miss behave
-
సీఐ చాంబర్లో కాలుతో తన్ని.. బూతులు తిట్టిన బీజేపీ నేత’
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన ఓ హత్య కేసులో గిరిజనుడిని మాడ్గుల సీఐ పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తుండగా.. అక్కడే ఉన్న బీజేపీ నాయకుడు ఆ గిరిజనుడిని కాలుతో తన్నిన దృశ్యాలు శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాడ్గుల మండలం ఇరి్వన్ పంచాయతీ పరిధిలోని గాంగ్యానగర్‌తండాకు చెందిన వడ్త్యావత్ శంకర్(28) ఏప్రిల్ 19న హత్యకు గురయ్యాడు. ఈ సంఘటనపై మాడ్గుల సీఐ ఉపేందర్‌రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా సీఐ చౌటకుంట తండాకు చెందిన ప్రత్యక్ష సాక్షిగా భావించిన మేరావత్ పాండు అనే వ్యక్తిని ఇటీవల పోలీస్ స్టేషన్‌కు పిలిపించి తన ఛాంబర్లో మాజీ ప్రజాప్రతినిధి, మరో బీజేపీ నాయకుడి ముందు విచారణ చేపట్టారు. విచారణ సమయంలో కుర్చీలో కూర్చున్న బీజేపీ నాయకుడు.. విచారణ ఎదుర్కొంటున్న పాండును వెనక నుంచి కాలుతో తన్నుతూ అసభ్యకరంగా దూషించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ దృశ్యాలను చూసిన గిరిజన సంఘాల నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. కాగా మాడ్గుల పోలీస్ స్టేషన్లో మేరావత్ పాండును కాలితో తన్ని బూతులు తిట్టిన బీజేపీ నాయకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ సంఘం నాయకుడు నేనావత్ హన్మానాయక్‌రాథోడ్ శుక్రవారం డిమాండ్ చేశారు. నేను గమనించలేదు: సీఐ పాండును బీజేపీ నాయకుడు తన చాంబర్లో తన్నినట్లు తాను గమనించలేదని సీఐ ఉపేందర్‌రావు చెప్పారు. దీనిపై పాండు ఫిర్యాదు చేస్తే సదరు నాయకుడిపై చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: దేవరయాంజల్: పేపర్ వార్తల ఆధారంగా జీవోలు ఇస్తారా? -
నిర్మాతపై నటి సంచలన వ్యాఖ్యలు
షూటింగ్ సమయంలో నిర్మాత తనను మానసికంగా వేధించాడని ఇరానీ నటి, బిగ్‌బాస్ ఫేం మందనా కరీమి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్ర నిర్మాత ప్రవర్తించిన తీరు తననెంతో బాధపెట్టిందని వాపోయారు. ప్రస్తుతం మందనా సన్నీలియోన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘కోకో కోలా’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ క్రమంలో షూటింగ్ సమయంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి వివరిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. కోకో కోలా సినిమా నిర్మత మహేంద్ర ధరివాల్, అతని కుమారుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, మానసికంగా వేధింపులకు గురిచేశాడని ఆరోపణలు చేశారు. ఇదంతా కోకో కోలా సినిమా షూటింగ్ చివరి రోజు అయిన దీపావళి ముందు రోజు సెట్లో చోటుచేసుకుందని నటి తెలిపారు. చదవండి: అది నా సినిమా టైటిల్.. ఇచ్చేయ్ ఇటీవల ఓ మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ‘‘గతేడాది నుంచి కోకో కోలా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా షూట్లో పాల్గొన్న నేను మొదటి నుంచి చిత్ర యూనిట్ మొత్తానితో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. ముఖ్యంగా నిర్మాత మహేంద్ర ధరివాల్.. ఎవరైతే సెట్లో పూర్తి అహంకార భావం, ఆధిపత్యం చెలాయించే వ్యక్తి. ఈ వ్యక్తితో ముఖ్యంగా నవంబర్ 13న చేదు అనుభావాన్ని ఎదుర్కొన్నాను. షెడ్యూల్ ప్రకారం దీపావళి ముందు రోజు రాత్రి ఈ సినిమాకి సంబంధించి నా షూటింగ్ చివరి రోజు. అయితే సినిమాలో ఇంకొన్ని బ్యాలెన్స్ ఉన్నాయని.. అందుకు మరో గంట సెట్లోనే ఉండాలని నిర్మాత అన్నారు. కానీ నాకు అదే సమయంలో వేరే మీటింగ్స్ ఉండటంతో కుదరదని చెప్పాను. షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత క్యారీవాన్‌లోకి వచ్చి డ్రెస్ మార్చుకుంటున్నా. చదవండి: ప్రముఖ సినీ గీత రచయిత ప్రేమ పెళ్లి వెంటనే నిర్మాత నేరుగా క్యారీవాన్‌లోకి వచ్చి నాపై గట్టిగా అరవడం ప్రారంభించాడు. నేను బట్టలు మార్చుకుంటున్నా. కాసేపు బయట ఉండండి అని చెప్పిన వినలేదు. క్యారీ వాన్లోనే అరుస్తూ.. ‘నా మాట దాటి బయటకు వెళ్లలేవు. నేను నీకు ఒక గంట ఎక్కువ పని చేయమని అడిగాను. నువ్వు నా మాట విని తీరాలి. ఎందుకంటే నేను నిర్మాత. నీకు డబ్బులు ఇచ్చే వ్యక్తిని’ అని అరుస్తూ తన కొడుకుతో కలిసి అక్కడంతా సీన్ క్రియేట్ చేశాడు. ఆయన అరుపులు విని సెట్లోని వారందరూ నన్ను ఇబ్బందిగా చూశారు. ఒక అర్టిస్ట్‌తో ప్రవర్తించే విధానం ఇదేనా.. అందులోనూ ఒక మహిళతో ఇలా మాట్లాడటం ఎంత వరకు సమంజసం’’. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మందనా వ్యాఖ్యలపై స్పందించిన నిర్మాత మహేంద్ర నటి మాటలను ఖండించారు. షూటింగ్ చివరి రోజు మందనాకు రాత్రి 9 గంటల వరకు షిఫ్ట్ ఉందని, కానీ తను గంట ముందే వెళ్తానని గొడవ చేసిందన్నారు. ఇంకో గంట ఉండాని అభర్ధించినట్లు తెలిపారు. తనను అడిగే వ్యాన్‌లోకి వచ్చానని, అయినప్పటికీ తన మాటలు పెడచెవిన పెట్టి, వీడియోలు తీయడం ప్రారంభించిందని, అందుకే గట్టిగా చెప్పానన్నారు. అంతేగాక ఈ సినిమా ప్రాజెక్టు కోసం ముందుగా తనతో 7 లక్షల రూపాయలు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లు, కానీ తనతో చివరికి 17 లక్షలు వసూలు చేసిందని అన్నారు. అంత మొత్తంలో డబ్బులు ఇచ్చినా తనకు బాధ లేదని కానీ తమతో ఇలా భాద్యతరాహిత్యంగా ప్రవర్తించడం కరెక్టు కాదని హెచ్చరించారు. -
ప్రాణం తీసిన ప్రవర్తన
తిరుపతి క్రైం : చెడు ప్రవర్తనే ఢిల్లీ వాసి మణితుల్లీ (28) పాలిట మృత్యువైంది. యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు పిన తల్లిని వేధింపులకు గురిచేస్తుండడంతో అతని బంధువులు రాడ్డుతో తలపై మోది హత్య చేశారు. ఈ మేరకు నిందితులు నేరాన్ని అంగీకరించారు. తిరుపతి నగరంలోని గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో ఉన్న లాడ్జిలో మంగళవారం జరిగిన హత్య కేసులో నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈస్టు సబ్ డివిజనల్ డీఎస్పీ మునిరామయ్య గురువారం ఈస్టు పోలీసు స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. పంజాబ్‌కు చెందిన మణితుల్లీ (28)కి ఢిల్లీలో బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న చంద్రగిరి మారుతీనగర్‌కు చెందిన యాస్మిన్‌ను 2016 ఆగస్టులో పెళ్లి చేసుకున్నాడని తెలిపారు. వీరు ఈ నెల 24న వీరు తిరుపతికి వచ్చారని తెలిపారు. గోవిందరాజుల స్వామి ఆలయం సమీపంలో ఉడ్‌సైడ్ లాడ్జిలో రూమ్‌ను అద్దెకు తీసుకున్నారని పేర్కొన్నారు. 6వ తేదీ యాస్మిన్ అక్క కూతురు మసుధ, కుమారుడు మసుధర్, అతని స్నేహితుడు తరుణ్‌కుమార్ అలియాస్ ఫయాజ్‌తోపాటు మణితుల్లీ నెల్లూరులోని మైపాడ్ బీచ్‌కు వెళ్లారని తెలిపారు. హత్యకు దారి తీసిన అసభ్య ప్రవర్తన యాస్మిన్ అక్క కొడుకు మసుధర్ స్నేహితుడు తరుణ్‌కుమార్ అలియాస్ ఫయాజ్ హిందూ మతానికి చెందినవాడన్నారు. మసుధను పెళ్లి చేసుకోవాలనుకున్నాడని తెలిపారు. బీచ్‌కు వెళ్లిన సమయంలో మసుధతో మణితుల్లీ అసభ్యంగా ప్రవర్తించడంతో తరుణ్‌కుమార్ అలియాస్ ఫయాజ్ గొడవపడ్డాడన్నారు. యాస్మిన్ జోక్యంతో అప్పటికి గొడవ సద్దుమణిగినా ఢిల్లీకి వెళ్లేలోపు మణితుల్లీని అంతం చేయాలని ఫయాజ్ అనుకున్నాడని పేర్కొన్నారు. 7వ తేదీన యాస్మిన్ భోజనం తెచ్చేందుకు ఇంటికి వెళ్లిందన్నారు. తనకు రూమ్‌లో బో రుగా ఉందని భార్య యాస్మిన్‌కు చెప్పడంతో ఆమె సూచన మేరకు మసుదూర్, అతని స్నేహితుడు తరుణ్‌కుమార్ అలియాస్ ఫయాజ్ హోటల్‌కు వెళ్లారని తెలిపారు. అందరూ కలసి మద్యం తాగారని, ఈ క్రమంలో మణితుల్లీతో తరుణ్‌కుమార్ గొడవ పడ్డాడని వివరించారు. పిన తల్లి యాస్మిన్‌ను వేధిస్తున్నాడంటూ మసుదూర్ కూడా కోపంతో రగిలిపోయాడన్నారు. వారి వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో మణితుల్లీ తలపై బలంగా మోది చంపేశారని తెలిపారు. తర్వాత వారు అక్కడి నుంచి పారిపోయారని తెలిపారు. లాడ్జి సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలం చేరుకుని విచారిస్తుండగా యాస్మిన్ అక్కడకు వచ్చిందన్నారు. ఆమెను విచారించడంతో అసలు విష యం తేలిందన్నారు. మణితుల్లీ మృతదేహాన్ని పోస్టుమార్టం చేసి ఢిల్లీ పోలీసులను సంప్రదించి మృతుడి గురించి తెలిపామన్నారు. ఈ కేసులో యాస్మిన్‌కు సంబంధం లేదని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
వదినతో అసభ్య ప్రవర్తన
హైదరాబాద్, బంజారాహిల్స్: ఓ వ్యక్తి వదినతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆమెపై దాడిచేశాడు. దీంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన మేరకు.. యూసుఫ్‌గూడ సమీపంలోని రహ్మత్‌నగర్‌లో నివసించే జి.కవిత లండన్‌లో ఉండి 2017 జూలైలో హైదరాబాద్‌కు తిరిగి వచ్చింది. ఆమె ఉంటున్న ఫ్లాట్‌లోనే రెండో అంతస్తులో మరిది శషిభూషణ్ కూడా ఉంటున్నాడు. ఈ నెల 1వ తేదీన శశిభూషణ్ ఆమె ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఆస్తి పత్రాలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. ఆమె ఇవ్వకపోవడంతో కక్ష పెంచుకున్న శశిభూషణ్ శనివారం ఉదయం మళ్లీ ఆమె ఇంట్లోకి వెళ్లి తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె కన్ను దెబ్బతిన్నది. తల్లిదండ్రులకు ఫోన్ చేయగా మీ వాళ్లు నన్ను ఏమీ చేయలేరంటూ అసభ్యంగా ప్రవర్తించి చంపేస్తానంటూ బెదిరించాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శశిభూషణ్‌పై కేసులు నమోదు చేశారు. -
ఆరేళ్ల బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన వృద్ధుడు
చినగంజాం: ఆరేళ్ల బాలిక పట్ల ఓ వృద్ధ ప్రబుద్ధుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ ఆవుల వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. సంతరావూరుకు చెందిన ఓ బాలిక స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. ఈ నెల 20వ తేదీన బాలిక తల్లిదండ్రులు పనులకు వెళ్లారు. అదే రోజు మధ్యాహ్నం పాఠశాలలో బాలిక ఆటలాడుకుంటోంది. అదే కాలనీకి చెందిన సుమారు 60 ఏళ్ల వృద్ధుడు దుడ్డు చిన్నబ్బాయి కళ్లు బాలికపై పడ్డాయి. బాలికను పాఠశాల వెనుక తుమ్మ చెట్లలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఓ యువకుడు అటువైపు రావడంతో చిన్నబ్బాయి పారిపోయాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చీరాల డీఎస్పీ ప్రేమకాజల్ తన సిబ్బందితో కలిసి గురువారం బాధితురాలి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. ప్రత్యక్ష సాక్షులను మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితుడిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ పేర్కొన్నారు. -
తెగులు గురువు!
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి ఆదర్శంగా నిలవాల్సిన గురువు అందుకు విరుద్ధంగాప్రవర్తించారు. తెలుగు పాఠాలు చెప్పాల్సిన ఆయన తరగతి గదిలో ప్రేమ పాఠాలు చెప్పడం ప్రారంభించి ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చారు. ఆయన ప్రవర్తనతో ఇబ్బందులు పడిన బాలికలు ఇన్నాళ్లూ సహనం వహించారు. అయితే ఆయనలో మార్పులేదు సరికదా వెకిలి చేష్టలు మరింత ఎక్కువయ్యాయి.దీంతో విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారంతాపాఠశాలను ముట్టడించారు. ఈ సంఘటన కంచిలి మండలం జలంత్రకోట జిల్లా పరిషత్ (ఒడియా) ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ ఘోరంపై స్పందించిన జిల్లా విద్యాశాఖాధికారి సాయిరాం.. ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు ఉపాధ్యాయుడు ఇ.ప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కంచిలి: జలంత్రకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇ.ప్రసాద్ తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఈయన కొన్నాళ్లుగా ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాన్ని విద్యార్థినులు బయటకు చెప్పుకోలేకపోవడంతో దీన్ని అలుసుగా తీసుకున్న ఉపాధ్యాయుడు మరింత రెచ్చిపోయారు. తరగతి గదిలో పాఠాలకు బదులు ప్రేమ పాఠాలు చెబుతూ, చేయకూడని పనులు చేస్తూ అనుచితంగా ప్రవర్తించేవారని పలువురు విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటిపై చేతులు వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడని శుక్రవారం పాఠశాలకు వెళ్లిన మీడియా ఎదుట కన్నీరుమున్నీరై వివరించారు. పాఠాలు బోధించాల్సిన గురువే ఇంతటి దారుణంగా ప్రవర్తిస్తే తమ వేదనను ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. ఆయన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మందలించినా తీరుమారలే..: ఉపాధ్యాయుడు ప్రసాద్ వ్యవహార శైలిపై కొంతమంది విద్యార్థినులు ఇప్పటికే ప్రధానోపాధ్యాయడు జె.బాలకృష్ణ దృష్టికి తెచ్చి ఉన్నారు. దీంతో ఉపాధ్యాయుడ్ని పిలిపించి ఇప్పటికే మందలించారు. అయినా ఆయనలో మార్పురాలేదు. దీంతో విద్యార్థినులంతా ఉపాధ్యాయుడు తీరుపై తల్లిదండ్రులకు చెప్పడంతో రెండు రోజులుగా కొంతమంది వచ్చి ఆందోళన చేస్తున్నారు. శుక్రవారానికి తల్లిదండ్రుల ఆందోళన తీవ్రమైంది. ఉపాధ్యాయుడుపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులంతా పట్టుబట్టారు. మిగిలిన ఉపాధ్యాయులు కూడా గ్రామస్తులతో కలిసి తెలుగు ఉపాధ్యాయుడు ప్రసాద్‌ను గట్టిగా నిలదీశారు. దీంతో దిగివచ్చిన ఆయన చేసిన తప్పును ఒప్పుకున్నారు. క్షమాపణ కోరుతూ లేఖరాశారు. అయితే గ్రామస్తులు మాత్రం శాంతించలేదు. ఉపాధ్యాయుడ్ని కఠినంగా శిక్షిం చాల్సిందేనని పట్టుబట్టారు. విషయం విద్యాశాఖాధికారుల దృష్టికి వెళ్లింది. డిప్యుటీ ఈవో టి.జోగారావు, ఎంఈవో ఎస్. శివరాంప్రసాద్‌లు శుక్రవారం పాఠశాలకు వచ్చి సంఘటనపై ఆరాతీశారు. ఉపాధ్యాయుడ్ని విచారించారు. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జె.బాలకృష్ణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పడంతో గ్రామస్తులు శాంతించారు. ఉపాధ్యాయుడు సస్పెన్షన్: అసభ్యకరంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడు ఇ.ప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ డీఈవో సాయిరాం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని ధ్రువీకరించారు. -
అసభ్య ప్రవర్తనపై రైల్వే ఉద్యోగి అరెస్టు
రాజమహేంద్రవరం సిటీ: రైలులో ప్రయాణిస్తున్న తోటి మహిళా ప్రయాణికురాలిపై అసభ్యంగా ప్రవర్తించి, టిక్కెట్ కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించాడనే ఫిర్యాదుతో అసిస్టెంట్ టెక్నికల్ అధికారి సతీష్‌ను బుధవారం రాజమహేంద్రవరం ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోనికి తీసుకుని అరెస్ట్ చేశారు. అసభ్య ప్రవర్తన నేరం ఆర్పీఎఫ్ పరిధిలో కేసు నమోదుకు అవకాశం లేకపోవడంతో రెండో కేసుగా జీఆర్పీకి అప్పగించారు. ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ రామయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం రాత్రి మచిలీపట్నం–విశాఖపట్నం ప్యాసింజర్ రైల్లో ఎస్–1 బోగీలో ప్రయాణిస్తున్న చోడిశెట్టి అనూషపై అదే రైల్లో ప్రయాణిస్తున్న రైల్వే అసిస్టెంట్ టెక్నికల్ అధికారి సతీష్ అసభ్యంగా ప్రవర్తించడంతో రైల్వే టిక్కెట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిందని, ఆ విషయం అడిగేందుకు వచ్చిన టీసీపై సైతం తిరగబడటంతో తోటి ప్రయాణికుల సహాయంతో 182కు ఫిర్యాదు చేశారన్నారు. రైలు రాజమహేంద్రవరం చేరే సమయానికి ప్లాట్‌ఫామ్ పైకి చేరుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు అప్రమత్తమై సతీష్‌ను అదుపులోనికి తీసుకున్నామన్నారు. టిక్కెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న నేరానికి, టీసీపై ఎదురుదాడికి దిగిన నేరానికి ఉన్నతాధికారుల ఆదేశాలతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఇన్స్పెక్టర్ రామయ్య తెలిపారు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నేరం ఆర్పీఎఫ్ పరిధిలో లేక పోవడంతో ఆ నేరాన్ని ప్రభుత్వ రైల్వే పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు జీఆర్పీ డీఎస్పీ ఎస్ మనోహరరావును వివరణ కోరగా సంఘటన జరిగిన ప్రదేశం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రాంతం లోనిదని, ముద్దాయిని అదుపులోనికి తీసుకుని భీమవరం తరలించినట్లు తెలిపారు. భీమవరం పోలీసులు కేసునమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపనున్నట్లు తెలిపారు. -
అచ్చం నాన్నలా!
క్రైమ్ పేరెంటింగ్ నాన్నకు అమ్మంటే చాలా ఇష్టం. చాలా ప్రేమ కూడా. అందుకే తరచు అమ్మను విసుక్కుంటూ ఉంటాడు. ‘అమ్మ.. మన సొంతం కదా’ అన్నట్లు.. అమ్మను ఎంతమాటైనా అంటుంటాడు! అంటే దీనర్థం ఏమిటి? అమ్మని నాన్న గౌరవించకపోయినా చెల్లుతుందనా?! నాన్న అలా అనుకుంటే.. ఇంట్లో పిల్లలూ అలాగే అనుకునే ప్రమాదం ఉంది. ప్రేమ ఉంటే గౌరవం ఉండాలి. గౌరవం లేకుంటే.. పిల్లలు ఇంట చెడి, రచ్చా చెడుతారు! యథా నాన్న... తథా తనయులు అన్నట్లు.. తయారౌతారు! ఒసేవ్.. చెక్‌బుక్ కనపడట్లేదు.. ఎక్కడ పెట్టి చచ్చావే’’ బెడ్రూమ్లోంచి కోపం, విసుగు, అసహనం కలగలసిన భర్తగారి కేక. వంటింట్లో ఉన్న భార్య చేతిలోపని వదిలేసి కంగారుగా బెడ్రూమ్లోకి పరిగెత్తింది. నా వస్తువులు ఏవీ ముట్టుకోవద్దని చెప్పానా? అన్నీ ఎందుకు సర్దుతావ్? ఏమీ తెలీనప్పుడు తెలీనట్టే ఉండాలి’’ అన్నాడు.. వచ్చీరాగానే వార్డ్‌రోబ్‌లోని ఫస్ట్ షెల్ఫ్‌లో బట్టల మడతలున్న పేపర్ కింద వెదుకుతున్న భార్యను చూస్తూ చిరాగ్గా! నువ్వో పెద్ద మొద్దువి. ఏవి ఎంత ఇంపార్టెంటో తెలియదు. అర్థం చేసుకునే తెలివీ లేదు.. ఎందుకు అన్నిట్లో దూరతావ్.. ’’ అంటూ ఇంకా తిడుతూనే ఉన్నాడు భర్త. చెక్ బుక్ తీసి చేతిలో పెట్టింది భార్య.ఎక్కడ దొరికింది? ఇందాక అక్కడే కదా వెదికాను? నేను పెట్టిన వస్తువులు పెట్టిన చోటే ఉంచు. కలియబెట్టకు అన్నీ’’ తిట్టాడు తనకు దొరకలేదన్న కసితో. ‘‘మీరు పెట్టినచోటే ఉందండీ’’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ పరాభవం తట్టుకోవడం ఆ మొగుడివల్ల కాలేదు. టిఫిన్ దగ్గర తీశాడు. గుర్తుపెట్టుకోండి.. ఇదేంటి ఉప్మానా? లై యా? (పోస్టర్లు అతికించే మైదాపిండి)’’ నోట్లోది ఊస్తూ.. ప్లేట్‌ను తోస్తూ.. అన్నాడు భర్త.ఆయన స్వర తీవ్రతకు.. చేష్టకు బిక్కచచ్చిపోయింది భార్య. ‘‘ఉప్మా ఇలా ఉంటేనే మీకిష్టం కదాని ఎప్పుడూ చేసినట్టే మెత్తగా చేశాను’’ భయపడుతూ జవాబిచ్చింది ఆమె. ‘ఏడిచావ్! ఏమీ చేతకాదు. నీకసలు తిండి దండగ’ అంటూ లేచాడు చేయి కడుక్కోవడానికి.పెళ్లయిన పద్దెమినిదేళ్ల నుంచి ఈ మాట వినీవినీ వేసారిపోయి ఉందేమో ఆ ఇల్లాలు.. ‘‘నాకేం ఊరికినే కూర్చోబెట్టి తిండి పెట్టట్లేదు మీరు. ఇంటెడు చాకిరీ చేస్తున్నా.. మీకు, మీ పిల్లలకు. గుర్తుపెట్టుకోండి’’ అంది కాస్త కటువుగానే వాళ్లాయన ఉప్మాప్లేట్ను టేబుల్ మీద నుంచి తీస్తూ!నాకే ఎదురు చెప్తావా? ఏ పెళ్లాం చేయంది నువ్వు చేస్తున్నావా?’’ అంటూ ఆమె చెంప చెళ్లుమనిపించాడు. తమ గదిలో కాలేజ్‌కి రెడీ అవుతున్న అమ్మాయి, అబ్బాయి మొహమొహాలు చూసుకొని ‘‘మమ్మీ ఎప్పుడూ ఇంతే. డాడీకి అనవసరంగా కోపం తెప్పిస్తుంద’’ న్నట్టుగా తలలాడించారిద్దరూ. నేనూ ఇంట్లో టిఫిన్ తినను. కాలేజ్ క్యాంటీన్ జిందాబాద్’’ అన్నాడు అబ్బాయి. ‘‘నేను కూడా’’ అంది అమ్మాయి. భర్త వెళ్లిపోయాడు. అవమానంతోనే వంటింట్లోకి వెళ్లి పిల్లలకు లంచ్ సర్దసాగింది. టూ మచ్ మమ్మీ.. నాకు వంద, చెల్లికి వంద ఇవ్వూ’’ అంటూ హాల్లోకొచ్చి కేకేశాడు కుమారుడు. ‘‘డబ్బులా.. ఎందుకూ?’’ అంటూ బాక్స్‌లు తీసుకొని వచ్చింది తల్లి.ఆ ఉప్మా మేమూ తినలేం.. క్యాంటీన్లో తింటాం’’ అంటూ కుడి చేయిచాచి వేళ్లను తనవైపు కదిలించసాగాడు ‘ఇవ్వు’ అన్నట్టుగా. మీరూ అలాగే అంటారేంట్రా.. ఎప్పుడూ చేసినట్టే..’’ అని ఆమె సమాధానం చెప్పేలోపే.. ‘‘నీ సోది వినే ఓపికలేదుగానీ ముందు డబ్బులివ్ మమ్మీ’’ అన్నాడు చాలా నిర్లక్ష్యంగా ఏమాత్రం మర్యాద లేకుండా. కొడుకు ప్రవర్తనకు కోపం ముంచుకొచ్చింది అయినా తమాయించుకుంది. ‘‘నా దగ్గరెక్కడుంటాయ్.. మీ డాడీని అడగాల్సింది’’ అంది టిఫిన్ బాక్స్‌లు అందిస్తూ.మమ్మీ దిస్ ఈజ్ టూ మచ్.. ఈ లంచ్ మాత్రం ఎందుకూ? అక్కర్లేదు’’ అన్నాడు కొడుకు బాక్స్‌ను తిరస్కరిస్తూ. నీకూ అక్కర్లేదా?’’ అదే కోపంతో కూతురుని అడిగింది ఆమె.‘‘ప్చ్..’’ అంది తల అడ్డంగా ఊపుతూ. చివుక్కుమంది తల్లి మనసు. లోపలికి వెళ్లి వెదికి వెదికి నూటయాభై రూపాయలు తెచ్చిచ్చింది. చేతిలోంచి విసురుగా లాక్కుంటూ వెళ్లిపోయాడు కొడుకు. వెనకాలే కూతురు. కనీసం బై కూడా చెప్పకుండా. పనిమనిషిలా... నీరసంగా సోఫాలో కూలబడింది ఆ తల్లి. పెళ్లయినప్పటి నుంచీ భర్త పద్ధతి అంతే. కాని పిల్లల తీరే ఆమెకు బాధ కలిగిస్తోంది. ‘ఈ మధ్యయితే మరీ మితిమీరుతున్నారు. తనంటే బొత్తిగా గౌరవం లేకుండా పోతోంది. వాళ్ల మంచి కోసం ఏది చెప్పినా.. చెప్పాలనుకున్నా హీనంగా తీసిపడేస్తున్నారు. వాళ్ల విషయంలో ఏం మాట్లాడబోయినా ‘‘బాగా తెలుసని చెప్పొచ్చావా? వాళ్లు నా పిల్లలు. నేను చెప్పినట్టు వింటారు’’ అని పిల్లల ముందే ఆయన చులకన చేయడం, వాళ్లముందే చేయిచేసుకోవడంతో ఈ ఇంట్లో తన స్థానమేంటో వాళ్లకు అర్థమైపోయింది. కొడుకైతే అచ్చంగా నాన్నకు నకలుగా తయారయ్యాడు. పనిమనిషిలా చూస్తున్నాడు’అని అనుకునేసరికి దుఃఖం పొంగుకొచ్చింది ఆమెకు. ‘కట్టుకున్నవాడికెలాగూ గౌరవం లేదు. కనీసం కన్నపిల్లలైనా విలువిస్తారనుకుంటే తండ్రిని మించిపోయారు. ఛీ.. ఏం బతుకు నాది’ అంటూ ఏడ్చేసింది. అమ్మాయిని కొట్టాడు మధ్యాహ్నం మూడు గంటలప్పుడు.. ప్రణీత్.. మీ అబ్బాయేనా?’’ అంటూ ఫోన్ వచ్చింది శేఖర్‌కి. అవునండీ.. మీరెవరు?’’ అన్నాడు ఆ తండ్రి.‘‘నేను మీ అబ్బాయి కాలేజ్ ఏరియా పోలీస్‌స్టేషన్ సీఐని.. మీరు అర్జెంట్‌గా రావాలి’’ అవతలి నుంచి ‘ఎందుకు.. ఏమైంది’ అని అడిగేలోపే ఫోన్ కట్ చేశారు సీఐ. ఉన్నపళంగా బయలుదేరాడు కంగారుపడుతూ! శేఖర్ వెళ్లేటప్పటికే అతని భార్యా స్టేషన్లో ఉంది. సీఐని విష్ చేసి ‘‘ఏమైంది’’ అని అడుగుతూ ఆమె పక్కన కూర్చున్నాడు. వాళ్లకు ఎదురుగా నుదుటికి బ్యాండెయిడ్ వేసుకొని కూర్చున్న అమ్మాయిని కళ్లతోనే చూపించింది ఆమె. ఇంకేదో అడిగేలోపే.. ‘‘మీ అబ్బాయి ఆ అమ్మాయిని కొట్టాడు’’ అన్నాడు సీఐ.. శేఖర్ సందేహాన్ని తీరుస్తున్నట్టుగా. తన భార్య పక్కనే ఉన్న కొడుకుని, సీఐని, తమకు ఎదురుగా ఉన్న ఆ అమ్మాయిని చూస్తూ అయోమయంగా.. ‘‘అసలు ఏమైంది’’అని అడిగాడు. కొడుకు ఏదో చెప్పబోతుండగా.. ‘‘నువ్వేం చెప్తావ్గానీ ఉండబ్బాయ్’’ అని వారించి ‘‘మీ అబ్బాయి ఆడపిల్లల పట్ల చాలా దురుసుగా బిహేవ్ చేస్తున్నాడండీ.. చాలా అమర్యాదగా మాట్లాడ్తాడు. ఇదివరకే రెండు, మూడుసార్లు మాకే కాదు, ప్రిన్సిపల్ వరకూ కంప్లయింట్స్ వెళ్లాయ్ మీ అబ్బాయి మీద. ఏదో పిల్లలు.. కలిసి చదువుకుంటున్నప్పుడు అలాంటివి ఉంటాయ్.. ఫ్రెండ్లీగా తీసుకోవాలి’ అని అమ్మాయిలకు సర్దిచెప్పాం. ఒళ్లు దగ్గరపెట్టుకొని ఉండమని మీ అబ్బాయికీ వార్నింగ్ ఇచ్చాం. అయినా మార్పులేదు. ఈ రోజు ఏకంగా చెయ్యే చేసుకున్నాడు’’ అని చెప్పింది ఆ అమ్మాయితోపాటు వచ్చిన లెక్చరర్. ‘‘సర్.. ప్రణీత్ మా పట్ల కూడా చాలా మిస్‌బిహేవ్ చేశాడు ఎన్నోసార్లు. నోటికొచ్చినట్టు మాట్లాడ్తాడు. మేం తిరిగి ఏదైనా అంటే.. బూతులు తిడతాడు’’ అని చెప్పింది ప్రణీత్ క్లాస్మేట్ ఇంకో అమ్మాయి. ‘‘ఈ రోజు కూడా అంతే.. చిన్న విషయంలో తన పంతం నెగ్గించుకోవడానికి నాతో ఆర్గ్యూ చేసి.. ఓడిపోతున్నాడనే అక్కసుతో నన్ను తోశాడు సర్. బెంచీ ఎడ్జ్ మీద పడ్డాను. ఐబ్రో మీది చర్మం చిట్లి రక్తం వచ్చింది’’ జరిగింది వివరించింది ఆ అమ్మాయి. ‘‘ఏరా.. అంత మొనగాడివా నువ్వు?’’ అన్నాడు సీఐ.. ప్రణీత్‌ను ఉద్దేశించి. భార్యకు గౌరవం ఇవ్వండి... సర్.. అమ్మాయిలకు పంతమేంటి సర్? నేనేదో సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ‘తప్పు తప్పు’ అని నాకే వంక పెట్టారు. నేను చెప్పినదాన్నే తప్పు పట్టారు. మా ఇంట్లో మా చెల్లి అలా మాట్లాడినా కొడతాను. చివరకు మా అమ్మ ఎదురు చెప్పినా నాకు కోపం సర్. ఆడపిల్లలకు మగవాళ్లతో పోటీ ఏంటి? ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి గాని’’ ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా అన్నాడు ప్రణీత్. తండ్రితో సహా అక్కడున్న వాళ్లంతా అవాక్కయ్యారు వాడి మాటలకు. ప్రణీత్ మైండ్ సెట్ అర్థమైన సీఐ.. కేస్ పెట్టకుండా అమ్మాయికి, లెక్చరర్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ప్రణీత్ మాటలతో వాడి కుటుంబ నేపథ్యాన్ని గ్రహించగలిగింది లెక్చరర్. లాస్ట్వార్నింగ్ ఇస్తూ వాడిని వదిలేస్తున్నట్టు చెప్పింది. ఆ పిల్లలను తీసుకొని వెళ్లబోతూ ‘‘ఇంట్లో మీ భార్యకు గౌరవం ఇవ్వడం నేర్చుకొండి. ఆడపిల్లలతో ఎలా మెలగాలో తెలుసుకుంటాడు మీ అబ్బాయి’’ అని సీరియస్‌గా సలహా ఇచ్చి బయటకు నడిచింది లెక్చరర్. ప్రణీత్ వాళ్లమ్మ భర్త వంక చూసింది. తలదించుకున్నాడతను. ప్రణీత్‌కు కౌన్సెలింగ్ స్టార్ట్ చేశాడు సీఐ. ఆ మాటలు ప్రణీత్ తండ్రి చెవినా పడుతున్నాయ్. నువ్వు గౌరవం ఇస్తేనే నీకు గౌరవం సాధారణంగా మన కుటుంబాల్లో భర్తకు భార్య టేకెన్ ఫర్ గ్రాంటెడ్. కుటుంబ సభ్యుల అందరిముందే ఆమెను విమర్శించడం, తిట్టడం వంటివి చేస్తుంటాడు. ఇది పిల్లల మీద ప్రభావం చూపుతుంది. అందుకే ముందు కుటుంబంలో అందరూ సమానం అనే భావన పిల్లల్లో కలిగించాలి. ఇంట్లో తల్లి, అక్క, చెల్లికి గౌరవం ఇస్తేనే బయట నువ్వు గౌరవం పొందుతావనే విషయాన్ని మగపిల్లలకు బోధించాలి. కుటుంబంలో ప్రేమానురాగాలు, గౌరవం ఇచ్చిపుచ్చుకునే వాతావరణం ఉండాలి. – డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, సైకియాట్రిస్ట్, ల్యూసిడ్ డయాగ్నస్టిక్స్, హైదరాబాద్ - శరాది -
సంస్కృత పాఠశాలలో....విష సంస్కృతి!
పార్వతీపురం టౌన్, న్యూస్‌లైన్: పేరుకే అది సంస్కృత పాఠశాల ....అక్కడ కొంతమంది ఉపాధ్యాయులు ఆ దేవనాగరి భాష నేర్పిన సంస్కృతిని మరిచి, పశువుల కన్నా హీనంగా ప్రవరిస్తున్నారు. చెల్లిగా, మాతృ సమానురాలిగా గౌరవించ వలసిన తోటి ఉపాధ్యాయురాలి పట్ల అత్యంత హేయంగా లైంగిక వేధింపులు కు దిగారు. మానసికంగా తీవ్రంగా వేధించారు. ఆరు నెలల క్రితం వరకూ ఓ టీచర్ వెంటపడితే, అతని నుంచి ఎలాగోలా ఆమె తప్పించుకుంది. ఇప్పుడు పాఠశాలను క్రమశిక్షణలో నడపవలసిన ముఖ్య బాధ్యతలు నిర్వహిస్తున్న హెచ్ఎం దారితప్పాడు. ఆమెను వేధించడం ప్రారంభించాడు, చివరకు భౌతికదాడికి దిగాడు. గతంలో స్థానిక టీఆర్ఎం గర్ల్స్ హైస్కూల్ విద్యార్థినుల పట్ల కూడా అక్కడ కొంతమంది ఉపాధ్యాయులు అసభ్యకరంగా ప్రవర్తించారు. గురుతర బాధ్యతతో మెలగవలసిన ఉపాధ్యాయులే ఇలా ప్రవర్తించడంతో తమ పిల్లల భవిష్యత్ ఏం కావాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. హెచ్ఎంపై ఆ ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కీచక పర్వం వెలుగుచూసింది. చాలా కాలంగా ... స్థానిక మున్సిపాలిటీ సంస్కృత ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉపాధ్యాయురాలిని అక్కడి ప్రధానోపాధ్యాయుడు చాలా కాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. హెచ్ఎం ప్రవర్తనపై ఆమె తోటి ఉపాధ్యాయుల వద్ద మొరపెట్టుకుంది. అయితే వారు తమ నిస్సహాయతను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం తనపై హెచ్ఎం వేధింపులకు, దాడికి దిగినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయమై రాజీ చేసేందుకు కొంతమంది యత్నిస్తున్నట్టు తెలిసింది. గతంలో కూడా ఇదే ఉపాధ్యాయునిని ఇదే స్కూల్లో పనిచేసిన ఓ ఉపాధ్యాయుడు లైంగికంగా వేధించడంతో ఆమె స్థానిక పెద్దలను ఆశ్రయించారు. వారు తీవ్రంగా హెచ్చరించడంతో ఆ ఉపాధ్యాయుడు వేధింపులను విరమించుకున్నట్టు సమాచారం. ఆ తరువాత హెడ్మాస్టర్ వేధిం పులకు పాల్పడుతున్నట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నాం... ఈ విషయమై ఎస్ఐ డి.దీనబంధు వద్ద ప్రస్తావించగా స్థానిక సంకావీధిలోని మున్సిపల్ సంస్కృత పాఠశాలలో పనిచేస్తున్న హెచ్ఎం ఎం.నాగభూషణం తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆ పాఠశాలలో ఓ ఉపాధ్యాయురాలు తమకు ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. రిక్వెస్ట్...దయచేసి వదిలేయండి... ఈ విషయమై హెచ్ఎం నాగభూషణం వద్ద ప్రస్తావించగా రిక్వెస్ట్...దయచేసి వదిలేయండంటూ ప్రాథేయపడ్డారు. హెచ్ఎం కుటుంబ సభ్యులు పట్టణంలోని అధికార పార్టీకి చెందిన ఓ పెద్దమనిషి పేరు చెబుతూ ఫోన్ చేయండంటూ కేకలు వేశారు. ఇప్పటికీ తేలని టీఆర్ఎం గర్ల్స్ హైస్కూల్ వ్యవహారం పార్వతీపురంలో మున్సిపాలిటీలోని టీఆర్ఎం గర్ల్స్ హైస్కూల్లో కొంతమంది విద్యార్థుల పట్ల ఆ పాఠశాల ఉపాధ్యాయులు కొందరు అసభ్యకరంగా ప్రవర్తించారు. బాధితులు నేరుగా ఐటీడీఏ పీఓకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఆ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థినుల పట్ల ఆ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు కీచక చర్యలకు పాల్పడగా, భరించలేని వారు నేరుగా అప్పటి మున్సిపల్ ప్రత్యేకాధికారి, ఐటీడీఏ పీఓ బీఆర్ అంబేద్కర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన మున్సిపల్ కమిషనర్‌కు విచారణకు ఆదేశించగా, రాజకీయ పలుకుబడి కలిగిన ఆ ఉపాధ్యాయులు నేరుగా కమిషనర్‌ను అధికార పార్టీ నేతలతో బెదిరించినట్లు సమాచారం. దీంతో ఆ విచారణ బుట్టదాఖలయినట్లు తె లుస్తోంది. ఇలా ఒకటీ అరా వెలుగు చూసినప్పటికీ రాజకీయ పలుకుబడితో ఉపాధ్యాయులు కీచక చర్యలు మానుకోవడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.