Mirchi Market
-
గుండెల్ని మండిస్తున్న మిర్చి ధర
గత కొన్ని వారాలుగా వివిధ రకాల మిరప ధరలు విపరీతంగా పడిపోవడంతో గుంటూరులోని మిర్చి రైతులు గుండెల్లో మిర్చి మంటతో, తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఆక్రందనలు చేస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్ అయిన ‘గుంటూరు మిర్చి యార్డ్’ (Guntur Mirchi yard) ఏటా 20కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తూ రూ. 10,000 కోట్ల టర్నోవర్‌తో రాష్ట్రప్రభుత్వానికి రూ. 100 కోట్ల ఆదాయాన్ని అందిస్తోంది. అయితే, అన్ని మిరప రకాల ధరలు ఇటీవలి వారాల్లో ఒక్కో బస్తాకు రూ. 1,000 నుండి రూ. 4,000 వరకు పడిపోయాయి. కర్నూలు, నంద్యాల, దాచేపల్లి, సత్తెనపల్లి (Sattenapalle) తదితర ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న తెలంగాణ నుంచి కూడా అధిక లాభాలు వస్తాయనే ఆశతో గుంటూరుకు వెళ్లిన రైతులు... ఇప్పుడు నష్టాల బారిన పడుతున్నారు.అధికారిక సమాచారం ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి సాగు 1.94 లక్షల హెక్టార్లలో ఉంది, ఈ సీజన్లో 11.29 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఉంటుందని అంచనా. అయితే ప్రస్తుతం వరుస చీడపీడల వల్ల సాగు ఖర్చులు 30% పైగా పెరిగాయి. చాలా మంది రైతులు తమ ఉత్పత్తులను లాభసాటి ధరలకు అమ్ముకోలేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పల్నాడు జిల్లాలో ఎకరాకు రూ. 2.5 లక్షలకుపైగా పెట్టుబడి పెట్టి మిర్చి సాగు చేసిన అనేక మంది నష్ట భయంతో గజగజలాడుతున్నారు. ‘ప్రస్తుత మార్కెట్ ధర లతో, మా పెట్టుబడులను తిరిగి పొందేందుకు మార్గం కనబడడం లేద’ని రైతులు వాపోతున్నారు.అనూహ్యంగా గత కొన్ని వారాలుగా మిర్చి కొనుగోళ్ల పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారి పోయింది. ముఖ్యంగా చైనా, బంగ్లాదేశ్, నేపాల్ వంటి కీలక మార్కెట్ల నుంచి అంతర్జాతీయ వాణిజ్యం గణనీయంగా మందగించిందని మిర్చి యార్డ్‌లో కొందరు వ్యాపారస్తులు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. 2023–24లో 0.179 మిలియన్ టన్నుల దిగుమతులతో చైనా భారతీయ ఎర్ర మిరప కాయల అతిపెద్ద కొనుగోలుదారుగా అవతరించింది. ఇది పరిమాణంలో సుమారుగా 14 శాతం పెరుగుదలను సూచిస్తుంది. ఒలియోరెసిన్, పాక రంగాల నుండి పెరుగుతున్న డిమాండ్ కారణంగా చైనాకు ఎర్ర మిరప ఎగుమతులు పుంజుకున్నాయి. విలువ పరంగా రెండవ అతిపెద్ద కొనుగోలుదారు అయిన థాయ్‌లాండ్, దాని దిగుమతులు మునుపటి సంవత్సరంతో పోలిస్తే 10.6 శాతం పెరిగాయి. గడచిన కొంత కాలంలో భారత దేశం నుండి అమెరికాకు ఎర్ర మిర్చి ఎగుమతుల్లో గణనీయమైన పెరుగుదల నమోదు అయింది. గత ఏడాది 29,173 టన్నుల నుంచి 2023–24లో ఎగుమతులు 25 శాతం పెరిగి 36,413 టన్నులకు చేరుకున్నాయి. అంటే ఎగుమతుల డిమాండ్ తగ్గిందన్నది దీనినిబట్టి చూస్తే అవాస్తవమే అన్నమాట!గిట్టుబాటు ధర లభించక మిర్చి రైతులు విలవిల్లాడి పోతున్నారు. అందుకే కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో అన్ని విధాలా విఫలమైందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్న తెలుదేశం పార్టీ అధి నేత తన అధికారులతో మంతనాలు, సమీక్షల తోనూ; కేంద్రంవైపు సహాయం కోసం చూసే చూపులతోనూ కాలం గడుపు తున్నట్లు కనిపిస్తోంది. అంతేకాని, మిర్చి రైతులను ఆదుకోవడానికి నిర్దిష్టమైన చర్యలైతే తీసుకోవడం లేదు. నిజంగా రైతుకు మేలు చేయడమే సీఎం నైజం అయితే తమకు వెంటనే భరోసా ఇచ్చే చర్యలను చేపట్టాలని రైతాంగం కోరుకుంటోంది.చదవండి: రైతులపై జులుం... కార్పొరేట్లకు సలాంరాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ వ్యాపారులు, విక్రయదారులు, ప్రభుత్వ అధికారులతో చర్చించారని చెబుతున్నారు. ఈ చర్చల్లో వ్యాపారులను కొనుగోలు కార్యకలా పాలను పెంచాలని డైరెక్టర్ కోరినా... మార్కెట్లో ఎటువంటి నిర్ణయాత్మక మార్పు కనబడడం లేదు. ఈ అత్యంత ఆందోళనకరమైన పరిస్థితి నుండి రైతులను కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోక తప్పదు. లక్షల్లో అప్పుచేసి మిరప సాగు చేసిన రైతులు కనీసం పెట్టుబడి కూడా రాబట్టుకోలేని దయనీయ స్థితిలో ఉండగా, వ్యాపారులు నిశ్శబ్దంగా అసంబద్ధ చర్యలకు పాల్పడుతున్నట్టుగా పలు అనుమానాలు కలుగుతున్నాయి. లేకుంటే అంతగా అభివృద్ధి చెందిన మిరపకు మార్కెట్ పడిపోవడం ఎలా సాధ్యం? చైనాతో సహా 20కి పైగా దేశాలు గుంటూరు మిర్చి వైపు చూస్తుండటం, గత సంవత్సర లాభసాటిగా మార్కెట్ ఉండటం చూస్తుంటే ఈ పతనం వెనుక ఉన్న కాణాలు అర్థం చేసుకోవడం కష్టంగానే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పెను నిద్దర వదిలి మిర్చి రైతులను వెంటనే ఆదుకోవాలి.- బలిజేపల్లి శరత్ బాబు ప్లాంట్ ప్రొటెక్షన్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త -
‘సమీకృతం’... మార్కెట్లు నిర్మాణంలో జాప్యం!
భైంసాటౌన్(ముధోల్): పట్టణాల్లో కూరగాయలు, మాంసం, చేపలు, పూలు, పండ్లు... ఇలా అన్ని మార్కెట్లు ఒకేచోట అందుబాటులో ఉండేలా ప్రభుత్వం సమీకృత మార్కెట్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే జిల్లా కేంద్రమైన నిర్మల్‌తో పాటు భైంసా, ఖానాపూర్ పట్టణాల్లో సమీకృత మార్కెట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రెండెకరాల స్థలంలో వెజ్, నాన్‌వెజ్, పూలు, పండ్ల దుకాణాలు ఒకే ఆవరణలో ఉండేలా నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా భైంసా, ఖానాపూర్‌లో ఏడాదిన్నరగా పనులు కొనసా...గుతుండగా, నిర్మల్‌లో ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం, గుత్తేదారులకు సకాలంలో బిల్లులు అందక పనుల్లో జాప్యం నెలకొందనే విమర్శలున్నాయి. ఎప్పటికి పూర్తయ్యేనో? జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాల సమీకృత మార్కెట్ల నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతను పబ్లిక్‌హెల్త్ శాఖకు అప్పగించింది. వారు టెండర్లు పిలిచి, గుత్తేదారులతో ఒప్పందం చేసుకుని పనులు ప్రారంభించారు. 2021లోనే స్థలాలు పరిశీలించగా నిర్మల్ మినహా భైంసా, ఖానాపూర్‌లలో స్థలాలు ఎంపిక చేసి పనులు సైతం ప్రారంభించారు. నిర్మల్‌లో ఆర్టీసీ స్థలం పరిశీలించినా సంస్థ స్థలం ఇచ్చేందుకు ఒప్పుకోకపోవడంతో మరోచోట పరిశీలించారు. భైంసా, ఖానాపూర్‌లో పనులు ప్రారంభించినా ఏడాదిలోపు పూర్తి చేయాలని నిబంధనలున్నాయి. దాదాపు ఏడాదిన్నర గడిచినా ఇప్పటికీ పనులు కొనసాగే దశలోనే ఉన్నాయి. అఽధికారులు దృష్టి సారించి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని పలువురు కోరుతున్నారు. ● నిర్మల్‌లో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సంస్థ స్థలం పరిశీలించగా వారు ఒప్పుకోలేదు. దీంతో అప్పటి నుంచి పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. ప్రస్తుతం పాత తహసీల్దార్ కార్యాలయం స్థలంలో మార్కెట్ నిర్మించాలని నిర్ణయించారు. రెండు, మూడురోజుల్లో పాత భవనం కూల్చివేసి పనులు ప్రారంభించనున్నట్లు అఽధికారులు చెబుతున్నారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో రూ.7.20 కోట్లతో దాదాపు 140 దుకాణాలతో మార్కెట్ నిర్మాణం చేపట్టనున్నారు. ● భైంసా పట్టణంలోని మిర్చి మార్కెట్ యార్డులో సమీకృత మార్కెట్ నిర్మాణం చేపడుతున్నారు. రూ.7.20 కోట్ల నిధులతో 90 (26నాన్‌వెజ్, 64వెజ్) దుకాణాలతో సముదాయం నిర్మిస్తున్నారు. ఇక్కడ వెజ్ బ్లాక్ పనులు స్లాబ్ లెవల్ వరకు కాగా నాన్‌వెజ్ బ్లాక్ రూఫ్ లెవల్ వరకు పూర్తయ్యాయి. ఆగస్టు నెలాఖరు వరకు పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ● ఖానాపూర్‌లో రూ.3.90 కోట్లతో మార్కెట్ నిర్మాణ పనులు చేపట్టగా దాదాపు 40 శాతానికిపైగా పూర్తయ్యాయి. 20 వెజ్, 20 నాన్‌వెజ్ దుకాణాలు నిర్మిస్తుండగా రెండు రూఫ్ లెవల్ వరకు పూర్తయ్యాయి. ఆగస్టు వరకు వినియోగంలోకి... భైంసా, ఖానాపూర్‌లలో పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏడాదిలోపు పూర్తి చేయాలని నిబంధనలున్నా.. త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆగస్టు నెలాఖరు వరకు పనులు పూర్తయ్యేలా చూస్తాం. నిర్మల్‌లో పాత తహసీల్దార్ కార్యాలయం స్థలం పరిశీలించి త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. – హరిభువన్గౌడ్, పబ్లిక్ హెల్త్ ఏఈ -
ఆంధ్రా మిర్చి అ'ధర'హో..
కొరిటెపాడు(గుంటూరు): గతంలో ఎన్నడూ లేనివిధంగా మార్కెట్లో గుంటూరు మిర్చి దుమ్ము రేపుతోంది. మిర్చి మార్కెట్లో శుక్రవారం తేజ రకం రికార్డు స్థాయిలో క్వింటా రూ.19,500ల ధర పలికింది. ఇప్పటికే రైతులు విక్రయించిన పంటను మినహాయిస్తే.. శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసిన వారికి లాభాల పంట పండనుంది. ఎర్ర బంగారంగా పిలుచుకునే మిర్చిని గతేడాది తక్కువ సాగు చేయగా.. చైనా, థాయిలాండ్ నుంచి ప్రస్తుతం భారీగా ఆర్డర్లు రావడంతో మిర్చి ఘాటు అ‘ధర’హో అనిపిస్తుంది. చైనా, థాయిలాండ్ నుంచి ఆర్డర్లు మిర్చి అమ్మకాలకు గుంటూరు మార్కెట్ దేశంలోనే పేరు పొందింది. ఏటా జనవరి మొదటి వారంలో సీజన్ ప్రారంభమవుతుంది. నెలరోజులు వేసవి సెలవులు మినహాయిస్తే నవంబర్ వరకు వ్యాపారం జోరుగా సాగుతుంది. ఈసారి బొబ్బర తెగులు, సాగునీటి కొరత వల్ల మిర్చి దిగుబడి భారీగా తగ్గింది. దీనికి తోడు రైతు ఆశించిన ధర దక్కలేదు. సగటున క్వింటాకు రూ.9 వేలు దక్కింది. అయితే ఒక్కసారిగా మిర్చికి అంతర్జాతీయంగా డిమాండ్ ఏర్పడింది. విదేశాలకు గుంటూరు నుంచే ఎక్కువ ఎగుమతులు జరుగుతాయి. ప్రస్తుతం చైనా, థాయిలాండ్ నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. మార్కెట్ యార్డులు, శీతల గిడ్డంగుల్లో సరుకు తక్కువగా ఉండటంతో ధర అమాంతం పెరిగింది. మేలు రకం తేజ క్వింటా ధర రూ.19,500కు చేరింది. మిగిలిన మిర్చి రకాలు కూడా క్వింటా రూ.16 వేలు పలుకుతున్నాయి. క్వింటా రూ.22 వేలకు పెరిగే అవకాశం తేజ రకానికి ఇతర రాష్ట్రాల్లోనే కాకుండా అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. ఈ ఏడాది పచ్చిమిర్చి ధర ఎక్కువగా ఉండటంతో ముందుగానే కోశారు. దీంతో పండు మిర్చి ఉత్పత్తి తగ్గడంతో ధరల పెరుగుదలకు కారణమైంది. పెరుగుదల ఇలాగే కొనసాగితే క్వింటా రూ.22 వేలకు చేరవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 10 లక్షల టన్నుల నిల్వలు ప్రస్తుతం రైతుల వద్ద మిర్చి నిల్వలు తక్కువగా ఉన్నాయి. శీతల గిడ్డంగుల్లో 10 లక్షల టన్నుల మేర నిల్వ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గత మూడు నెలల నుంచి మిర్చి ధరలు పెరుగుతున్నాయి. గతేడాది ఇదే సమయంలో తేజ, బాడిగ రకాలు క్వింటా రూ.13 వేలు, ఇతర రకాలు రూ.8 వేలు పలికాయి. ప్రస్తుతం తాలు రకాలు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం మార్కెట్లోనూ రికార్డు ధర ఖమ్మం వ్యవసాయం: తెలంగాణలోని ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం తేజ రకం మిర్చి క్వింటా ధర రికార్డు స్థాయిలో రూ.20,021లు పలికింది. గురువారం రూ.18,600 ఉండగా.. ఒక్క రోజులో ఏకంగా రూ.1,400లు పెరిగింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నర్సింహాపురం గ్రామానికి చెందిన ఎ.రామారావు నుంచి వ్యాపారులు ఈ ధరకు మిర్చిని కొనుగోలు చేశారు. ఖమ్మం మార్కెట్లో గతేడాది పండించిన పంటను వ్యాపారులు, కొందరు రైతులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వచేశారు. ఆ నిల్వలకు జూన్ నుంచి ధర పెరుగుతూ వస్తోంది. జూన్‌లో రూ.11వేలు పలికిన ధర నవంబర్ నాటికి రూ.20 వేలకు చేరింది. ప్రస్తుతం పంటను ముంబయి, కోల్‌కతా, ఢిల్లీ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. మిర్చికి ఈ స్థాయిలో ధర రావడంతో వ్యాపారులు, రైతులు ఆశ్చర్యపోతున్నారు. ఈ ధర ఇలాగే కొనసాగితే ఈ ఏడాది సాగు చేసిన రైతులకు సిరులు కురుస్తాయని ఆనందంగా చెబుతున్నారు. పెరిగిన ధరలు ఆశలు రేకెత్తిస్తున్నాయి.. మిర్చి ధరలు ఈ స్థాయిలో పెరగడం గతంలో ఎప్పుడూ చూడలేదు.. చాలా సంతోషంగా ఉంది. ధరలు ఇలానే కొనసాగితే రైతులు కష్టాల నుంచి గట్టెక్కడమే కాదు.. లాభాలనార్జిస్తారు కూడా. రెండెకరాలు కౌలుకు తీసుకుని పదేళ్లుగా మిర్చి సాగుచేస్తున్నా. అప్పులు తప్ప మిగిలిందేం లేదు.. ఈ దశలో మిర్చి ధరలు అమాంతంగా పెరగడం ఆశలు రేకెత్తిస్తోంది. మిర్చి రైతులకు మంచి రోజులొచ్చాయనిపిస్తోంది.. – కొక్కెర నాగేశ్వరరావు, విశదల, గుంటూరు జిల్లా -
పని నిల్.. జీతం ఫుల్!
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వంలో అవసరం లేకున్నా మిర్చి యార్డులో 39 మంది సీజనల్ కండీషనల్ కింద ఆపరేటర్లుగా తీసుకున్నారు. వీరిలో అధిక శాతం మంది యార్డుకు రాకుండానే జీతాలు తీసుకునేవారు. ఈ నెలాఖరుతో వీరి రెన్యూవల్ గడువు ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఆపరేటర్లు యార్డు కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మిర్చియార్డులో టీడీపీ ప్రభుత్వ హయాంలో కంప్యూటర్ ఆపరేటర్ల అవసరం లేకున్నా ఇష్టారాజ్యంగా నియమాకాలు చేసుకున్నారు. కొంతమంది వద్ద డబ్బులు తీసుకొని వారిని కంప్యూటర్ ఆపరేటర్లుగా నియమించారు. వీరు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతవరకు, మార్కెట్ యార్డులో పని చేయకుండానే జీతాలు తీసుకుని వెళ్లిపోయారు. కొంతమంది సిబ్బంది గతంలో పనిచేసిన యార్డు చైర్మన్‌కు డ్రైవర్‌గా, పీఏగా, ఫొటోగ్రాఫర్లుగా పనిచేసిన సందర్భాలున్నాయి. మార్కెట్ యార్డులో రికార్డుల ప్రకారం మొత్తం 84 మంది కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు. ఇందులో మార్కెట్ యార్డులో రోజువారీగా లావాదేవీలు, ఎంట్రీ చేసేందుకు 24 మందిని తాత్కాలికంగా నియమించారు. గతంలో జాయింట్ కలెక్టర్ 10 మంది కంప్యూటర్ ఆపరేటర్లను నియమించారు. సీజనల్ కండిషనల్ పేరుతో మరో 39 మందిని నియమించారు. వీరిలో ఎక్కువమంది ఏనాడూ యార్డులోకి వచ్చి పనిచేసిన దాఖలాలు లేవు. జీతాల సమయంలో మాత్రం వచ్చి నెలకు రూ.15 వేలు తీసుకుపోవడం తప్ప వారు చేసే పని ఏమీ ఉండదు. అయితే టీడీపీ ప్రభుత్వంలో యార్డులో పనిచేయకుండా జీతాలు తీసుకున్న వీరు, ప్రస్తుతం ఉద్యోగాలు పోతాయని, రెన్యూవల్ కావేమో అనే భయంతో, యార్డులో కనిపిస్తున్నారు. వీరికి పని లేకపోవటంతో యార్డుకు వచ్చి టైం పాస్ చేసుకొని వెళుతున్నారు. ముగియనున్న రెన్యూవల్ గడువు... మిర్చియార్డుకు జనవరి నుంచి మేనెల వరకు రోజుకు లక్ష టిక్కీలకు పైగా సరుకు వస్తుంది. ఆ సమయంలో సరుకు తూకాలు వేసే సమయంలో వేమెన్ల వద్ద, సరుకు వివరాలను నమోదు చేసేందుకు కంప్యూటర్ ఆపరేటర్లు అవసరమని సాకు చెప్పి సీజనల్ కండిషనల్ పేరుతో 39 మంది ఆపరేటర్లను తీసుకున్నారు. అయితే మార్కెట్ యార్డులో రెగ్యులర్‌గా 24 మంది కంప్యూటర్ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. వారే మిర్చి వివరాలను నమోదు చేస్తున్నారు. గతంలో పనిచేసిన మార్కెటింగ్ కమిషనర్ వీరిని రెన్యూవల్ చేసేందుకు నిరాకరించటంతో, టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆయనపై ఒత్తిడి తెచ్చి, రెన్యూవల్ చేయించారు. ప్రస్తుతం వీరి గడువుఈ నెల 31 వ తేదీతో ముగుస్తోంది. వీరిని కొనసాగిస్తారా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. సీజన్ లోనే తాత్కాలిక సిబ్బందిని తీసుకుంటాం సీజనల్ కండిషనల్ పేరుతో కొంతమంది కంప్యూటర్ ఆపరేటర్లను తీసుకున్నాం. ప్రస్తుతం మిర్చియార్డుకు 34 నుంచి 35 వేల టిక్కీల సరుకు మాత్రమే వస్తోంది. కాబట్టి గతంలో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్లు సరిపోతారు. సీజనల్లో అవసరమైనప్పుడు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని తాత్కాలిక పద్ధతిలో తీసుకుంటాం. – వెంకటేశ్వరరెడ్డి, మార్కెట్ సెక్రటరీ, గుంటూరు -
తరలింపు తప్పనిసరే..
మిర్చి మార్కెట్‌పై త్రీటౌన్ ప్రజల అభీష్టం మేరకే నిర్ణయం ఖమ్మం: మిర్చి మార్కెట్ తరలింపు నిర్ణయం ఏళ్ల నాటిదేనని, దీనికి అందరూ కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని త్రీటౌన్ అభివృద్ధి సమితి సభ్యులు ప్రస్తావించారు. ఈ మేరకు ఖమ్మం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో త్రీటౌన్ అభివృద్ధి సమితి సభ్యులు, కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, డివిజన్ల బాధ్యులు, సీనియర్ నాయకులు ఈ అంశంపై సోమవారం సుదీర్ఘంగా చర్చించారు. మిర్చి మార్కెట్ తరలింపుపై ప్రజలు పదేళ్లుగా ముక్తకంఠంతో వాదిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. తక్షణమే త్రీటౌన్ ప్రాంతం నుంచి తరలించి.. తమ ప్రాణాలను కాపాడాలని వేడుకుంటున్నట్లు వారు వివరించారు. ఇప్పటికే అనేక రకాల శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. త్రీటౌన్‌లో ప్రస్తుతం ఉన్న మిర్చి మార్కెట్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, యుద్ధ ప్రాతిపదికన దీనిని ఇక్కడి నుంచి తరలించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే త్రీటౌన్ ప్రాంతం నుంచి ఎక్కడికి తరలించాలి.. తరలించిన మార్కెట్ స్థానంలో మళ్లీ ఎలాంటి అభివృద్ధి సంస్థను తీసుకురావాలని చర్చించారు. మిర్చి మార్కెట్‌ను త్రీటౌన్ నుంచి రఘునాథపాలెంకు తరలిస్తే అన్ని విధాల, అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంటుం దని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే కొన్ని వర్గాల ప్రజలు, వ్యాపారులు రఘునాథపాలెంలో స్థలం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దృష్టికి తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లా కేంద్రానికి అతి చేరువలో ఉండాలని, దీంతో రవాణాకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో ఉండటం వల్ల అన్ని రకాల సదుపాయాలు, అధికారులు, వ్యాపార లావాదేవీలకు స్పష్టత ఉంటుందన్నారు. దీనికి తగిన ప్రభుత్వ స్థలం రఘునాథపాలెంలో ఉండటం వల్ల అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇక్కడి నుంచి మార్కెట్‌ను తొలగించడం వల్ల ఎవరికీ ఎటువంటి నష్టం జరగదని, నష్టం జరిగేదల్లా కేవలం మిల్లర్స్, కోల్డ్ స్టోరేజీల నిర్వాహకులకేనని గీత వెంకన్న అన్నారు. మార్కెట్‌ను తరలించాలని అన్ని వర్గాల వారు సుముఖత వ్యక్తం చేసినప్పుడు.. మార్కెట్లో ఎలాంటి సంబంధం లేని వారు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. కమీషన్ వ్యాపారులు, రైతులకుగానీ ఎటువంటి నష్టం జరగదని, వారు ఎక్కడికైనా వెళ్లగలరని, స్టోరేజీలు మాత్రం ఎక్కడికి వెళ్లలేవన్నారు. మార్కెట్ తరలింపులో భాగంగా త్రీటౌన్ అభివృద్ధి సమితి కన్వీనర్‌గా మెంతుల శ్రీశైలంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతోపాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. త్రీటౌన్ను అభివృద్ధి చేసుకుందామని, దీనికి ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారం కూడా తీసుకుని అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానని శ్రీశైలం అన్నారు. చర్చలో నున్నా మాధవరావు, కార్పొరేటర్లు పాలడుగు పాపారావు, ప్రముఖ వ్యాపారులు, కోఆప్షన్ సభ్యులు గీత వెంకన్న, మాటూరి లక్ష్మీనారాయణ, నీలం కృష్ణ, నున్నా సత్యనారాయణ, కొత్త వెంకటేశ్వర్లు, పసుమర్తి రామ్మోహన్, రమాదేవి, దడాల రఘు, కొప్పెర ఉపేందర్, తోట వీరభద్రం, రుద్రగాని ఉపేందర్, పోతుగంటి ప్రవీణ్, కనకం భద్రయ్య, తవిడబోయిన గోపాల్, తోట రామారావు, పెనుగొండ ఉపేందర్, మాటేటి రామారావు, కాసర్ల వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. -
జైల్ భరో నిర్వహిస్తాం: రేణుకా చౌదరి
ముదిగొండ: ఖమ్మం జిల్లా ముదిగొండలో కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి మంగళవారం పర్యటించారు. ఖమ్మం మిర్చి మార్కెట్‌పై దాడి ఘటనలో అరెస్టు అయిన చిరుమర్రికి చెందిన రైతు ఆనందరావు కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దమ్ముంటే తన చేతికి బేడీలు వేయాలని సవాల్ విసిరారు. రైతులపై కండిషన్ బెయిల్ ఎత్తివేయకపోతే జైల్ భరోకు పిలుపునిస్తామని హెచ్చరించారు. కాగా, రైతు ఆనందరావును కలిసి రేణుకాచౌదరి రూ.15 వేల సహాయం అందజేశారు. -
ఖమ్మం దిగ్బంధనం
జిల్లా అంతటా 144 సెక్షన్ అమలు - రైతులకు మద్దతుగా ప్రతిపక్షాల ఆందోళన - మార్కెట్‌పై దాడి కేసులో రైతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు - ముదిగొండ ఠాణా ఎదుట భట్టి బైఠాయింపు సాక్షి, ఖమ్మం: మిర్చి మార్కెట్‌పై దాడి ఘటన తో ఖమ్మం జిల్లాను పోలీసులు దిగ్బంధనం చేశారు. మిర్చి మార్కెట్‌పై దాడి ఘటన రాష్ట్ర స్థాయిలో సంచలనం రేకెత్తించడం, సీఎం కేసీఆర్ సీరియస్ కావడంతో పోలీసులు అప్ర మత్తమయ్యారు. రైతుల ఆందోళనకు మద్దతు గా జిల్లాలోకి ప్రతిపక్షపార్టీల ప్రజాప్రతినిధు లు, నేతలు రాకుండా సరిహద్దుల్లోనే చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ వచ్చే నెల 12 వరకు 144 సెక్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లాకు పక్కనే ఉన్న భద్రాద్రి కొత్తగూడెం పోలీసులను కూడా రప్పించి భారీ బందోబస్తు నిర్వహించారు. ప్రతిపక్షాల నిరసన ర్యాలీలు, పార్టీ కార్యాలయాల వద్ద బందోబస్తు, ఆందోళనలు, అరెస్ట్‌లతో శనివారం ఖమ్మం అట్టుడికి పోయింది. మార్కెట్లో భారీ బందోబస్తు నడుమ కొనుగోళ్లను ప్రారంభించారు. ఖమ్మం సరిహ ద్దులోని నాయకన్‌గూడెం వద్ద, కోదాడ వైపు నేలకొండపల్లి వద్ద, వరంగల్ వైపు తిరుమ లాయపాలెం వద్ద చెక్‌పోస్టులు ఏర్పా టు చేసి వాహనాలను తనిఖీ చేశారు. మార్కెట్ ఘటనపై జిల్లాలోని ప్రతిపక్షాలు ఉదయం నుంచే ఆందోళనకు సమాయత్తం కాగా, పోలీసులు ముందస్తుగానే టీడీపీ, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, కాంగ్రెస్ కార్యాల యాల వద్ద నిఘా పెట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యనేతల కదలికలు, పార్టీ శ్రేణుల నిరసనలను కట్టడి చేశారు. దాడి ఘటనలో రైతుల అరెస్టు మార్కెట్ కార్యాలయాలపై దాడి ఘటనలో ముదిగొండ మండలానికి చెందిన చిరుమర్రి, బాణాపురం గ్రామాలకు చెందిన రైతులు ఉన్నారనే ఉద్దేశంతో అక్కడి రైతులను ముదిగొండ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. విషయం తెలిసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ముదిగొండ ఠాణా వద్ద ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు బైఠాయించారు. రైతులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలియడంతో ముదిగొండ, నేలకొండపల్లి, బోనకల్ మండలాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించి ‘‘సీఎం డౌన్‌డౌన్.. రైతు వ్యతిరేకి కేసీఆర్’’అంటూ నినాదాలు చేశారు. రైతులు భారీ సంఖ్యలో వస్తుండటంతో ఏసీపీ సురేశ్‌కుమార్ ఠాణాకు వచ్చారు. పరిస్థితి చేయిదాటుతుందన్న ఉద్దేశంతో భట్టిని అరెస్ట్ చేసి కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసుల అదుపులో లెఫ్ట్ నేతలు సీపీఐ జిల్లా కార్యాలయం నుంచి ప్రదర్శనగా వస్తున్న రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డిని, కార్యకర్తలను బైపాస్‌రోడ్డు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని కొణిజర్ల పోలీస్‌స్టేషన్ కు తరలించారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమో క్రసీ జిల్లా కార్యాలయం నుంచి ప్రదర్శనగా బయలుదేరిన ఆ పార్టీ నేతలు పోటు రంగా రావు, రాయల చంద్రశేఖర్‌లను అదుపులోకి తీసుకుని అనంతరం టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి, విడుదల చేశారు. ఖమ్మం లో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, నేత నామా నాగేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సన్నె ఉదయ్‌ప్రతాప్, నేలకొండ పల్లిలో టీడీపీ నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కూసుమంచిలో బీజేపీ నేత గోలి మధు సూదన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల హైరానా.. మిర్చి మార్కెట్‌ను సందర్శించడానికి టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వస్తు న్నారని తెలుసుకొని పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు పెట్ట డంతోపాటు ఖమ్మంలోని అన్ని వైపులా వాహనాల తనిఖీ చేయించారు. ఎటువైపు నుంచి ఎవరు వస్తున్నారో? ఏం జరుగుతుందో అర్థంకాక పోలీసులు అవస్థలు పడ్డారు. అరెస్ట్‌లతో పార్టీల నేతలు ఆందోళనకు గురయ్యారు. నేలకొండపల్లిలో టీడీపీ, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. కూసుమంచి, పాలేరు, ఖమ్మంరూరల్ ప్రాంతాల్లో, హైదరాబాద్– ఖమ్మం రోడ్లపైకి టీఆర్ఎస్ శ్రేణులు వచ్చి ప్రభుత్వానికి మద్దతుగా నినాదాలు చేశారు.