రాష్ట్రంలో శిశు మరణాల రేటు తక్కువ
వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి
సాక్షి,హైదరాబాద్: బాలింతల మరణాలు ఈ మధ్య కాలంలో సంభవిస్తున్నాయని, అలా ఎందుకు జరుగుతున్నాయన్న అంశాన్ని పరిశీలించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో మంత్రి మంగళవారం సమీక్షించా రు. ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన దేశాల్లోనూ బాలింతలు, శిశు మరణాలు సంభవిస్తున్నాయని, 50 శాతం మరణాలకు కారణాలు తెలియడం లేదన్నారు. అయినా మన రాష్ట్రంలో మాతా శిశు మరణాల రేటు చాలా తక్కువగా ఉందని, దాన్ని మరింత తగ్గించాల్సిన బాధ్యత సూపరింటెండెంట్లు, వైద్యులపై ఉందన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు అధికంగా జరిగేలా చూడాలన్నారు. సమావేశంలో ఉన్నతాధికారులు రాజేశ్వర్ తివారీ, వాకాటి కరుణ పాల్గొన్నారు.
‘నిలోఫర్‌లో మదర్ మిల్క్ బ్యాంకు’
తల్లి పాలు అందని పిల్లలకు ఆ పాలను అందించే బృహత్తర కార్యక్రమానికి ధాత్రి, డాక్టర్ ఫర్ సేవ సంస్థలు నడుం బిగిం చాయని వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మదర్ మిల్క్ బ్యాంకు పోస్టర్‌ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ తల్లి పాలు అందక తల్లడిల్లుతున్న వారికి మేమున్నామం టూ ముందుకు వచ్చిన ఆ సంస్థలు.. నిలోఫర్ ఆస్పత్రిలో మదర్ మిల్క్ బ్యాంకుని పెట్టాలనుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. తల్లుల నుం చి ఒక్కోసారి ఎక్కువగా ఉత్పత్తి అయిన పాలను సేకరించి వాటిని పిల్లలకు అందజేస్తారని చెప్పారు. ఈ నెల 30 నుంచి కార్యక్రమాన్ని నిలోఫర్‌లో ప్రారం భిస్తున్నారన్నారు. దేశంలో కేవలం 15 మిల్క్ బ్యాంకులే ఉన్నాయని, రాష్ట్రంలో మొదటిసారి మదర్ మిల్క్ బ్యాంకుని ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.