ఉనికి కోసమే ఆ పార్టీ ధర్నా..
ఎమ్మెల్యే రాములు నాయక్, ఎమ్మెల్యే లక్ష్మి
ఆసిఫాబాద్ : తెలంగాణలో టీడీపీ ఉనికిని చాటుకునేందుకు ఆ పార్టీ నేతలు ధర్నా చేయనున్నట్లు ప్రకటించారని ఎమ్మెల్సీ రాములు నాయక్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఎద్దేవా చేశారు. ఆసిఫాబాద్‌లో వారిరువురు శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయం దండుగ అన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పుడు తమ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణలోని రైతుల సమస్యల పేరిట ధర్నాకు దిగడం విడ్డూరంగా ఉందన్నారు. అరుుతే, ధర్నా ఇక్కడ కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో చూసుకోవాలని సూచించారు.
ఇక టీడీపీ హయూంలోనే రైతుల ఆత్మహత్యలు అధికంగా జరగగా, అనేక పరిశ్రమలు మూసివేసి కార్మికులను రోడ్డున పడేసిన ఘనత, ఆడపిల్లలను అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది టీడీపీ అధికారంలో ఉన్నప్పుడేనని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో రైతుల సమస్యల పేరిట ఈనెల 5న వరంగల్‌లో ధర్నా చేస్తామని టీడీపీ నేతలు ప్రకటించడం సిగ్గుచేటని రాములు, లక్ష్మి పేర్కొన్నారు, కాగా, టీడీపీ నాయకులు రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు తమ పార్టీ హయూంలో జరిగిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే, ఆ పార్టీ నేతలు రైతుల కోసం కాకుండా ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబు వైఖరికి నిరసనగా ధర్నా చేయాలని సూచించారు. టీడీపీ హాయంలో తొమ్మిదేళ్లలో జరగని అభివృద్ధిని ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడాదిలో కాలంలో చేసి ప్రజలు ఆదరణ పొందుతున్నారని తెలిపారు. సమావేశంలో ఎంపీపీ తారాబాయి, జెడ్పీటీసీ ఏమా జి, సింగిల్ విండో చైర్మన్ అలిబిన్ అహ్మద్, నాయకులు గంధం శ్రీనివాస్, ఎండీ.మహమూద్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
పర్యాటక కేంద్రంగా ‘భీమ్ ప్రాజెక్టు’
ఆసిఫాబాద్ : మండలంలోని కొమరం భీమ్ ప్రా జెక్టు జలాశయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేం దుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ రాములు నాయక్ తెలిపారు. మండలంలోని అడ గ్రామం వద్ద ఉన్న భీమ్ జలాశయాన్ని శుక్రవారం ఆయన పరిశీలించా రు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ జిల్లాలో సహజసిద్ధమైన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయని, ఇందులో బీమ్ ప్రాజెక్టు జలాశయం బోటిం గ్ ఏర్పాటుకు అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. దీన్ని పర్యాటక కేంద్రంగా ఏర్పాటుచేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, ఇందులో భాగంగా పర్యాటక శాఖ చైర్మన్ పేర్వారం రాములు ఈనెల 21వ తేదీన జలాశయాన్ని సందర్శించనున్నారని ఆయన తెలిపారు. ఈ పర్యటనలో ఎమ్మెల్సీ వెంట ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎంపీపీ తారాబాయి, జెడ్పీటీసీ ఏమాజి, సింగిల్ విండో చైర్మన్ అలిబిన్ అహ్మద్, నాయకులు గంధం శ్రీనివాస్, ఎండీమహమూద్ తదితరులు ఉన్నారు.
టీడీపీ హయాంలోనే రైతు ఆత్మహత్యలు
Published Sat, Aug 1 2015 3:16 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement