mine workers
-
50 శాతం శాలరీ హైక్.. సెలవుల పెంపు; డిమాండ్లు ఇవే
గోదావరిఖని: దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు గని కార్మికుల ఉమ్మడి చార్టర్ ఆఫ్ డిమాండ్లను జాతీయ కార్మిక సంఘాలు సిద్దం చేశాయి. ఈ నెలాఖరుతో 10వ వేతన సంఘం గడువు పూర్తి కానుంది. వచ్చే నెల నుంచి కొత్త వేతన ఒప్పందం అమలు కావాల్సి ఉంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న నాలుగు జాతీయ సంఘాలు ఒకేతాటిపైకి వచ్చి ఉమ్మడి చార్టర్ ఆఫ్ డిమాండ్లు పొందు పర్చాయి. దేశంలోని 4 లక్షల మంది కార్మికులకు వర్తించనున్న డిమాండ్లపై బొగ్గు గని కార్మికుల్లో ఆసక్తి రేకిస్తోంది. తమకు సంబంధించి జాతీయ కార్మిక సంఘాలు ఏ విధంగా ముందుకు వెళ్తాయి.. 11వ వేతన కమిటీలో జీతభత్యాలు ఏ విధంగా పెరుగుతాయి.. అలవెన్సులు ఏ విధంగా ఉంటాయనే ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. దేశంలో ఉన్న జాతీయ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూ యూనియన్లు తమ డిమాండ్లను ఉమ్మడిగా సిద్దం చేశాయి. ఈనెల 3న నిర్వహించిన వర్చువల్ సమావేశంలో దీనికి అంగీకరించారు. ప్రధానంగా మూల వేతనం, అలవెన్సులు, సెలవులు తదితర అంశాలపై ఇప్పటికే స్పష్టతకు వచ్చాయి. దీనిపై ఆదివారం మరోసారి వర్చువల్ సమావేశం నిర్వహించి పూర్తిస్థాయిలో అంగీకారం తెలుపనున్నాయి. ఈ ఒప్పందం పూర్తయితే 01.07.2021 నుంచి 30.06.2026 వరకు అమలులో ఉండనుంది. ప్రధాన డిమాండ్లు ప్రస్తుత మూల వేతనంపై 50 శాతం జీతం పెంచాలి. ఎల్ఎల్టీసీ రూ.75 వేలు, ఎల్టీసీ రూ .50 వేలు చెల్లించాలి రెస్క్యూ అలవెన్స్ వేతనంలో 15 శాతం చెల్లించాలి. క్వారీ, వాషరీ, క్రషర్, సీహెచ్‌పీల్లో పనిచేసే కార్మికులకు వేతనంలో 10 శాతం డస్ట్ అలవెన్స్ ఇవ్వాలి సాధారణ సెలవులు 11 నుంచి 15 రోజులకు పెంచాలి సిక్ లీవ్ 15 నుంచి 20 రోజులకు పెంచాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే కార్మికులు కోలుకునేంత వరకు పూర్తి స్థాయి వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలి మూడేళ్ల వరకు శిక్షణ, స్టడీ లీవ్ ఇవ్వాలి ప్రతి సంవత్సరం నిర్వహించే సమావేశాలకు టీఏ, డీఏతో పాటు నలుగురు ట్రేడ్ యూనియన్ ప్రతినిధులకు ప్రత్యేక సెలవులు ఇవ్వాలి. గ్రాడ్యువిటీ చెల్లింపునకు సీలింగ్ పరిమితి ఉండొద్దు విధుల్లో మరణించిన కాంట్రాక్టు కార్మికులతో సహా పర్మినెంట్ కార్మికులకు రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలి. ఆధార పడిన వారికి పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలి. సీపీఆర్ఎంఎస్ స్కీంపై రూ.25 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందించాలి. ప్రతి గనిపై లైఫ్ సపోర్టు అంబులెన్సులు ఏర్పాటు చేయాలి పెన్షన్ ఫండ్ కోసం టన్ను బొగ్గుపై రూ.20 వసూలు చేయాలి. కనీస పెన్షన్ రూ.10 వేలకు తగ్గకూడదు వారంలో 40 పని గంటలు లేదా ఐదు రోజులు పనిదినాలు ఉండాలి కాంట్రాక్టు కార్మికులకు క్రమబద్ధీకరించాలి గనుల్లో కొత్త నియామకాలు ప్రారంభించాలి. కార్మికుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలి కాంట్రాక్టు కార్మికులకు జేబీసీసీఐ పరిధిలోకి రావాలి. పారామెడికల్ స్టాఫ్‌కు ప్రత్యేక క్యాడర్ స్కీం తయారు చేయాలి. యువత చదువుకు తగిన ఉద్యోగం ఇవ్వాలి. వీటితో పాటు మరికొన్ని డిమాండ్లపై జాతీయ కార్మిక సంఘాలు పూర్తి స్థాయి కసరత్తు చేసి బొగ్గు పరిశ్రమ ద్వైపాక్షిక కమిటీకి అందించనున్నాయి. ఈ డిమాండ్లపై కోలిండియా యాజమాన్యం జాతీయ కార్మిక సంఘాలతో చర్చించనుంది. ఇరువర్గాల సంప్రదింపుల అనంతరం పూర్తి స్థాయి నిర్ణయాలు వెలువడనున్నాయి. చదవండి: సింగరేణిలో ఇదేం వివక్ష ? -
జీడీకే–10 గని మూసివేత
సాక్షి, రామగిరి(మంథని): సింగరేణి సంస్థలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన జీడీకే–10 గనిని మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించింది. గత ఏడాది డిసెంబర్లోనే 10వ గనిని మూసివేయా లని యాజమాన్యం భావించినప్పటికి అనేక కారణాల వల్ల ఆ ప్రక్రియ ఆగిపోయి.. ఈ ఏడాది మార్చి వరకు యాజమాన్యం గడువు పెంచింది. గనిలో బొగ్గు ఉత్పత్తి చేయాలంటే ముఖ్యంగా కోల్కట్టర్స్, సపోర్ట్మెన్లు కావల్సి ఉంటుంది. అయితే సంస్థలో కొత్తగా కార్మికుల నియామకాలు లేకపోవడంతో పాటు ఉత్పత్తి వ్యయం పెరిగిపోవడం గని మూసివేతకు కారణంగా తెలుస్తోంది. 520 మంది కార్మికుల బదిలీ.. 1976లో స్థాపించిన జీడీకే–10ఇంక్లైన్(గని) తనకు కేటాయించిన ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తూ.. ఎంతో మందికి ఉపాధి అందించి.. బంగారు గనిగా పేరొందింది. యావత్ సింగరేణిలో మొట్టమొదటి బీజీ(బ్లాసింగ్ గ్యాలరీ)ప్యానల్ ఏర్పాటు చేసిన 10వ గనిలో బొగ్గు ఉత్పత్తి కోసం ఖర్చులు అధికం కావడంతో గనిని మూసివేయాలనే యాజమా న్యం నిర్ణయించింది. ఇప్పటికే గనిలో పని చేస్తున్న సుమారు సుమారు 520 మంది కార్మికులను బది లీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. వారికి ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ చేసేందుకు దరఖాస్తులు చేసుకోవాలని ఉత్తర్వు లు జారీ చేశారు. ఈ మేరకు వీరిలో 157 మంది కార్మికులు ఆర్జీ3 పరిధిలోని ఓసీపీ1, ఓసీపీ 2 గనులకు బది లీ కోసం దరఖాస్తులు చేసుకున్నా రు. మిగిలిన వారు వివిధ ఏరియాలకు బదిలీ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. గనిలో ప్రస్తుతం ఉన్న 180 మంది కార్మికులు ఉన్నారు. గని లోపల డ్యామ్ నిర్మాణం, యంత్రాల తరలింపునకు అవసరం మేరకు కార్మి కులను ఇక్కడే ఉంచుకుని మిగిలిన కార్మికులను వివిధ గనులకు యాజమాన్యం బదిలీ చేస్తోంది. భూగర్భంలోని నాలుగు పొరల్లో ఉన్న బొగ్గు నిక్షేపాలను వెలికి తీయడం కోసం 1989లో యావత్ సింగరేణిలోనే మొట్టమొదటి సారిగా ఈ గనిలో బీజీ ప్యానల్ ఏర్పాటు చేశారు. అనేక ఒడిదొడుకులను ఎదు ర్కొని నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని గని సాధించింది. ఈ క్రమంలో గనిలో వర్క్స్పాట్(పని స్థలం)దూరం పెరింగింది. దాదాపు 250 మీటర్ల లోతులో ఉన్న బొగ్గును ఉత్పత్తి చేసేందుకు మ్యాన్ వైడింగ్ షాప్టును ఏర్పా టు చేశారు. అయితే పనిస్థలం దూరంగా ఉండటంతో ఆశించినస్థాయిలో ఉత్పత్తి జరగడం లేదు. దీంతో నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఈ గనిని ఆర్జీ3 పరిధి లోని ఓపీసీ1కు అప్పగించాలని యాజమాన్యం నిర్ణయించింది. పెరగనున్న ఓసీపీ–1 జీవితకాలం.. జీడీకే–10 గనిని మూసివేసి ఆర్జీ –3 పరిధిలోని ఓసీపీ–1కు అప్పగించాలని యాజమాన్యం నిర్ణయించింది. దీంతో ఓసీపీ–1 జీవితకాలం దాదాపు 16 సంవత్స రాలు పెరగనుంది. ఓసీపీ–1కు అప్పగించనున్న 10వ గని ప్రాంతంలో 2019 డిసెంబర్ నాటికి బొగ్గు ఉత్పత్తి ప్రా రంభం అవుతుంది. అదే విధంగా సింగరేణి సంస్థ లో మొట్టమొదటి సారి లాంగ్వాల్ టెక్నాలజీని ప్రవేశపెట్టిన జీడీకే 10ఏ గనిని 2015లో యాజమాన్యం మూసివేసింది. జీడీకే 10ఏ గనిని 1985 లో ప్రారంభించారు. భూగర్భంలో నాలుగు పొర ల్లో ఉన్న బొగ్గు నిక్షేపాల్లో పై రెండు పొరల్లోని బొగ్గు నిక్షేపాలను వెలికితీయడం కోసం 1994లో 10ఏ గనిలో లాంగ్వాల్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. జీడికే 10, జీడీకే 10ఏ గనుల ఆవరణలో సుమారు 336 మిలియన్ టన్నుల బొగ్గు ఉండగా.. 34 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశారు. మిగిలిని 302 మిలియన్ టన్నుల బొగ్గును యాజమాన్యం ఓసీపీ–1 ద్వారా వెలికితీయనుంది. బొగ్గు ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి జీడీకే 10వ గనిని జీవితకాలం ముగిసింది. గనిలో బొగ్గు ఉత్పత్తి చేయాలంటే కోల్కర్టర్స్, సపోర్టుమెన్ కార్మికులు అవసరం కాగా.. కొత్తగా నియాకాలు లేవు. దీనికి తోడు పని స్థలం దూరం కావడంతో బొగ్గు ఉత్పత్తికి ఖర్చులు అ«ధికం కావడం వల్ల గనిని మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించింది. అయితే ఓసీపీ–1 విస్తరణ వల్ల ఏఎల్పీకి ఎలాంటి ముప్పు వాటిళ్లకుండా రెండు డ్యామ్‌లను నిర్మించి, గనిలోపల ఉన్న యంత్రాలను పైకి తరలించిన తరువాతే.. గనిని పూర్తిస్థాయిలో మూసివేయడం జరుగుతుంది. –బి.వీరారెడ్డి, ఏఏపీ జీఎం -
నేతలపై కార్మికుల ఆగ్రహం
శ్రీరాంపూర్: ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్‌లోని 3వ మైన్ కార్మికుల సమస్యలు పరిష్కరించడం లేదని కార్మికులు ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ బాల్కసుమన్, ఎమ్మెల్యే దివాకరరావు బుధవారం ఉదయం 3వ మైన్స్‌ను సందర్శించి కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా తమ సమస్యలు పరిష్కరించడంలేదని, ఎప్పుడు చూసినా హామీలతో కాలం గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతలు వారిని సముదాయించి ముఖ్యమంత్రితో మాట్లాడి అన్ని సమస్యలూ వెంటనే పరిష్కరించే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
కార్మిక పక్షపాతి ‘కాకా’
* కోల్‌బెల్ట్‌లో ప్రతీ కార్యకర్తతో సత్సంబంధాలు * గని కార్మికులకు పెన్షన్ ఇప్పించిన మహానేత * 17 వేల మందికి ఇళ్లస్థలాల క్రమబద్ధీకరణలో కీలక భూమిక * 1950 నుంచే రామగుండంతో సంబంధాలు.. హైదరాబాద్‌కు చెందిన గడ్డం నర్సింహస్వామి, గడ్డం వెంకటస్వామి, గడ్డం నారాయణస్వామి అన్నదమ్ములు. 1950లో నర్సింహాస్వామి రామగుండంలో నెలకొల్పిన 62.5 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్‌లో సబ్ కాంట్రాక్టర్‌గా పనిచేసేవారు. ఇదే సమయంలో వెంకటస్వామి, అంజయ్య, ఎంఎం.ఆసీమ్, సంజీవరెడ్డి తదితరులు హైదరాబాద్‌లోని నారాయణగూడ తాజ్‌మహల్ కేంద్రం అడ్డాగా కార్మిక రాజకీయాలు నడిపేవారు. హైదరాబాద్‌లోని కార్వాన్, బీహెచ్ఇఎల్, రిపబ్లికన్ పోర్ట్, శ్రీశైలం డ్యామ్ తదితర సంస్థల్లో కార్మిక సంఘాలు ఏర్పాటు చేసి వారిహక్కుల కోసం పోరాడారు. ఈ నేపథ్యంలో సోదరుడు నర్సింహాస్వామి రామగుండంలో కాంట్రాక్టు పనులు నిర్వహించడంతో వెంకటస్వామి తరుచూ హైదరాబాద్‌లో ‘జనతా రైలు’ ఎక్కి రామగుండం, మంచిర్యాల, కాగజ్‌నగర్‌కు వచ్చి వెళ్లేవారు. 1953లో రామగుండం బి-పవర్‌హౌస్ వద్ద మూడు రంగుల జెండాను వెంకటస్వామి ఎగురవేశారు. తర్వాత సింగరేణి కాలరీస్, సిర్పూర్ కాగజ్‌నగర్‌లో కూడా కార్మిక సంఘాలు ఏర్పాటు చేసి పనిచేశారు. 1957లో జరిగిన ద్విశాసనసభ ఎన్నికల సమయంలో చెన్నూర్, సిర్పూర్ నుంచి వెంకటస్వామి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. తర్వాత 1962లో మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ స్వతంత్ర అభ్యర్థి జి.సైదయ్య చేతిలో ఓడిపోయారు. అనంతరం 1967లో కాంగ్రెస్ అభ్యర్థిగా, 1971లో తెలంగాణ ప్రజాసమితి, 1977లో కాంగ్రెస్ పార్టీ తరఫున మూడుసార్లు మెదక్ జిల్లా సిద్దిపేట లోక్‌సభ నియోజకవర్గం(ఎస్సీ రిజర్వు) నుంచి ఎంపీగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 1978లో రాష్ట్ర రాజకీయాలకు ఆకర్షితులై ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. చెన్నారెడ్డి ప్రభుత్వంలో కార్మిక, పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలోనే ఆయన హైదరాబాద్‌లో చాలా మంది పేదలకు గుడిసెలు వేసుకునే అవకాశం కల్పించి ‘గుడిసెల వెంకటస్వామి’గా పేరు తెచ్చుకున్నారు. 1989 నుంచి పెద్దపల్లి లోక్‌సభపై దృష్టి.. 1989, 1991, 1996లో తిరిగి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఎస్సీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుసగా ఎంపీగా ఎన్నికై రెండవసారి హ్యాట్రిక్ సాధించారు. 1998, 1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చెలిమెల సుగుణకుమారి చేతిలో ఓటమిపాలయ్యారు. 2004లో జరిగిన ఎన్నికల్లో ఆమెపైనే ఘన విజయం సాధించారు. 1979లో ఇందిరాగాంధీ కేంద్ర క్యాబినెట్లో డెప్యూటీ లేబర్ మినిస్టర్‌గా, 1996లో పీవీ న ర్సింహారావు కేబినెట్లో గ్రామీణాభివృద్ధి, కార్మిక, జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. 1985 నుంచి 1988 వరకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, తర్వాత కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యుడిగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా, లోక్‌సభ డెప్యూటీ లీడర్‌గా వ్యవహరించారు. కాకా తన కుమారులు జి.వినో ద్, జి. వివేక్‌ను కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. గని కార్మికులకు పెన్షన్ సౌకర్యం... సింగరేణి సంస్థలో 1996 కన్నా ముందు గని కార్మికులకు పెన్షన్ సౌకర్యం లేదు. ఆ సమయంలో పెద్దపల్లి లోక్‌సభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన కాకా కేంద్రంతో మాట్లాడి గని కార్మికులకు పెన్షన్ ఇప్పించడంలో కీలక భూమిక పోషించారు. 1998లో జరిగిన వేతన ఒప్పందం సమయంలో సింగరేణి వద్ద డబ్బులు లేకపోతే ఎన్టీపీసీ యాజమాన్యంతో మాట్లాడి రూ.400 కోట్లు తీసుకుని కార్మికులకు వేతన చెల్లించేలా చూశారు. కాజిపేట నుంచి సిర్పూర్కాగజ్నగర్ వరకు రామగిరి ప్యాసింజర్ రైలును వేయించారు. గోదావరిఖనిలో సింగరేణి స్థలాల్లో ప్రజలు ఇళ్లు నిర్మించుకోగా... ఈ విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్లి సుమారు 17 వేల మందికి స్థలాల క్రమబద్ధీకరించి పట్టాలు ఇప్పించారు. గనులపైకి వచ్చినప్పుడు కార్మికులు ఆయనకు తమ కష్టసుఖాలు చెప్పుకునేవారు. సింగరేణిలో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ యూనియన్ బలోపేతం కోసం కూడా చిరకాలం పనిచేశారు. కాకా కృషితో పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని మేడారం, పెద్దపల్లి నియోజకవర్గాలకు రాష్ట్రస్థాయిలో అధిక ప్రాధాన్యత లభించేది. తన తర్వాత తరమైన దళిత నేతలు గుమ్మడి నర్సయ్య, బడికెల రాజలింగం, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తదితరులకు అవకాశం కల్పించి రాజకీయంగా ఎదిగేలా చూశారు. -
'సింగరేణి’కి సీఎం వరాలు
గోదావరిఖని : సింగరేణి కార్మికులకు నిజంగా ఇది పండుగరోజు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన కార్మికులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వరాలు కురిపించారు. సోమవారం హైదరాబాద్‌లో అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో తీపి కబురు అందించారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 63 వేల మంది గని కార్మికులకు తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్‌ను ప్రకటించారు. ఈ నిర్ణయంతో జిల్లాకు చెందిన ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3 డివిజన్లకు చెందిన 20 వేల మందికి లబ్ధి చేకూరనుంది. మరోవైపు గని కార్మికులు పని ఒత్తిడితో చాలామంది విధులకు డుమ్మా కొట్టారు. వీరిని యాజమాన్యం డిస్మిస్ చేసింది. అలా విధులకు గైర్హాజరై డిస్మిస్డ్ అయిన వారినీ తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుంటానని కేసీఆర్ హామీ ఇవ్వడంతో కార్మికుల్లో హర్షతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సింగరేణిలో వారసులకూ ఉద్యోగావకాశాలను పరిశీలిస్తామని ప్రకటించారు. సాధ్యాసాధ్యాలపై పరిశీలన జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. సమ్మెకాలానికి ప్రత్యేక సెలవు 2011లో సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 17వరకు 35 రోజుల పాటు సాగిన సకలజనుల సమ్మెలో కార్మికులందరూ పాల్గొన్నారు. ఆ సమయంలో వేతనం కోల్పోయారు. అయితే సమ్మెలో పాల్గొన్న కార్మికులకు కేసీఆర్ ప్రత్యేక సెలవుగా ప్రకటించారు. దీంతో మిగిలిన కార్మికులు తమ సెలవులను వినియోగించుకోనున్నారు. కార్మికులు, ఉద్యోగుల వేతనాలపై మూడు శాతం ఇంక్రిమెంట్ ఇస్తున్నారు. అయితే తెలంగాణ ఇంక్రిమెంట్‌ను ఎలా చెల్లిస్తారో ఇంకా విధివిధానాలు రూపొందించలేదు. ఒకవేళ మూడు శాతం అమలు చేస్తే ఒక్కో కార్మికుడికి రూ.1500 నుంచి రూ. 2,500 వరకు ఇంక్రిమెంట్ రూపంలో అందనుంది. ‘ఖని’లోనే సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నాలుగు జిల్లాల్లో మాదిరిగానే జిల్లాలో గోదావరిఖనిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల కోల్‌బెల్ట్ ప్రాంతాలకు అనుకూలంగా గోదావరిఖని ఉండడంతో ఆయా జిల్లాలోని సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులకు అనుసంధానంగా ఇక్కడే మెడికల్ కళాశాల ఏర్పాటు చేసే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తే ఎన్టీపీసీ యాజమాన్యం కూడా సహకరించే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో దీనిపై ఆశలు చిగురిస్తున్నాయి. స్థలసేకరణ వేగవంతం చేయండి.. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 800 మెగావాట్ల విద్యుత్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ సీఎండీ అరూప్‌రాయ్ చౌదరి ఇటీవల సీఎంని కలిసి సానుకూలత వ్యక్తం చేశారు. ప్లాంట్ కో సం 1500ఎకరాల స్థలాన్ని త్వరితగతిన సేకరిం చాలని సీఎం కేసీఆర్ సింగరేణి అధికారులకు సూచించారు. అలాగే తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ప్లాంట్ కోసం కూడా మరో 400 ఎకరాల స్థలాన్ని సేకరించాలని సం బంధిత అధికారులను ఆయన ఆదేశించారు. -
సొంతిళ్లు కలేనా?
న్యూస్‌లైన్, బెల్లంపల్లి , సింగరేణి బొగ్గు గని కార్మికులకు సొంతింటి కల హామీలకే పరిమితమవుతోంది. మృత్యుగుహల్లాంటి గనుల్లోకి వెళ్లి బొగ్గు ఉత్పత్తి చేస్తున్న కార్మికులకు ఏళ్లు గడుస్తున్నా ఆ హామీ నెరవేరడం లేదు. పాలకుల పట్టింపులేని తనం, కార్మిక సంఘాల నిర్లిప్త వైఖరి కార్మికులకు శాపంగా మారుతోంది. ఏళ్ల తరబడి రెక్కలు, ముక్కలు చేసుకొని సింగరేణి పురోభివృద్ధికి దోహదపడిన కార్మికులు ఉద్యోగ విరమణ చేసిన తర్వాతపూరి గుడిసెలు, అద్దె ఇళ్లలో నివాసం ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రతిసారీ ఎన్నికల్లో కార్మికులకు సొంతిళ్లు నిర్మించి ఇస్తామన్న హామీ కార్మిక సంఘాలు, పాలకులకు ఓట్లను కూడబెడుతోంది. హామీలు మాత్రం నాయకులు తీర్చడం లేదు..