Microsoft Corp
-
యూనికార్న్‌కు చేరిన డైలీహంట్ స్టార్టప్
బెంగళూరు, సాక్షి: స్టార్టప్ సంస్థ.. వెర్సే ఇన్నోవేషన్‌లో తాజాగా టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్, అల్ఫావేవ్(ఫాల్కన్ ఎడ్జ్ క్యాపిటల్) 10 కోట్ల డాలర్లకుపైగా(సుమారు రూ. 740 కోట్లు) ఇన్వెస్ట్ చేశాయి. దీంతో వెర్సే విలువ బిలియన్ డాలర్లకు చేరింది. తద్వారా యూనికార్న్‌గా ఆవిర్భవించింది. వెర్నాక్యులర్ కంటెంట్ ప్లాట్‌ఫామ్ డైలీహంట్‌కు మాతృ సంస్థే వెర్సే ఇన్నోవేషన్. స్థానిక భాషలలో సేవలందించే తొలి స్టార్టప్‌గా యూనికార్న్ హోదాను చేరినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. బిలియన్‌డాలర్ విలువకు చేరిన స్టార్టప్‌లను యూనికార్న్‌గా పిలుస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. (యాపిల్ నుంచి సెల్ఫ్‌డ్రైవింగ్ కారు!) ఇతర సంస్థలూ వెర్సే ఇన్నోవేషన్‌లో ఇప్పటికే వాటాలున్న సోఫినా గ్రూప్, లుపా సిస్టమ్స్ సైతం తాజాగా ఇన్వెస్ట్ చేశాయి. అంతేకాకుండా మ్యాట్రిక్స్ పార్టనర్స్, సీక్వోయా క్యాపిటల్, గోల్డ్‌మన్ శాక్స్ సైతం నిధులు అందించినట్లు తెలుస్తోంది. షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్ జోష్ ద్వారా వెర్సే ఇన్నోవేషన్ పలు యాప్స్‌ను విస్తరిస్తోంది. జోష్ 12 స్థానిక భాషలలో అందుబాటులో ఉంది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఇండియాకు గతంలో హెడ్‌గా పనిచేసిన ఉమంగ్ బేడీ, సహవ్యవస్థాపకుడు వీరూ గుప్తాతో కలసి యాప్స్‌ను అభివృద్ధి చేస్తున్నారు. 1 బిలియన్కు మేడిన్ ఇండియా యాప్స్ ద్వారా 2025కల్లా 100 కోట్ల యూజర్లకు చేరువకావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా ఫేస్‌బుక్‌ను అధిగమించాలని ప్రణాళికలు వేస్తున్నారు. ఇతర విదేశీ భాషల ఆడియన్స్‌నూ ఆకట్టుకునేందుకు ప్లాట్‌ఫామ్స్‌ను విస్తరించే యోచనలో ఉన్నారు. 2018లో బేడీ ఫేస్‌బుక్‌ను వీడి డైలీహంట్‌లో చేరారు. ప్రస్తుతం జోష్ యాప్‌కు 7.7 కోట్ల మంది నెలవారీ యూజర్లున్నట్లు డైలీహంట్ చెబుతోంది. 3.6 కోట్ల మంది రోజువారీ యూజర్లతోపాటు.. 1.5 బిలియన్ వీడియోలను ప్లే చేస్తున్నట్లు తెలియజేసింది. మొత్తంగా 30 కోట్ల మంది యూజర్లు తమ స్థానిక భాషల కంటెంట్‌ను వినియోగిస్తున్నట్లు వివరించింది. -
యూఎస్ మార్కెట్లు అప్- క్రూయిజర్ షేర్ల స్పీడ్
దాదాపు మూడు వారాల తరువాత శుక్రవారం యూఎస్ మార్కెట్లు చెప్పుకోదగ్గ స్థాయిలో ఎగశాయి. డోజోన్స్ 359 పాయింట్లు(1.35%) పెరిగి 27,174 వద్ద ముగిసింది. ఎస్అండ్పీ 52 పాయింట్ల(1.6%) లాభంతో 3,298 వద్ద నిలిచింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 241 పాయింట్లు(2.3%) జంప్‌చేసి 10,914 వద్ద స్థిరపడింది. అయినప్పటికీ ఈ వారం నికరంగా డోజోన్స్ 1.8 శాతం నష్టపోగా.. ఎస్అండ్పీ 0.6 శాతం నీరసించింది. అయితే 4 వారాల నష్టాలకు చెక్ పెడుతూ నాస్డాక్ మాత్రం 1.1 శాతం పుంజుకుంది. ఇటీవల కరెక్షన్ బాటలో సాగుతున్న మార్కెట్లు వరుసగా నాలుగో వారం నష్టాలతో ముగిశాయి. తద్వారా 2019 ఆగస్ట్ తదుపరి అత్యధిక కాలం మార్కెట్లు వెనకడుగుతో నిలిచినట్లయ్యింది. ఆశావహ అంచనాలు వచ్చే వారం హౌస్ డెమక్రాట్లు ప్రతిపాదిస్తున్న 2.4 ట్రిలియన్ డాలర్ల ఉపశమన ప్యాకేజీపై వోటింగ్ చేపట్టనున్నారు. నిరుద్యోగులకు లబ్దిని పెంచడంతోపాటు.. నష్టాలకు లోనవుతున్న ఎయిర్‌లైన్స్‌కు ఆర్థిక మద్దతు అందించేందుకు ఈ బిల్లును రూపొందించారు. అయితే ఈ బిల్లు రిపబ్లికన్లు ప్రతిపాదించిన ప్యాకేజీకంటే అధికంకావడం విశేషం! దీంతో సెంటిమెంటు బలపడగా.. టెక్నాలజీ దిగ్గజాలలో షార్ట్ కవరింగ్ మార్కెట్లకు జోష్‌నిచ్చినట్లు నిపుణులు తెలియజేశారు. క్రూయిజర్ దూకుడు వారాంతాన ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే టెక్ దిగ్గజాలలో యాపిల్ 3.8 శాతం లాభపడగా.. అమెజాన్ 2.5 శాతం, మైక్రోసాఫ్ట్ 2.3 శాతం, నెట్‌ఫ్లిక్స్, ఫేస్బుక్ 2.1 శాతం చొప్పున ఎగశాయి. ఇతర కౌంటర్లలో ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్ 5 శాతం జంప్‌చేసింది. క్రూయిజర్ నిర్వాహక కంపెనీలు కార్నివాల్ 9.7 శాతం, నార్వేజియన్ క్రూయిజ్ లైన్ 13.7 శాతం, రాయల్ కరిబియన్ 7.7 శాతం చొప్పున దూసుకెళ్లాయి. ఈ నెలలో వీక్ మార్కెట్లకు దన్నునిస్తున్న ఫాంగ్ స్టాక్స్ సెప్టెంబర్‌లో వెనకడుగు వేస్తున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకూ యాపిల్ 13 శాతం పతనంకాగా.. మైక్రోసాఫ్ట్, అల్ఫాబెట్(గూగుల్), నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, ఫేస్బుక్ సుమారు 8 శాతం చొప్పున క్షీణించాయి. దీంతో ఈ నెలలో మార్కెట్లు కరెక్షన్ బాట పట్టినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫలితంగా ఈ నెలలో ఇప్పటివరకూ డోజోన్స్ 4.4 శాతం, ఎస్అండ్పీ 5.8 శాతం చొప్పున పతనంకాగా.. నాస్డాక్ మరింత అధికంగా 7.3 శాతం తిరోగమించడం గమనార్హం! -
టెక్ షాక్- యూఎస్ మార్కెట్లు బోర్లా
వరుస రికార్డులతో హోరెత్తిస్తున్న అమెరికా స్టాక్ మార్కెట్లు గురువారం ఒక్కసారిగా కుప్పకూలాయి. ప్రధానంగా ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే న్యూఏజ్ ఎకానమీ కౌంటర్లలో తలెత్తిన భారీ అమ్మకాలు మార్కెట్లను దెబ్బతీశాయి. దీంతో డోజోన్స్ 808 పాయింట్లు(2.8%) పతనమై 28,293 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 126 పాయింట్లు(3.5%) పడిపోయి 3,455 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 598 పాయింట్లు(5%) దిగజారి 11,458 వద్ద స్థిరపడింది. యాపిల్, మైక్రోసాఫ్ట్, బోయింగ్ తదితర దిగ్గజాల వెనకడుగుతో తొలుత డోజోన్స్ 1,000 పాయింట్లకుపైగా పడిపోవడం గమనార్హం! పతన బాటలో కొద్ది నెలలుగా దూకుడు చూపుతూ అటు ఎస్అండ్పీ, ఇటు నాస్డాక్ కొత్త రికార్డులను చేరుకునేందుకు దోహదపడుతున్న టెక్ దిగ్గజాల కౌంటర్లలో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి జూన్ తదుపరి ఒక్క రోజులోనే ఫాంగ్ స్టాక్స్ అన్నీ భారీగా పతనమయ్యాయి. ఐఫోన్ల దిగ్గజం యాపిల్ 8 శాతం, విండోస్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 6.2 శాతం చొప్పున కుప్పకూలగా.. అమెజాన్, ఫేస్బుక్, గూగుల్, నెట్‌ఫ్లిక్స్ 5 శాతం స్థాయిలో పతనమయ్యాయి. ఇతర కౌంటర్లలో జూమ్ 10 శాతం, టెస్లా 9 శాతం, ఎన్విడియా 9.3 శాతం చొప్పున బోర్లా పడ్డాయి. ఇక బ్లూచిప్స్ హెచ్‌పీ, బోయింగ్, డీరె 3 శాతం చొప్పున డీలా పడ్డాయి. అయితే పటిష్ట త్రైమాసిక ఫలితాల కారణంగా కాల్విన్ క్లెయిన్ బ్రాండ్ కంపెనీ పీవీహెచ్ కార్ప్ 3.3 శాతం ఎగసింది. లాభాల స్వీకరణ ఉన్నట్టుండి గురువారం వెల్లువెత్తిన అమ్మకాలకు ప్రధాన కారణం ట్రేడర్ల లాభాల స్వీకరణే అని విశ్లేషకులు చెబుతున్నారు. కోవిడ్-19 కారణంగా ఆర్థిక వ్యవస్థ అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ న్యూఏజ్ ఎకానమీ కౌంటర్లు నిరవధికంగా దూసుకెళుతున్నట్లు తెలియజేశారు. దీంతో సాంకేతికంగానూ మార్కెట్లు ఓవర్‌బాట్ స్థాయికి చేరుకున్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో ఒక్కసారిగా అమ్మకాలు ఊపందుకున్నట్లు వివరించారు. ఉదాహరణకు గురువారంనాటి పతనం తదుపరి కూడా యాపిల్ ఇంక్ షేరు 2020లో ఇప్పటివరకూ 65 శాతం ర్యాలీ చేయడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. బుధవారం రికార్డ్స్ పలు సానుకూల అంశాల నేపథ్యంలో బుధవారం ఎస్అండ్పీ 54 పాయింట్లు(1.5%) బలపడి 3,581కు చేరగా.. నాస్డాక్ 117 పాయింట్లు(1%) ఎగసి 12,056 వద్ద ముగిసింది. వెరసి 2020లో ఎస్అండ్పీ 22వసారి, నాస్డాక్ 43వ సారి సరికొత్త గరిష్టాలను అందుకున్న సంగతి తెలిసిందే. ఇక డోజోన్స్ 455 పాయింట్లు(1.6%) జంప్‌చేసి 29,100 వద్ద స్థిరపడింది. తద్వారా ఫిబ్రవరి గరిష్టానికి 1.5 శాతం చేరువలో నిలవడంతోపాటు.. 6 నెలల తదుపరి తిరిగి 29,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. -
ట్రంప్ పై మైక్రోసాఫ్ట్ దావా..!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముస్లిం మతం దేశాల నుండి వలసలను పరిమితం చేయడంపై టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ తీవ్రంగా స్పందిస్తోంది. ఇమ్మిగ్రేషన్ కార్వ నిర్వాహక ఆదేశాలపై కంపెనీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫెడరల్ కోర్టులో దావా వేసేందుకు రడీ అవుతోంది. ఏడు ముస్లిందేశాల శరణార్ధులపై ట్రంప్ తాజా ఆదేశాలను అడ్డుకునేందుకు వాషింగ్టన్ స్టేట్ అటార్నీ జనరల్ కార్యాలయం సహకారంతో ఈ దావా వేయనున్నట్టు మైక్రో సాఫ్ట్ ప్రతినిది పీట్ వూటెన్ ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వివాదాస్పద నిర్ణయాలపై భారత ప్రభుత్వం స్పందించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తున్న ట్రంప్ తాజా నిర్ణయాలపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా హెచ్ 1 బీ వీసాలపై ట్రంప్ ఆంక్షల ప్రతిపాదనలపై ట్రంప్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు విదేశాంగ శాఖ సిద్ధమవుతోంది. ఈమేరకు అమెరికన్ కాంగ్రెస్ సీనియర్ సభ్యులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. కాగా ఇమ్మిగ్రేషన్ ఆంక్షలపై ఇప్పటికే టెక్ దిగ్గజాలు తమ నిరసనను వ్యక్తం చేశాయి. ముఖ్యంగా ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల విమర్శలు గుప్పించారు.అ మెరికా వలస దారులదేశమనీ, ట్రంప్ నిర్ణయం సరైదని కాదని ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.