వైఎస్సార్‌సీపీని వీడే ప్రసక్తే లేదు | Never leave ysr cp says MLA Kona Raghupathi | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీని వీడే ప్రసక్తే లేదు

Published Sun, Feb 1 2015 1:44 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

వైఎస్సార్‌సీపీని వీడే ప్రసక్తే లేదు - Sakshi

వైఎస్సార్‌సీపీని వీడే ప్రసక్తే లేదు

బాపట్ల : వైఎస్సార్ సీపీ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష పార్టీయని, వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల్లో బలమైన నాయకుడిగా ఎదిగారని  బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి తెలిపారు. తనకు పార్టీ వీడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక కోన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  రాష్ట్రవిభజన సందర్భంగా ఏర్పడిన పరిస్థితుల్లో ఒక పక్క జిల్లా ఏర్పాటు చేయాలనే దిశగా ప్రయత్నం, ఆ తరువాత వ్యవసాయ కళాశాల చారిత్రక నేపథ్యం ఉన్న బాపట్ల కళాశాలను యూనివర్శిటీగా చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ రెండింటినీ సాధించుకునే తీవ్రతను తెలియజేసేందుకు ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాననే ఆలోచనను వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.1982 నుంచి తన తండ్రి కోన ప్రభాకరరావు బాపట్ల కేంద్రంగా నల్లమడ జిల్లాను ఏర్పాటు చేయాలనే దృఢసంకల్పంతో పనిచేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. జిల్లా కేంద్రం, వ్యవసాయ విశ్వవిద్యాలయం బాపట్లకు తీసుకురావాలనే లక్ష్యంతో తాను పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ రెండు సాధించుకోవటానికి ఏ త్యాగానికైన సిద్ధమని కోన తెలిపారు. తనకున్న పరిచయాలతో నియోజకవర్గ అభివృద్ధికి అందరినీ కలుపుకొని పనిచేస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement