Mahesh Babu And Namrata Meets Bill Gates In New York, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Mahesh Babu - Bill Gates: టెక్‌ దిగ్గజంతో మహేష్‌బాబు దంపతులు భేటీ, ఫోటో వైరల్‌  

Published Wed, Jun 29 2022 12:10 PM | Last Updated on Wed, Jun 29 2022 12:31 PM

Mahesh Babu meets Microsoft cofounder Bill Gates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు దంపతులు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ను కలిశారు. లేటెస్ట్‌ మూవీ ‘సర్కారు వారి పాట’ విజయంతో ఫుల్‌ ఖుషీగా ఉన్న మహేష్‌ ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో  యూరప్ టూర్‌ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేస్తున్నమహేష్‌ తాజాగా బిల్‌గేట్స్‌తో భేటీ అయిన ఫోటోను ట్వీట్‌ చేశాడు. భార్య నమ్రత,తాను కలిసి బిల్‌గేట్స్‌తో​  ఉన్న ఫోటోను  పంచుకున్నాడు. దీంతో ఈ పిక్‌ ఇపుడు వైరల్‌గా మారింది. 

ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్న మహేష్‌ ప్రపంచ కుబేరుడుతో కలవడం విశేషగా నిలిచింది. బిల్‌గేట్స్ ను కలిసిన ఫోటోని ఫ్యాన్స్‌తో పంచుకున్న మహేష్‌, బిల్‌గేట్స్‌ని కలవడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించాడు. ప్రపంచంలో  గ్రేటెస్ట్‌ విజనరీ  ఉన్న, అత్యంత గౌరవమైన, ప్రోత్సాహకరమై వ్యక్తి అంటూ ట్వీట్‌ చేశాడు.  దీంతో మహేష్ దంపతులు బిల్‌గేట్స్‌ భేటీ వెనుక  వ్యాపార ప్రయోజనాలున్నాయా అనే చర్చకు దారి తీసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement