Microsoft Bill Gates
-
టెక్ దిగ్గజంతో మహేష్‌బాబు దంపతులు భేటీ, ఫోటో వైరల్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దంపతులు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ను కలిశారు. లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ విజయంతో ఫుల్ ఖుషీగా ఉన్న మహేష్ ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూరప్ టూర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నమహేష్ తాజాగా బిల్‌గేట్స్‌తో భేటీ అయిన ఫోటోను ట్వీట్ చేశాడు. భార్య నమ్రత,తాను కలిసి బిల్‌గేట్స్‌తో ఉన్న ఫోటోను పంచుకున్నాడు. దీంతో ఈ పిక్ ఇపుడు వైరల్‌గా మారింది. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్న మహేష్ ప్రపంచ కుబేరుడుతో కలవడం విశేషగా నిలిచింది. బిల్‌గేట్స్ ను కలిసిన ఫోటోని ఫ్యాన్స్‌తో పంచుకున్న మహేష్, బిల్‌గేట్స్‌ని కలవడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించాడు. ప్రపంచంలో గ్రేటెస్ట్ విజనరీ ఉన్న, అత్యంత గౌరవమైన, ప్రోత్సాహకరమై వ్యక్తి అంటూ ట్వీట్ చేశాడు. దీంతో మహేష్ దంపతులు బిల్‌గేట్స్ భేటీ వెనుక వ్యాపార ప్రయోజనాలున్నాయా అనే చర్చకు దారి తీసింది. Had the pleasure of meeting Mr. @BillGates! One of the greatest visionaries this world has seen... and yet the most humble! Truly an inspiration!! pic.twitter.com/3FN2y7bIoc — Mahesh Babu (@urstrulyMahesh) June 29, 2022 -
బిల్‌గేట్స్‌పై ‘రాసలీలల’ ఆరోపణలు.. కీలక నిర్ణయం!
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో బిల్‌గేట్స్‌పై లైంగిక-రాసలీలల ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఆరోపణల మీద మైక్రోసాఫ్ట్ బోర్డు దర్యాప్తు అర్ధాంతరంగా ముగిసింది కూడా!. ఈ తరుణంలో కంపెనీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని ప్రముఖ న్యాయ విచారణ సంస్థ ‘అరెంట్ ఫాక్స్ ఎల్ఎల్పీ’ని మైక్రోసాఫ్ట్ నియమించుకుంది. ఈ సంస్థ బిల్‌గేట్స్ వచ్చిన ఆరోపణలపై బోర్డు తయారు చేసిన నివేదికను సమీక్షిస్తుంది. ఆ తర్వాతే బోర్డు రూపొందించిన నివేదికను బహిర్గతం చేస్తుంది. అంటే.. బిల్‌గేట్స్ లైంగిక వేధింపుల విషయంలో బోర్డు దర్యాప్తు ఏం తేల్చిందన్న విషయం వేసవి దాకా బయటికి రాదన్నమాట!. ఒక్క బిల్‌గేట్స్ విషయంలోనే మాత్రమే కాదు.. 2019 తర్వాత మైక్రోసాఫ్ట్‌లో పని చేసే పలువురు ప్రముఖుల మీద పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే లైంగిక వేధింపులు, లింగ వివక్ష, ఇతర సమస్యలపై కంపెనీ విధానాల్ని సమీక్షించాలని షేర్ హోల్డర్స్.. బోర్డును కోరారు. అందుకే అరెంట్ ఫాక్స్‌ను నియమించుకుంది మైక్రోసాఫ్ట్ కంపెనీ. ప్రముఖులపై వచ్చిన ఆరోపణలు నిజమా? కాదా? అనే విషయంతో పాటు కంపెనీలో భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు ఎదురైతే ఎలా డీల్ చేయబోతుందన్న విషయంపై కంపెనీ ఒక పద్ధతిని ఫాలో అవ్వాలని చూస్తోంది. అందుకే న్యాయ విచారణ సంస్థ అభిప్రాయాల్ని సేకరిస్తోంది. పనిలో పనిగా ఉద్యోగుల ఆందోళనలను, పరిష్కారాలపైనా అరెంట్ దృష్టి పెట్టనుంది. ఇదిలా ఉంటే మైక్రోసాఫ్ట్ చైర్మన్ పదవి నుంచి 2020 మార్చి నెలలో ఆయన దిగిపోయాడు. తన నిష్క్రమణకు కారణం ‘ఫౌండేషన్’ మీద ఫోకస్ చేయడమే అని ఆయన ప్రకటించుకున్నప్పటికీ.. అసలు విషయం కాదని వేధింపుల పర్వమే కారణమని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2007 సమయంలో సమయంలో ఉద్యోగులపై ఆయన ఈ-మెయిల్స్ ద్వారా వేధింపులకు పాల్పడ్డాడని, ఉమెనైజర్ అని, ఉద్యోగులతో ఆయన ప్రవర్తనాశైలి బాగుండేదని కాదని ఆరోపణలు రాగా.. ఈమేరకు బోర్డు ఆయన్ని పిలిచి మందలించినట్లు మీడియాలోనూ కథనాలు వచ్చాయి. ఈ కథనాల తర్వాత మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగులు కొందరు, బిల్‌గేట్స్ సన్నిహితులు సైతం ఆయనపై లైంగిక ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు రావడం కొసమెరుపు. చదవండి: ‘బిల్‌గేట్స్ పచ్చి తాగుబోతు, యువతులతో నగ్నంగా స్విమ్మింగ్‌పూల్‌లో..’ సంబంధిత కథనాలు: గేట్స్ వెకిలి మెయిల్స్.. వద్దని వారించిన మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్స్! -
రానున్న 4-6 నెలలు జాగ్రత్త: బిల్ గేట్స్
వాషింగ్టన్: రానున్న 4-6 నెలల్లో కరోనా వైరస్ మరిన్ని సవాళ్లు విసరవచ్చని గ్లోబల్ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకులు బిల్ గేట్స్ తాజాగా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు అనారోగ్య సమస్యలు సృష్ఠిస్తున్న వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రజలు మాస్కులు ధరించడం, సామాజిక దూరం, పరిశుభ్రతను పాటించడం వంటివి విధిగా చేయవలసి ఉన్నట్లు నొక్కి చెప్పారు. లేదంటే వైరస్ మరింత విజృంభించవచ్చని, దీంతో మరణాల సంఖ్య సైతం పెరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు. కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్ల అభివృద్ధి, పంపిణీలకు బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ పరిశోధన, ఆర్థిక సహకారమందిస్తున్న సంగతి తెలిసిందే. (ఇక యూఎస్‌లోనూ ఫైజర్ వ్యాక్సిన్!) మరో 2 లక్షల మంది యూఎస్‌లో కోవిడ్-19 విలయానికి ఇప్పటివరకూ 2.9 లక్షల మందికిపైగా ప్రాణాలు విడిచారు. అయితే ఇటీవల అదనంగా 2 లక్షల మంది మరణించే అవకాశమున్నట్లు ఆరోగ్య అంశాలను మదింపు చేసే ఐహెచ్ఎంఈ అంచనా వేసింది. ఇదెంతో బాధాకరమైన విషయమని ఈ సందర్భంగా బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సహచైర్మన్ బిల్ గేట్స్ పేర్కొన్నారు. అయితే మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం తదితర చర్యల ద్వారా వీటి నుంచి తప్పించుకోవచ్చని సూచించారు. ఇటీవల యూఎస్‌లో గరిష్ట స్థాయిలో కేసులు, మరణాలు పెరగడం ఆందోళన కలిగిస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కోగలమని భావిస్తున్నట్లు చెప్పారు. 2015లోనే వైరస్ల కారణంగా అత్యధిక సంఖ్యలో మరణాలకు వీలున్నట్లు 2015లో అంచనా వేసినప్పటికీ కోవిడ్-19 ఇంతకంటే అధిక నష్టాన్ని కలిగిస్తున్నట్లు బిల్ గేట్స్ పేర్కొన్నారు. నిజానికి ముందుముందు మరింత క్లిష్ట పరిస్థితులు ఎదురుకావచ్చని అభిప్రాయపడ్డారు. వైరస్ కారణంగా ఇటు యూఎస్.. అటు ప్రపంచంపై పడిన ఆర్థిక ప్రభావం ఆందోళనలు కలిగిస్తున్నట్లు చెప్పారు. -
‘రోబో’పై కూడా పన్ను వేయాలి
మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వ్యాఖ్య వాషింగ్టన్: మానవుల ఉద్యోగాలను తన్నుకుపోతున్న రోబోలపై (ఆటోమేషన్)నా పన్నులు ఉండాల్సిందేనని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ అన్నారు. ‘‘ఆటోమేషన్‌కు కచ్చితంగా పన్నులు ఉండాల్సిందే. ప్రస్తుతం మానవ ఉద్యోగి ఫ్యాక్టరీలో 50,000 డాలర్ల విలువైన పనిచేస్తే ఆ ఆదాయంపై ఆదాయపన్ను, సామాజిక భద్రతా పన్ను వంటివి ఉన్నాయి. ఒకవేళ ఇదే పనిని చేసేందుకు ఓ రోబో వస్తే దానిపైనా ఇదే స్థాయిలో పన్ను విధించాలని నేను అంటాను’’ అని ప్రపంచ కుబేరుడైన బిల్‌గేట్స్ ‘క్వార్ట్జ్ వెబ్సైట్’కు తెలిపారు. రోబోలను వినియోగిస్తున్న కంపెనీలపై ప్రభుత్వాలు పన్నులు విధించాలని ఆయన సూచించారు. దానివల్ల ఆటోమేషన్‌ను తాత్కాలికంగానైనా నిదానించేలా చేయవచ్చని, అలాగే, ఇతర ఉపాధి అవకాశాలపై నిధుల వినియోగానికి సైతం అవకాశం ఉంటుందన్నారు. మానవులు మాత్రమే చూడగలిగే పెద్దవాళ్ల సంక్షేమం లేదా పాఠశాలల్లో చిన్నారులతో కలసి పనిచేసే ఉద్యోగాలకు కావాల్సిన నిధులను రోబో పన్ను ద్వారా రాబట్టుకోవచ్చని సూచించారు. ఈ పన్ను పట్ల రోబో కంపెనీలు ఆగ్రహిస్తాయని తాను అనుకోవడం లేదన్నారు. అయితే, గేట్స్ సూచన పూర్తిగా ఆమోదయోగ్యం కాకపోవచ్చని క్వార్ట్జ్ వెబ్సైట్ పేర్కొంది. రోబోల వల్ల ఉపాధి కోల్పోయేవారికి శిక్షణ ఇచ్చేందుకు వీలుగా నిధుల కోసం రోబో యజమానులపై పన్నుల విధింపు ప్రతిపాదన యూరోపియన్ యూనియన్ చట్టసభ సభ్యుల ముందుగా రాగా, వారు దాన్ని తిరస్కరించిన విషయాన్ని ఆ పోర్టల్ పేర్కొంది.