Minister laksmareddi
-
రాష్ట్రంలో శిశు మరణాల రేటు తక్కువ
వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి సాక్షి,హైదరాబాద్: బాలింతల మరణాలు ఈ మధ్య కాలంలో సంభవిస్తున్నాయని, అలా ఎందుకు జరుగుతున్నాయన్న అంశాన్ని పరిశీలించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో మంత్రి మంగళవారం సమీక్షించా రు. ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన దేశాల్లోనూ బాలింతలు, శిశు మరణాలు సంభవిస్తున్నాయని, 50 శాతం మరణాలకు కారణాలు తెలియడం లేదన్నారు. అయినా మన రాష్ట్రంలో మాతా శిశు మరణాల రేటు చాలా తక్కువగా ఉందని, దాన్ని మరింత తగ్గించాల్సిన బాధ్యత సూపరింటెండెంట్లు, వైద్యులపై ఉందన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు అధికంగా జరిగేలా చూడాలన్నారు. సమావేశంలో ఉన్నతాధికారులు రాజేశ్వర్ తివారీ, వాకాటి కరుణ పాల్గొన్నారు. ‘నిలోఫర్‌లో మదర్ మిల్క్ బ్యాంకు’ తల్లి పాలు అందని పిల్లలకు ఆ పాలను అందించే బృహత్తర కార్యక్రమానికి ధాత్రి, డాక్టర్ ఫర్ సేవ సంస్థలు నడుం బిగిం చాయని వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మదర్ మిల్క్ బ్యాంకు పోస్టర్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ తల్లి పాలు అందక తల్లడిల్లుతున్న వారికి మేమున్నామం టూ ముందుకు వచ్చిన ఆ సంస్థలు.. నిలోఫర్ ఆస్పత్రిలో మదర్ మిల్క్ బ్యాంకుని పెట్టాలనుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. తల్లుల నుం చి ఒక్కోసారి ఎక్కువగా ఉత్పత్తి అయిన పాలను సేకరించి వాటిని పిల్లలకు అందజేస్తారని చెప్పారు. ఈ నెల 30 నుంచి కార్యక్రమాన్ని నిలోఫర్‌లో ప్రారం భిస్తున్నారన్నారు. దేశంలో కేవలం 15 మిల్క్ బ్యాంకులే ఉన్నాయని, రాష్ట్రంలో మొదటిసారి మదర్ మిల్క్ బ్యాంకుని ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. -
సమ్మె నోటీసిచ్చిన డాక్టర్లు
హైదరాబాద్ : సర్కారు ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. గురువారం ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డికి ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు సమ్మె నోటీసులు అందజేశారు. 18రోజుల్లోపు డిమాండ్లను పరిష్కరించాలని వారు గడువు పెట్టారు. ఏప్రిల్ 10వ తేదీ నుంచి వివిధ రూపల్లో నిరసనలు తెలుపుతామన్నారు. జూన్ 2నుంచి పూర్తిస్థాయిలో వైద్యసేవలు నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తమకు యూజీసీ స్కేల్ వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు డైరెక్టర్లను నియమించాలనే ఆలోచన విరమించుకోవాలని కోరారు. -
హర్షితకు ప్రభుత్వ ఖర్చుతో వైద్యం
సాక్షి, హైదరాబాద్ : కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్సకు డబ్బుల్లేక మెర్సీకిల్లింగ్‌కు అనుమతించాలని కోరుతూ హెచ్ఆర్సీని ఆశ్రయించిన బాధితురాలు హర్షిత(11) కుటుంబీకులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. హర్షితకు శస్త్రచికిత్స చేపట్టేందుకు ఓ కార్పొరేట్ ఆస్పత్రి ముందుకు వచ్చిందని, ఇందు కోసం ఆరోగ్యశ్రీ నుంచి రూ.10.50 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. బంజారాహిల్స్‌లోని ‘విరించి’ ఆస్పత్రి రూపొందించిన ‘వి కనెక్ట్ విరించి మొబైల్ యాప్’ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గుండె, కాలేయ, కిడ్నీ మార్పిడి వంటి చికిత్సలు ఇప్పటి వరకు ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, ఖరీదైన ఈ వైద్య సేవలను పేదలకూ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఇప్పటికే ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు ప్రారంభించామన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులు తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడంతో పాటు సామాజిక సేవలో భాగంగా నెలకు ఒక అవయవ మార్పిడి శస్త్రచికిత్సనైనా బాధితులకు ఉచితంగా చేసి, తమ దాతృత్వాన్ని చాటుకోవాలని కోరారు. నిరుపేదలకు అండగా ఉండే కార్పొరేట్ ఆస్పత్రులకు ప్రభుత్వం కూడా తమ వంతు సాయం చేస్తుందన్నారు. ఆరోగ్య రాజధానిగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌లో అధునాతన హంగులతో 600 పడకల సామర్థ్యంతో ‘విరించి’ ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. కాగా మంత్రి విజ్ఞప్తికి ‘విరించి’ ఆస్పత్రి చైర్మన్ విష్ కొంపెల్ల స్పందించారు. తమ ఆస్పత్రిలో ప్రతి నెలా ఒకరికి ఉచితంగా అవయవ మార్పిడి శస్త్రచికిత్స చేయనున్నట్లు ప్రకటించారు. తమ ఆస్పత్రిలో మరో నెల రోజుల్లో ఈ శస్త్రచికిత్సలు ప్రారంభమవుతాయన్నారు. కార్యక్రమంలో చైర్పర్సన్ మాధవీలత కొంపెల్ల, సీఎంఓ శ్రీనివాస్ మైనా, మెడికల్ డెరైక్టర్ ఎన్‌ఎస్‌వీవీమూర్తి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు మంత్రి లక్ష్మారెడ్డి బంజారాహిల్స్‌లోని ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ ప్రధాన కార్యాలయంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
క్యాన్సర్, కిడ్నీ రోగులకు నెలవారీగా ఉచిత మందుల కిట్
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: క్యాన్సర్, కిడ్నీ, మధుమేహం, బీపీ వంటి సమస్యలతో బాధపడే రోగులకు నెలకు సరిపడా మందులను ఒక కిట్‌గా ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించి నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి వెల్లడించారు. కుటుంబ సంక్షేమ కార్యక్రమా లు, జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్(ఎన్యూహెచ్ఎం)ల పనితీరుపై మంగళవారం ఇక్కడ ఆయన వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలని సూచించారు. క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తిస్తే నివారించడానికి వీలుం టుందన్నారు. మూడు నెలల్లో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి కేంద్రాలు అన్ని వసతులతో సిద్ధంగా ఉంచాలన్నారు. రాష్ట్రంలో 500 ప్రసూతి కేంద్రాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశితస్థాయిలో ఆధునీకరించాలని సూచిం చారు. గ్రేటర్ పరిధిలోని 127 ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాలు, 13 సామాజిక ఆరోగ్య కేంద్రాల పరిపాలన బాధ్యతలను జీహెచ్ఎంసీకి అప్పగించాలని నిర్ణయించామన్నా రు. పారిశుద్ధ్యం, మంచినీరు వంటి సమస్యలను సులువుగా అధిగమించడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. -
ప్రజల్ని పీల్చి పిప్పిచేస్తున్నా పట్టించుకోరా?
కార్పొరేట్ ఆసుపత్రుల్లో వసూళ్లపై మండలిలో సభ్యుల ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇష్టారాజ్యంగా బిల్లులు వసూలు చేస్తూ ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నారని, వీటి నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అధికార, విపక్ష ఎమ్మెల్సీలు విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ విషయం వాస్తవం కాదని మంత్రి సి.లక్ష్మారెడ్డి ఇచ్చిన సమాధానంపై శాసనమండలిలో పలువురు సభ్యులు అసంతృప్తి వ్యక్తంచేశారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో బిల్లుల వసూలు, బీపీఎల్ కుటుంబాలకు 30 శాతం ఉచిత చికిత్స, పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటుపై తీసుకున్న చర్యలేమిటని సభ్యుడు ఫారుఖ్‌హుస్సేన్ ప్రశ్నిం చారు. లక్ష్మారెడ్డి సమాధానమిస్తూ.. బిల్లుల వసూలు లేదని, బీపీఎల్ కుటుంబాలకు 30శాతం ఉచిత చికిత్స అందించాలనే నియమం లేదని, ప్రత్యేక విభాగం ఏర్పాటు లేదని చెప్పడంతో పలువురు విభేదించారు. సరైన ప్రమాణాలు, అనుమతులు లేని ఆసుపత్రులపై తీసుకుంటున్న చర్యలేమిటని ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణరావు ప్రశ్నిం చారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అంతా దోపిడీ జరుగుతోందని, వీటిపై కమిటీ వేయాలని ఎమ్మెల్సీ ఎం.రంగారెడ్డి డిమాండ్ చేశారు. కాగా, ప్రైవేట్ ఆసుపత్రులను కంట్రోల్ చేయడానికి టాస్క్‌ఫోర్స్‌ను వేయాలని ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. జిల్లాల నుంచి వచ్చే ఎమర్జెన్సీ కేసుల్లో డబ్బులు కట్టనిదే వైద్యం అందించే పరిస్థితి లేకుండా పోయిందని కె.రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం కచ్చితమైన ప్రణాళికలతో ముందుకెళ్లాలని అల్తాఫ్ రిజ్వీ సూచించారు. మంత్రి సమాధానమిస్తూ అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టం చేస్తామని, జిల్లాల్లో ఐసీయూలు కూడా లేని పరిస్థితి ఉన్నందున ఇప్పటికే మహబూబ్‌నగర్‌లో ప్రారంభించామని, కరీంనగర్, సిద్ధిపేటలలో కూడా వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాగా, ఆసుపత్రుల్లో నిర్లక్ష్యం నిజమేనని, కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి, గతంలో జరిగిన లోపాల్ని సరిదిద్దుతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. స్వైన్‌ఫ్లూ కేసులు తగ్గాయి స్వైన్‌ఫ్లూ పరిస్థితి ఏమిటని ఎమ్మెల్సీలు ఎం.రంగారెడ్డి, ఎమ్మెస్ ప్రభాకరరావు, మహ్మద్ అలీ షబ్బీర్ వేసిన ప్రశ్నకు మంత్రి లక్ష్మారెడ్డి సమాధానమిచ్చారు. 2015తో పోల్చితే స్వైన్‌ఫ్లూ కేసులు గణనీయంగా తగ్గాయని గతంలో 2,956 కేసులు బయటపడగా 101 మరణాలు సంభవించాయని, ప్రస్తుతం 44 కేసులు రాగా 4 మరణాలున్నాయని, డెంగ్యూ కేసులు కూడా గతేడాది 1,831 కేసులు రాగా, ఇద్దరు మరణించారని, ఈ ఏడాది 21 కేసులకు ఒక్క మరణం కూడా లేదన్నారు. విషజ్వరాల నియంత్రణకు పంచాయతీరాజ్ శాఖ సమన్వయంతో చర్యలు తీసుకుంటామని చెప్పారు.