Mirpet
-
ఆ డబ్బాలతో దడ!
సాక్షి, హైదరాబాద్: పేలుడు...అది చిన్నదైనా, పెద్దదైనా పేరు వినగానే ఒక్కసారిగా ఉలిక్కిపడతారు. ఇటీవల కాలంలో రాజధానిలో తరచుగా చిన్నస్థాయి పేలుళ్లు చోటు చేసుకుంటున్నాయి. అత్యధిక ఉదంతాల్లో క్షతగాత్రులే ఉంటుండగా కొన్ని సందర్భాల్లో మాత్రం మరణాలు సంభవిస్తున్నాయి. ఈ బ్లాస్ట్‌లకు ప్రధానంగా గృహ, వాణిజ్య అవసరాలకు వినియోగించే ఆర్గానిక్ సాల్వెంట్స్ కారణమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సమ్మిళిత పదార్ధాలు కలిగి ఉన్న పెయింట్స్‌ను కొన్ని స్థితుల్లో ఇళ్లల్లో పెట్టుకోవడం ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు. శనివారం కుషాయిగూడ పారిశ్రామికవాడలో పెయింట్ డబ్బా పేలి కూలీ నాగరాజు మృతిచెందిన విషయం విదితమే. పెయింట్ డబ్బాలతోనే సమస్య... నగరంలో చోటు చేసుకుంటున్న ఇలాంటి చిన్న స్థాయి పేలుళ్లకు పెయింట్ డబ్బాలే ఎక్కువగా కారణంగా మారుతున్నాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ రంగులు వాటిలో వాడే థిన్నర్లలో వలటైల్ ఆర్గానిక్ సాల్వెంట్స్‌గా పిలిచే ఎసిటోన్, ఈ రసాయనం కలిపిన ట్వాలిన్ , ఈథర్ వంటివి ఎక్కువగా ఉంటాయి. ఓ పెయింట్ డబ్బా సీల్ తెరిచిన తర్వాత సగం వినియోగించి మిగిలిన సగాన్ని అలానే ఉంచి మూత పెట్టడం పరిపాటి. మరోసారి వినియోగించడానికి పనికి వస్తుందనే ఉద్దేశంతో దాచి పెడుతుంటారు. ఫలితంగా ఆ డబ్బాల్లో ఉండే రంగుల్లోని ఆవిరి స్వభావం కలిగిన రసాయనాలు అందులో ఉన్న గాలిలోని ఆక్సిజన్‌తో కలుస్తూ వ్యాకోచించడానికి ప్రయతి్నస్తాయి. గట్టిగా మూత పెట్టి ఉండటంతో అది సాధ్యం కాక డబ్బా లోపలి భాగంలో వాక్యూమ్ ఏర్పడుతుంది. ఈ స్థితిలో ఉన్న డబ్బా మూతలు సైతం బిగుసుకుపోతాయి. అలాంటి వాటిని తెరవడానికి రాపిడి కలిగించినా, గట్టిగా కొట్టినా చిన్నస్థాయి పేలుడు చోటు చేసుకుంటుంది. ఎక్కువగా బలవుతున్నది వారే... ఇలాంటి డబ్బాల పేలుడు వల్ల క్షతగాత్రులుగా, మృతులుగా మారుతున్న వారిలో ఎక్కువగా చెత్త ఏరుకునే వాళ్లే ఉంటున్నారు. సగం వాడిన పెయింట్ డబ్బాలను సాధారణంగా ఆ వినియోగదారులు కొన్ని రోజుల పాటే భద్రపరుస్తుంటారు. డబ్బా తుప్పు పడుతున్నప్పుడో, కదిలి్చనప్పుడు పెయింట్ శబ్ధం రాకుంటే పూర్తిగా గడ్డ కట్టేసిందనే భావనతోనో, మూత తీయడం సాధ్యం కానప్పుడో వాటిని బయటపారేస్తుంటారు. సాధారనంగా ఒక ఇంటి నుంచి మరో ఇంటికి మారేటప్పుడు, దుకాణాలకు మెరుగులు దిద్దే సమయాల్లోనూ ఇలా చేస్తుంటారు. ఆఖరుకు ఈ డబ్బాలు చెత్తకుప్పల్లోకి వచ్చి చేరతాయి. వీటిని కాగితాలతో పాటు ఏరుకునే చెత్త ఏరుకునేవాళ్లు తీసుకుని వాటిని తెరిచే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కలిగే రాపిడి ఫలితంగా పేలుడు జరిగి కొన్నిసార్లు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ప్లాస్టిక్ డబ్బాలు ఇంకా ప్రమాదం... గతంలో పెయింట్స్‌ను ఇనుప డబ్బాల్లో విక్రయించే వారు. అయితే ఇటీవల కాలంలో దాదాపు అన్ని రకాలైన రంగుల్ని ప్లాస్టిక్ డబ్బాల్లోనే ఉంచి విక్రయిస్తున్నారు. ఇనుప వాటి కంటే ఇవి అత్యంత ప్రమాదకరమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సగం ఖాళీ అయిన ఇనుప డబ్బాలో ఉన్న రంగుకు ఆక్సిజన్ అందుబాటులోకి రాక రసాయనక్రియ జరగదు. కేవలం గడ్డ కట్టడం మాత్రమే జరుగుతుంది. అదే ప్లాస్టిక్ డబ్బాలో ఉంటే ఉన్న చిన్నపాటి సందుల నుంచి ఆక్సిజన్ వెళ్తుంది. దీంతో పాటు ఆర్గానిక్ సాల్వెంట్స్ కొన్ని రోజులకు ప్లాస్టిక్‌తో కలిసి పాలిమరైజేషన్ జరుగుతుంది. ఈ కారణంగా ఏర్పడే వేఫరైజర్ల కారణంగానూ దాన్ని తెరవడానికి ప్రయత్నించినప్పుడు పేలుడు జరిగే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇలాంటి డబ్బాలు ఇంట్లో ఉన్నప్పటికీ పేలుడు ప్రమాదాలు తప్పవని నిపుణులు వివరిస్తున్నారు. ఈ తరహా పేలుళ్లకు ఉదాహరణలు ⇒ మీర్ పేట్ పోలీసుస్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ పోష్ కాలనీలో చెత్త ఏరుకునే నిర్మల ప్లాస్టిక్ డబ్బాను తెరిచే ప్రయత్నం చేసి తీవ్రంగా గాయపడ్డారు. ⇒ నాచారంలో రసాయనంతో కూడిన డబ్బా చేతిలో పేలడంతో ఓ చిన్నారికి గాయాలు అయ్యాయి. ⇒ హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో టిన్ పేలి అలీ అనే వ్యక్తి మరణించాడు. పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే పిల్లర్ నెం.279 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ⇒ బాలానగర్ పరిధిలోని రంగారెడ్డి నగర్లో నీలమ్మ (45) అనే పారిశుద్ధ్య కారి్మకురాలు రసాయనాల డబ్బాలతో కూడి వ్యర్థాల సంచిని శుభ్రం చేసే ప్రయత్నం చేసింది. ఆ సంచిలోని డబ్బా పేలడంతో ఆమె ఎడమ కాలి బొటనవేలు ఛిద్రమైంది. సీల్ తీస్తే వాడేయాలి ఆర్గానిక్ సాల్వెంట్స్ కలిగి ఉండే పెయింట్స్‌ను డబ్బా సీల్ తీసిన తర్వాత పూర్తిగా వాడేయడం ఉత్తమం. అలా కాకుండా కొంత మిగిలితే బయట పారబోయాలి. తర్వాత వినియోగిద్దామనే ఉద్దేశంతో దాచి పెట్టినా, కొన్నాళ్ళకు పారేసినా ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. ఇలాంటి డబ్బాలు తెరవడానికి ప్రయతి్నంచిన ప్రతిసారీ పేలిపోవాలని లేదు. పేలుడుకు చోటు చేసుకోవడానికి అవసరమైన స్థాయిలో సాల్వెంట్స్ రేష్యో తయారైతేనే అలా జరుగుతుంది. ఇలా సగం ఖాళీ అయిన డబ్బాలు ఇంట్లో ఉండి, వాటిని తెరవాల్సిన అవసరం వస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి వాటిని వెంటనే తెరవకుండా కనీసం గంట సేపు చల్లని నీటిలో ఉంచాలి. ఫ్రిజ్ వాటర్‌ను బక్కెట్లో పోసి అందులో ఈ డబ్బాలను వేయాలి. ఇలా చేస్తే అందులో ఉన్న ఆవిరి చల్లబడి మళ్లీ పెయింట్‌గా మారుతుంది. అప్పుడు రాపిడి కలిగిస్తూ తెరిచినా ఎలాంటి ప్రమాదం ఉండదు. – ఫోరెన్సిక్ నిపుణులు -
అత్త ప్రాణం తీసిన ‘కోడలి’ తగాదా
మీర్‌పేట: అత్తాకోడళ్ల మధ్య జరిగిన వివాదంలో కూతురుకు వత్తాసుగా నిలిచిన తండ్రి ఆవేశానికిలోనై వియ్యంకురాలిపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మంగళవారం మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేసీ తండాకు చెందిన జతావత్ ప్రభు (45) ఆటోడ్రైవర్. రెండేళ్ల క్రితం అల్మాస్గూడ వినాయకహిల్స్‌లో నివాసముండే కొర్ర జయరామ్‌కు తన కుమార్తె స్వాతిని ఇచ్చి వివాహం జరిపించాడు. కొంతకాలంగా ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కుమార్తెను చూసేందుకు ప్రభు అతని భార్య శాంతితో కలిసి మంగళవారం వినాయకహిల్స్లోని అల్లుడి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో కూతురు స్వాతి, అత్త లలిత (50)లు గొడవ పడుతుండగా ప్రభు మధ్యలోకి వెళ్లడంతో ఇరువురి మధ్య మాటామాట పెరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైన ప్రభు పక్కనే ఉన్న ఇనుప సుత్తెతో లలితపై దాడి చేయడంతో ఆమెకు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, నిందితుడు ప్రభును అరెస్టు చేసినట్లు ఎస్ఐ గోవిందస్వామి తెలిపారు. -
మీర్పేట్ గ్యాంగ్‌రేప్ నిందితుల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన అమానుషం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నందనవనం కాలనీలో గంజాయి బ్యాచ్ 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాయి. అయితే.. ఈ కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు. ఆరుగురి నిందితులను అరెస్ట్ చేశారు. అబేద్ లాల్ అనే రౌడీషీటర్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, మరో కీలక నిందితుడు పరారీలో ఉన్నట్లు రాచకొండ సీపీ చౌహన్ మీడియాకు వివరాలు వెల్లడించారు. బాలికను బెదిరించడంతో పాటు, దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు గంజాయి కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఏ1 అబేద్ బిన్ ఖాలీద్, ఏ2 తెహసీన్, ఏ3 మంకాల మహేష్ కీలక నిందితులు కాగా, వీరికి ఏ4 నర్సింగ్ ఏ5 అశ్రఫ్, ఏ6 ఫైజల్, ఏ7 ఇమ్రాన్ సహకరించారు. చదవండి: మీర్‌పేట గ్యాంగ్ రేప్ ఘటనపై గవర్నర్ దిగ్భ్రాంతి ఘాతుకం జరిగిందిలా.. హైదరాబాద్ లాల్‌బజార్‌కు చెందిన బాలిక(16) తల్లిదండ్రులిద్దరూ గతంలో చనిపోయారు. దీంతో రెండువారాల కిందట.. తన తమ్ముడితో(14)తో కలిసి మీర్‌పేటలోని ఓ కాలనీకి వచ్చారు. సమీప బంధువైన అక్క దగ్గర ఆశ్రయం పొందుతున్నారు. బాలిక దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. తమ్ముడు ఫ్లెక్సీలు కట్టే పనిచేస్తుంటాడు. సోమవారం ఉదయం 9 గంటలకు బాలిక తన సోదరుడు, మరో ముగ్గురు చిన్నారులతో కలిసి ఇంట్లో ఉన్న సమయంలో ఎనిమిది మంది నిందితులు ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడ్డారు. అప్పటికే గంజాయి మత్తులో ఉన్న ఆ బృందంలోని నలుగురు బాలిక మెడపై కత్తిపెట్టారు. భవనంలోని మూడో అంతస్తులోకి తీసుకెళ్లారు. మిగిలినవారు ఆమె తమ్ముడితోపాటు అక్కడే ఉన్న చిన్నారుల్ని బెదిరించారు. పైకెళ్లిన నిందితుల్లో ముగ్గురు బాలికను కత్తితో బెదిరిస్తూ ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలిసిన బాధితురాలి సోదరి మీర్‌పేట పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం బాలికను సఖి కేంద్రానికి తరలించారు. మొత్తం ఏడు బృందాలలో గాలింపు చేపట్టిన పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై పోక్సో యాక్టు, సెక్షన్ 5జీ రెడ్‌విత్ 6 కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రధాన నిందితుడు మంగళ్‌హాట్‌లో రౌడీషీటర్‌గా ఉన్నాడని సీపీ తెలిపారు. పారిపోయే క్రమంలో.. ‘‘ అష్రఫ్, చిన్నా, మహేశ్, తహిసీన్ అనే నలుగురు అత్యాచారానికి పాల్పడిన తర్వాత రేసుకోర్సు వెనకవైపు ఉన్న ఫైజల్, ఇమ్రాన్ దగ్గరికి వెళ్లారు. వారి మొబైల్స్ తీసుకొని రెండు మూడు కాల్స్ చేసుకొని డిలీట్ చేశారు. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఉమ్నాబాద్ వరకు వెళ్లిపోయారు. అక్కడ రెండు పోలీసు బృందాలు గస్తీ నిర్వహిస్తుండటం చూసి.. తిరిగి వెనక్కి వచ్చేశారు. హైదరాబాద్ నగరంపై వారికి పూర్తి అవగాహన ఉండటంతో వారిని పట్టుకోవడానికి మొత్తం 12 బృందాలను వినియోగించాం. ఈ క్రమంలో వివిధ చోట్ల వారు పోలీసులకు చిక్కారు.’’ చౌహాన్ మీడియాకు తెలిపారు. -
జోరుగా ప్లాస్టిక్ బియ్యం దందా!
మీర్పేట్లో వెలుగుచూసిన ఘటన.. రంగంలోకి అధికారులు హైదరాబాద్: ప్రజారోగ్యం వీధిన పడింది. వ్యాపారులు కాసులకు కక్కుర్తిపడి ప్రజలతో ఆటలాడుకుంటున్నారు. నగరంలోని ఓ దుకా ణాదారు ఆరోగ్యానికి హాని చేసే ప్లాస్టిక్ బియ్యాన్ని విక్రయిస్తున్న వైనం మంగళవారం వెలుగు చూడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కర్మన్ ఘాట్ డివిజన్లోని నందనవనంలో రాకేశ్ చౌదరి అనే వ్యక్తి దుర్గా జనరల్ స్టోర్స్‌ను నిర్వహిస్తున్నాడు. అక్కడే నివాసముంటున్న అశోక్.. రాకేశ్ చౌదరి దుకాణంలో నెల క్రితం బియ్యాన్ని కొనుగోలు చేశాడు. ఆ బియ్యాన్ని వినియోగిస్తున్నప్పటినుంచీ అనారోగ్యం బారిన పడుతుండటంతో అశోక్‌కు బియ్యంపై అనుమానం వచ్చింది. దీంతో మంగళవారం ఆ బియ్యంతో వండిన అన్నాన్ని ముద్దగా చేసి గోడకు కొట్టడంతో అది బంతిలా తిరిగొచ్చింది. దీంతో ఆ బియ్యం ప్లాస్టిక్ బియ్యమేనని నిర్ధారించు కున్న అశోక్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై సంబంధిత అధికారులకు కూడా సమాచారమివ్వగా దుర్గా జనరల్ స్టోర్స్‌తో పాటు ఆ ప్రాంతంలోని మిగతా కిరాణా దుకాణాలపై దాడులు నిర్వహించి బియ్యం నమూనాలను ప్రయోగశాలకు పంపించారు. అశోక్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మీర్పేట్లో కల్తీ నెయ్యి స్వాధీనం