జైలు అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం
చంచల్గూడా జైలు అధికారుల తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రవీణ్ రెడ్డి సోమవారం మండిపడ్డారు. తమ పార్టీ అధ్యక్షుడు, లక్షలాది మందికి ప్రతినిధి అయిన వైఎస్.జగన్మోహన్రెడ్డి జైల్లో దీక్ష చేస్తుండగా ఆయన ఆరోగ్యపరిస్థితిని బాహ్య ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం అధికారులకు వుందన్నారు. వాటిపై దృష్టి పెట్టకపోగా జగన్ దీక్ష చేస్తున్నారన్న నెపంతో మిగిలిన వారితో ములాఖాత్‌లు రద్దు చేయడం దారుణమన్నారు. తన బంధువైన సునీల్‌రెడ్డిని కలిసేందుకు చంచల్‌గూడ జైలుకు వచ్చిన ప్రవీణ్‌రెడ్డికి, ములాఖాత్‌కు అనుమతించక పోవడంతో వెనుతిరిగారు.
నిరవధిక నిరహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్‌కు మద్దతు తెలిపేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు చంచల్‌గూడకు చేరుకుంటున్నారు. వైఎస్ జగన్‌కు మద్దతుగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. కొందరు మహిళలు మోకాళ్లపై నడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. సీబీఐ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పుత్తా ప్రతాప్ రెడ్డి, చల్లా మధుసూదన్‌రెడ్డి, ముక్కా రూపానందరెడ్డిల సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారితో పాటు మరో 400 మందిని పోలీసులు అరెస్ట్ చేసి కంచన్‌బాగ్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.