నేడు ‘కాకతీయ’ అవార్డుల ప్రదానం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ముందుగా ప్రకటించిన మిషన్ కాకతీయ అవార్డులను బుధవారం ప్రదానం చేయనుంది. ఉదయం 11 గంటలకు ఎర్రమంజిల్‌లోని జలసౌధ కార్యాలయంలో ఈ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు మీడియా ప్రతినిధులకు అవార్డులను అందజేస్తారని శాఖ ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్ పాండే మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మిషన్ కాకతీయ అవార్డుల కోసం ప్రభుత్వం ఎంట్రీలను ఆహ్వానించగా..వచ్చిన ఎంట్రీలలో మిషన్ కాకతీయ కార్యక్రమంపై వివిధ పత్రికలు ,టీవీ చానళ్లలో వచ్చిన వార్తలను పరిశీలించి ఉత్తమమైన వాటిని న్యాయనిర్ణేతలు ఎంపిక చేసినట్లు తెలిపారు. అవార్డులు పొందిన జర్నలిస్టులతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన విలేకరులు, బ్యూరో చీఫ్‌లు, న్యూస్ ఎడిటర్లు, ఎడిటర్లు, సీఈవోలు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.