తెలంగాణ శాసనసభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. కాగా శనివారం ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో గందగోళం నెలకొంది.
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. కాగా శనివారం ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో గందగోళం నెలకొంది. జీరో అవర్‌లో టీఆర్‌ఎస్, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ శాసనసభాపక్ష నేత లక్ష్మణ్... తెదేపా సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేసే అంశాన్ని పరిశీలించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. లక్ష్మణ్ చేసిన విజ్ఞప్తిని టీఆర్‌ఎస్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు.
టీడీపీ సభ్యుడు క్షమాపణ చెబితే సమస్య పరిష్కారం అవుతుందని శాసనసభా వ్యవహారాల శాఖమంత్రి హరీష్‌రావు తెలిపారు. టీడీపీ సభ్యుడు మాట్లాడిన మాటల్లో ఎక్కడా కూడా గౌరవ సభ్యులను కించపరిచే విధంగా లేవని బీజేపీ సభ్యుడు కిషన్‌రెడ్డి అన్నారు. టీడీపీ సభ్యులను ఏ అంశంపై సస్పెండ్ చేశారో స్పష్టం చేయాలని కోరారు. మరోవైపు శాసనమండలిని ఈ నెల 21 వరకు వాయిదా వేస్తున్నట్లు మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు.