కార్మికులకు కనీస వేతనం ఖరారు
అనంతపురం అర్బన్: జిల్లాలో 2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్స్కిల్డ్ (నైపుణ్యం లేని) కార్మికుల రోజువారీ కనీస వేతనం ఖరారు చేస్తూ కలెక్టర్ కోన శశిధర్ మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఖరారు చేసిన కనీస వేతనం మహిళ, పురుష కార్మికులకు వర్తిస్తుందని తెలిపారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. రూరల్ పరిధిలో కార్మికునికి రోజువారీ వేతనం రూ.310 చొప్పున 26 రోజులకు 8,060 ఇవ్వాలి. అర్బన్, మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్మికునికి రోజువారీ వేతనం రూ.375 చొప్పున 26 రోజులకు 9,750 ఇవ్వాలి.