Minister Nirmala Sitharaman
-
అంతా మోదీ చలవే!, దేశంలో పెరిగిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం!
నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని పదేళ్ల యూపీఐ పాలనాకాలంతో పోల్చిచూస్తే, మోడీ పాలనా కాలంలో దేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రవాహం 65 శాతం పెరిగి, 500.5 బిలియన్ డాలర్లకు చేరిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు పేర్కొన్నారు. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయని సీతారామన్ పేర్కొన్నారు. ఫైనాన్స్ బిల్లు 2022, అప్రాప్రియేషన్ బిల్లు, 2022పై జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి ఈ మేరకు సమాధానం ఇస్తూ, యూఎన్‌సీటీఏడీ (వాణిజ్యం, అభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి వేదిక) నివేదిక ప్రకారం, ప్రపంచంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అత్యధికంగా ఆకర్షించే ఐదు దేశాల్లో భారతదేశం ఒకటిగా కొనసాగుతోందని అన్నారు.2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి ఎఫ్‌డీఐల ప్రవాహం 81.72 బిలియన్ డాలర్లయితే, 2019–20లో ఈ విలువ 74.9 బిలియన్ డాలర్లుగా ఉందని అన్నారు. మహమ్మారి సమయంలోనూ ఎఫ్‌డీఐల ప్రవాహం దేశంలోకి కొనసాగిందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు కోవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ, వనరుల సమీకరణ కోసం ప్రభుత్వం పన్నుల పెంపు దిశగా ఆలోచించలేదని, ఆర్థిక పునరుద్ధరణకు నిధులు సమకూర్చడానికి ఎటువంటి పన్నును పెంచలేదని ఆమె అన్నారు. ఓఈసీడీ నివేదిక ప్రకారం, 32 దేశాలు తమ ఆర్థిక పునరుద్ధరణలకు నిధులు సమకూర్చడానికి తమ పన్ను రేట్ల పెంపువైపే మొగ్గుచూపాయని తెలిపారు. రష్యా– ఉక్రెయిన్ మధ్య యుద్ధం మహమ్మారి తరహాలోనే అన్ని దేశాలను ప్రభావితం చేస్తోందని సీతారామన్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల నుండి రాష్ట్రాలకు రూ. 8.35 లక్షల కోట్లు కేటాయించామని ఆర్థికమంత్రి పేర్కొంటూ, ఇది 2021–22కి సవరించిన అంచనా రూ. 7.45 లక్షల కోట్ల కంటే అధికమని అన్నారు. -
ఆర్మీలోకి అధునాతన శతఘ్ని వ్యవస్థలు
దియోలాలి: భారత ఆర్మీ సామర్థ్యాన్ని పెంపొందించడంలో భాగంగా మూడు శతఘ్ని వ్యవస్థలను కొనుగోలు చేసినట్లు రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వీటిలో ఎం777 ఏ2 అల్ట్రాలైట్ హోవిట్జర్లు, కె9 వజ్ర శతఘ్నులతో పాటు ఆయుధాలను సరిహద్దులకు చేరవేసే ఫీల్డ్ ఆర్టిలరీ ట్రాక్టర్(ఫ్యాట్)లు ఉన్నాయి. మహారాష్ట్రలోని దియోలాలి ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో సీతారామన్ వీటిని సైన్యానికి అందజేశారు. అమెరికా నుంచి కొనుగోలు చేసిన ఎం777 ఏ2(155 ఎంఎం–39 క్యాలిబర్)హోవిట్జర్ శతఘ్నులు 30 కి.మీ దూరంలోని శత్రు స్థావరాలను తుత్తునియలు చేయగలవు. మారుమూల, పర్వత ప్రాంతాలకు హెలికాప్టర్ల ద్వారా తరలించగల ఈ హోవిట్జర్ల ద్వారా పగలు, రాత్రి తేడా లేకుండా నిమిషానికి 5 రౌండ్ల కాల్పులు జరపొచ్చు. అలాగే దక్షిణకొరియాకు చెందిన థండర్–9ను అభివృద్ధి చేసి కె9 వజ్ర(155 ఎంఎం–52 క్యాలిబర్) యుద్ధ ట్యాంకును రూపొందించారు. వేరియంట్స్‌ను బట్టి ఈ ట్యాంకులు 30 కి.మీ నుంచి 58 కి.మీ దూరంలోని లక్ష్యాలను అవలీలగా ఛేదిస్తాయి. దాదాపు 100 వజ్ర యుద్ధ ట్యాంకుల్లో పదింటిని సైన్యం ఇప్పటికే అందుకోగా, మిగిలినవాటిని భారత్‌లో తయారు చేయనున్నారు. అలాగే శతఘ్నులను యుద్ధ సమయంలో సరిహద్దుకు తరలించేందుకు అవసరమైన 6్ఠ6 ఫీల్డ్ ఆర్టిలరీ ట్రాక్టర్(ఫ్యాట్)లను అశోక్ లేలాండ్ సంస్థ నుంచి సైన్యం కొనుగోలు చేసింది. 10 టన్నుల బరువును ఈ ట్రక్కులు అవలీలగా మోసుకెళ్తాయి. -
ఆంధ్రుడిని పెళ్లాడి కర్ణాటక నుంచి రాజ్యసభకు!
సాక్షి బెంగళూరు: కర్ణాటకలో భారీ వర్షాల కారణంగా అతలాకుతలం అవుతున్న కొడగు జిల్లాలను శుక్రవారం రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సందర్శించారు. ఈ సందర్భంగా నిర్మల కొడగు జిల్లా మంత్రి సా రా మహేశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడగులో ఆర్మీ సహాయక చర్యలను పరిశీలించేందుకు కర్ణాటకకు చేరుకున్న నిర్మలా .. మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో బిజీ షెడ్యూల్ దృష్ట్యా సమావేశాన్ని త్వరగా ముగించాలని మహేశ్ సీతారామన్‌ను కోరారు. దీంతో ఆగ్రహానికి లోనైన ఆమె ‘నేను కేంద్ర మంత్రిని. కానీ మీ ఆదేశాలను పాటించాల్సి వస్తోంది. నమ్మలేకపోతున్నా’ అని అన్నారు. జిల్లా అధికారులు అందించిన ప్రణాళిక మేరకే తాను నడుచుకుంటున్నానని స్పష్టం చేశారు. అనంతరం కొడగు డిప్యూటీ కమిషనర్‌ను శ్రీవిద్యను పిలిపించిన సీతారామన్.. షెడ్యూల్లో తలెత్తిన సమస్యను సరిచేయాలనీ, మంత్రి మరోసారి తనను ఇబ్బందిపెట్టకుండా చూడాలని ఆదేశించారు. ఓ వ్యక్తి(మహేశ్) కారణంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్న అందరినీ బాధపెట్టాలనుకోవడంలేదని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ఆ గదిలో మీడియా సిబ్బందితో పాటు ఆర్మీ అధికారులు ఉన్నారు. మహేశ్‌తో సీతారామన్ వాగ్వాదం నేపథ్యంలో గట్టిగా మాట్లాడాలని మీడియా ప్రతినిధులు కోరగా.. ‘మైకులు ఆన్‌లోనే ఉన్నాయి కదా. అన్నింటిని రికార్డు చేసుకోవచ్చు. మీకు నచ్చినంతసేపు రికార్డు చేసుకోండి’ అని చెప్పారు. కొడగు జిల్లాకు రక్షణ శాఖ నుంచి తక్షణ సాయంగా రూ.7 కోట్లు, తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి మరో రూ.కోటి విడుదల చేస్తున్నట్లు నిర్మల చెప్పారు. అంతకుముందు మడికేరి పునరావాస కేంద్రంలో వరద బాధితుల్ని పరామర్శించిన మంత్రి.. జిల్లాలో నష్టాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తానన్నారు. కాగా, సీతారామన్ వ్యాఖ్యలపై మహేశ్ స్పందిస్తూ..‘ఆమె తమిళనాడులో పుట్టింది. ఆంధ్రుడిని పెళ్లాడి కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైంది. ఇలాంటప్పుడు ఆమె మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉండాల్సింది’ అని వ్యాఖ్యానించారు. -
అరుణాచల్‌కి వెళ్తే తప్పేముంది: నిర్మల
గాంధీనగర్: అరుణాచల్‌ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమని, ఈ విషయంలో ఇతరుల అభిప్రాయాలతో పనిలేదని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇటీవల ఆమె అక్కడ పర్యటించడం పట్ల చైనా అభ్యంతరం వ్యక్తం చేయడంపై ప్రశ్నించినపుడు..‘ఇందులో సమస్యేం ఉంది? అది మన భూభాగమే. మనం అక్కడికి వెళ్తాం. దీనిపై ఇతరుల అభిప్రాయాల గురించి ఆలోచించాల్సిన పనిలేదు’ అని గాంధీనగర్‌లో బదులిచ్చారు. టిబెటన్ల గురువు దలైలామాకు ఆశ్రయం కల్పించడం వల్లే భారత్–చైనా మధ్య వివాదాలు మొదలయ్యాయా అని అడిగిన మరో ప్రశ్నకు..ప్రతి సమస్యకు ఏదో ఒక కారణం ఉంటుందని, ఏ సంబంధమైనా ఏదో ఒక దాని వల్లే దెబ్బతినదని అన్నారు. గూఢచర్యం కేసులో పాకిస్తాన్లో జైలు శిక్ష అనుభవిస్తున్న నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌ను భారత్‌కు తిరిగి తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. -
ఒక్క కంపెనీ.. 2 వేల ఖాతాలు..
చెన్నై: ఏకంగా 2,000 పైగా బ్యాంకు ఖాతాలతో ఒక డొల్ల కంపెనీ దాదాపు రూ. 4,000 కోట్ల పైచిలుకు నగదు లావాదేవీలు నిర్వహించిన వైనాన్ని గుర్తించినట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇంత భారీగా లావాదేవీలు ఉన్నప్పటికీ ఆదాయం గురించి సదరు కంపెనీ సరైన వివరణ ఇవ్వలేదని ఆమె పేర్కొన్నారు. పెద్ద నోట్లను డిపాజిట్ చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువును ఉపయోగించుకుని ఆ సంస్థ.. బ్లాక్‌మనీని చలామణిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేసిందని వివరించారు. పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) జరగకపోయి ఉండి ఉంటే ఇది బైటపడేదే కాదని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ ఉదంతం వెలుగుచూసిన తర్వాత సదరు కంపెనీ ప్రస్తుతం మూతబడిందని ఆమె తెలిపారు. బీజేపీకి చెందిన వ్యాపారవర్గాలు నిర్వహించిన యాంటీ బ్లాక్‌మనీ డే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సీతారామన్ ఈ విషయాలు చెప్పారు. పెద్ద నోట్లు రద్దు తర్వాతే డొల్ల కంపెనీల వ్యవహారాలు బైటికొచ్చాయని ఆమె తెలిపారు. -
ప్రతి భారతీయుడి కల సింధు నెరవేరుస్తుంది
-
చిరంజీవి గ్రామంలోనూ అదే పరిస్థితి
నరసాపురం :మెగాస్టార్, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నరసాపురం నియోజకవర్గంలో మూడు గ్రామాలను దత్తత తీసుకున్నారు. నరసాపురం మండలంలోని తూర్పుతాళ్లు, పెదమైవానిలంక గ్రామాలను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ దత్తత తీసుకున్నారు. పెదమైవాని లంకలో రూ.4.50 కోట్ల నాబార్డు నిధులతో 70 తూముల వంతెన స్థానే మూడు వంతెనలు నిర్మిస్తున్నారు. ఆ పనులు నత్తనడకన సాగుతున్నాయి. అప్రోచ్ రోడ్ల నిర్మాణాలకు ఇంకా అనుమతులు రాలేదు. ఇదే గ్రామంలో రూ.3 కోట్లతో నిర్మిస్తున్న డిజిటల్ కమ్యూనిటీ హాల్ పనులు 60 శాతం మాత్రమే పూర్తయ్యాయి. 10 సీసీ రోడ్లు, 22 బయోడైజిస్టడ్ మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. 1,100 సోలార్ దీపాలను అందించారు. తూర్పుతాళ్లు, పెదమైనవానిలంక గ్రామాల్లో ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మిస్తామని సీతారామన్ హామీ ఇచ్చారు. ఆ ప్రతిపాదన కొలిక్కి రాలేదు. ఉప్పు పంటకు గుర్తింపు తీసుకొస్తామని, పండించిన ఉప్పును నిల్వ చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తామని ఇచ్చిన హామీలు ఇంకా గడప దాటలేదు. ప్రధానంగా సముద్రం అలల తీవ్రతకు గ్రామంలోని తీరం కోతకు గురవుతోంది. నివారణకు కనీస చర్యలు కూడా తీసుకోలేదు. తూర్పుతాళ్లు గ్రామానికి ఇప్పటివరకు 10 సీసీ రోడ్లు మంజూరు కాగా, మూడు మాత్రమే పూర్తయ్యాయి. పదెకరాల విస్తీర్ణంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌ను రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించే పనులు ముందుకు సాగడంలేదు. ఈ గ్రామంలో 26 బయోడైజిస్టర్ లెట్రిన్లు నిర్మించి, 1,600 సోలార్ దీపాలు అందించారు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. వాటి నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. పంచాయతీ భవనం నిర్మాణానికి ఎవరూ పూనుకోవడం లేదు. డంపింగ్ యార్డు కూడా ఇక్కడ ఓ ప్రధాన సమస్యగా తయారైంది. పనులు కొనసాగుతాయా! ఇదిలావుండగా, నిర్మలా సీతారామన్ ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఇటీవల ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో దత్తత గ్రామాల్లో పెండింగ్ పనులు పూర్తవుతాయో లేదోననే సందేహం అక్కడి ప్రజలను వెన్నాడుతోంది. ‘చిరు’ గ్రామంలోనూ అదే పరిస్థితి మెగాస్టార్ చిరంజీవి మొగల్తూరు మండలంలోని పేరుపాలెం సౌత్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ 5.50 కోట్లు మంజూరు చేశారు. ఇప్పటివరకు కేవలం రూ.1.10 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. గ్రామంలో రూ.3 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, విద్యుత్ శాఖలకు సంబంధించిన పనులు ప్రారంభం కావాల్సి ఉంది. -
భారత్ ర్యాంక్ మెరుగుకు కృషి
నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ: వ్యాపారం చేసుకోడానికి సులభతరమైన దేశాలకు సంబంధించి ప్రపంచబ్యాంక్ జాబితాలో భారత్ ర్యాంక్ ఈ ఏడాది మెరుగుపడుతుందన్న విశ్వాసాన్ని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యక్తంచేశారు. ఈ దిశలో ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని ఆమె పేర్కొన్నారు. 189 దేశాల ఇటీవలి ప్రపంచ బ్యాంక్ జాబితాలో భారత్ ర్యాంక్ 142 కావడం గమనార్హం. సీఐఐ, ఫిక్కీలు ఇక్కడ నిర్వహించిన వేర్వేరు కార్యక్రమల్లో పాల్గొన్న సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడిన ముఖ్యాంశాలను చూస్తే... - దేశంలో వ్యాపార అవకాశాల మెరుగుకు కేంద్రంతోపాటు పలు రాష్ట్రాలు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాయి. - దేశంలో మౌలిక రంగం అభివృద్ధికి సైతం కేంద్రం పెట్టుబడులు పెడుతోంది. - ఆరోగ్య భద్రత, ఇంధనం, ఆటోమొబైల్, రక్షణ వంటి అంశాల్లో పెట్టుబడులకు భారత్‌లో మంచి అవకాశాలు ఉన్నాయి. - ఈ కామర్స్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అంశంపై రాష్ట్రాలతో తమ మంత్రిత్వశాఖ చర్చలు జరుపుతోంది. -
కేంద్ర బృందాన్ని పంపిస్తా..
మీ ఇబ్బందులు చెప్పుకోండి పొగాకు రైతు ప్రతినిధులతో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పొగాకు రైతుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన వైఎస్సార్సీపీ ఎంపీలు న్యూఢిల్లీ: పొగాకు రైతుల సమస్యలను తెలుసుకునేందుకు కేంద్రం నుంచి బృందాన్ని పంపిస్తామని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హామీఇచ్చారు. ఇబ్బందులేమైనా ఉంటే కమిటీకి నివేదించాలని రైతులకు సూచించారు. పొగాకు పంటకు ప్రత్యామ్నాయంపై తానెలాంటి నిర్ణయాన్ని తీసుకోలేనని ఆమె స్పష్టం చేశారు. పొగాకు రైతుల సమస్యల్ని తప్పక పరిష్కరిస్తామని, ధైర్యంగా ఉండాలని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు నేతృత్వంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన రైతు ప్రతినిధుల బృందం శుక్రవారం ఢిల్లీలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమైంది. బీజేపీ ఎంపీ కంభపాటి హరిబాబు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం, గ్రేడింగ్ తక్కువ చేసి చూపడం, ఇతర ఇబ్బందులను ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రైతులు తమ ఇబ్బందుల్ని మంత్రికి వివరించారు. గ్రేడ్‌ను తగ్గిస్తున్నారని, గిట్టుబాటు ధర లభించట్లేదని తెలిపారు. స్టాకును కొనేలా పొగాకు బోర్డును ఆదేశించాలని కోరారు. మంత్రి మాట్లాడుతూ.. రైతుసమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. రైతుల ఇబ్బందులు తెలుసుకోవడానికి సోమ లేదా మంగళవారం కేంద్రబృందాన్ని పంపిస్తానని హామీఇచ్చారు. మంచి పరిణామం: వైఎస్సార్సీపీ ఎంపీలు పొగాకు రైతు సమస్యలపై కేంద్రమంత్రి సానుకూలంగా విని కేంద్ర బృందాన్ని పంపిస్తామని హామీ ఇవ్వడం మంచి పరిణామమని వైఎస్సార్సీపీ ఎంపీలు మేకపాటి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు చెప్పారు. కేంద్రమంత్రి వెంకయ్యతో భేటీ.. ఇదిలాఉండగా వైఎస్సార్సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి, టీడీపీ ఎంపీ మురళీమోహన్, రైతుసంఘాల ప్రతినిధులు అంతకుముందు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును కలసి పొగాకు రైతు సమస్యలపై వినతిపత్రం అందచేశారు. లోయర్, మిడిల్ గ్రేడ్ పొగాకుకు కనీస ధర రూ.96 చొప్పున చెల్లిస్తామని కంపెనీలు ప్రకటించినప్పటికీ గరిష్టంగా రూ.50 నుంచి 70 మాత్రమే ఇస్తున్నాయని చెప్పారు. వెంటనే వెంకయ్యనాయుడు పొగాకు బోర్డు చైర్మన్ గోపాల్‌తో ఫోన్లో మాట్లాడి తగు ఆదేశాలు జారీ చేశారు. పొగాకు రైతుల ఇబ్బందులపై వాణిజ్యమంత్రితో, ప్రత్యామ్నాయ పంటలపై వ్యవసాయమంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని ఆయన రైతులకు హామీఇచ్చారు. -
అందుకే.. ఆ 2 రంగాల్లో పరిమితులు మార్చలేదు
న్యూఢిల్లీ: కీలకమైన రక్షణ, బ్యాంకింగ్ రంగాల్లో సిసలైన ఇన్వెస్టర్లే పెట్టుబడులు పెట్టాలన్నది తమ అభిమతమని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. రాత్రికి రాత్రి అమ్ముకుని బిచాణా ఎత్తేసే తరహా ఇన్వెస్టర్ల రాకను ప్రభుత్వం కోరుకోవడం లేదని తెలిపారు. అందుకే ఈ రెండు రంగాల్లో విదేశీ పెట్టుబడుల పరిమితిని ఇప్పటిదాకా ఉన్నట్లుగానే యథాతథంగా ఉంచినట్లు మంత్రి వివరించారు. వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితుల్లో కేంద్రం మార్పులు చేసిన నేపథ్యంలో ఆమె వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. పలు రంగాల్లో విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఎఫ్‌డీఐ, ఎఫ్ఐఐ, ఎన్నారై మార్గాల్లో వచ్చే వాటన్నింటికీ ఉమ్మడి పరిమితులను వర్తింపచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు, మంగళవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో కీలక బిల్లుల ఆమోదానికి ప్రతిపక్షం సహకారం లభించగలదని ఆశిస్తున్నట్లు మంత్రి తెలిపారు. -
కమలానిదే భవిష్యత్తు
చెన్నై, సాక్షి ప్రతినిధి : ‘‘ప్రాంతీయ పార్టీలను కాదని బీజేపీ ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీదే. మాతృభాషను నేర్చుకోవాల్సిందే, అలాగని ఇతర భాషల అధ్యయనంపై ఆంక్షలు విధించ డం ఎంతమాత్రం సరికాదు. హిందీ భాషను వద్దని ఉద్యమాలు నిర్వహించడం వల్ల ఎందరో నష్టపోయారు. వారిలో నేను ఉన్నా. తమిళనాడులో హిందీ వద్దని ఉద్యమాలు చేసిన ద్రవిడపార్టీల నేతలు తమ పిల్లలకు మాత్రం హిందీని నేర్పించారు.’’ అంటూ ద్రవిడ పార్టీలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విరుచుకుపడ్డారు. కోయంబత్తూరులో శనివారం రాత్రి జరిగి న పారిశ్రామిక సదస్సులో కేంద్ర వాణిజ్య, పారిశ్రామిక శాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొని, అనంతరం మీడియాతో మాట్లాడారు. మాతృభాష నేర్చుకోకూడదని తాము చెప్పడంలేదన్నారు. ఇతర భాషలు కూడా నేర్చుకోవాలని మాత్రమే చెబుతున్నామని స్పష్టం చేశారు. ముఖ్యంగా పిల్లల అభీష్టానుసారం ఇతర భాషలు నేర్పించాలని ఆమె కోరారు. తాను మదురై జిల్లాలో పుట్టి తిరుచ్చి, విళుపురం జిల్లాల్లో చదివానని, ఆ రోజుల్లో హిందీ నేర్చుకోవాలని ఆశపడ్డానని గుర్తుచేసుకున్నారు. అయితే అప్పటి పోరాటాలు తన ఆసక్తిని అడ్డుకున్నాయని, తనలా ఎందరో నష్టపోయారని చెప్పారు. ఆంగ్లేయు లు వదిలి వెళ్లిన భాషను హాయిగా అందరూ అభ్యసిస్తున్నారు, భారతదేశంలో పుట్టిన హిందీ భాషను మాత్రం నేర్చుకోలేని నిస్సహాయతను తమిళనాడు రాష్ట్రం తనకిచ్చిందన్నారు. హిందీని వద్దంటూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు, ప్రచారాలు చేసిన పార్టీ నేతలు తమ పిల్లలకు మాత్రం హిందీ చెప్పించారని ఆమె విమర్శించారు. అన్ని భాషలు నేర్చుకోవాలనే తపన తమిళనాడుతోపాటూ అన్ని రాష్ట్రాల్లో పెరిగిన సంగతిని కేంద్రం గుర్తించి అందుకు అవసరమైన చర్యలను చేపడుతోందని చెప్పారు. మద్య నిషేధంపై ఆలోచన మద్యం మహమ్మారి దేశంలోని అన్ని రాష్ట్రాలను పట్టిపీడిస్తోందని, ఎన్నో కుటుంబాలను కాలరాస్తోందని తమ ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు. దీనికి అడ్డుకట్టవేసేందుకు ఒక కార్యాచరణ ప్రణాళికను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక మహిళ ప్రారంభించిన ఉద్యమం మద్యనిషేధానికి కారణమైందన్నారు. మద్యనిషేధం విధించేటపుడు కల్లుగీత కార్మికులు నష్టపోకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. కల్లుగీత, చేపల వేట వంటివి చేసేది మగవారైనా, వాటిని అమ్మేది స్త్రీలు కావడంతో ప్రత్యామ్నాయ ఉపాధి అకాశాలను పరిశీలించాల్సి ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అధికారం మాదే తమిళనాడులో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రాంతీయ పార్టీలదే పెత్తనంగా ఉన్న తమిళనాడులో ఒక పరాయి పార్టీగా ప్రజలు భావిస్తున్న బీజేపీకి ఎలా పట్టం కడతారనే ప్రశ్నకు ఆమె తీవ్రంగా స్పందించారు. ఒకప్పుడు రాష్ట్రం విద్య, వైద్యం, వ్యాపారం, వాణిజ్యం, పారిశ్రామికం తదితర అన్నిరంగాల్లో అగ్రస్థానంలో ఉండేదని, కానీ నేడు దిగజారిపోరుుందని చెప్పారు. ఈ దిగజారుడుకు ప్రత్యేకంగా తాను ఎవరినీ నిందించడం లేదని, అయితే ఈ పరిస్థితిలో మార్పురావాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారని తెలిపారు. కోల్పోయిన వైభవాన్ని తిరిగి తీసుకురావడం బీజేపీ ప్రభుత్వానికే సాధ్యమని ప్రజలు సైతం విశ్వసిస్తున్నట్లు ఆమె అన్నారు. గత ఆరు నెలల మోదీ పాలనను చూసిన తరువాతనే తమిళనాడు ప్రజలు ఈ అభిప్రాయానికి వచ్చారని ఆమె తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం, అభిలాషను నెరవేరుస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. -
15 నుంచి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : కేంద్ర వాణిజ్య పన్నులశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 15 నుంచి 17 వరకు జిల్లాలో పర్యటించనున్నట్టు ఏలూరు ఎంపీ మాగంటి బాబు తెలిపారు. స్థానిక ఎంపీ క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆయనను పలువురు కలిసి సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కేంద్రమంత్రి పర్యటించనున్నట్టు చెప్పారు.