Miss Universe 2013
-
విశ్వ సుందరి గాబ్రియెలా
మాస్కో: మిస్ యూనివ ర్స్ కిరీటాన్ని వెనిజువెలా సుందరి మారియా గాబ్రియెలా ఇస్లర్(25) గెలుచుకున్నారు. శనివారం రాత్రి ఇక్కడ జరిగిన ఫైనల్లో 85 మంది అందగత్తెలను తోసిరాజని ఆమె ఈ ఘనతను సాధించారు. మన దేశానికి చెందిన మానసి మోగే టాప్-10లో ప్రవేశించినా.. టాప్-5లోకి చేరలేకపోయింది. 2000లో భారత్‌కు చెందిన లారాదత్తా మిస్ యూనివర్స్‌గా ఎంపికయ్యారు. ఆ తర్వాత ఆ కిరీటం మనకు అందని ద్రాక్షగా మారింది. టీవీ యాంకర్‌గా పనిచేస్తున్న మారియా.. స్పెయిన్ జానపద నృత్యం ఫ్లమెంకోలో దిట్ట. మిస్ యూనివర్స్‌గా ప్రకటించగానే గాబ్రియెలా ఉద్వేగానికి గురై తన శిరసుపై అలంకరించిన విశ్వసుందరి కిరీటం జారిపోతున్న విషయాన్ని కూడా గ్రహించలేకపోయారు. చివరి నిమిషంలో గమనించిన గాబ్రియెలా కిరీటం కింద పడిపోకుండా పట్టుకున్నారు. 2, 3 స్థానాల్లో మిస్ స్పెయిన్ పాట్రిసియా, మిస్ ఈక్వెడార్ కాన్స్టాంజా నిలిచారు. మిలియన్‌డాలర్ల స్విమ్‌సూట్‌లో గాబ్రియెలా మిస్ యూనివర్స్ కిరీటాన్ని సాధించిన గాబ్రియేలా మాస్కోలో విధులు ప్రారంభించారు. ఆదివారం ఆమె ఓ కార్యక్రమంలో మిలియన్ డాలర్ల (దాదాపు రూ.6 కోట్లు) విలువ చేసే స్విమ్‌సూట్‌లో కనువిందు చేశారు. ఈ స్విమ్సూట్ను 900 విలువైన రత్నాలతో రూపొందించారు. దీనికి రక్షణగా సాయుధ గార్డులు ఉన్నారని మిస్ యూనివర్స్ నిర్వాహక సంస్థ అధ్యక్షుడు పాలా షుగార్ట్ చెప్పారు. -
విశ్వసుందరిగా మిస్ వెనెజువెలా
-
విశ్వసుందరిగా మిస్ వెనెజువెలా
శనివారం రష్యా రాజధాని మాస్కోలో జరిగిన మిస్ యూనివర్స్-2013లో గెలుపొందిన అనంతరం అభివాదం చేస్తున్న మిస్ వెనెజువెలా గాబ్రియెలా ఇస్లర్. మిస్ స్పెయిన్ పాట్రికియా యురెనా రోడ్రిగ్జ్ రెండో స్థానంలో నిలవగా, మిస్ ఈక్వెడార్ కాన్స్టాంజా బెజ్ మూడు స్థానంలో నిలిచింది. మిస్ ఇండియా మానసి మోఘే టాప్ టెన్‌లో మాత్రమే స్థానం దక్కించుకుంది. -
మిస్ యూనివర్స్ పోటీలో మానసి మోగి
రష్యాలోని మాస్కోలో జరిగిన మిస్ యూనివర్స్-2013 ప్రిలిమినరీ పోటీలో భారత్ తరఫున మిస్ ఇండియా మానసి మోగి పాల్గొంది. క్రోకస్ సిటీ హాల్లో జరిగిన పోటీలో మానసి వినూత్న దుస్తులతో కనువిందు చేసింది. ఈ నెల 9న శనివారం జరిగే ఫైనల్ పోటీలో మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఏ సుందరీమణి దక్కుతుందో తేలనుంది. ప్రిలిమినరీ పోటీలో స్విమ్ సూట్లో మిస్ ఇండియా మానసి మోగి. మిస్ యూనివర్స్ ప్రిలిమినరీ గ్రూప్ ఫోటో సెషన్ లో పాల్గొన్న సుందరీమణులు. రష్యాలోని మాస్కోలో ఈ నెల 9న జరిగే ఫైనల్ పోటీలో మిస్ యూనివర్స్ 2013 కిరీటం కోసం క్రోకస్ సిటీ హాల్లో పోటిలో ఉన్న సుందరీమణులు. మిస్ యూనివర్స్-2013 మాస్కోలోని గ్రూప్ క్రోకస్ సిటీ హాల్లో జరిగిన ఫోటో సెషన్ లో పాల్గొన్న సుందరీమణులు.