missile experimentation
-
అణ్వస్త్ర సత్తా చాటేందుకే బ్రహ్మోస్ తయారీ
లక్నో: ప్రపంచంలోని ఏ దేశమూ భారత్‌పై దాడికి దిగే సాహసం చేయకూడదనే బ్రహ్మోస్ అణ్వస్త్ర క్షిపణులను తయారుచేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ స్పష్టంచేశారు. లక్నోలో రక్షణ సాంకేతికత, ప్రయోగ కేంద్రం, నూతన బ్రహ్మోస్ ఆయుధ కర్మాగారాలకు రాజ్‌నాథ్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘భారత్ బ్రహ్మోస్ సహా ఇతర ఆయుధాలను తయారుచేస్తోందంటే అర్ధం.. ఇతర దేశాలపై దాడికి సిద్ధమైందని కాదు. కయ్యానికి కాలు దువ్వేందుకు ప్రయత్నించే దేశాలకు భారత తన అణ్వస్త్ర సామర్థ్యాన్ని చాటిచెప్పేందుకే ఇలా క్షిపణులను తయారుచేస్తోంది. భారత్‌కు చెడు చేయాలని పొరుగుదేశం(పాక్) ఎందుకు అనుక్షణం పరితపిస్తోందో నాకైతే అర్ధంకాలేదు’ అని రాజ్‌నాథ్ అన్నారు. బ్రహ్మోస్ యూనిట్ కోసం అడిగిన వెంటనే 200 ఎకరాల స్థలం కేటాయించారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను రాజ్‌నాథ్ అభినందించారు. ఈ రెండు యూనిట్లను డీఆర్డీవో నెలకొల్పుతోంది. యూనిట్లో బ్రహ్మోస్ కొత్త తరం వేరియంట్ క్షిపణులను రూపొందిస్తారు. ఏడాదికి దాదాపు వంద క్షిపణులను తయారుచేస్తారు. -
ఉత్తర కొరియాపై అమెరికా తాజా అనుమానం..
సాక్షి నాలెడ్జ్ సెంటర్: అంతర్జాతీయ సమాజం ఆంక్షలను పెడచెవినపెట్టి క్షిపణి ప్రయోగాలతో దూకుడుగా వ్యవహరిస్తున్న ఉత్తర కొరియా ఆయుధాలకు ఇంధనం ఎక్కడి నుంచి వస్తోంది? ఈ రాకెట్ ఇంధనం మొదట్లో చైనా, రష్యా నుంచి సరఫరా అయ్యేదనీ, ఇప్పుడు ఉత్తర కొరియానే సొంతంగా తయారుచేసుకుంటూ ఉండొచ్చని అమెరికా గూఢచార సంస్థలు భావిస్తున్నాయి. క్షిపణులు, రాకెట్లను ప్రయోగించడానికి అన్సిమిట్రికల్ డైమిథైల్ హైడ్రజైన్ (యూడీఎంహెచ్) అనే శక్తిమంతమైన ఇంధనం అవసరం. కమ్యూనిస్ట్ కొరియాపై ఆంక్షలకు ముందు యూడీఎంహెచ్ను చైనా రష్యాలు గుట్టచప్పుడుకాకుండా అందజేసేవి. ఇప్పుడు ఉత్తర కొరియాయే సొంతగా ఈ ఇంధనం ఉత్పత్తిచేసే స్థాయికి చేరుకుని ఉంటుందని అమెరికా సర్కారు అంచనావేస్తోందని ప్రసిద్ధ అమెరికా దినపత్రిక న్యూయార్క్‌టైమ్స్ వెల్లడించింది. అయితే యూడీఎంహెచ్ తయారీకి అవసరమైన పదార్థాలను చైనా, రష్యా ఇంకా రహస్యంగా రవాణాచేస్తున్నాయా? అనే విషయం తేల్చడానికి అమెరికా ప్రభుత్వం నానా పాట్లు పడుతోందంది. ఒకవేళ అదే నిజమైతే ఈ ముడిపదార్థాల సరఫరాను ఆంక్షల ద్వారా ఆపడానికిగానీ, విద్రోహ చర్యల ద్వారా దెబ్బదీయడానికిగాని ఏంచేయాలనేదానిపై అమెరికా భద్రతా సంస్థలు యోచిస్తున్నాయి. కిమ్ సర్కారే తయారుచేసుకుంటోందా? యూడీఎంహెచ్ సరఫరా కోసం కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం ఇతర దేశాలపై ఆధారపడే దశలో లేదనీ, ఇప్పటికే దీన్ని ఉత్పత్తి చేస్తోందని గూఢచార సంస్థలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని ఎప్పటి నుంచో చెబుతు న్నా అమెరికా సర్కారు పెడచెవిన పెట్టిందని ఈ సంస్థలు అంటున్నాయి. అమెరికాలోని ఏ ప్రాంతాన్నైనా లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేయగల క్షిపణులకు అవసరమైన ఇంధనాన్ని ఉత్తరకొరియా తయారుచేయడం నేర్చుకుందని జార్జి డబ్ల్యూ బుష్ ప్రభుత్వ హయాంనాటి రహస్య డాక్యుమెంట్లలోనే అంచనా వేశారు. కిమ్ ప్రభుత్వం ఇటీవల ప్రదర్శించిన సాంకేతిక సామర్థ్యం చూస్తే ఈపాటికే యూడీఎంహెచ్ ఉత్పత్తిచేయడం ప్రారంభించిందని అనుకోవచ్చని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ప్రతినిధి టిమోతీ బారెట్ చెప్పారు. యూడీఎంహెచ్ తయారీ నిలిపేసిన అమెరికా! యూడీఎంహెచ్ తయారీని చైనా, పలు యూరప్ దేశాలు కొనసాగిస్తుండగా అమెరికాలో 1966లోనే నాసా సలహా మేరకు నిలిపివేశారు. అప్పటి నుంచి అగ్రరాజ్యం తమ ఆయుధాలకు మరింత స్థిరమైన, ఘన ప్రొపెలంట్ ఇంధనాన్ని వినియోగిస్తోంది. తేలికగా మండుతూ వేగంగా ఆవిరైపోయే యూడీఎంహెచ్ ఎంతో ప్రమాదకరమైనది. యూడీఎంహెచ్తో ఎగిరే క్షిపణుల ప్రయోగ సమయంలో ఎందరో కార్మికులు గతంలో మరణించారు. రష్యాలో యూడీఎంహెచ్ను ‘దెయ్యం విషం’ అని పిలుస్తారు. రష్యా లేదా చైనా నుంచి ఉత్తర కొరియాకు సరఫరా ఆగిపోయుంటే, ఈ రసాయనం ఎలా తయారుచేయాలో ఉత్తరకొరియా ఇప్పటికే నేర్చుకుని ఉంటుందని నమ్ముతున్నానని యూడీఎంహెచ్ వంటి ఇంధనాలపై పుస్తకం రాసిన ఇక్హార్ట్ ష్మిడ్ పేర్కొంటున్నారు. ఈ ఇంధనం తయారీ టెక్నాలజీ, యంత్రాలు ఉత్తరకొరియా సంపాదించే ఉంటుందని, పూర్తిగా సొంతంగా ఉత్పత్తి చేసే స్థితికి చేరే క్రమంలో ఎందరో కార్మికులు ప్రాణాలు కోల్పోయి ఉంటారని అమెరికా విదేశాంగశాఖ మాజీ అధికారి వాన్ డీపెన్ అన్నారు. -
అమెరికాతో సమఉజ్జీ
-
అమెరికాతో సమఉజ్జీ
అదే మా లక్ష్యం ► అణు కార్యక్రమం పూర్తి చేస్తా.. ► ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ ప్రతిజ్ఞ సియోల్: సైనిక సంపత్తి విషయంలో అమెరి కాతో సమ ఉజ్జీ కావాలనే లక్ష్యానికి తమ దేశం చేరువగా వచ్చిందని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. ఎన్ని ఆంక్షలు విధించినా వెనక్కి తగ్గేది లేదని, అణ్వాయుధ కార్యక్రమాన్ని పూర్తి చేసి తీరుతానని కిమ్ ప్రతిజ్ఞ చేశారు. ఉత్తరకొరియా అధికారిక మీడి యా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) కిమ్ వ్యాఖ్యలను శనివారం ప్రసా రం చేసింది. తాజా క్షిపణి ప్రయోగంపై కిమ్ పూర్తి సంతృప్తి వ్యక్తంచేసినట్టు కేసీఎన్ఏ తెలిపింది. క్షిపణి సామర్థ్యాన్ని కిమ్ స్వయంగా పరిశీలించినట్టు తెలిపింది. ఈ ప్రయోగం విజయవంతం కావడం దేశ సైనిక సంపత్తిని పెంపొందించిందని కిమ్ వ్యాఖ్యానించినట్టు పేర్కొంది. ఈ మిస్సైల్ వాడేందుకు సిద్ధంగా ఉందని కిమ్ చెప్పారు. అంతర్జాతీయంగా ఆంక్షలు విధిస్తున్నా అణ్వాయుధ కార్యక్రమాన్ని పూర్తి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. అమెరికా వెనకడుగు వేసేలా ప్రతిదాడి చేసేందుకు అణు సామర్థ్యా న్ని సాధించామని, సైనిక సంపత్తిలో అమెరికాకు సమానంగా నిలవాలనేదే తమ లక్ష్యమని, తాజా పరీక్షలతో ఉత్తరకొరియా విషయంలో అమెరికా పాలకులు సైనికచర్య(మిలిటరీ ఆపరేషన్) అనే మాట మాట్లాడేందుకు ధైర్యం చేయరని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని క్షిపణి ప్రయోగాలు చేస్తామని కిమ్ సంకేతాలిచ్చారు. భవిష్యత్తులో చేసే ప్రయోగాలు అర్థవంతంగా, వాస్తవికంగా ఉంటాయని, ఇది దేశ సైనిక సామర్థ్యాన్ని పెంపొందిస్తాయని వెల్లడించారు. కాగా, శుక్రవారం తాము ప్రయోగించింది మధ్య తరహాకు చెందిన ఖండాంతర క్షిపణి హ్వాసంగ్–12 అని ఉత్తరకొరియా శనివారం నిర్ధారించింది. ఈ క్షిపణి జపాన్ మీదుగా 3,700 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పసిఫిక్ మహాసముద్రంలో కుప్పకూలింది. ఉత్తరకొరియా ఇప్పటి వరకూ చేసిన ప్రయోగంలో సుదూర ప్రాంతం ప్రయాణిం చిన క్షిపణి ఇదే. ప్రాంతీయ శాంతికి విఘాతం.. జపాన్ మీదుగా ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం చేయడాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీవ్రంగా ఖండించింది. ఇది తీవ్రమైన రెచ్చగొట్టే చర్యని తప్పుబట్టింది. ఉత్తర కొరియా అణు, క్షిపణి ప్రయోగాల కారణంగా ప్రాంతీయ శాంతి, భద్రతకు విఘాతం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా భద్రతాపరమైన ఆందోళనలకు కారణమవుతోందని పేర్కొంది. భద్రతా మండలి అత్యవసర భేటీ అనంతరం విడుదల చేసిన ప్రకటనలో ఉత్తరకొరియాపై విధించిన ఆంక్షలను అన్ని దేశాలు తక్షణం, పూర్తిగా అమలు చేయాలని సభ్య దేశాలకు సూచించింది. అమెరికా భయపడదు ‘ఉ.కొరియా ముప్పు’పై ట్రంప్ వాషింగ్టన్: అమెరికా, తన మిత్ర దేశాలను ఎవరూ భయపెట్టలేరని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. ఉత్తర కొరియా ముప్పు ఎదుర్కొనేందుకు అమెరికా వద్ద ప్రభావశీల ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని చెప్పారు. అంతర్జాతీయ సమాజం ఆందోళనలను పెడచెవినపెడుతూ ఉ.కొరియా తాజాగా మరోసారి ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన నేపథ్యంలో ట్రంప్ పైవిధంగా వ్యాఖ్యానించారు. ఉ.కొరియాను దీటుగా ఎదుర్కోవడానికి సైనిక చర్యకు దిగే అవకాశాలను పరిశీలిస్తున్నామని అమెరికా రక్షణ శాఖ సలహాదారు హెచ్ఆర్ మెక్‌మాస్టర్ వెల్లడించారు. అమెరికా వైమానిక దళ 70వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ..‘ మీ శక్తి, సామర్థ్యాలను చూసిన తరువాత నా విశ్వాసం ఎప్పుడూ లేనంతగా పెరిగింది. ఉ.కొరియా ముప్పు ఎదుర్కొనేందుకు మనకు ప్రభావశీల, మెరుగైన మార్గాలున్నాయన్న సంగతి అర్థమవుతోంది. బెదిరింపులకు దిగేవారి నుంచి మన ప్రజలు, మిత్రులు, మన సంస్కృతిని కాపాడుకోగలం’ అని అన్నారు. అమెరికా రక్షణ శాఖ మంత్రి మ్యాటిస్ ఉ.కొరియా క్షిపణి ప్రయోగంపై జపాన్ రక్షణ మంత్రి ఒనోడెరాతో ఫోన్లో మాట్లాడారు. ఉ.కొరియా ఆయుధ సంపత్తి సాయుధ సిబ్బంది వాహకాలు 2,500 యుద్ధ ట్యాంకులు 4,060 ఆర్టిల్లరీ, ఎయిర్ డిఫెన్స్ గన్స్ 32,100 సైన్యం 10, 20,000 యుద్ధ విమానాలు 545 హెలికాప్టర్లు 286 ప్రధాన యుద్ధ నౌకలు 3 తీరప్రాంత గస్తీ నౌకలు 383 ల్యాండిగ్‌క్రాఫ్ట్+హోవర్ క్రాఫ్ట్ 267 జలాంతర్గాములు 70.