migrating
-
ఎగిరిపోతున్న సంపన్నులు! ఎక్కువగా ఆ దేశానికే..
భారత్ నుంచి ఏటా వేల సంఖ్యలో మిలియనీర్లు విదేశాలకు తరలిపోతున్నారు. ఈ ఏడాది దాదాపు 4,300 మంది మిలియనీర్లు భారత్‌ను వీడే అవకాశం ఉందని, వీరిలో ఎక్కువ మంది యూఏఈని తమ గమ్యస్థానంగా ఎంచుకున్నారని అంతర్జాతీయ పెట్టుబడుల వలస సలహా సంస్థ హెన్లీ అండ్ పార్టనర్స్ తాజా నివేదిక వెల్లడించింది.గత ఏడాది ఇదే నివేదిక ప్రకారం 5,100 మంది భారతీయ మిలియనీర్లు విదేశాలకు మకాం మార్చారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ మిలియనీర్ల వలసల విషయంలో చైనా, యూకే తర్వాత ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో ఉంటుందని అంచనా. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ఇప్పుడు చైనాను అధిగమించగా, భారతీయ నికర మిలియనీర్లు చైనా కంటే 30 శాతం కంటే తక్కువ.కొత్త మిలియనీర్లుభారత్ ప్రతి సంవత్సరం వేలాది మంది మిలియనీర్లను కోల్పోతున్నప్పటికీ దానికంటే ఎక్కువ సంఖ్యలో కొత్త సంపన్నులను తయారు చేస్తూనే ఉందని నివేదిక పేర్కొంది. గత దశాబ్దంలో దేశంలో 85 శాతం సంపద పెరిగినట్లు వెల్లడించింది. ఇలా వెళ్తున్న మిలియనీర్లలో చాలా మంది భారత్‌లో వ్యాపార ప్రయోజనాలు, ఇళ్లను కలిగి ఉన్నారని నివేదిక ఎత్తి చూపింది. ఇది కొనసాగుతున్న ఆర్థిక సంబంధాలను సూచిస్తుంది.2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,28,000 మంది మిలియనీర్లు వలసలు వెళ్తారని భావిస్తున్నారు. వీరికి యూఏఈ, యూఎస్ఏ ఇష్టమైన గమ్యస్థానాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. భద్రత, ఆర్థిక పరిగణనలు, పన్ను ప్రయోజనాలు, పదవీ విరమణ అవకాశాలు, వ్యాపార అవకాశాలు, అనుకూలమైన జీవనశైలి, పిల్లలకు విద్యావకాశాలు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు, మొత్తం జీవన నాణ్యతతో సహా వివిధ కారణాల వల్ల సంపన్న కుటుంబాలు వలస వెళ్తున్నాయి. -
సంక్రాంతి :పల్లెబాట పట్టిన జనం..రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు కిటకిట (ఫొటోలు)
-
TRSలో వలసలు ఆగిపోయాయా? ఆపేశారా?
-
వలసల వల్లే నేరాలు
సాక్షి, ముంబై: నగరానికి వలస వస్తున్నవారివల్లే నేరాల సంఖ్య పెరుగుతోందని హోంశాఖ మంత్రి ఆర్ఆర్ పాటిల్ పేర్కొన్నారు. బంగారం ధర విపరీతంగా పెరిగిపోవడంతో దొంగతనాలకు, దోపిడీలకు ముంబైని లక్ష్యంగా చేసుకుంటున్నారని అసెంబ్లీలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నేరాలకు పాల్పడుతున్నవారిలో ఇతర ప్రాంతాలవారే ఎక్కువగా ఉంటున్నారని, దీంతో రోజురోజుకు పెరుగుతున్న కొత్త నేరాల కేసులు దర్యాప్తు చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పాటిల్ ఆందోళన వ్యక్తం చేశారు. చెంబూర్‌లోని మాహుల్ ప్రాంతంలోగల కోళీ సమాజం మహిళల నుంచి బంగారు నగలు, నగదు తీసుకుని పారిపోయిన బెంగాలీ వడ్డి వ్యాపారిపై ఏం చర్యలు తీసుకున్నారంటూ ప్రతిపక్ష నాయకులు పాటిల్‌ను ప్రశ్నించారు. అందుకు ఆయన సమాధానమిస్తూ... ఈ ఘటనతో సంబంధమున్న ఉత్తమ్‌కుమార్ మల్లాను అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుడు 5,382 గ్రాముల బంగారం, రూ.26 లక్షల నగదు.. ఇలా మొత్తం రూ.2 కోట్లు విలువచేసే సొత్తు దోచుకుపోయాడని, ఇప్పటిదాకా 943 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించామని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిని వెంటనే బదిలీ చేస్తామని కూడా హెచ్చరించామన్నారు. గత ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు 693 మంది నేరస్తులు పోలీసుల కళ్లుగప్పి పారిపోయినట్లు వెలుగులోకి వచ్చిన విషయాన్ని పాటిల్ కూడా అంగీకరించారు. ఇందులో 136 మంది పట్టుబడ్డారన్నారు. పోలీసుల భద్రతపై మాట్లాడుతూ.. వారికి త్వరలోనే బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు అందజేస్తామన్నారు. అందుకు నాగపూర్‌కు చెందిన నేకో డిఫెన్స్ సిస్టం కంపెనీకి ఐదు వేల బుల్లెట్ ఫ్రూప్ జాకెట్లు సరఫరా చేయాలని ఆదేశించినట్లు పాటిల్ సభలో వెల్లడించారు.