MLA Kona Raghupathi
-
IYRను తొలగించిన విధానం బాధాకరం
-
బ్రాహ్మణులనూ మోసం చేశారు: కోన రఘుపతి
సాక్షి, హైదరాబాద్: బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.500 కోట్లు ఇస్తామని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలోనే పెట్టింది. కానీ తొలి ఏడాది రూ.25 కోట్లు, 2015-16లో రూ.35 కోట్లు ఇచ్చి బ్రాహ్మణులను ఈ ప్రభుత్వం మోసం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోన రఘుపతి ప్రభుత్వాన్ని విమర్శించారు. బుధవారం ఆయన అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. బ్రాహ్మణ వర్గానికి చెందిన ప్రతినిధిగా తాను ఒక్కడినే ఈ సభలో ఉన్నానని, ఇందుకు సంతోషపడాలో, ఈ వర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ బాధపడాలో అర్థం కావడం లేదన్నారు. బ్రాహ్మణులంటే అందరూ పౌరోహిత్యం చేస్తున్నారనుకుంటున్నారు కానీ చాలామంది బ్రాహ్మణ యువతీ యువకులు అడ్వొకేట్ల వద్ద, ఆడిటర్ల వద్ద గుమాస్తాలుగా ఉన్నారన్నారు. సామాజిక సర్వే లేకుండా కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారని, చట్టబద్ధత ఏముంటుందని ప్రశ్నించారు. దివంగత ఎమ్మెల్యేలకు సంతాపం: ఇటీవలి కాలంలో మరణించిన మాజీ ఎమ్మెల్యేలు మెట్ల సత్యనారాయణ, సత్యలింగనాయకర్, డి.సత్యనారాయణ రెడ్డికి శాసనసభ బుధవారం నివాళులు అర్పించింది. సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది. -
వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తే లేదు
బాపట్ల : వైఎస్సార్ సీపీ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష పార్టీయని, వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రజల్లో బలమైన నాయకుడిగా ఎదిగారని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి తెలిపారు. తనకు పార్టీ వీడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక కోన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవిభజన సందర్భంగా ఏర్పడిన పరిస్థితుల్లో ఒక పక్క జిల్లా ఏర్పాటు చేయాలనే దిశగా ప్రయత్నం, ఆ తరువాత వ్యవసాయ కళాశాల చారిత్రక నేపథ్యం ఉన్న బాపట్ల కళాశాలను యూనివర్శిటీగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రెండింటినీ సాధించుకునే తీవ్రతను తెలియజేసేందుకు ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాననే ఆలోచనను వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.1982 నుంచి తన తండ్రి కోన ప్రభాకరరావు బాపట్ల కేంద్రంగా నల్లమడ జిల్లాను ఏర్పాటు చేయాలనే దృఢసంకల్పంతో పనిచేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. జిల్లా కేంద్రం, వ్యవసాయ విశ్వవిద్యాలయం బాపట్లకు తీసుకురావాలనే లక్ష్యంతో తాను పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ రెండు సాధించుకోవటానికి ఏ త్యాగానికైన సిద్ధమని కోన తెలిపారు. తనకున్న పరిచయాలతో నియోజకవర్గ అభివృద్ధికి అందరినీ కలుపుకొని పనిచేస్తున్నట్లు చెప్పారు.