Midterm elections
-
US midterm elections 2022: లాస్ ఏంజెలిస్ మేయర్‌గా నల్లజాతి మహిళ
లాస్ ఏంజెలిస్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భాగంగా జరిగిన లాస్ ఏంజెలిస్ మేయర్ పదవిని మొట్టమొదటిసారిగా ఒక నల్లజాతి మహిళ కైవసం చేసుకుంది. లాస్ ఏంజెలిస్‌కు ఒక మహిళ మేయర్ కావడం ఇదే తొలిసారి. 40 లక్షల జనాభా ఉన్న లాస్ఏంజెలిస్ను పలు సమస్యలు చుట్టుముట్టిన వేళ రిపబ్లికన్ అభ్యర్థి, కుబేరుడు రిక్ కరుసోపై డెమొక్రటిక్ మహిళా అభ్యర్థి కరీన్ బాస్ దాదాపు 47,000 ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 70 శాతానికిపైగా ఓట్ల లెక్కింపు పూర్తవడంతో కరీన్ బాస్ గెలుపు దాదాపు ఖరారైనట్లే. రెండేళ్లక్రితం అధ్యక్ష ఎన్నికల వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు చెందిన ఉపాధ్యక్ష అభ్యర్థుల షార్ట్ లిస్ట్‌లోనూ కరీన్ పేరు ఉండటం గమనార్హం. లాస్ ఏంజెలిస్ మేయర్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా రిక్ కరుసో ఏకంగా దాదాపు రూ.817 కోట్లకుపైగా ఖర్చుపెట్టినట్లు వార్తలొచ్చాయి. ‘ ఈ ఎన్నికలు మనీకి సంబంధించినవి కాదు. మనుషులకు సంబంధించినవి’ అని ప్రచారం సందర్భంగా కరీన్ బాస్ వ్యాఖ్యానించడం ప్రస్తావనార్హం. -
స్త్రీ శక్తి: మడమ తిప్పలేదు... అడుగు ఆపలేదు
పౌరహక్కుల నుంచి పర్యావరణం వరకు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. జాత్యహంకార బెదిరింపులు ఎన్ని ఎదురైనా ధైర్యమే వజ్రాయుధంగా ముందుకు కదిలారు. కొత్త అడుగుతో చరిత్ర సృష్టించారు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన మన వాళ్ల గురించి.. అరుణా మిల్లర్ మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా గెలిచిన అరుణా మిల్లర్ హైదరాబాద్‌లో పుట్టింది. భారత సంతతికి చెందిన వ్యక్తి లెఫ్టినెంట్ గవర్నర్ కావడం ఇదే మొదటిసారి. ఈ విషయంలో అరుణ చరిత్ర సృష్టించింది. మేరీలాండ్కు తొలి భారతీయ–అమెరికన్ డెలిగేట్‌గా తన ప్రత్యేకత చాటుకుంది. మిస్సోరీ యూనివర్శిటీలో సివిల్ ఇంజనీరింగ్ చేసిన అరుణ ట్రాన్స్‌పోర్టేషన్ ప్లానర్‌గా, ట్రాఫిక్ ఇంజనీర్‌గా వివిధ ప్రాంతాలలో పనిచేసింది. మిస్సోరీ ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన అరుణ ఆరోగ్య సంరక్షణ నుంచి పర్యావరణ పరిరక్షణ వరకు ఎన్నో కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించింది. పరిమళా జయపాల్ పరిమళా జయపాల్ యూఎస్ హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్(ప్రతినిధుల సభ)కు ఎంపికైన తొలి భారతీయ–అమెరికన్ మహిళ. తాజాగా 7వ డిస్ట్రిక్ట్(వాషింగ్టన్) నుంచి ప్రతినిధుల సభకు ఎంపికైంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి క్లిఫ్‌మూన్‌పై విజయం సాధించింది. చెన్నైలో పుట్టిన పరిమళా జయపాల్ ఇండోనేషియా, మలేసియాలో పెరిగింది. తల్లి రచయిత్రి. తండ్రి మార్కెటింగ్ రంగంలో పనిచేశారు. పదహారు సంవత్సరాల వయసులో అమెరికాకు వెళ్లింది పరిమళ. జార్జ్‌టౌన్ యూనివర్శిటీ నుంచి బీఏ, కెలాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పట్టాలు పుచ్చుకుంది. చదువు పూర్తయిన తరువాత ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో ఫైనాన్షియల్ ఎనలిస్ట్‌గా పనిచేసింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి ముందు పౌరహక్కుల ఉద్యమాల్లో చురుగ్గా పనిచేసింది. ‘హేట్ ఫ్రీ జోన్’ అనే సంస్థను ప్రారంభించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. పరిమళ మంచి రచయిత్రి కూడా. ‘పిల్గ్రిమేజ్: వన్ వుమెన్స్ రిటర్న్ టు ఏ ఛేంజింగ్ ఇండియా’ అనే పుస్తకం రాసింది. ‘నువ్వు మీ దేశానికి వెళ్లి పో’ అంటూ ఆమెకు ఎన్నోసార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే ఆమె వాటిని ఎప్పుడూ ఖాతరు చేయలేదు. వెనక్కి తగ్గలేదు. నబీలా సయ్యద్ అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికలలో ఇల్లినాయి జనరల్ అసెంబ్లీకి ఎన్నిక కావడం ద్వారా 23 ఏళ్ల ఇండియన్–అమెరికన్ నబీలా సయ్యద్ చరిత్ర సృష్టించింది. డెమోక్రటిక్ పార్టీకి చెందిన నబీలా 51వ డిస్ట్రిక్ట్‌లో రిపబ్లిక్ పార్టీకి చెందిన క్రిస్ బోస్పై ఘన విజయం సాధించింది. ఇల్లినాయి రాష్ట్రంలోని పాలై్టన్ విలేజ్‌లో పుట్దింది నబీలా. హైస్కూల్ రోజుల నుంచి ఉపన్యాస పోటీల్లో చురుగ్గా పాల్గొనేది. వాటి ద్వారా రకరకాల సామాజిక విషయాలను లోతుగా తెలుసుకునే అవకాశం వచ్చింది. కాలేజిలో ఎన్నో చర్చావేదికల్లో పాల్గొనేది. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి పొలిటికల్ సైన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లలో పట్టా పుచ్చుకుంది. స్త్రీ సాధికారత, హక్కులకు సంబంధించి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనే నబీలా ఉద్యోగం కంటే ఉద్యమాలకే ప్రాధాన్యత ఇచ్చేది. ఈ క్రమంలోనే రాజకీయాలకు దగ్గరైంది. ‘ఎమిలీస్ లిస్ట్’తో కలిసి పనిచేసింది. ఎమిలీస్ లిస్ట్ అనేది డెమోక్రటిక్ మహిళా అభ్యర్థులు చట్ట సభకు ఎన్నిక కావడానికి ఉపకరించే పొలిటికల్ యాక్షన్ కమిటీ.‘నా విజయానికి ప్రధాన కారణం తమ తరపున పోరాడే, బలంగా గొంతు వినిపించే వ్యక్తిని ప్రజలు తమ ప్రతినిధిగా చట్టసభకు పంపాలనుకోవడం. వారి నమ్మకాన్ని నిలబెడతాను’ అంటోంది నబీలా.ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటి తలుపు తట్టిన నబీలా తనను గెలిపించిన వారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి మళ్లీ ఇంటింటికీ వెళ్లనుంది. -
US Midterm Elections 2022: అమెరికా సెనేట్‌పై పట్టు నిలుపుకున్న డెమొక్రాట్లు
వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్‌లో అత్యంత కీలకమైన ఎగువ సభ సెనేట్‌పై డెమొక్రాట్లు పట్టు నిలుపుకున్నారు. మూడు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండింట్లో డెమొక్రాటిక్ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. నెవడాకు చెందిన డెమొక్రాటిక్ సెనేటర్ కేథరిన్ కార్టెజ్ మాస్‌తో తన రిపబ్లికన్ ప్రత్యర్థి ఆడం లక్సల్ట్పై విజయం సాధించారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ఆడం ఓటమి ట్రంప్‌కు వ్యక్తిగతంగా ఎదురు దెబ్బే. అరిజోనాలోనూ డెమొక్రాటిక్ సెనేటర్ మార్కె కెల్లీ గెలిచారు. దీంతో 100 మంది సభ్యులున్న సెనేట్‌లో డెమొక్రాట్ల సంఖ్య 50కి చేరింది. రిపబ్లికన్లకి 49 మంది సభ్యుల బలముంది. జార్జియాలో ఫలితం వెలువడాల్సి ఉంది. -
కొత్త రికార్డుల దిశగా సాగొచ్చు
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందితే.., ఈ వారం దేశీయ స్టాక్ సూచీలు తాజా జీవితకాల గరిష్టానికి చేరే వీలుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరించే అవకాశం లేకపోలేదని అంటున్నారు. దేశీయంగా ద్రవ్యోల్బణ డేటా, అమెరికా మధ్యంతర ఎన్నికలు, విదేశీ పెట్టుబడులు కీలకమని చెబుతున్నారు. చివరి దశకు చేరుకున్న కార్పొరేట్ ఆర్థిక ఫలితాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. ట్రేడింగ్ నాలుగురోజులే జరిగిన గత వారంలో సెన్సెక్స్ 1097 పాయింట్లు, నిఫ్టీ 233 పాయింట్లు చొప్పున ర్యాలీ చేశాయి. అమెరికా అక్టోబర్ రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల కన్నా తక్కువగా నమోదువడంతో ఇకపై ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే ఆశలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. ‘‘గతేడాది(2021) అక్టోబర్ 19న సెన్సెక్స్ 62,245 వద్ద, నిఫ్టీ 18,604 వద్ద జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. ఈ వారాంతపు రోజున సెన్సెక్స్ జీవితకాల గరిష్టం ముగింపు(61,795) వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో ఏడాది గరిష్టాన్ని(18,362) తాకింది. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందితే సూచీలు జీవితకాల గరిష్టాన్ని అందుకోవచ్చు. ట్రేడర్లు మాత్రం అప్రమత్తంగా ఉండటం మంచిది. నిఫ్టీ 18,300 స్థాయిని నిలుపుకోలిగితే 18,600 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరిగితే డౌన్‌ట్రెండ్‌లో 18,000 –17,800, శ్రేణిలో తక్షణ మద్దతు లభించవచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ అన్మోల్ దాస్ తెలిపారు. ► ద్రవ్యోల్బణ డేటా దృష్టి అమెరికా ద్రవ్యోల్బణ డేటా వెల్లడి తర్వాత మార్కెట్ వర్గాలు ఇప్పుడు దేశీయ ద్రవ్యోల్బణ గణాంకాలపై దృష్టి సారించాయి. డిసెంబర్ ఆర్బీఐ ద్రవ్య విధాన వైఖరికి మార్గదర్శకమైన సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు నేడు విడుదల కానున్నాయి. సెప్టెంబర్ ద్రవ్యోల్బణం 7.4%గా నమోదైంది. ఈ అక్టోబర్‌లో ఏడుశాతంలోపే ఉండొచ్చని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. . ► కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు దేశీయ కార్పొరేట్ ఆర్థిక ఫలితాల అంకం చివరి దశకు చేరింది. ఈ వారంలో సుమారు 1,400కి పైగా కంపెనీలు తమ క్యూ2తో గణాంకాలను ప్రకటించనున్నాయి. ఓఎన్జీసీ, గ్రాసీం ఇండస్ట్రీస్ ఆర్థిక ఫలితాల ప్రకటన(నేడు)తో నిఫ్టీ 50 ఇండెక్స్‌లో లిస్టయిన కంపెనీ త్రైమాసిక ఫలితాల వెల్లడి పూర్తి అవుతుంది. వీటితో పాటు బయోకాన్, భారత్ ఫోర్జ్, అపోలో టైర్స్, ఐఆర్సీటీసీ, స్పైస్‌జెట్‌లు, ఆర్తి ఇండస్ట్రీస్, అబాట్ ఇండియా, బాలకృష్ణ ఇండస్ట్రీస్, హుడ్కో, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, జ్యోతి ల్యాబ్స్, లక్స్ ఇండస్ట్రీస్ కంపెనీలు ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది. ► ప్రపంచ పరిణామాలు అమెరికా అధ్యక్షుడి రెండేళ్ల పాలనకు రెఫరెండంగా భావించిన మధ్యంతర ఎన్నికల ఫలితాలను ప్రపంచ మార్కెట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. నేడు యూరో పారిశ్రామికోత్పత్తి డేటా, బ్రిటన్ నిరుద్యోగ రేటు మంగళవారం విడుదల అవుతాయి. అదే రో జున యూరోజోన్, జపాన్ జీడీపీ అంచనాలు వెల్లడికానున్నాయి. ఎల్లుండి(బుధవారం)బ్రిటన్ అక్టోబర్ ద్రవ్యోల్బణ డేటా విడుదల అవుతుంది. ఈ మరుసటి రోజు యూరో జోన్ ద్రవ్యోల్బణం, జపాన్ వా ణిజ్య లోటు గణాంకాలు విడుదల అవుతాయి. ఆర్థి క స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. ఎఫ్ఐఐలు వైఖరి ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధానపరమైన ఆందోళనలు తగ్గుముఖంపట్టడంతో దేశీయ మార్కెట్లోకి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నాయి. గతవారంలో రూ.6,300 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. ఎఫ్ఐఐలు తమ బుల్లిష్ ధోరణిని కొనసాగిస్తే సూచీలు సులభంగా జీవితకాల గరిష్టాన్ని చేరుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. దిద్దుబాటు సమయంలో కొనుగోళ్లు చేపడుతూ మార్కెట్‌కు అండగా నిలిచే సంస్థాగత ఇన్వెస్టర్లు ఇటీవల అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఈ నవంబర్‌లో నికరంగా రూ.5600 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. -
Nabeela Syed: ఇండో-అమెరికన్ సంచలనం
అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు.. ఎన్నో సంచలనాలకు నెలవుగా మారింది. అందులో భారత సంతతికి చెందిన పలువురు నెగ్గి.. హాట్ టాపిక్‌గా మారారు. ఇందులో రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, ప్రమీలా జయపాల్, అమీ బేరా ఉన్నారు. అయితే వీళ్లు కాకుండా నబీలా సయ్యద్ మాత్రం చరిత్ర సృష్టించింది. ఇల్లినాయిస్ స్టేట్ జనరల్ అసెంబ్లీకి ఎన్నికైన.. అత్యంత పిన్నవయస్కురాలి ఘనత సాధించింది ఆమె. 23 ఏళ్ల ఈ ఇండో-అమెరికన్.. రిపబ్లికన్ ప్రత్యర్థి క్రిస్ బాస్‌ను ఓడించింది. ఇల్లినాయిస్ స్టేట్‌లోని 51వ డిస్ట్రిక్ నుంచి పోటీ చేసిన ఆమె.. మొత్తం ఓట్లలో 52.3 శాతం ఓట్లకు దక్కించుకుంది. దీంతో తన ఆనందాన్ని ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. నా పేరు నబీలా సయ్యద్. 23 ఏళ్ల వయసున్న ముస్లిం యువతిని. ఇండో-అమెరికన్‌ని. రిపబ్లికన్ పార్టీ ఆధీనంలో ఉన్న స్థానాన్ని మేం కైవసం చేసుకున్నాం. జనవరిలో ఇల్లినాయిస్ జనరల్ అసెంబ్లీలో చిన్నవయస్కురాలిగా అడుగుపెట్టబోతున్నాం. నన్ను గెలిపించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ జిల్లాలో ప్రతీ తలుపు తట్టాను. ఇప్పుడు గెలిచిన తర్వాత మరోసారి తట్టి.. వాళ్లకు కృతజ్ఞతలు చెబుతాను. రంగంలోకి దిగడానికి నేను సిద్ధం అని సుదీర్ఘ పోస్టులు చేశారు. View this post on Instagram A post shared by Nabeela Syed (@nabeelasyed) భారత దేశ మూలాలున్న నబీలా సయ్యద్.. బర్కిలీ కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పలు ఎన్జీవోలలో పని చేయడంతో పాటు మహిళా హక్కుల సాధన, అత్యాచార బాధితుల తరపున పోరాడుతున్నారామె. ఇదీ చదవండి: లెఫ్టినెంట్ గవర్నర్‌గా కాట్రగడ్డ అరుణ -
సీన్ రివర్స్.. బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో సీన్ రివర్స్ అయ్యింది. రిపబ్లికన్ పార్టీ స్వల్ఫ ఆధిపత్యం సాధించింది. అయితే అనుకున్న మేర ఫలితం సాధించలేకపోవడం గమనార్హం. ఈ తరుణంలో డెమోక్రటిక్ పార్టీ నేత, ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచి రోజు అంటూ వ్యాఖ్యానించారాయన. ఓటర్లలో పేరుకుపోయిన నిరాశను అంగీకరించిన బైడెన్.. అధిక మెజారిటీ ద్వారా అమెరికన్లు తన ఆర్థిక ఎజెండాకు మద్దతు ఇచ్చారని చెప్పారు. ‘‘ఇది ఒక శుభదినం. బహుశా ప్రజాస్వామ్యానికి, అమెరికాకు మంచి రోజని భావిస్తున్న. రిపబికన్లదే పూర్తి హవా ఉంటుందని కొందరు అంచనా వేశారు. అది జరగలేదు’’ అంటూ వైట్ హౌజ్‌లో జరిగిన న్యూస్ కాన్ఫరెన్స్‌లో వ్యాఖ్యానించారాయన. మరోవైపు 2024 అధ్యక్ష ఎన్నికల కోసం సిద్ధమవుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఈ ఫలితాలు పెద్ద దెబ్బే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కనీసం 250 స్థానాలు ఆశించింది ఆ పార్టీ. పైగా ట్రంప్ వ్యక్తిగతంగా ప్రచారం చేసిన ప్రముఖులు ఓటమి చెందడం గమనార్హం. అధిక ద్రవ్యోల్బణంతో పాటు బైడెన్ ఎన్నిక చట్టబద్ధతను ప్రశ్నిస్తూ.. రిపబ్లికన్లు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. 2018 తర్వాత మొదటిసారిగా 435 మందితో కూడిన యూఎస్ హౌజ్‌ను అతిస్వల్ఫ ఆధిక్యంతో తిరిగి కైవసం చేసుకునేందుకు ట్రాక్ ఎక్కింది. వంద మంది సభ్యున్న యూఎస్ సెనేట్‌లో ఇరు పార్టీలు 48 స్థానాలు దక్కించుకున్నాయి. ఇక హౌజ్ ఆఫ్ రెప్రజెంటివ్స్లో రిపబ్లికన్ పార్టీ 207 సీట్లు, డెమోక్రటిక్ పార్టీ 183 స్థానాలు దక్కించుకున్నాయి(స్పష్టమైన ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది). గత 40 ఏళ్లలో ఈ మధ్యంతర ఎన్నికల ఫలితాలు అత్యుత్తమమని బైడెన్ వ్యాఖ్యానించడం గమనార్హం. -
బైడెన్ ఇజ్జత్‌కా సవాల్.. ట్రంప్‌కి తాడేపేడో!
అగ్రరాజ్యం అమెరికాలో మధ్యంతర (మిడ్ టర్మ్) ఎన్నికలకు రంగం సిద్ధమయ్యింది. మంగళవారం ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో వెలువడే ఫలితాలు ప్రస్తుత అధ్యక్షుడి మిగిలిన రెండేళ్ల పదవీ కాలంపై ప్రభావం చూపనున్నాయి. దేశ రాజకీయాలను సైతం తారుమారు చేసే అవకాశం లేకపోకపోలేదు. అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిష్టకు పరీక్షగా మారాయి. బైడెన్‌తోపాటు మాజీ అధ్యక్షుడు డొ నాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రచారం హోరెత్తించారు. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడ్డారు. మధ్యంతర ఎన్నికలంటే? అమెరికా పార్లమెంట్(కాంగ్రెస్)కు ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. కాంగ్రెస్‌లో రెండు సభలుంటాయి. అవి హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్. అధ్యక్షుడి పదవీ కాలం నాలుగేళ్లు. కాంగ్రెస్‌కు ప్రతి రెండేళ్లకోసారి.. అధ్యక్షుడి పదవీ కాలం మధ్యలో(సగం ముగిసినప్పుడు) ఎన్నికలు జరుగుతాయి. అందుకే వీటిని మధ్యంతర ఎన్నికలు అంటారు. అమెరికాలో 50 రాష్ట్రాలున్నాయి. ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు సెనేటర్లు ప్రాతినిధ్యం వహిస్తారు. అంటే మొత్తం సెనేటర్లు 100 మంది. వారి పదవీ కాలం ఆరేళ్లు. మొత్తం 435 మంది ప్రతినిధులు ఉంటారు. ఇక జనాభాను బట్టి రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించే ప్రతినిధుల సంఖ్య మారుతుంది. వారి పదవీ కాలం రెండేళ్లు. ప్రతినిధుల సభలోని అన్ని స్థానాలతోపాటు సెనేట్‌లో మూడొంతుల్లో ఒక వంతు స్థానాలకు (35 సీట్లు) ఎన్నికలు నిర్వహిస్తారు. అంతేకాకుండా కొన్ని పెద్ద రాష్ట్రాల్లో గవర్నర్లను కూడా ఎన్నుకుంటారు. గెలిచేదెవరో? అధికార డెమొక్రటిక్ పార్టీకి కాంగ్రెస్ ఉభయ సభల్లో గత రెండేళ్లుగా మెజారిటీ ఉంది. అందుకే జో బైడెన్ మదిలోని ఆలోచనలు సులభంగా చట్టాలుగా మారుతున్నాయి. కానీ, ప్రతిపక్ష రిపబ్లికన్లతో పోలిస్తే డెమొక్రాట్ల ఆధిక్యం స్వల్పమే. కాబట్టి మధ్యంతర ఎన్నికల్లో ఇరుపక్షాల నడుమ ఉత్కంఠభరితమైన పోటీ ఖాయంగా కనిపిస్తోంది. ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు, సెనేట్‌లో డెమొక్రాట్లు పాగా వేసే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రతినిధుల సభలో 435 స్థానాలు ఉండగా, కేవలం 30 స్థానాల్లో గట్టి పోటీ ఉండనుంది. ఇక సెనేట్‌లో 35 సీట్లలో హోరాహోరీ పోరు సాగనుంది. దేశవ్యాప్తంగా అమలయ్యే చట్టాలను కాంగ్రెస్ రూపొందిస్తుంది. ఏయే చట్టాలను తీసుకురావాలో హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్(ప్రతినిధుల సభ) నిర్ణయిస్తుంది. ఆ చట్టాలను సెనేట్ అడ్డుకోవచ్చు లేదా ఆమోదించవచ్చు. అధ్యక్షుడు తీసుకున్న నిర్ణ యాలకు సెనేట్ ఆమోద ముద్ర వేస్తుంది. అత్యంత అరుదుగా వాటిపై విచారణ కూడా జరపవచ్చు. ప్రభావితం చేసే అంశాలేమిటి? దేశంలోకి వెల్లువెత్తుతున్న వలసలు, పెరిగిపోతున్న నేరాలు, జీవన వ్యయం వంటివి మధ్యంతర ఎన్నికలను ప్రభావితం చేయబోతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలు ప్రతిపక్ష రిపబ్లికన్లకు ఉపకరించనున్నాయి. ఆగస్టులో నిర్వహించిన సర్వేలో అధ్యక్షుడు బైడెన్ పట్ల 50 శాతం కంటే తక్కువ ప్రజామోదం ఉన్నట్లు తేలింది. ఇది ఆయనకు ఇబ్బందికరంగా పరిణమించింది. మధ్యంతర ఎన్నికలు సాధారణంగా అధ్యక్షుడి పనితీరును ప్రతిబింబిస్తాయి. ఈ ఫలితాలను ఆయన పాలనపై ప్రజాతీర్పుగా భావించవచ్చు. ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ల పట్టు సాధిస్తే.. వాతావరణ మార్పులు, ఆరోగ్య సంరక్షణ పథకాలు, గర్భస్రావ హక్కుల పరిరక్షణ, తుపాకీ సంస్కృతిని కట్టడి చేయడం వంటి అంశాల్లో బైడెన్ మరింత దూకుడుగా ముందుకెళ్లొచ్చు. ఏదో ఒక సభలో రిపబ్లికన్లు పైచేయి సాధిస్తే మాత్రం బైడెన్ అజెండాకు అడ్డుకట్ట తప్పదు. అధ్యక్ష ఎన్నికను ప్రభావితం చేస్తుందా? మధ్యంతర ఎన్నికల ఫలితాల ఆధారంగా.. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగుతారో ఒక అంచనాకు రావొచ్చు. రిపబ్లికన్ పార్టీ నుంచి తానే పోటీ చేయబోతున్నానని మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ మద్దతుదారులు ఎక్కువ సంఖ్యలో నెగ్గకపోతే ఆయనకు అవకాశాలు తగ్గిపోతాయి. మిషిగాన్, విస్కాన్సిన్, పెన్సిల్వేనియా వంటి పెద్ద రాష్ట్రాలను డెమొక్రాట్లు నిలబెట్టుకుంటే బైడెన్ మళ్లీ అధ్యక్షుడు అయ్యే చాన్సుది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా మధ్యంతరంలో ఐదుగురు భారతీయులు
వాషింగ్టన్: అమెరికా పార్లమెంట్ దిగువ సభకు జరుగుతున్న మధ్యంతర ఎన్నికల్లో ఐదుగురు భారతీయ అమెరికన్లు బరిలో దిగారు. కాలిఫోర్నియాలోని ఏడో కాంగ్రెషనల్ స్థానం నుంచి 57 ఏళ్ల అమీ బేరా ఆరోసారి రేసులో ఉన్నారు. 46 ఏళ్ల రో ఖన్నా కాలిఫోర్నియాలోని 17వ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. వాషింగ్టన్ రాష్ట్రంలోని ఏడో స్థానం నుంచి 57 ఏళ్ల జయపాల్ అదృష్టం పరీక్షించుకోనున్నారు. మిషిగన్‌లోని 13వ స్థానం నుంచి శ్రీ థనేదర్ పోటీకి సిద్ధమయ్యారు. రిపబ్లిక్ అభ్యర్థులతో పోలిస్తే బేరా, రాజా, ఖన్నా, ప్రమీలా బలంగా ఉన్నట్లు సమాచారం. ఇక 67 ఏళ్ల థనేదర్ అరంగేట్రం చేస్తున్నారు. ఐదుగురిలో ప్రమీలా జయపాల్ ఒక్కరే మహిళా అభ్యర్థి. హోరాహోరీ పోరు ఉండే స్థానాల్లో భారతీయ అమెరికన్ ఓటర్ల పాత్ర కీలకం కానుంది. ప్రతినిధుల సభలో 435 మంది సభ్యులుంటారు. 50 రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన స్థానాలను కేటాయిస్తారు. సెనేట్‌లో మాత్రం 100 మంది సెనేటర్లు ఉంటారు. ప్రతి రాష్ట్రానికి సమప్రాధాన్యత అంటే రెండు సీట్లు ఉంటాయి. మరోవైపు మేరీలాండ్ రాష్ట్రంలో డెమొక్రటిక్ మహిళా అభ్యర్థిగా లెఫ్టినెంట్ గవర్నర్ పదవి కోసం 57 ఏళ్ల అరుణా మిల్లర్ పోటీపడుతున్నారు. ఆమె గెలిస్తే ఈ పదవి చేపట్టే తొలి భారతీయ అమెరికన్‌గా చరిత్ర సృష్టిస్తారు. ప్రతినిధుల సభకు నవంబర్ ఎనిమిదో తేదీన పోలింగ్ జరగనుంది. -
ట్విటర్ డీల్: మస్క్‌పై ధ్వజమెత్తిన అమెరికా అధ్యక్షుడు
న్యూఢిల్లీ: బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్విటర్ కొనుగోలుపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ స్పందించారు. తప్పుడు సమాచారాన్ని అవాస్తలను వ్యాప్తి చేస్తున్న ట్విటర్‌ను కొనుగోలు చేశారంటూ ఆయన విమర్శలు గుప్పించారు. ప్రపంచవ్యాప్తంగా, అసత్య ప్రచారాలతో విషాన్ని చిమ్ముతున్న ట్విటర్‌ను కొనుగోలు చేశారని మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా అసత్య వార్తలను, విషప్రచారాన్ని చేస్తున్న ట్విటర్‌ను మస్క్ కొనుగోలు చేయడం విచారకరమన్నారు. ట్విటర్‌కి అసలుఎడిటర్లే (నియంత్రణ) లేరు ఇక ప్రమాదంలో ఉన్నదాన్ని పిల్లలు అర్థం చేసుకుంటారని ఎలా విశ్వసించాలని బిడెన్ ప్రశ్నించారు. ముఖ్యంగా సీఈవో పరాగ్ అగర్వాల్ సహా పలువురి కీలక ఎగ్జిక్యూవ్ల తొలగింపు, సంస్థలో దాదాపు సగం ఉద్యోగులపై వేటు, డైరెక్టర్ బోర్డును చేసి, ఏకైక డైరెక్టర్‌గా మస్క్ కొనసాగుతున్న నేపథ్యంలో బిడెన్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. నవంబర్ 8న అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్న సందర్భంగా శుక్రవారం సాయంత్రం చికాగోలో జరిగిన నిధుల సమీకరణ మీట్లో దీని ప్రభావంపై డోనర్లను హెచ్చరిస్తూ బిడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్ల మధ్య ఈ ఎ న్నికలు బైడెన్ సర్కార్‌కు పెద్ద సవాల్. (ElonMusk రోజుకు 40 లక్షల డాలర్ల నష్టం! అయినా ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇస్తున్నా!) మరోవైపు ట్విటర్ టోకోవర్పై అమెరికా మాజీ ప్రెసిడెంట్ డోనాల్ట్ ట్రంప్ సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే. కాగా బిడెన్‌పై మస్క్ గతంలో తీవ్ర విమర్శలు చేశారు. దేశాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజలు బైడెన్‌ను ఎన్నుకోలేదనీ, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డ్రామాను తట్టుకోలేకే ఆయన్ను గెలిపించారని వ్యాఖ్యానించడం గమనార్హం. -
181 ఏళ్ల తర్వాత తొలిసారిగా..
వాషింగ్టన్ : కొత్తగా కొలువుదీరిన ప్రతినిధుల సభ(హౌజ్ ఆఫ్ రిప్రజంటేటివ్స్) 181 ఏళ్ల నిబంధనను తిరగరాస్తూ కొత్త చరిత్రను లిఖించింది. మత సంప్రదాయాలకు విలువనిస్తూ వివిధ మతాలకు చెందిన ప్రతినిధులు తమ ఆచారం ప్రకారం తలపాగా(హిజాబ్, టర్బైన్) ధరించి సభకు హాజరయ్యేలా రూపొందించిన బిల్లుకు గురువారం ఆమోదం తెలిపింది. హౌజ్‌కు తొలిసారిగా ఎన్నికైన తొలి ముస్లిం మహిళలుగా సరికొత్త రికార్డు సృష్టించిన రషిదా త్లాయిబ్, ఇల్హాన్ ఒమర్‌లు ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఈ బిల్లు ఆమోదం పొందడం విశేషం. ‘హెడ్‌గేర్ ధరించడంపై 181 ఏళ్లుగా ఉన్న నిషేధాన్ని 116వ కాంగ్రెస్ సభ్యులు ఎత్తివేశారు. నాకు ఇంతటి సాదర స్వాగతం పలికిన నా సహచరులకు ధన్యవాదాలు. ఈవిధంగానే.. ముస్లిం కుటుంబాలను అమెరికా నుంచి విడదీసే నిషేధానికి కూడా ముగింపు పలికే రోజు కోసం ఎదురుచూస్తున్నా’ అంటూ ఇల్హాన్ ఒమర్ ట్విటర్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. కాగా నవంబరులో జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 100 మంది మహిళలు దిగువ సభ(హౌజ్)కు ఎన్నికయ్యారు. ఇందులో 28 మంది తొలిసారిగా ఈ సభలో అడుగుపెట్టబోతున్నారు. వీరంతా డెమొక్రటిక్ పార్టీకి చెందిన వారే కావడం విశేషం. ఇక ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి ముస్లిం మహిళలుగా రషిదా త్లాయిబా, సోమాలియాకు చెందిన ఇల్హాన్ ఒమర్‌లు గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. Yesterday, Congress voted to lift a 181 year ban on headwear to make the #116thCongress more inclusive for all. I thank my colleagues for welcoming me, and I look forward to the day we lift the Muslim ban separating families all over the U.S. from their loved ones. — Ilhan Omar (@IlhanMN) January 4, 2019 -
ట్రంప్‌కు ‘మధ్యంతర’ భంగపాటు!
గత రెండేళ్లుగా దూకుడుగా వెళ్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఆ దేశంలోని మధ్యంతర ఎన్నికల ఫలితాలు తొలిసారి ‘చెక్’ పెట్టాయి. సెనేట్‌లో తమ బలం సుస్థిరం చేసుకున్నామని, ఈ ఫలి తాలు తమకే అనుకూలమని ట్రంప్ చెప్పుకుంటున్నా, ప్రతినిధుల సభపై ఆయన పార్టీ పట్టు కోల్పోయింది. ఎనిమిదేళ్ల తర్వాత ఆ సభలో డెమొక్రాట్లకు ఆధిపత్యం లభించింది. ఈ ఎన్నికల్లో ఏం చేసైనా విజయాన్ని సొంతం చేసుకోవాలని ట్రంప్ తాపత్రయపడ్డారు. ఆయన ప్రచారం పర్యవ సానంగా దేశంలో జాతి, మత, సాంస్కృతిక, వలస విషయాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ట్రంప్ ప్రత్యర్థులకు గుర్తుతెలియని వ్యక్తులు పైప్ బాంబులు పంపడం, పిట్స్బర్గ్ యూదుల ప్రార్థనా మందిరం కాల్పులు జరిగి 11మంది మరణించడం వంటి ఉదంతాలు జనాన్ని ఆలోచింపజేశాయి. అమెరికాలో ఆశ్రయం పొందటానికొస్తున్న మధ్య అమెరికా దేశస్తుల విషయంలో ట్రంప్ చేసిన ప్రక టనలు బెడిసికొట్టాయి. ఎన్నికల ఫలితాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి నిర్వహించిన మీడియా సమావేశంలో సైతం ట్రంప్ అతిశయోక్తులకు పోయారు. అతిగా స్పందించారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సరిగా జవాబు చెప్పలేక ఆయన అసహనంతో ఊగిపోయారు. ట్రంప్‌ను ప్రశ్నిస్తుండగా మైక్ తీసుకునేందుకు వచ్చిన వైట్‌హౌస్ ఉద్యోగినిని నిలువరించడానికి ప్రయత్నించిన సీఎన్ఎన్ ప్రతినిధిపై అసభ్యంగా ప్రవర్తించాడని నిందలేసి అతని గుర్తింపు కార్డును రద్దు చేయించారు. ఇతర మీడియా ప్రతినిధులపై సైతం ఆయన అదే విధంగా విరుచుకుపడ్డారు. ‘మీరు ప్రజా శత్రువుల’ని దూషించారు. పైకి ఎంత గాంభీర్యాన్ని ప్రదర్శించినా, ఈ ఎన్నికల ఫలి తాలు ఆయన్ను ఎంతగా నిరాశపరిచాయో ఈ మీడియా సమా వేశమే వెల్లడించింది. రెండేళ్లనాటితో పోలిస్తే ట్రంప్ రాజకీయంగా బలహీనపడినట్టు ఈ ఫలితాలు రుజువు చేశాయి. వందమంది సభ్యులుండే సెనేట్‌లో రిపబ్లికన్ సభ్యులు 51మంది. డెమొక్రాట్ల బలం 49. కానీ తాజా ఎన్నికలతో రిపబ్లికన్ల బలం యధాతథంగా 51 ఉండగా, డెమొక్రాట్లు 46కి పడిపోయారు. మొత్తం 35 సెనేట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 435 స్థానాలుండే ప్రతినిధుల సభలో రిప బ్లికన్లకు 235 స్థానాలుంటే డెమొక్రాట్లు 193మంది ఉండేవారు. తాజా ఫలితాలతో డెమొక్రాట్ల బలం 255కి చేరుకుంటే, రిపబ్లికన్లు 197కి పరిమితమయ్యారు. ఈసారి ఎన్నికల విశిష్టత ఏమంటే.. ప్రతినిధుల సభకు ఎన్నడూలేని స్థాయిలో వందమంది మహిళలు విజయం సాధించారు. వీరిలో అత్యధికులు డెమొక్రాట్లే. అలాగే 28మంది తొలిసారిగా ఎన్నికైనవారు. అంతేకాదు... తొలిసారిగా ఒక ముస్లిం మహిళ గెలిచారు. ట్రంప్‌కు తుపాకి తయారీదారుల సంస్థ నేషనల్ రైఫిల్ అసో సియేషన్(ఎన్ఆర్ఏ) కూడా తోడ్పాటునందించింది. సెనేట్‌లో ఆ సంస్థ చలవతో కొందరు రిప బ్లికన్లు సెనేట్‌కు, గవర్నర్ పదవులకూ ఎన్నికైనా కొన్ని స్థానాల్లో దాని ఎత్తులు పారలేదు. ఇండి యానా, మిస్సోరి, టెనెస్సీ వంటి స్థానాల్లో ఎన్ఆర్ఏ మద్దతున్నవారు నెగ్గగా... వర్జీనియా, నెవడా, విస్కాన్సిన్, కొలరాడో, సౌత్ కరొలినా, కాన్సాస్‌లలో ఎన్ఆర్ఏ ఎత్తులు పారలేదు. తుపాకుల కొనుగోలును నియంత్రించాలని గట్టిగా వాదించిన డెమొక్రాట్లే అక్కడ విజయం సాధించారు. నిజా నికి సౌత్ కరొలినా, కాన్సాస్‌లు రిపబ్లికన్లకు బాగా పట్టున్న ప్రాంతాలు. తుపాకుల అమ్మకాలను నియంత్రించాలని కోరుకునేవారు వాటి కొనుగోలుకు అర్హమైన వయసును 18 ఏళ్లనుంచి 21 ఏళ్లకు మార్చాలని, మానసిక ఆరోగ్యం సరిగా లేనివారి నుంచి తుపాకులు స్వాధీనం చేసుకోవాలని అడు గుతున్నారు. ఇలా డిమాండ్ చేయటమంటే ఆత్మరక్షణ హక్కుకు పౌరుల్ని దూరం చేసినట్టే అవు తుందని ఎన్ఆర్ఏ వాదిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫ్లారిడాలోని ఒక ఉన్నత పాఠశాల విద్యార్థి 17మంది విద్యార్థుల్ని, ఉపాధ్యాయుల్ని కాల్చిచంపిన ఉదంతం తర్వాత తుపాకి సంస్కృతిపై దేశ మంతా నిరసనలు మిన్నంటాయి. ఎన్‌ఆర్‌ఏకు మద్దతిస్తున్నారని గుర్తించిన అభ్యర్థులకు వ్యతి రేకంగా చాలాచోట్ల విద్యార్థులే ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేయ డానికి డెమొక్రాట్లు జంకారు. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, ఉపాధి అవకాశాలు కొద్దో గొప్పో పెరగడం అందుకు కారణం. అందుకే పేదవర్గాలకుండే ఆరోగ్యబీమా, సామాజిక భద్రత వగైరా అంశాల్లో కోత పెట్టడం, ఆహార పదార్థాల ధరలు పెరగడం వంటి అంశాలపై డెమొ క్రాట్లు దృష్టి సారించారు. ప్రతినిధుల సభలో డెమొక్రాట్లకు ఆధిక్యత రావడంతో డోనాల్డ్ ట్రంప్‌కు ఇక కష్టకాలం మొద లైనట్టే. రెండేళ్లుగా ఉభయ సభల్లో ఉన్న మెజారిటీని ఆసరా చేసుకుని ఇష్టానుసారం వ్యవహరిస్తున్న ఆయన ఇకపై ఆచి తూచి అడుగులేయాల్సి ఉంటుంది. వలస చట్టాల్లో కఠినమైన నిబంధనలు, పన్ను కోతలు, ఆరోగ్యబీమా సంస్కరణలు వగైరా అంశాల్లో తాను ఆశించిన మార్పులు తీసుకు రావడం అంత సులభం కాదు. విపక్షంతో ఓపిగ్గా చర్చించడానికి, అవసరమైతే రాజీ పడటానికి ఆయన సిద్ధమైతే తప్ప ఆశించినవి అమల్లోకి తీసుకురావడం కష్టం. వీటి సంగతలా ఉంచి 2016 నాటి అధ్యక్ష ఎన్నికల సమయంలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీని ఓడించడానికి రష్యాతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలపై మ్యూలర్ ఏడాదిన్నరగా సాగిస్తున్న దర్యాప్తును అడుగడుగునా ట్రంప్ ఆటంకపరిచే యత్నం చేస్తున్నారు. దాని దర్యాప్తు దాదాపు పూర్తయింది. అదిచ్చే నివేదిక ట్రంప్‌పై నిందలు నిజమని నిర్ధారించిన పక్షంలో ప్రతినిధుల సభ ఆయన్ను అభిశంసించే అవకాశం ఉంది. అయితే అధ్యక్ష పదవినుంచి తొలగించాలంటే సెనేట్‌లో మూడింట రెండువంతుల మంది మద్దతు అవసరం. అది ఎటూ అసాధ్యం. కానీ ప్రతినిధుల సభలో ఎదురైన భంగపాటుకు ట్రంప్ ప్రతీకార చర్యలు మొదలుపెడతారు. మొత్తానికి రాబోయే రెండేళ్లూ ఆయనకు అగ్నిపరీక్షే. ఆయ నకు వచ్చే ఎన్నికల్లో అధ్యక్ష పీఠం దక్కకపోవచ్చునని ప్రస్తుత ఫలితాలు వెల్లడిస్తున్నాయి. చేసు కున్నవారికి చేసుకున్నంత! -
వారిలో ఎక్కువ మంది ట్రంప్‌కు వ్యతిరేకమే..!
అమెరికా చట్ట సభలకు జరిగిన మధ్యంతర ఎన్నికల ఫలితాలు ఊహించినట్టే వచ్చాయి. ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు, సెనెట్‌లో రిపబ్లికన్లు మెజారీటీ సాధించారు. ప్రతినిధుల సభలో డెమోక్రాట్ల ఆధిపత్యం ట్రంప్ దూకుడుకు కళ్లెం వేస్తుందని ట్రంప్ వ్యక్తిగత అంశాలపై, ఆయన పాలనపై జరుగుతున్న దర్యాప్తులు ఊపందుకుంటాయని విశ్లేషకుల అంచనా. ట్రంప్ తన విధానాలను, నిర్ణయాలను పునఃపరిశీలించుకోవలసిన అవసరం ఉంటుందని కూడా వారు స్పష్టం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో 100 మందికిపైగా మహిళలు ఎన్నిక కావడం విశేషం. మధ్యంతర ఎన్నికలు అమెరికా ప్రజల్ని ట్రంప్ అనుకూలురు, ట్రంప్ వ్యతిరేకులుగా విభజించాయనీ, దీని ఫలితం దేశ రాజకీయాల్లో మరో రెండేళ్ల వరకు ఉంటుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మధ్యంతర ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెల్లడికానప్పటికీ, ఇంత వరకు వచ్చిన ఫలితాలను బట్టి ప్రతినిధుల సభ డెమోక్రాట్ల పట్టులోకి వెళ్లిందని స్పష్టమవుతోంది. ప్రతినిధుల సభలో మెజారిటీ కంటే 30 సీట్లు అధికంగా డెమోక్రాట్లు గెలుచుకున్నారు. 2006 తర్వాత డెమోక్రాట్లకు ఇంత మెజారిటీ రావడం ఇదే తొలిసారి. డెమోక్రాట్ల తరఫున ఎన్నికైన వారిలో చాలా మంది మొదటి సారి ప్రజాప్రతినిధులయిన వారే. ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు మెజారిటీ సాధించడం వల్ల ట్రంప్‌పై ఉన్న వివిధ కేసుల దర్యాప్తు ముమ్మరమవుతుంది. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పాల్పడిన అవకతవకలు, ఎన్నికల్లో రష్యా జోక్యం, అలాగే.. ఆయన వివాదాస్పద నిర్ణయాలు, పాలన తీరుపై విచారణలు మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది. అయితే కీలకాంశాలపై నిర్ణయం తీసుకోవాలంటే ప్రతినిధుల సభ, సెనెట్ రెండింటిలో మెజారిటీ సభ్యుల ఆమోదం అవసరం. సెనెట్‌లో రిపబ్లికన్లకు మెజారిటీ ఉన్నందున డెమోక్రాట్ల పని అనుకున్నంత సులభం కాదు. కాగా, కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం జనవరిలో జరుగుతుంది కాబట్టి ఇదంతా కార్యరూపం దాల్చడానికి కొన్ని నెలలు పడుతుంది. ప్రతినిధుల సభలో మెజారిటీ సాధించిన డెమోక్రాట్లు వివిధ అంశాలపై దృష్టి సారించనున్నారు. అభిశంసన సభలో మెజారిటీ ఉన్నందున డెమోక్రాట్ పార్టీకి మరింత నగదు అందుబాటులో ఉంటుంది. సిబ్బంది పెరుగుతారు. సభా సంఘాలపై నియంత్రణ వస్తుంది. దాంతో ట్రంప్‌కు సంబంధించిన వివిధ కుంభకోణాలు, వివాదాస్పద నిర్ణయాలపై విచారణలు ఊపందుకుంటాయి. అలాగే, ట్రంప్ అభిశంసనకు చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే అభిశంసన అంత సులభం కాకపోవచ్చు. ప్రతినిధుల సభ అభిశంసన ప్రక్రియను ప్రారంభించవచ్చు. కానీ, రెండు సభల్లో మెజారిటీ సభ్యులు ఆమోదిస్తేనే ఈ తీర్మానం చెల్లుతుంది. ప్రతినిధుల సభలో మెజారిటీ ఉన్నప్పటికీ చాలా మంది డెమోక్రాట్లు ట్రంప్ ఎన్నికల అక్రమాలపై జరుగుతున్న విచారణ తేలేంత వరకు అభిశంసనకు ముందుకు రాకపోవచ్చు. మరోవైపు సెనెట్‌లో మూడింట రెండు వంతుల బలం డెమోక్రాట్లకు లేదు. కాబట్టి అక్కడ తీర్మానం నెగ్గే అవకాశం లేదు. బడ్జెట్ ప్రతినిధుల సభలో మెజారిటీ ఉన్న డెమోక్రాట్లు బడ్జెట్ విషయంలో ట్రంప్‌కు కళ్లెం వేసే అవకాశం ఉంది. ఇప్పటిలా ట్రంప్ తనకు కావలసిన నిధుల కోసం ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉండదు. బడ్జెట్‌కు సంబంధించిన వివిధ అంశాల్లో ట్రంప్ మాట చెల్లుబాటయ్యే పరిస్థితి కూడా ఇప్పుడు లేదు. పన్ను రిటర్న్‌లు ట్రంప్ వ్యక్తిగత ఆదాయం, పన్ను రిటర్న్స్ పత్రాలను వెలుగులోకి తెచ్చేందుకు డెమోక్రాట్లు ప్రయత్నిస్తారు. గతంలో వీటిని ఇవ్వడానికి ట్రంప్ నిరాకరించారు. అయితే, ఈసారి ట్రంప్‌ను రిటర్న్స్ పత్రాల కోసం అడుగుతామనీ, ఆయన నిరాకరిస్తే తమకున్న అధికారంలో చట్టబద్ధంగా వాటిని తీసుకుంటామని హౌస్ వేస్ అండ్ మీన్స్ కమిటీకి నాయకత్వం వహించనున్న రిచర్డ్ నీల్ చెప్పారు. ఆయన బ్యాంకు లావాదేవీల వివరాలు కూడా సంపాదిస్తామన్నారు. ఇవి బయటపడితే ట్రంప్‌కు రష్యాతో ఉన్న సంబంధాలు బయటపడతాయని ఆయన అన్నారు. అయితే, వీటికోసం న్యాయపరంగా సుదీర్ఘ పోరాటం చేయాల్సి ఉంటుంది. రష్యా జోక్యం గత అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందనీ, ట్రంప్ విజయానికి రష్యా సహకరించిందని వచ్చిన ఆరోపణలపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో మళ్లీ విచారణ ప్రారంభించే అవకాశాలున్నాయి. ఇప్పుడీ పునర్విచారణ ప్రారంభమైతే ట్రంప్‌పై ఒత్తిడి మరింత పెరగవచ్చు. మెక్సికో సరిహద్దులో గోడ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఈ అంశాన్ని కీలకం చేసుకుని లబ్ధి పొందారు. అక్రమ వలసలను అరికట్టడానికి మెక్సికో సరిహద్దు పొడవునా గోడ కడతానని చెప్పారు. అమెరికన్ కాంగ్రెస్ గత మార్చిలో దానికి 160 కోట్ల డాలర్లను కూడా కేటాయించింది. అప్పట్లో డెమోక్రాట్లు సహా పలువురు దీన్ని వ్యతిరేకించారు. ఇప్పుడీ గోడ నిర్మాణాన్ని ఆపేసేందుకు డెమోక్రాట్లు చర్యలు తీసుకోవచ్చు. ఒబామా కేర్ మధ్యంతర ఎన్నికల్లో ప్రభావం చూసిన అంశాల్లో ఇమ్మిగ్రేషన్, హెల్త్‌కేర్ ముఖ్యమైనవి. ఒబామా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య సంరక్షణ పథకాన్ని కొనసాగిస్తామని డెమోక్రాట్లు చెప్పారు. ఇప్పుడు దాన్ని ఆచరణలో పెట్టే అవకాశం ఉంది. అలాగే, వలస విధానాల్లో ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న సవరణలు, తెస్తున్న కొత్త నిబంధనలపై కూడా డెమోక్రాట్లు దృష్టి సారించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మెడికేర్, మెడిక్ ఎయిడ్ పథకాల కొనసాగింపునకు చర్యలు తీసుకుంటామని ఎన్నికల అనంతరం డెమోక్రాట్ల నేత నాన్సీ పిలోసి చెప్పారు. 65 ఏళ్లు దాటిన వారికి, దివ్యాంగులకు ఆదాయంతో సంబంధం లేకుండా ఈ పథకాల కింద వైద్య సహాయం అందిస్తారు. ఔషధాల ధరల్ని తగ్గిస్తామని, ఆరోగ్యబీమా ప్రీమియం తగ్గిస్తామని కూడా డెమోక్రాట్లు చెబుతున్నారు. ఇరాన్‌తో ఒప్పందం ఒబామా హయాంలో అమెరికా –ఇరాన్‌ల మధ్య కుదిరిన అణు ఒప్పందం నుంచి ట్రంప్ వైదొలగడం పట్ల డెమోక్రాట్లు ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడీ ఒప్పందాన్ని పునరుద్ధరించాలని డెమోక్రాట్లు భావిస్తున్నా, సెనెట్‌లో మెజారిటీ లేనందున చేయగలిగిందేమీ ఉండదని తెలుస్తోంది. అలాగే, ఇజ్రాయెల్‌తో సంబంధాల విషయంపై కూడా వీరు దృష్టి సారించే అవకాశం ఉంది. ప్రతినిధుల సభలో మెజారిటీ సాధించడంతో పలు ప్రభుత్వ కమిటీలు, విచారణ సంఘాలకు డెమోక్రాట్ నేతలే నాయకత్వం వహిస్తారు. దాంతో ఈ కమిటీలు ట్రంప్ పాలనపైన, వ్యక్తిగతంగాను శూలశోధనకు దిగే అవకాశం ఉంది. రెండుగా చీలిన అమెరికన్లు మధ్యంత ఎన్నికలు ట్రంప్ పాలనపై రెఫరెండమని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఎన్నికలతో ట్రంప్‌కు అనుకూలంగా, వ్యతిరేకంగా అమెరికన్లు విడిపోయారని , దీని ప్రభావం వచ్చే రెండేళ్ల పాటు అమెరికా రాజకీయాలపై ఉంటుందని వారు తెలిపారు. ఈ ఎన్నికలతో అమెరికా వాణిజ్యయుద్ధం మరింత ముదురుతుందని, 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఇదే ప్రధానాంశం అవుతుందని పరిశీలకుల భావన. అలాగే, ఈ ఎన్నికల్లో వంద మందికి పైగా మహిళలు నెగ్గడంతో సంప్రదాయక వాదులైన డెమోక్రాట్లు తమ అజెండాను సవరించుకోవలసి ఉంటుందన్నారు. పురుషుల ఓట్లు ట్రంప్‌కే మధ్యంతర ఎన్నికల్లో 60శాతం పురుషుల ఓట్లు రిపబ్లికన్ పార్టీకి పడ్డాయని, మహిళల ఓట్లు రెండు పార్టీలకు పడ్డాయని ఎన్నికల సర్వేలు వెల్లడిస్తున్నాయి. మధ్యంతర ఎన్నికల్లో 49శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 18–24 ఏళ్ల మధ్య వయస్కుల్లో 68శాతం మంది డెమోక్రట్పార్టీకి ఓటు వేశారు. వృద్ధ ఓటర్లు ఎక్కువగా రిపబ్లికన్ అభ్యర్ధులకు ఓటు వేశారు. అమెరికాయేతర ఓటర్లు వయసుతో నిమిత్తం లేకుండా ఎక్కువ మంది డెమోక్రాట్ పార్టీకి ఓటు వేశారు. -
ఇకపై అతడికి వైట్‌హౌజ్‌లో ఎంట్రీ లేదు!
వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు గట్టి షాక్ తగిలింది. బుధవారం వెల్లడైన ఫలితాల్లో డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధుల సభలో పైచేయి సాధించగా.. రిపబ్లికన్లు సెనేట్‌లో ఆధిపత్యం నిలుపుకొన్నారు. కాగా ఈ ఫలితాలతో కంగుతిన్న ట్రంప్ మరోసారి మీడియాను టార్గెట్ చేశారు. మీడియా తప్పుడు ప్రచారమే తమ ఓటమికి కారణమని పరోక్షంగా విమర్శించారు. ఈ క్రమంలో సీఎన్ఎన్ జర్నలిస్టు జిమ్ అకోస్టా ప్రెస్‌పాస్‌ను రద్దు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అమెరికా మధ్యంతర ఎన్నికల పోలింగ్ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి సీఎన్ఎన్ రిపోర్టర్ జిమ్ అకోస్టా హాజరయ్యారు. ఈ క్రమంలో వలసదారులపై ట్రంప్ అనుసరిస్తున్న విధానాలను ప్రస్తావిస్తూ.. ఇది ఒకరమైన దాడే కదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ట్రంప్.. ‘ నిజం చెప్పనా. అధ్యక్షుడిగా నేనేం చేయాలో నాకు తెలుసు. మీరు వార్తా సంస్థను సరిగ్గా నడిపించుకోండి. అలాగే రేటింగ్స్‌ను పెంచుకోండి’ అంటూ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో మరో ప్రశ్న అడిగేందుకు అకోస్టా సిద్ధమవుతుండగా.. ‘కూర్చో.. అతడి నుంచి మైక్రోఫోన్ లాక్కోండి’ అంటూ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం జిమ్ మరోసారి వైట్‌హౌజ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. ప్రెస్‌పాస్ రద్దు అయిన కారణంగా మిమ్మల్ని లోపలికి అనుమతించలేమని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఫ్యూచర్ నోటీసు అందేంత వరకు మరలా వైట్‌హౌజ్‌లో ప్రవేశించే వీలులేదని వైట్‌హౌజ్ వర్గాలు అతడికి సూచించాయి. అసభ్యంగా ప్రవర్తించాడు.. అందుకే ‘అధ్యక్షుడు ట్రంప్ పత్రికా స్వేచ్ఛకు విలువనిస్తూ తన పాలన గురించి ఎదురయ్యే ఎన్నో కఠినమైన ప్రశ్నలకు సావధానంగా సమాధానమిస్తారు. కానీ ప్రెస్‌పాస్ పేరిట వైట్‌హౌజ్‌లో ప్రవేశించిన ఓ వ్యక్తి మా మహిళా ఉద్యోగితో అసభ్యంగా ప్రవర్తిస్తే మాత్రం ఉపేక్షించేది లేదు’ అని వైట్‌హౌజ్ ప్రతినిధి సారా సాండర్స్ ట్వీట్ చేశారు. కాగా ఇవన్నీ అబద్ధాలని, వారి తప్పులను ఎత్తిచూపిన కారణంగానే తనపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని అకోస్టా పేర్కొన్నారు. ఈ విషయంలో సాటి జర్నలిస్టులంతా ఆయనకు మద్దతుగా నిలిచారు. President Trump believes in a free press and expects and welcomes tough questions of him and his Administration. We will, however, never tolerate a reporter placing his hands on a young woman just trying to do her job as a White House intern... — Sarah Sanders (@PressSec) November 8, 2018 -
అమెరికా ఎన్నికలు : ప్రతినిధుల సభలో డెమొక్రాట్ల హవా
న్యూయార్క్ : అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల ఫలితాలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధిపత్యానికి గండికొట్టేలా వెలువడుతున్నాయి. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో డెమొక్రటీ పార్టీ అభ్యర్థులు మెజార్టీ దిశగా సాగుతుండగా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పార్టీకి చెందిన రిపబ్లికన్లు సెనేట్‌లో సత్తా చాటుతున్నారు. అమెరికా పార్లమెంటును కాంగ్రెస్ పేరుతో వ్యవహరిస్తారు. కాగా, ప్రతినిధుల సభలో 435 స్థానాలకు, సెనేట్‌లోని మొత్తం 100 స్థానాల్లో 35 సీట్లకు ఎన్నిక జరిగింది. వీటితోపాటు 36 రాష్ట్రాల గవర్నర్లు సహా పలు పదవులకు కూడా ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల ప్రకారం డెమోక్రాట్లు మరో 23 స్థానాల్లో విజయం సాధిస్తే ప్రతినిధుల సభలో వీరు పైచేయి సాధిస్తారు. వర్జీనియా, ఫ్లోరిడా, పెన్సీల్వేనియా, కొలొరాడో వంటి రాష్ట్రాల్లో రిపబ్లికన్లపై డెమోక్రాట్లు విజయం సాధించారు. మరోవైపు సెనేట్‌లో నార్త్ డకోటా, ఇండియానా స్థానాల్లో రిపబ్లికన్లు గెలుపొందారు. టెక్సాస్ స్థానంలో రిపబ్లికన్ అభ్యర్థి టెడ్ క్రుజ్ విజయం సాధించారు. ట్రంప్ దూకుడుకు బ్రేక్.. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన రెండేళ్ల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలను ఆయన పనితీరుకు రెఫరెండంగా పరిగణిస్తున్నారు. ఇక మధ్యంతర ఎన్నికల్లో అద్భుత విజయం సాధించామని డొనాల్డ్ ట్రంప్ ట్విట్ చేయడం గమనార్హం. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ఊహించని రీతిలో విజయం సాధించిన ట్రంప్, కాంగ్రెస్‌లో సంఖ్యాబలం అండతో ఏకపక్ష నిర్ణయాలతో చెలరేగారు. మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్లు గణనీయంగా ఎన్నికవడంతో ట్రంప్ దూకుడుకు బ్రేక్ పడనుంది. -
అమెరికా చరిత్రలోనే తొలిసారిగా..
వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జారెడ్ పోలీస్ విజయం సాధించారు. కొలరెడో గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్న జారెడ్ అమెరికా చరిత్రలో గవర్నర్‌గా ఎంపికైన తొలి స్వలింగ సంపర్కుడిగా చరిత్రకెక్కారు. తనను తాను గే అని ఎన్నికల ప్రచారంలో బహిరంగంగా ప్రకటించిన జారెడ్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ప్రచారాస్త్రంగా మార్చుకుని విజయం సాధించారు. గతంలోనూ ఐదుసార్లు కాంగ్రెస్ ప్రతినిధిగా ఎన్నికైన జారెడ్ ఇకపై కొలరెడో గవర్నర్‌గా సేవలు అందించనున్నారు. కాగా ఓరెగాన్ గవర్నర్ కేట్బ్రౌన్ అమెరికా తొలి బైసెక్సువల్ గవర్నర్‌గా గుర్తింపు పొందగా.. న్యూజెర్సీ మాజీ గవర్నర్ జిమ్ మెక్‌గ్రీవీ తన పదవికి రాజీనామా చేసిన తర్వాత తాను గేనని ప్రకటించుకున్నారు. పేరు మార్చుకుని.. యూదు అయిన జారెడ్ అసలు పేరు జారెడ్ చుల్జ్. తన బామ్మ ఙ్ఞాపకార్థం 25 ఏట తన పేరును జారెడ్ పోలీసుగా మార్చుకున్నారు. కాలేజీ రోజుల నాటి నుంచే రాజకీయాల్లో రాణించాలనే ఆశయం ఉన్న జారెడ్ మొదట వ్యాపారవేత్తగా ఎదిగి... ఆ తర్వాత డెమొక్రటిక్ పార్టీలో చేరి తన కలను సాకారం చేసుకున్నారు. -
అమెరికాలో ‘మధ్యంతర’ పోలింగ్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైంది. 435 మంది సభ్యులున్న ప్రతినిధుల సభతో పాటు సెనేట్‌లో 35 స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఈ ఎన్నికల్లో 36 రాష్ట్రాలకు గవర్నర్లను ప్రజలు ఎన్నుకోనున్నారు. అధ్యక్షుడు ట్రంప్ రెండేళ్ల పాలనకు రెఫరెండంగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో విజయం అధికార రిపబ్లికన్లకు, ప్రతిపక్ష డెమొక్రాట్లకు కీలకంగా మారింది. అమెరికాలోని తూర్పు రాష్ట్రాలైన మెయిన్, న్యూహాంప్‌షైర్, న్యూజెర్సీ, న్యూయార్క్‌లో మంగళవారం ఉదయం 6 గంటలకు(స్థానిక కాలమానం) పోలింగ్ మొదలైంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ(దిగువ సభ)లో 435 స్థానాల్లో రిపబ్లికన్ పార్టీకి 235 మంది సభ్యులు ఉండగా, డెమొక్రటిక్ పార్టీకి 193 మంది సభ్యులు ఉన్నారు. అలాగే ఎగువ సభ సెనేట్‌లోని 100 స్థానాల్లో రిపబ్లికన్ పార్టీ సభ్యులు 52 మంది, డెమొక్రాట్లు 48 మంది ఉన్నారు. కాగా, ఎన్నికల నేపథ్యంలో సోమవారం క్లీవ్‌ల్యాండ్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎప్పుడూ చప్పగా సాగే మధ్యంతర ఎన్నికలు తన కారణంగానే హాట్‌హాట్‌గా సాగుతున్నాయని కితాబిచ్చుకున్నారు. నకిలీ ఖాతాలపై ఫేస్బుక్ కొరడా.. మధ్యంతరం సందర్భంగా ఓటర్లను ప్రభావితం చేసేందుకు యత్నించిన 115 అకౌంట్లను సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్బుక్ తొలగించింది. అమెరికా విచారణ సంస్థల ఫిర్యాదు నేపథ్యంలో ఫేస్బుక్లో 30 ఖాతాలతో పాటు అనుబంధ సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో 85 అకౌంట్లను బ్లాక్ చేసింది. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రభావితం చేసేందుకు రష్యా యత్నించిందని విచారణ సంస్థలు గుర్తించిన సంగతి తెలిసిందే. సీఎన్ఎన్ సర్వేలో డెమొక్రాట్లకు పట్టం.. ఈ ఎన్నికల్లో డెమొక్రట్లు విజయం సాధించనున్నట్లు సీఎన్ఎన్ సర్వేలో తేలింది. ఈ సర్వే ప్రకారం.. ప్రతినిధుల సభలోని 435 స్థానాలకు గాను డెమొక్రటిక్ పార్టీ 182 నుంచి 239 స్థానాలను(42–55 శాతం) కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. 2006, 2010 మధ్యంతర ఎన్నికల తరహాలో ఈసారీ రిపబ్లికన్లతో పోల్చుకుంటే డెమొక్రటిక్ పార్టీ 10 శాతం ఆధిక్యం పొందే అవకాశముంది. నల్ల జాతీయులు, లాటినో సంతతి ప్రజలు, చదువుకున్న శ్వేతజాతి మహిళలు, గృహిణులు డెమొక్రాట్లకు మద్దతుగా నిలిస్తే, శ్వేతజాతి పురుషులు ఎక్కువగా ట్రంప్‌కు మద్దతు తెలుపుతున్నట్లు సీఎన్ఎన్ సర్వేలో తేలింది. -
మంగళప్రదం
ఎన్నడూ లేనంతగా ఈసారి ఎక్కువ సంఖ్యలో మహిళలు యు.ఎస్. మధ్యంతర ఎన్నికలకు పోటీ పడుతున్నారు. ‘మీటూ’ వేళ మహిళావనికి ఇదొక మంగళప్రదమైన సంకేతం. బరిలో నిలిచిన మహిళల ముఖాలు మనమెరిగినవి కాకపోవచ్చు. కానీ ఆ గెలుపోట ముల ముఖకాంతులు.. లోకాలను వెలిగించేవి, పోరాటస్పృహను కలిగించేవీ! యు.ఎస్.లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా మంగళవారమే జరుగుతాయి. మంగళవారమే ఎందుకంటే.. ఏవో హిస్టారికల్ శకునాలు. కొన్ని గంటల్లో ఇవాళ అక్కడ మిడ్‌టెర్మ్ పోల్స్. మధ్యంతర ఎన్నికలు. ముఖం చిట్లించి చూపు తిప్పుకునే విషయమే. ఎవరిక్కావాలి? ఇంటి పక్కన కేసీఆర్ వేసుకున్న ‘ముందస్తు’ షామియానానే ఓ మామూలు విషయం. ఇక ఎక్కడో అమెరికాలోని ‘మిడ్‌టెర్మ్’ పోల్ ఫంక్షన్‌ని ఆగి చూస్తామా! పిల్లలు, స్కూళ్లు, అప్పులు, వడ్డీలు.. ఎన్నున్నాయ్ జీవితంలో. ఎన్నికల్లా ఐదేళ్లకో, రెండేళ్లకో వచ్చిపోయేవి కావివన్నీ. ఎప్పుడూ వెంట ఉండేవీ. వెంబడిస్తూ ఉండేవి. అయితే ఈసారి యు.ఎస్. ఎన్నికల్నుంచి పూర్తిగా ముఖం తిప్పేసుకోలేం. అవేం అధ్యక్ష ఎన్నికలు కాదు. భారీ ముఖాలేం బరిలో లేవు. ప్రపంచం కూడా పెద్దగా నోరు తెరిచి అమెరికా వైపు చూసేదేం ఉండదు. అయినా ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈ ఎన్నికల్లో ఉంది. ఇంట్రెస్టింగ్ కాదు, ఇన్స్పైరింగ్ పాయింట్. 257 మంది మహిళలు ఈ మిడ్‌టెర్మ్ ఎన్నికల్లో పోటీకి నిలబడ్డారు! రికార్డిది. ఇరవై ఏళ్ల క్రితం ఈ రికార్డు 131. నలభై ఏళ్ల క్రితం 48. ఇదేం విశేషం! ఏళ్లు గడుస్తున్న కొద్దీ పోటీ చేసేవాళ్లు పెరుగుతూనే ఉంటారు కదా. సంఖ్య పెరగడం విశేషం కాదు. సంఖ్యను పెంచుతున్న విశేషం ఏదో ఉంది. ఏంటది? ఈ ఎన్నికల్లోనైతే ‘మీటూ’ ఎఫెక్ట్!అమెరికన్ పార్లమెంట్‌కి (పార్లమెంట్ అనరు. ‘కాంగ్రెస్’ అంటారు) సరిసంఖ్య ఉన్న ప్రతి ఏడాదీ మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి. అంటే రెండేళ్లకోసారి. 2016లో జరిగాయి. అంతకు ముందు 2014లో. ఇప్పుడు 2018లో. తర్వాత 2020లో. అధ్యక్ష ఎన్నికలు నాలుగేళ్లకోసారి వాటి మానాన అవి వచ్చిపోతుంటాయి. అవీ సరిసంఖ్య ఉన్న ఏడాదిలోనే. అవీ మంగళవారమే.మనకిక్కడ పార్లమెంటులో లోక్‌సభ, రాజ్యసభ ఉన్నట్లే అమెరికన్ ‘కాంగ్రెస్’లో ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్), పెద్దల సభ (సెనెట్) ఉంటాయి. ఆ రెండు సభలకే ఇప్పుడు ఈ ఎన్నికలు. వాటితో పాటు అమెరికాలోని యాభై రాష్ట్రాల ప్రతినిధుల సభలకు, పెద్దల సభలకు, యాభై గవర్నర్ పదవులకు కలిపి 6,665 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. ‘హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్’లో మొత్తం 435 సీట్లకు, ‘సెనెట్’లోని 100 సీట్లలో 35 సీట్లకు (మూడింట ఒక వంతు) అభ్యర్థులు పోటీ పడుతున్నారు. హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ పదవీ కాలం రెండేళ్లే కాబట్టి ప్రతి రెండేళ్లకూ మొత్తం నాలుగు వందల ముప్పై అయిదు సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. సెనెట్ సభ్యుడి పదవీ కాలం ఆరేళ్లు కనుక ప్రతి రెండేళ్లకూ ఖాళీ అయ్యే ముప్పై ఐదు సీట్లకు పోలింగ్ ఉంటుంది. 2016 ఎన్నికల నాటికి యు.ఎస్.లో ‘మీటూ’ ఉద్యమం మొదలవలేదు. గత ఏడాది అక్టోబర్‌లో ఆవిర్భవించింది. అందుకే ఈ ఎన్నికల్లో ఆ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఇవాళ జరుగుతున్న ఎన్నికల్లో ‘హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్’కి పోటీ పడుతున్న అభ్యర్థులలో 29 శాతం మంది, సెనెట్‌కు పోటీ చేస్తున్నవారిలో 32 శాతం మంది మహిళలే. ఈ రెండు సభలకు కలిపి 257 మంది మహిళలు బరిలో ఉన్నారు. మనకైదేనా కొత్తది వచ్చిందంటే, అమెరికాలో అది పాతదై ఉంటుంది. ‘మీటూ’ కూడా అంతే. ముందక్కడ. తర్వాత ఇక్కడ. అలాంటిది.. ఒకటేదైనా అమెరికాకే తొలిసారి అయి ఉందంటే? అదెక్కడి నుంచి వచ్చి ఉంటుంది? అక్కడి మహిళల్నుంచి. ఈ ఎన్నికల్లో క్రిస్టీన్ హాల్క్వెస్ట్ గెలిస్తే అమెరికా తొలి ట్రాన్స్‌జెండర్ గవర్నర్ అవుతారు. స్టేసీ అబ్రామ్స్ గెలిస్తే అమెరికా తొలి నల్లజాతి గవర్నర్ అవుతారు. పాలెట్ జోర్డాన్ గెలిస్తే అమెరికా తొలి ‘నేటివ్ అమెరికన్’ (ప్రాచీన దేశవాళీ జాతుల) గవర్నర్ అవుతారు. అలెగ్జాండ్రియా ఆకాసియో కార్టెజ్ (29) గెలిస్తే అమెరికా తొలి యంగెస్ట్ ఉమన్ ఇన్ ‘కాంగ్రెస్’ అవుతారు. రషీదా త్లయీబ్ గెలిస్తే అమెరికా తొలి ముస్లిం–అమెరికన్ ఉమన్ ఇన్ ‘కాంగ్రెస్’ అవుతారు. ఇల్హాన్ ఒమన్ గెలిస్తే అమెరికా తొలి సోమాలీ–అమెరికన్ ఇన్ ‘కాంగ్రెస్’ అవుతారు. వీళ్లంతా ‘డెమోక్రాట్’ పార్టీ అభ్యర్థులే. అంటే ‘రిపబ్లికన్ పార్టీ’కి ప్రత్యర్థులు. అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు విరోధులు. అలాగని ట్రంప్ పార్టీలో మహిళా అభ్యర్థులు లేరని కాదు. ఆ పార్టీ మహిళలతో ఈ పార్టీ మహిళలు పోటీ పడుతున్నారని కాదు. ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తున్న మహిళలు, ‘మీటూ’ను సమర్థిస్తున్న మహిళలు ఈ ఎన్నికల్లో, అందులోనూ డెమోక్రాట్ పార్టీలో ఎక్కువమంది ఉన్నారు. పోటీ పడిన ఈ మహిళలంతా గెలిస్తే ఈ ఎన్నికలు మంగళప్రదం అవుతాయి. అసలు మహిళ పోటీ పడడమే పెద్ద గెలుపు. సామాన్యంగా లేరక్కడ మేల్ షోవెనిస్టులు. పిల్లలు, స్కూళ్లు, అప్పులు, వడ్డీలు.. ఎన్నున్నా జీవితంలో అప్పుడప్పుడు తలెత్తి చూడాలి. ఏ దేశ మహిళైనా విజయం సాధించడం అంటే.. నింగిలో ఒక కొత్త నక్షత్రం మెరవడమే. తలెత్తి చూడడమే కాదు.. పిల్లలకు, పక్కనున్న వాళ్లకూ చూపించాలి. ఆ నక్షత్రకాంతి.. భూమి మీద ఏ దీపాన్ని వెలిగిస్తుందో చెప్పలేం. అందుకే చూపించాలి. వీరు గెలిస్తే... - మాధవ్ శింగరాజు -
బ్రిటన్‌లో ‘మధ్యంతర’ పోరు
సాహసమో, దుస్సాహసమో... ప్రధాన ప్రతిపక్షం అంతర్గత పోరులో సతమత మవుతున్నప్పుడే మధ్యంతర ఎన్నికల అస్త్రం ప్రయోగించాలని బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే నిర్ణయించారు. 50 రోజుల వ్యవధిలో... అంటే జూన్ 8న ఈ ఎన్నిక లుంటాయని ప్రకటించారు. అయిదేళ్లకోసారి ఎన్నికలు జరిగే బ్రిటన్ పార్లమెం టుకు 2015లో ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో అప్పటి ప్రధాని డేవిడ్ కామె రాన్ నేతృత్వంలోని కన్సర్వేటివ్ పార్టీ విజయం సాధించి చాన్నాళ్ల తర్వాత సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. యూరప్ యూనియన్(ఈయూ)లో కొనసా గాలా, వద్దా అన్న అంశంపై నిరుడు జూన్‌లో నిర్వహించిన రిఫరెండంలో 51.9 శాతంమంది బయటకు పోవడానికి అనుకూలంగా ఓటేయడంతో డేవిడ్ కామెరాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచీ థెరిస్సా మే ఒడిదుడుకులు పడుతూనే ఉన్నారు. ఈయూ పేరు పెట్టుకుని నాలుగు దశాబ్దాలే కావొచ్చుగానీ... ఏడు దశాబ్దాలక్రితం యూరోపియన్ ఎకనా మిక్ కమ్యూనిటీ(ఈఈసీ)గా ఉన్నప్పటినుంచీ దానితో బ్రిటన్‌కున్న అనుబంధం బలమైనది. చెప్పాలంటే ఆ సంస్థ ఆవిర్భావంలో బ్రిటన్‌ది ప్రధాన పాత్ర. అంతటి అనుబంధాన్ని తెంచుకుని ఒంటరి ప్రయాణానికి సంసిద్ధం కావడమమంటే మాటలు కాదు. పైగా మొత్తంగా చూస్తే బ్రెగ్జిట్వైపు అధికులు మొగ్గి ఉండొచ్చుగానీ కేవలం ఇంగ్లండ్, వేల్స్ రాష్ట్రాలు రెండు మాత్రమే ఆ వాదనను బలపరిచాయి. అటు స్కాట్లాండ్, ఇటు నార్తర్న్ ఐర్లాండ్ గట్టిగా వ్యతిరేకించాయి. అంతేకాదు... స్కాట్లాండ్ బ్రిటన్ నుంచి విడిపోతామని ప్రకటించింది. అందుకు సాధ్యమైనంత త్వరగా రిఫరెండం నిర్వహించమని స్కాట్లాండ్ డిమాండ్ చేస్తోంది. మరోపక్క త్వరగా బయటకు వెళ్లమని ఈయూ నుంచి బ్రిటన్‌కు సందేశాలు అందుతున్నాయి. అధికారంలోకి రావడం కోసం బ్రెగ్జిట్ అంటే ఇష్టం లేకపోయినా 2015 ఎన్నికల్లో దాన్ని కన్సర్వేటివ్‌లు నెత్తినపెట్టుకున్నారు. తమ పార్టీ ఓడిపోతుందని సర్వేలన్నీ చెప్పడంతో వారు ఆందోళనచెందారు. నెగ్గితే ఎటూ అత్తెసరు మెజారిటీయే వస్తుం దని, రిఫరెండం పెట్టడానికి కూటమిలోని లిబరల్ డెమొక్రటిక్ పార్టీ అంగీకరిం చడం లేదని సాకు చెప్పి తప్పించుకోవచ్చునని భావించారు. కానీ అందరి అంచ నాలనూ తలకిందులు చేస్తూ కన్సర్వేటివ్‌లు సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పర్చగల స్థాయికి చేరారు. విధి లేక డేవిడ్ కామెరాన్ రిఫరెండం పెట్టక తప్పలేదు. అందులో అధిక శాతంమంది మొగ్గు చూపడంతో ఆయన తప్పుకున్నారు. ఆయన స్థానంలో వచ్చిన థెరిస్సా సవాలక్ష సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎక్కడ ప్రారంభించాలో, ఎలా కొనసాగించాలో తెలియక అయోమయంలో ఉన్నారు. ఈయూ నుంచి బయటికొస్తే సమస్యలన్నీ మంత్రించినట్టు మాయమవు తాయని చాలామంది అనుకున్నా పరిస్థితులు అలా లేవు. దాంతో ప్రజల్లో అసం తృప్తి పెరుగుతోంది. కఠిన నిబంధనలతో వలసదారులను కట్టడి చేసే చట్టాన్ని తీసుకొస్తే అంతా చక్కబడుతుందని థెరిస్సా భావించారు. అక్రమ వలసదారులను, గడువుకు మించి ఉంటున్నారని గుర్తించిన వేలాదిమందిని అరెస్టు చేశారు. బ్రిట న్కు రాదల్చుకున్నవారిపై అనేక ఆంక్షలు పెట్టారు. ఇవి పెద్దగా ఫలితాన్నివ్వలేదు. అటు అంతర్జాతీయ పరిస్థితులు కూడా ఏమంత అనుకూలంగా లేవు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బ్రిటన్‌కు అండగా ఉంటామని గట్టి హామీ ఇవ్వలేక పోయారు. పైగా ఆయనను ఎంతవరకూ విశ్వసించవచ్చునో తెలియదు. రేపన్న రోజున స్వతంత్ర బ్రిటన్ నుంచి అంతర్జాతీయ మార్కెట్లో తమకు ఎదురుకాగల పోటీని అంచనా వేసుకున్న ఈయూ దేశాలు.. మరీ ముఖ్యంగా జర్మనీ బ్రెగ్జిట్ లావాదేవీల్లో బ్రిటన్‌తో కఠినంగా ఉండాలని నిర్ణయించాయి. వీటన్నిటి పర్య వసానంగా నానాటికీ సమస్యలు తీవ్ర రూపం దాలుస్తాయని కన్సర్వేటివ్‌లకు అర్థ మైంది. వాస్తవం ఇది కాగా ఈయూ నుంచి ఉపసంహరించుకోవడానికి సంబం ధించిన ప్రక్రియకు విపక్షాలు అడ్డుకోకుండా నిరోధించడానికే మధ్యంతర ఎన్నికలు ప్రకటించానని థెరిస్సా దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు. వాస్తవా నికి 2015 పార్లమెంటు ఎన్నికల్లోగానీ, రిఫరెండంలోగానీ బ్రెగ్జిట్‌ను బలంగా వ్యతిరేకించిన విపక్ష లేబర్ పార్టీ తన వైఖరిని మార్చుకుంది. ఈయూ నుంచి బయటకు రావడానికి సంబంధించిన బిల్లుకు ఈమధ్యే అనుకూలంగా ఓటేసింది. పైగా బ్రెగ్జిట్ కార్యాచరణ రూపకల్పనకు మరింత చురుగ్గా కదలాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. అయితే ఇప్పుడు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎవరు గెలిచినా బ్రెగ్జిట్ ప్రక్రియపై ఎలాంటి ప్రభావమూ ఉండదు. ఒకసారి రిఫరెండంలో ప్రజాభి ప్రాయం వెల్లడైంది గనుక దాన్ని అమలు చేయడం మినహా వేరే మార్గం లేదు. బ్రెగ్జిట్ వద్దనుకున్న పార్టీ తాము అధికారంలోకొస్తే మరో రిఫరెండం నిర్వహి స్తామని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. బ్రెగ్జిట్‌ను గతంలో వ్యతిరేకించిన లేబర్ పార్టీ ఇప్పుడు తన మనసు మార్చుకుంది. అయితే కన్సర్వేటివ్‌ల తరహాలో మొండిగా కాక ఈయూతో సామరస్యంతో మెలగి దేశ ప్రయోజనాలను కాపాడతామని ఆ పార్టీ నాయకుడు జెరిమీ కోర్బిన్ హామీ ఇస్తున్నారు. ఇది కన్సర్వేటివ్ మద్దతుదార్ల లోని ఈయూ అను కూలవాదులను కూడా ఆకట్టుకుంటుందని ఆయన ఆశిస్తు న్నారు. వాస్తవానికి ఇటీవల విడుదలైన సర్వేలు కన్సర్వేటివ్ పార్టీ లేబర్ పార్టీకన్నా 21 పాయింట్ల ఆధిక్యతలో ఉన్నదని తేల్చాయి. ఈ సర్వేలు, లేబర్ పార్టీ అంతర్గత పోరు చూసి థెరిస్సా మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలన్న కీలక నిర్ణయం తీసుకు న్నారు. అయితే దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై తలెత్తే ప్రశ్నలకు జవాబివ్వగల నన్న విశ్వాసం ఆమెకు ఉందా? ఎన్నికలకు ముందు సంప్రదాయంగా జరిగే టెలివి జన్ చర్చలకు దూరంగా ఉండాలని థెరిస్సా నిర్ణయించుకోవడాన్ని గమనిస్తే ఆ విష యంలో ఎవరికైనా అనుమానాలు తలెత్తకమానవు. మొత్తానికి బ్రిటన్ పౌరులు ఎవరి విధానాలకు అనుకూలమో మరో 50 రోజుల్లో తేలిపోతుంది. ఎవరు అధికా రంలోకొచ్చినా సమస్యల బెడద తీవ్రంగానే ఉంటుంది. -
‘మధ్యంతరం’కోసం కేసీఆర్ ఎత్తులు: షబ్బీర్ అలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయన్న విషయాన్ని సీఎం కేసీఆర్ పరోక్షంగా చెబుతున్నారని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటిదాకా ఇచ్చిన హామీలను 2019 లోగా అమలుచేయలేమని కేసీఆర్‌కు అర్థమయిందన్నారు. అందుకే 2017లోనే మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్నారన్నారు. ఇప్పటిదాకా అమలుచేసిన హామీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరామని, అయినా సీఎం పట్టించుకోవడం లేదన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినా స్పీకరు పట్టించుకోవడం లేదని, అందుకే ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించామన్నారు. 23 అసెంబ్లీ సీట్లకు, రెండు లోక్‌సభ స్థానాలకు, శాసనమండలికి వచ్చే ఉప ఎన్నికలను ఎదుర్కొనడం కంటే మొత్తం అసెంబ్లీని రద్దుచేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోందన్నారు. -
2017లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలనే ఎత్తుగడ
రాష్ట్రావతరణ వేడుకలకు వందలాది కోట్ల రూపాయలు ఖర్చు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు. పత్రికల్లో పేజీల కొద్ది ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. శుక్రవారం ఆయన ఇక్కడ ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం ఖాయమన్నారు. ఉప ఎన్నికలకు బదులు అసెంబ్లీని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టుగా ఉందన్నారు. 2017లోనే అసెంబ్లీని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలనేది కేసీఆర్ ఎత్తుగడని, అందుకే 2022 నాటికి హామీల అమలు అంటూ మాట్లాడుతున్నాడని చెప్పారు. 2019 వరకు కేసీఆర్ ప్రభుత్వానికి గడువు ఉండగా... 2022కు హామీలు నెరవేరుస్తామనడం వెనుక మతలబు ఏమిటి? అని ప్రశ్నించారు. -
మధ్యంతర ఎన్నికలు తథ్యం
కొయ్యలగూడెం :రాష్ట్రంలో టీడీపీ సర్కారు ఐదేళ్లూ పాలనను కొనసాగించడం అసంభవమని, ఏ క్షణంలోనైనా మధ్యం తర ఎన్నికలు రావడం తథ్యమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని స్పష్టం చేశారు. శనివారం కొయ్యల గూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాలతో ప్రజలు విసిగిపోయారని, త్వరలోనే వారినుంచి తిరుగుబాటు వస్తుందని నాని పేర్కొన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు సైతం ఆయన విధానాలపై విసుగు చెందారని, గత్యంతరం లేక ఆయన మాటలకు వంత పాడుతున్నారని అన్నారు. టీడీపీ శ్రేణులకు ప్రజల మధ్యకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని, వైఎస్సార్ సీపీ ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి ఉద్యమ బాట పడుతోందని చెప్పారు. చంద్రబాబు నాయుడు రాజధాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని, తన కోటరీతో కోట్లాది రూపాయల భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆయనకు కాంగ్రెస్ నాయకులు పరోక్షంగా సహకరిస్తున్నారని విమర్శించారు. పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్, మలేషియా అంటూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్విని యోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనకు అంతిమ ఘడియలు సమీపించాయని పేర్కొన్నారు. మధ్యంతర ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని నేతృత్వంలో జిల్లాలోని 15 స్థానాల్లో పార్టీని గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇతర పార్టీల నుంచి వైఎస్సార్ సీపీలోకి చేరికల పరంపర ప్రారంభమైందని, టీడీపీ నుంచి కూడా వలసలు మొదలవుతున్నాయని బాలరాజు అన్నారు. 300 వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ప్రజలను నట్టేట ముంచారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీలో చేరిన నాయకులు ఈ సందర్భంగా పలువురు నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. యువజన కాంగ్రెస్ నాయకుడు దుగ్గిన శ్రీనివాస్, ఆయన అనుచరులకు ఆళ్ల నాని, బాలరాజు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ముందుగా మెయిన్ సెంటర్లో పార్టీ సీనియర్ నాయకులు తాడికొండ మురళీకృష్ణ, మట్టా శ్రీనివాస్ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నాని, బాలరాజు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ ఎస్సీ సెల్ నాయకులు మనెల్లి నాగేశ్వరరావు మృతికి సమావేశం నివాళులుఅర్పించింది. అనంతరం జిల్లా సర్పంచ్ల ఛాంబర్ ఉపాధ్యక్షులు దేవీ గంజిమాల నివాసానికి వెళ్లి ఇటీవల ఆమె ఇంట్లో జరిగిన చోరీ గురించి ఆరా తీశారు. తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు పోల్నాటి బాబ్జి, ముప్పిడి సంపత్‌కుమార్, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వందనపు సాయిబాలపద్మ, సీనియర్ నాయకులు తాడికొండ మురళీకృష్ణ, ఎండీ హాజీ బాషా, దాసరి విష్ణు, గాడిచర్ల సోమేశ్వరరావు, చిన్నం గంగాధరం, నాయకులు గోపాలకృష్ణ గోఖలే, తుమ్మలపల్లి గంగరాజు, తాడిగడప రామకృష్ణ, ఎస్కే బాజీ, దూలపల్లి కాంతారావు, చిన్నం గంగాధరం, కాపర్తివేణు, బుట్టాయగూడెం మండల కన్వీనర్ సయ్యద్‌బాజీ, పార్టీ జిల్లా నాయకులు ఆరేటి సత్యనారాయణ, సంకు కొండ, యడ్లపల్లి సురేష్, చిక్కాల దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. -
కరకు తగ్గని ఒబామా
* రిపబ్లికన్లతో కలసి పనిచేసినా, కాంగ్రెస్‌నూ పట్టించుకోనని స్పష్టీకరణ * కొత్త పరిణామాల నేపథ్యంలో తన ఎజెండా మారబోదని వ్యాఖ్య * మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల వైఫల్యం నేపథ్యంలో వ్యాఖ్యలు వాషింగ్టన్: అమెరికన్ కాంగ్రెస్ ఉభయ సభల స్థానాలకు, పలు రాష్ట్రాల గవర్నర్ పదవులకు జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ చేతిలో పాలకపక్షం డెమోక్రాటిక్ పార్టీ ఘోర పరాజయంపాలైన నేపథ్యంలో ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఒకింత తిరస్కార వైఖరితోనే స్పందించారు. రాబోయే తన రెండేళ్ల పాలనలో రిపబ్లికన్లతో కలసి పనిచేస్తానని, అయితే 2.4 లక్షలమంది భారతీయులు సహా, కోటీ పది లక్షల మంది అక్రమ వలసదార్లు అమెరికాలోనే కొనసాగేందుకు దోహదపడే వలస సంస్కరణల వంటి అంశాల్లో మాత్రం తాను కాంగ్రెస్‌ను పట్టించుకోనని , కార్యవర్గపరంగా తనకున్న అధికారాలను వినియోగిస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల అనంతరం ఏర్పడిన కొత్త పరిణామాల నేపథ్యంలో తన ఎజెండాలోనూ ఎలాంటి మార్పు ఉండబోదన్నారు. వైట్‌హౌస్‌లో దాదాపు 90 నిమిషాలసేపు సాగిన విలేకరుల సమావేశంలో ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే రెండేళ్లలో ప్రజాహితం కోసం కష్టపడి పనిచేస్తానంటూ అమెరికన్ ప్రజలకు రాసిన బహిరంగ లేఖలోనూ స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో, బహిరంగ లేఖలో ఒబామా వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. దేశంలో 2.4 లక్షలమంది భారతీయులు సహా కోటీ 10 లక్షలమంది అక్రమ వలసదారులున్నారు. వలస విధానంలో సమగ్రమైన సంస్కరణల ద్వారానే అమెరికాలో నివసించే వారికి తగిన అవకాశాలు లభిస్తాయి. వలసలపై సమగ్ర వ్యవస్థ పనితీరు మెరుగుపడేలా ఈ ఏడాదిలోగా చర్యలు తీసుకుంటాం. వాణిజ్య ఒప్పందాలు, మౌలిక సదుపాయాల కల్పనపై వ్యయం, వలస విధానాల ప్రక్షాళన వంటి అంశాల్లో రాజీ కుదుర్చుకునేందుకు యత్నిస్తా. పరిపాలనలో వివిధ అంశాల్లో ఎలా ముందుకు సాగాలన్న విషయమై, సెనేట్ మెజారిటీ నేత కాబోతున్న మిచ్ మెకెన్నెల్తో, ప్రతినిధుల సభ స్పీకర్ కాబోతున్న జాన్ బోయెనర్తో సహా ఇతర రిపబ్లికన్, డెమోక్రాటిక్ నేతలతో చర్చిస్తా. తాజా ఎన్నికల్లో రిపబ్లికన్లు గెలిచారు. అయితే, వారంతా నాతో కలసి పనిచేయాలంటూ ప్రజలు తీర్పిచ్చారు.