MLAs protest
-
శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు?
ముంబయి: ఎన్సీపీలో ఇరు వర్గాల మధ్య వివాదం ఇంకా కొనసాగుతోంది. పార్టీలో ఎలాంటి చీలిక రాలేదని సీనియర్ నాయకులు అజిత్ పవార్, శరద్ పవార్లు ప్రకటించినప్పటికీ ఇరుపక్షాల నుంచి ఇంకా విభజనకు సంబంధించిన వివాదాలు కొనసాగుతున్నాయి. శరద్ పవార్ గ్రూప్ ఎమ్మెల్యేలపై అజిత్ పవార్ వర్గం అనర్హత వేటుకు సిద్ధమైంది. ఈ మేరకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గానికి మద్దతు ఇస్తున్నారని ఎమ్మెల్యేల పేర్లు పేర్కొంటూ స్పీకర్‌కు అజిత్ వర్గం ఫిర్యాదు చేసింది. మొదట అజిత్ పవార్ వర్గానికి చెందిన 41 మంది ఎమ్మెల్యేలపై శరద్ పవార్ వర్గం అనర్హత పిటిషన్‌ను దాఖలు చేసింది. దీని తర్వాత అజిత్ పవార్ వర్గం కూడా ఈ చర్యలకు పూనుకుంది. అనర్హత వేటు పిటిషన్లో శరద్ పవార్ వర్గానికి చెందిన జయంత్ పాటిల్, జితేంద్ర అవద్, రోహిత్ పవార్, రాజేష్ తోపే, అనిల్ దేశ్‌ముఖ్, సందీప్ క్షీరసాగర్, మాన్సింగ్ నాయక్, ప్రజక్తా తాన్పురే, రవీంద్ర భూసార, బాలాసాహెబ్ పాటిల్ ఉన్నారు. అనర్హత పిటిషన్ జాబితా నుంచి నవాబ్ మాలిక్, సుమన్ పాటిల్, అశోక్ పవార్, చేతన్ తుపేలను మినహాయించారు. ఎన్సీపీ జాతీయాధ్యక్ష పదవిపై ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ సమక్షంలో ఇరు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. అజిత్ వర్గం పిటిషన్‌పై అక్టోబర్ 6న ఇరువర్గాలను ఈసీ విచారణకు పిలిచింది. పార్టీ జాతీయాధ్యక్షున్ని తాము ఎన్నుకున్నామని అజిత్ వర్గం ఈసీకి పిటిషన్ దాఖలు చేసింది. అజిత్ పవార్ తిరుగుబాటుతో జులైలో ఎన్సీపీలో చీలిక వచ్చింది. తన వర్గం ఎమ్మెల్యేలతో అజిత్ పవార్.. శివ సేన నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతునిచ్చారు. అనంతరం తన వర్గమే నిజమైన ఎన్సీపీ అని ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్సీపీలో ఎలాంటి చీలిక రాలేదని ఇటీవల ఇరుపక్షాల నాయకులు చెప్పారు. అయినప్పటికీ తాజాగా ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇదీ చదవండి: చంద్రయాన్ 3: విక్రమ్ ల్యాండర్, రోవర్ మేల్కొలుపు! -
మీరు తాగొచ్చారు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఊగిపోయిన సీఎం
పాట్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార్ అసెంబ్లీలో ఆగ్రహంతో ఊగిపోయారు. సభలో ఆందోళనలు చేపట్టిన ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీరంతా తాగొచ్చారని గట్టిగా అరిచారు. దీంతో అసెంబ్లీలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బిహార్‌లో 2016లోనే మద్యాన్ని నిషేధించారు. అయితే కల్తీ మద్యం మాత్రం విచ్చలవిడిగా దొరుకుతోంది. ఇది తాగి ఛప్రా సరన్ జిల్లాలో 17 మంది చనిపోయారు. ఇందులో ఆరుగురు మంగళవారమే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయంపైనే ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు సీఎంపై విమర్శలు గుప్పించారు. కల్తీ మద్యాన్ని అరికట్టలేకోయిన సీఎం అసెంబ్లీ ద్వారం వద్ద నిల్చొని ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సభలో నితీశ్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రతిపక్ష నేతల తీరుపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం జరిగింది? కాస్త శాంతియుతంగా ఉండండి. మీరంతా తాగి వచ్చినట్లు ఉన్నారు. అని ఫైర్ అయ్యారు. సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యేలు మళ్లీ నిరసనకు దిగారు. Liquor Ban isn't working... Illegal trader's are selling it Openly... Accept it or Not But Mr. Nitish Kumar is Pushing Bihar Back into JungleRaj.#NitishKumar #Bihar #GOAT𓃵 #NewHigh4TNSports#Messi𓃵 pic.twitter.com/oZ0hC97BhW — Suhani Anand (@SuhaniAnand17) December 14, 2022 ఛప్రా సరన్ జిల్లాలో మంగళవారం చనిపోయిన ఆరుగురి మరణానికి ఇంకా కారణం తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. వీరంతా కల్తీ మద్యం తాగే చనిపోయారనే విషయాన్ని మాత్రం ధ్రువీకరించలేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామన్నారు. కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: కేబినెట్ మంత్రిగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణం -
భోపాల్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
న్యూఢిల్లీ: ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబావుటా ఎగురవేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు, వారిని మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు తరలిస్తోంది. మొత్తం 44 మంది ఎమ్మెల్యేలను విమానం ద్వారా పంపేందుకు సిద్ధం అయింది. మధ్యప్రదేశ్ సీఎంగా కాంగ్రెస్‌కు చెందిన కమల్ నాథ్ ఉండడంతో భోపాల్ సరైన రక్షణ ప్రాంతమని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ వ్యవహారాలను కమల్‌నాథ్‌తో పాటు ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ కూడా పరిశీలిస్తున్నారు. -
అసెంబ్లీలోనే ఎమ్మెల్యేల నిద్ర.. నిరసన కొనసాగింపు
పంజాబ్ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో నిరసన తెలుపుతున్నారు. సోమవారం నాడు సభలో తాము పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన తర్వాతి నుంచి ఇప్పటివరకు వాళ్లంతా అసెంబ్లీలోనే ఉండిపోయారు. నేలమీదే పడుకోవడం, అక్కడే బ్రష్ చేసుకోవడం.. నిరసన కొనసాగించడం.. ఇదీ ఎమ్మెల్యేల కార్యక్రమంగా మారింది. అసెంబ్లీ హాలును ఖాళీ చేసి వెళ్లాలని ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ కోరినా ఎమ్మెల్యేలు మాత్రం పట్టు వీడలేదు. సోమవారం సభ వాయిదా పడిన తర్వాత అసెంబ్లీ నుంచి వెళ్లేందుకు ఎమ్మెల్యేలు నిరాకరించారు. అధికారంలో ఉన్న అకాలీదళ్ - బీజేపీ ప్రభుత్వంపై తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మీద మళ్లీ కొత్తగా చర్చ మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ అధికారులు మొత్తం లైట్లు, ఏసీలు ఆపేశారని, తమకు చాలా సేపటి వరకు కనీసం తిండి, నీళ్లు కూడా లేవని ప్రతిపక్ష నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీ చెప్పారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అసెంబ్లీ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేలు మొబైల్ ఫోన్ల నుంచి వచ్చే వెలుతురులోనే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ.. తమకు తామే గాలి విసురుకుంటూ గడిపారు. వచ్చే సంవత్సరం పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దాంతో ఇదే చిట్టచివరి సమావేశం కావడంతో ఎలాగైనా ప్రజల దృష్టిని ఆకట్టుకోవాలని కాంగ్రెస్ ఈ వ్యూహం రచించింది. మంగళవారం బక్రీద్ సెలవు కాగా, బుధవారంతో అసెంబ్లీ ముగిసిపోతుంది. సీనియర్ ఎమ్మెల్యేలు చాలామంది వెళ్లిపోయినా.. యువ ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీలోనే ఆగిపోయారు. కాంగ్రెస్‌కు పంజాబ్‌లో మొత్తం 42 మంది ఎమ్మెల్యేలున్నారు. వారిలో 27 మంది నిరసనలో పాల్గొన్నారు. వాళ్లందరికీ పంజాబ్ పీసీసీ చీఫ్ అమరీందర్ సింగ్ కేఎఫ్‌సీ నుంచి ఆహారం పంపారు. -
రోడ్డెక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
-
రోడ్డెక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్ : రేషన్ సరుకులకు ఆధార్ అనుసంధాన్ని తొలగించాలంటూ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రోడ్డెక్కారు. హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఎల్బీనగర్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, రాజేందర్, కూన శ్రీశైలంగౌడ్, రాజిరెడ్డి కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. జిల్లాలో 14 వేల కుటుంబాలకు ఈ నెల రేషన్ అందక అవస్థలు పడుతున్నారని, ఆధార్ లింక్ పెట్టి రేషన్ కోటాలో కోత విధించడంపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ కార్డుదారులందరికీ సరుకులు ఇస్తామని జాయింట్ కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యేలు ఆందోళన విరమించారు. -
స్పీకర్ ఛాంబర్ వద్ద ఎమ్మెల్యేల భైఠాయింపు
హైదరాబాద్ : తెలంగాణ ప్రాంత కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సోమవారం స్పీకర్ ఛాంబర్ ఎదుట బైఠాయించారు. తక్షణమే బీఏసీ ఏర్పాటు చేసి బిల్లుపై చర్చ జరపాలంటూ డిమాండ్ చేశారు. విభజన బిల్లుకు సహకరించాలని వారు నినాదాలు చేశారు. మరోవైపు బిల్లును సభలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ సీమాంధ్ర ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. కాగా సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు... స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఉన్నారు.