుంటే.. వారం వారం ఒక్కొక్కరి నుంచి రూ.వెయ్యి చొప్పున వసూలు చేసి అదే గ్రామంలో మరొకరికి రూ.10వేలు అప్పుగా ఇస్తున్నారు. అలా గ్రామంలో వారానికి ఒకరికి చొప్పున రుణాలు ఇస్తున్నారు. రైతులు వ్యవసాయ పెట్టుబడికి, ఇతర అవసరాలకు ప్రజలు అప్పులు తీసుకుంటున్నారు. 12 వారాల్లో చెల్లించాల్సిందే.. మైక్రో ఫైనాన్స్‌లో తీసుకున్న రుణం ఎంతైనా సరే 12 వారాల్లోగా చెల్లించాల్సిందే. రూ.వెయ్యి తీసుకుంటే వారానికి రూ.100 చొప్పున, రూ.10వేలు తీసుకుంటే వారానికి రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన 20 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు. మరికొన్ని ఫైనాన్స్ కంపెనీలు గ్రామాల్లో చిన్న చిన్న సంఘాలు ఏర్పాటు చేసి రుణాలు ఇస్తున్నాయి. ఆరుగురు సభ్యులతో కూడిన సంఘాన్ని ఏర్పాటు చేసి వారిలోనే ఒకరిని ఏజెంటుగా నియమించి మిగితా సభ్యుల నుంచి రుణాలు వసూలు చేస్తున్నాయి. వాయిదా ప్రకారం నిర్ణయించిన తేదీకి ఒక రోజు ఆలస్యమైనా పది శాతం వడ్డీ కలిపి వసూలు చేస్తున్నారు. వడ్డీ దందాపై అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. రూ.లక్షల్లో టర్నోవర్ గ్రామాల్లో మైక్రోఫైనాన్స్ వ్యాపారం రోజు రోజుకు విస్తరిస్తోంది. రూ.లక్షల్లో వ్యాపారం సాగుతోంది. ఉట్నూర్ మండలంలోని ఘన్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో 300 మందికి పైగా గిరిజనులు రుణాలు తీసుకున్నారు. దంతన్‌పెల్లి, బీర్సాయిపేట్, శంబుగూడ, చింతగూడెం, కొత్తగూడెం, సాలెవాడ–బి పంచాయతీల పరిధిలోని మోతీరాంగూడ, బాబాపూర్, ముసల్పాడ్, హోల్వాడి, సాలెవాడ–బి తదితర గ్రామాల్లో మరో 500 మంది రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గిరిజనుల అవసరానికి వారి ఇంటికే వచ్చి వ్యాపారులు అప్పులు ఇస్తుండడంతో తీసుకునేందుకు మెుగ్గు చూపుతున్నారు. వారం వారం వసూళ్లతో అతి కొద్ది సమయంలోనే లక్షల్లో టర్నోవర్ సాగుతోంది. అవసరాన్ని బట్టి తీసుకుంటున్నారు.. ఇంటింటికి తిరుగుతూ డబ్బులు అందిస్తున్నారు. దీంతో అవసరం ఉన్న వారు వడ్డీ ఎంతైనా సరే లెక్క చేయకుండా డబ్బులు తీసుకుంటున్నారు. రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వడ్డీకి తీసుకుంటున్నారు. ఒకరిని చూసి మరొకరు గ్రామాల్లో గ్రామమంతటా అప్పు తీసుకుంటూ మోసపోతున్నారు. – పంద్ర జైవంత్‌రావు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకుడు అధికారులు దృష్టి సారించాలి మైక్రోఫైనాన్షియర్లపై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలి. ఎక్కడి నుంచో వచ్చి అమాయక గిరిజనులను మోసం చేస్తున్నారు. వారం వారం యథేచ్ఛగా డబ్బులు వసూలు చేసుకుంటూ తిరుగుతున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. గిరిజనులు ఆర్థిక భారం మోయాల్సి వస్తంది. – మరప బాజీరావు, జంగుబాయి ఆలయ చైర్మన్