సొంతిళ్లు కలేనా?
న్యూస్‌లైన్, బెల్లంపల్లి , సింగరేణి బొగ్గు గని కార్మికులకు సొంతింటి కల హామీలకే పరిమితమవుతోంది. మృత్యుగుహల్లాంటి గనుల్లోకి వెళ్లి బొగ్గు ఉత్పత్తి చేస్తున్న కార్మికులకు ఏళ్లు గడుస్తున్నా ఆ హామీ నెరవేరడం లేదు. పాలకుల పట్టింపులేని తనం, కార్మిక సంఘాల నిర్లిప్త వైఖరి కార్మికులకు శాపంగా మారుతోంది.
ఏళ్ల తరబడి రెక్కలు, ముక్కలు చేసుకొని సింగరేణి పురోభివృద్ధికి దోహదపడిన కార్మికులు ఉద్యోగ విరమణ చేసిన తర్వాతపూరి గుడిసెలు, అద్దె ఇళ్లలో నివాసం ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రతిసారీ ఎన్నికల్లో కార్మికులకు సొంతిళ్లు నిర్మించి ఇస్తామన్న హామీ కార్మిక సంఘాలు, పాలకులకు ఓట్లను కూడబెడుతోంది. హామీలు మాత్రం నాయకులు తీర్చడం లేదు..