
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మైక్రోఫైనాన్స్ రంగంలో ఉన్న ముత్తూట్ మైక్రోఫిన్ తెలంగాణలో అడుగుపెడుతోంది. భువనగిరి, జనగాం, హన్మకొండ, పరకాలలో శాఖలను ఈ నెలలో తెరుస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది.
జూన్‌లోగా ఆంధ్రప్రదేశ్‌కు సేవలను విస్తరిస్తామని ముత్తూట్ మైక్రోఫిన్ సీఈవో సదాఫ్ సయీద్ వెల్లడించారు. కొచ్చి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ముత్తూట్ మైక్రోఫిన్ 18 రాష్ట్రాలకు విస్తరించింది. 1,424 శాఖలతో సేవలు అందిస్తోంది. సుమారు 33 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment