MLA R.K.Roja
-
లోకేష్ సైక్లింగ్ చేసుకుంటున్నాడు: ఎమ్మెల్యే రోజా
-
శ్రీశైలం మల్లిఖార్జునస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా
-
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ఎమ్మెల్యే రోజ జన్మదిన వేడుకలు
-
బాబుతో పొత్తంటే రాజకీయాల నుంచి రిటైర్మెంటే
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న వారంతా రాజకీయంగా ఎంతో నష్టపోయారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో చక్రం తిప్పానని చంద్రబాబు చెప్పుకున్న కాలంలో కూడా ఎవరూ బాగుపడింది లేదన్నారు. ప్రధానిగా పనిచేసిన గుజ్రాల్ ఆ తర్వాత రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్నారని, ఆయన తర్వాత ప్రధాని అయిన దేవెగౌడ పరిస్థితీ అంతేనని చెప్పారు. అనంతరం బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత వాజ్‌పేయి కూడా రిటైర్డ్ అయ్యారని పేర్కొన్నారు. ఇప్పుడేమో కాంగ్రెస్‌తో బాబు పొత్తుకు దిగారని, దీంతో చిన్న వయసులోనే రాహుల్ గాంధీ కూడా తెరమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. రాహుల్ గాంధీ గతంలో రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయనపై చంద్రబాబు రాళ్లు వేయించారని, ఇప్పుడేమో కాంగ్రెస్‌ను తలపై పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ఉరి వేసుకుంటానన్న ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, కాంగ్రెస్‌తో కలిస్తే బట్టలు ఊడదీసి కొడతారన్న మంత్రి అయ్యన్నపాత్రుడు ఇప్పుడేం చేస్తారని ప్రశ్నించారు. రాబోయే కాలంలో కాంగ్రెస్‌లో టీడీపీ విలీనమైనా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నారు. హత్యాయత్నం కేసు నీరుగార్చేందుకు నాటకాలు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును నీరుగార్చేందుకు సీఎం చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని రోజా ధ్వజమెత్తారు. హత్యాయత్నం ఉదంతంలో ఏ–1 ముద్దాయి ముమ్మాటికీ చంద్రబాబేనన్నారు. ప్రజా సంకల్పయాత్రకు విశేష స్పందన వస్తుండటంతో రాజకీయంగా ఆయన్ను ఎదుర్కొనే దమ్ము లేక చంద్రబాబు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. హత్యాయత్నానికి ఉపయోగించింది కత్తి కాదు ఫోర్కు అని చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కొన్ని న్యూస్ ఛానెళ్లు ప్రచారం చేయడం దారుణమన్నారు. హత్యాయత్నం ఘటనపై సీబీఐ విచారణ జరపకుండా ఉండేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కీలక వ్యక్తుల కాళ్లను పట్టుకున్నారని ఆరోపించారు. హత్యాయత్నం ఘటన జరిగిన రెండో రోజు నిందితుడి సోదరుడు తామంతా టీడీపీ అభిమానులం అని చెప్పారని, అయితే సీఎం చంద్రబాబు సామాజిక మాధ్యమాల్లో ఆ కుటుంబమంతా వైఎస్సార్సీపీ అభిమానులంటూ ప్రచారం చేయించడం దారుణమని మండిపడ్డారు. ప్రత్యర్థులను హతమార్చడం బాబుకు అలవాటేనని ఆరోపించారు. ప్రతిపక్ష నేతను కడతేర్చేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించి చివరకు ఫెయిల్ అయ్యారన్నారు. ఆపరేషన్ గరుడ గురించి ఓ చిన్నస్థాయి నటుడు శివాజీ మీడియాకు వివరాలిస్తే వాటిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఆపరేషన్ గరుడ చెప్పిన విధంగానే వరుస ఘటనలు జరుగుతున్నాయని ఇంటెలిజెన్స్ అధికారులను, డీజీపీని పక్కన కూర్చోబెట్టుకొని చంద్రబాబు వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. -
దౌర్భాగ్య పాలనలో మహిళల రక్షణ కరవు
మద్దిలపాలెం(విశాఖ తూర్పు): రాష్ట్రంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు అంతులేకుండా పోతుందని, గాంధీ గారు చెప్పినట్టు అర్ధరాత్రి కాదు కదా పట్టపగలు మహిళలు నడవలేని దౌర్భపాలనలో ఉన్నామని వైఎస్సార్ సీపీ అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త వరుదు కల్యాణి ధ్వజమెత్తారు. మద్దిలపాలెం నగర పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో గత నాలుగు నెలల్లో 281 మంది అత్యాచారాలకు గురయ్యారన్నారు. గుంటూరులోనే నెలరోజుల వ్యవధిలో ఏడుగురు మహిళలు అత్యాచారాలకు గురయ్యారంటే చంద్రబాబు పాలన దారుణంగా ఉందో స్పష్టమవుతుందన్నారు. ఆడపడుచులకు రక్షణ కల్పించడంలో ఘోరంగా విఫలమైన టీడీపీ ప్రభుత్వంపై పోరాటాలు చేస్తున్న ఎమ్మెల్యే రోజాపై అవాకులు చేవాకులు పేలుతున్నారన్నారు. తోటి మహిళా ఎమ్మెల్యే గుండు గీయిస్తానంటూ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ అగౌరవంగా మాట్లాడి మహిళలపై తనకు ఉన్న గౌరవాన్ని చాటుకున్నారన్నారు. గతంలో దళిత మహిళను వివస్త్ర చేసిన బండారు సత్యనారాయణకు మహిళలే బుద్ధి చెబుతారన్నారు. టీడీపీ మరో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సభ్య సమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు చేశారన్నారు. ఈయన మాటలు మహిళలు వింటే వెంకన్నను చెప్పుతో కొడతారన్నారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్లో బుద్దా పాత్ర ఉందని తెలిసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకోకుండా ప్రభుత్వ విప్ పదవి ఇచ్చారన్నారు. కాల్‌మనీ, నారాయణ కాలేజీలో విద్యార్థినుల ఆత్మహత్యల విషయంలోనే ప్రభుత్వం చర్యలు తీసుకుండా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించిందన్నారు. దాచేపల్లి మైనర్ బాలికపై అత్యాచారం ఘటనలో వారి అండగా ఎమ్మెల్యే రోజా పోరాటం వృథా పోలేదన్నారు. రోజా టీడీపీలో ఉన్నప్పడు చేసే పోరాటాలు ప్రజాపోరాటాలు అంటూ పొగిడిన నేతలు నేడు వైఎస్సార్సీపీ తరుపున చేస్తే రాజకీయాలనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రోజాకు ఎమ్మెల్యే బండారు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న క్షమాపణలు చెప్పకుంటే మహిళల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందన్నారు. సమావేశంలో నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరి, రాష్ట్ర అధికార ప్రతనిధి ఎం.శ్రీదేవి, రాష్ట్ర జనరల్ సెక్రటరీలు శ్రీదేవి వర్మ, మళ్ల ధనలత, మహిళా నాయకులు శ్రీదేవి, ఎ.వి.రమణి, శిరిష తదితరులు పాల్గొన్నారు. -
రోజాకు సుప్రీంకోర్టులో ఊరట
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రోజా ఇచ్చిన వివరణ లేఖను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. స్పీకర్ కు ఈ లేఖ అందజేయాలని ప్రభుత్వ తరుపు న్యాయవాదికి ఆదేశించింది. రెగ్యులర్ సెషన్స్ లో లేదా ప్రత్యేక సెషన్స్ లో ఆర్కే రోజా వివరణ లేఖపై నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. శాసన సభ వ్యవహారాలకు కూడా రోజాను అనుమతించాలని ఆదేశించింది. ఎనిమిది వారాల్లోగా రోజా వివరణ లేఖపై నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. రోజా లేఖపై స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే మాత్రం తాము మరోసారి విచారణ చేపడతామని స్పష్టం చేసింది. శాసనసభా పక్ష కార్యాలయంలోకి రోజాను అనుమతించాలని ఆదేశించింది. ఎల్పీ కార్యాలయంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కూడా అనుమతిచ్చింది. అంతేకాకుండా.. చిన్న సమస్యను పెద్దదిగా చేయవద్దని.. సామరస్యంగా పరిష్కరించుకోవాలని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్లు సమచారం. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసిన సుప్రీంకోర్టు కేసు తదుపరి విచారణను ఆగస్టు తొలివారానికి వాయిదా వేసింది. -
వివరణ ఇచ్చేందుకు సిద్ధం
ఎమ్మెల్యే ఆర్.కె.రోజా సాక్షి, న్యూఢిల్లీ: తనపై మోపిన అభియోగాలకు వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని నగరి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ఆర్.కె.రోజా పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఆమె సుప్రీం కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ‘‘కాల్ మనీ సెక్స్ రాకెట్ గురించి పోరాడినందుకు నన్ను టార్గెట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. నాకు వివరణ ఇచ్చుకునేందుకు అవకాశం ఇవ్వలేదు. ఏవిధంగా నన్ను అవమానించారో మీరందరూ చూశారు. ఈరోజు కోర్టులో ప్రభుత్వ న్యాయవాది పీపీ రావు.. ఇదివరకే పిటిషనర్‌కు అవకాశం ఇచ్చామని చెప్పారు. కానీ మాకైతే అవకాశం ఇవ్వలేదు. నేను చంద్రబాబును కామ సీఎం అన్న విషయాన్ని వాళ్లు తప్పుగా భావిస్తున్నారు. ఆ భాషగా గానీ, ఆ ఉద్దేశంతో గానీ నేను అనలేదని ముందు నుంచీ చెబుతూ వస్తున్నా. అప్పట్లో పత్రికలు కాల్‌మనీని కామ అని చెప్పి షార్ట్‌కట్‌లో వేశాయి. కాల్‌మనీపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు తప్ప చంద్రబాబును అగౌరవపరచాలని మేమెప్పుడూ ఆలోచించలేదు. ఇలాంటి చిన్న విషయాలపై వివాదాల కంటే రాష్ట్రం అభివృద్ధిపై దృష్టిపెట్టాలని న్యాయమూర్తులు అన్నారు. నా వివరణ గురించి అడిగారు. నేను చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాను. మా న్యాయవాదికి కూడా చెప్పాను. నేను తప్పు చేయలేదు. అనిత విషయంలో కూడా నేను ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరయ్యాను. నేను అనని మాటలను సబ్ టైటిల్స్‌గా వేశారని చెప్పాను. ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షించాలని కోరాను. నేను చేయని తప్పుకు నన్ను శిక్షించకండి’’ అని పేర్కొన్నారు. రోజా తరపున మరో న్యాయవాది నర్మదా సంపత్ మాట్లాడుతూ.. ‘‘వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా? అని ధర్మాసనం అడిగింది. మేం సిద్ధంగా ఉన్నాం. కేవలం సభా నాయకుడి విషయంలోనే కాకుండా మరో రెండు అభియోగాలకూ ఇది వర్తించాలని కోరాం’’ అని వివరించారు. విచారం వ్యక్తంచేయాల్సిందిగా కోర్టు కోరిందా? వివరణ ఇవ్వాల్సిందిగా కోరిందా? అని మీడియా ప్రశ్నించగా ‘‘ఆమె ఉద్దేశం ఏంటో వివరించాలని చెప్పింది’’ అని వివరించారు.