mla lakshman
-
కె. లక్ష్మణ్‌కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ముషీరాబాద్ ఎమ్మెల్యే డా. కె.లక్ష్మణ్‌కు ప్రభుత్వం రెండు రోజుల క్రితం బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. ఇటీవల ఉగ్రవాదుల దాడులు పెరగటం, పాతబస్తీలో ఎన్ఐఏ అరెస్ట్, వారి లిస్టులో పలు రాజకీయ నాయకుల పేర్లు కూడా ఉండటంతో భద్రతను పెంచింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న నేపథ్యంలో ఈ భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. -
అసెంబ్లీలో హరీష్ వ్యాఖ్యలపై రగడ
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో బుధవారం సాయంత్రం మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై రగడ నెలకొంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌పై మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. రైతు సమస్యలపై రెండోరోజు కూడా సభలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా రాధామోహన్‌పై హరీష్ చేసిన వ్యాఖ్యలు నిరాధారమని, రైతు సమస్యలపై సమాధానం చెప్పాల్సి వస్తుందని ప్రభుత్వం తప్పించుకుంటోందని ఆయన అన్నారు. కేంద్రమంత్రి ఎలాంటి ఆరోపణలు చేయలేదని, హరీష్ రావు వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఎమ్మెల్యే లక్ష్మణ్ అన్నారు. ( రైతుల ఆత్మహత్యలకు కుటుంబ సమస్యలు, నపుంసకత్వం కారణమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ వ్యాఖ్యలు చేశారంటూ హరీష్ రావు పేర్కొన్నారు) అంతకు ముందు రైతు సమస్యలపై బీజేపీ ఎమ్మెల్యేలు ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రైతుల మీద కేంద్ర ప్రభుత్వానికి ప్రేమ ఉంటే ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేయాలన్నారు. రైతుల పట్ల ఏ రకమైన మర్యాద ఉందో చెప్పాలంటే తన దగ్గర చాలా సబ్జెక్ట్ ఉందని, మాట్లాడుకుందామంటే అది కూడా చెప్పుకుందామని హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు సమాధానం చెబుతోంటే విపక్షాలు అడ్డుకున్నాయి. -
టీడీపీ హయాంలోనే రైతు ఆత్మహత్యలు
ఉనికి కోసమే ఆ పార్టీ ధర్నా.. ఎమ్మెల్యే రాములు నాయక్, ఎమ్మెల్యే లక్ష్మి ఆసిఫాబాద్ : తెలంగాణలో టీడీపీ ఉనికిని చాటుకునేందుకు ఆ పార్టీ నేతలు ధర్నా చేయనున్నట్లు ప్రకటించారని ఎమ్మెల్సీ రాములు నాయక్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఎద్దేవా చేశారు. ఆసిఫాబాద్‌లో వారిరువురు శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయం దండుగ అన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పుడు తమ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణలోని రైతుల సమస్యల పేరిట ధర్నాకు దిగడం విడ్డూరంగా ఉందన్నారు. అరుుతే, ధర్నా ఇక్కడ కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో చూసుకోవాలని సూచించారు. ఇక టీడీపీ హయూంలోనే రైతుల ఆత్మహత్యలు అధికంగా జరగగా, అనేక పరిశ్రమలు మూసివేసి కార్మికులను రోడ్డున పడేసిన ఘనత, ఆడపిల్లలను అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది టీడీపీ అధికారంలో ఉన్నప్పుడేనని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో రైతుల సమస్యల పేరిట ఈనెల 5న వరంగల్‌లో ధర్నా చేస్తామని టీడీపీ నేతలు ప్రకటించడం సిగ్గుచేటని రాములు, లక్ష్మి పేర్కొన్నారు, కాగా, టీడీపీ నాయకులు రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు తమ పార్టీ హయూంలో జరిగిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఆ పార్టీ నేతలు రైతుల కోసం కాకుండా ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబు వైఖరికి నిరసనగా ధర్నా చేయాలని సూచించారు. టీడీపీ హాయంలో తొమ్మిదేళ్లలో జరగని అభివృద్ధిని ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడాదిలో కాలంలో చేసి ప్రజలు ఆదరణ పొందుతున్నారని తెలిపారు. సమావేశంలో ఎంపీపీ తారాబాయి, జెడ్పీటీసీ ఏమా జి, సింగిల్ విండో చైర్మన్ అలిబిన్ అహ్మద్, నాయకులు గంధం శ్రీనివాస్, ఎండీ.మహమూద్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. పర్యాటక కేంద్రంగా ‘భీమ్ ప్రాజెక్టు’ ఆసిఫాబాద్ : మండలంలోని కొమరం భీమ్ ప్రా జెక్టు జలాశయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేం దుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ రాములు నాయక్ తెలిపారు. మండలంలోని అడ గ్రామం వద్ద ఉన్న భీమ్ జలాశయాన్ని శుక్రవారం ఆయన పరిశీలించా రు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ జిల్లాలో సహజసిద్ధమైన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయని, ఇందులో బీమ్ ప్రాజెక్టు జలాశయం బోటిం గ్ ఏర్పాటుకు అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. దీన్ని పర్యాటక కేంద్రంగా ఏర్పాటుచేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, ఇందులో భాగంగా పర్యాటక శాఖ చైర్మన్ పేర్వారం రాములు ఈనెల 21వ తేదీన జలాశయాన్ని సందర్శించనున్నారని ఆయన తెలిపారు. ఈ పర్యటనలో ఎమ్మెల్సీ వెంట ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎంపీపీ తారాబాయి, జెడ్పీటీసీ ఏమాజి, సింగిల్ విండో చైర్మన్ అలిబిన్ అహ్మద్, నాయకులు గంధం శ్రీనివాస్, ఎండీమహమూద్ తదితరులు ఉన్నారు. -
సభలో టీఆర్ఎస్, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. కాగా శనివారం ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో గందగోళం నెలకొంది. జీరో అవర్‌లో టీఆర్ఎస్, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ శాసనసభాపక్ష నేత లక్ష్మణ్... తెదేపా సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేసే అంశాన్ని పరిశీలించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. లక్ష్మణ్ చేసిన విజ్ఞప్తిని టీఆర్ఎస్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. టీడీపీ సభ్యుడు క్షమాపణ చెబితే సమస్య పరిష్కారం అవుతుందని శాసనసభా వ్యవహారాల శాఖమంత్రి హరీష్‌రావు తెలిపారు. టీడీపీ సభ్యుడు మాట్లాడిన మాటల్లో ఎక్కడా కూడా గౌరవ సభ్యులను కించపరిచే విధంగా లేవని బీజేపీ సభ్యుడు కిషన్‌రెడ్డి అన్నారు. టీడీపీ సభ్యులను ఏ అంశంపై సస్పెండ్ చేశారో స్పష్టం చేయాలని కోరారు. మరోవైపు శాసనమండలిని ఈ నెల 21 వరకు వాయిదా వేస్తున్నట్లు మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు.