
హైదరాబాద్, బంజారాహిల్స్: ఓ వ్యక్తి వదినతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆమెపై దాడిచేశాడు. దీంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన మేరకు.. యూసుఫ్‌గూడ సమీపంలోని రహ్మత్‌నగర్‌లో నివసించే జి.కవిత లండన్‌లో ఉండి 2017 జూలైలో హైదరాబాద్‌కు తిరిగి వచ్చింది. ఆమె ఉంటున్న ఫ్లాట్‌లోనే రెండో అంతస్తులో మరిది శషిభూషణ్ కూడా ఉంటున్నాడు. ఈ నెల 1వ తేదీన శశిభూషణ్ ఆమె ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఆస్తి పత్రాలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు.
ఆమె ఇవ్వకపోవడంతో కక్ష పెంచుకున్న శశిభూషణ్ శనివారం ఉదయం మళ్లీ ఆమె ఇంట్లోకి వెళ్లి తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె కన్ను దెబ్బతిన్నది. తల్లిదండ్రులకు ఫోన్ చేయగా మీ వాళ్లు నన్ను ఏమీ చేయలేరంటూ అసభ్యంగా ప్రవర్తించి చంపేస్తానంటూ బెదిరించాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శశిభూషణ్‌పై కేసులు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment