అక్కాచెల్లెళ్లతో మిసెస్ కిల్లర్?
ప్రియాంకా చోప్రా టాప్ హీరోయిన్. కజిన్ బాటలో తాను కూడా ఉన్నత స్థాయికి చేరుకోవడానికి పరిణీతి చోప్రా కృషి చేస్తున్నారు. ఈ అక్కాచెల్లెళ్లిద్దరూ కలిసి నటిస్తే, కచ్చితంగా అది క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. బాలీవుడ్ దర్శకురాలు ఫరా ఖాన్ భర్త శిరీష్ కుందర్ ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా తీయడానికి రెడీ అవుతున్నారట. ‘మిసెస్ కిల్లర్’ టైటిల్‌తో క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారని సమాచారం.