mlc Somu Veerraju
-
ఏపీ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ సోమువీర్రాజు ఫైర్
-
మోదీ అభివృద్ధిని దుష్టశక్తులు అడ్డుకుంటున్నాయి
రాజమహేంద్రవరం రూరల్: ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి రాష్ట్రంలో కనపడనీయకుండా కొన్ని దుష్టశక్తులు అడ్డుకుంటున్నాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. తనను ఇబ్బంది పెట్టేందుకు కొంత మంది శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. అలాంటి వాటికి తాను భయపడబోనన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో సోమవారం సోము వీర్రాజు విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో శ్మశాన వాటికలు, అంగన్వాడీ భవనాలు, చంద్రన్న బాట పేరుతో వేసే సీసీ రోడ్లు, స్వచ్ఛభారత్ తదితర పథకాలకు ఖర్చు పెట్టే నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవేనని సోము వీర్రాజు పేర్కొన్నారు. -
టీడీపీపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయనగరం: టీడీపీపై మిత్రపక్షం బీజేపీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ మిత్రధర్మం పాటించడం లేదని, కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నా.. అది టీడీపీ ప్రభుత్వం చేస్తున్నట్టు చూపిస్తోందని విమర్శించారు. జిల్లాలోని జియ్యమ్మవలస మండలం పెదమేరంగి కూడలిలో జరిగిన బీజేపీ బూత్ కమిటీ సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. 'కురుపాం నియోజకవర్గంలో బీజేపీనే పోటీ చేస్తుంది. మేము మిత్రధర్మం పాటిస్తున్నాం కానీ, టీడీపీ పాటించటం లేదు. రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోదీ ప్రాధాన్యమిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి వినియోగిస్తున్న నిధులన్నీ కేంద్రానివే. రాష్ట్రంలో నిధులు సేకరణపై శ్వేతపత్రం విడుదల చేయాలి' అని ఆయన ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. తాము చేసిన అభివృద్ధిని టీడీపీ ప్రభుత్వం చేస్తున్నట్లు చూపించడానికి ప్రయత్నం జరుగుతోందని, ప్రజలందరూ దీనిని గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం చేసిన మోసాన్ని తాము ఎప్పటికీ మర్చిపోమమని అన్నారు. తనవి ఆరోపణలు కాదు, వాస్తవాలని అన్నారు. పాఠశాల మరుగుదొడ్ల నిర్వహణకు ప్రతి జిల్లాకూ రూ. 6 నుంచి 7 కోట్లు ఇస్తున్నామని, కానీ, ఈ నిధులు దుర్వినియోగమవుతున్నాయని విమర్శించారు. సీఎం దావోస్ పర్యటనలో అనేక ఒప్పందాలు కుదుర్చుకోవడానికి కారణం ప్రధాని మోదీనే అని అన్నారు. 1995 నుంచి 2014 వరకు చంద్రబాబు పాలించినకాలంలో కరెంట్ కొరత ఉండేదని, కానీ మోదీ వచ్చాక కరెంట్ కొరత లేదని అన్నారు. కేంద్రం ఇస్తున్న అభివృద్ధి నిధులను టీడీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం చెప్పుకుంటున్న ఎన్టీఆర్ జలసిరి పథకం నిజం కాదని, బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న సోలార్ పంపు సెట్లనే ఆ పథకం కింద ఇస్తున్నారని అన్నారు. చంద్రన్న బీమా తమ ఘనతగా చంద్రబాబు చెప్పుకుంటున్నారని, ఆ పథకంలో రాష్ట్ర ప్రభుత్వానిది ఒక్క రూపాయి కూడా లేదని, రూ. 170 కోట్లు వరకు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిందని, అది కేంద్రం పథకమేనని అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను సక్రమంగా ఖర్చు చేస్తే రాష్ట్రం ఇంకా ముందంజలో ఉంటుందని, మోదీ ఇస్తున్న ప్రతి పథకానికి ఎన్టీఆర్ పేరు పెట్టి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. -
చంద్రబాబు తీరు కరెక్ట్ కాదు : ఎమ్మెల్సీ సోమువీర్రాజు
సాక్షి, కాకినాడ : పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్రంగా తప్పుబట్టారు. కాకినాడలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం తెలిపిన అభ్యంతరాలను ఏపీ ప్రభుత్వమే పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. అనవసర రాజకీయాలు చేయకుండా.. ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని చంద్రబాబును ఆయన కోరారు. ఇది కూడా చదవండి... పోలవరంపై చేతులెత్తేసిన చంద్రబాబు నిన్న చంద్రబాబు చేసిన ప్రకటనపై వీర్రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం సహకరిస్తేనే అనే పదం సీఎం వాడటం సరికాదని.. సకాలంలోనే సహకరిస్తేనే ప్రాజెక్టు 60 శాతం పూర్తయిందన్న విషయం గుర్తుంచుకుంటే మంచిదని ఆయన చెప్పారు. ’’పోలవరంపై రాజకీయం వద్దు. టెండర్ల విషయంలో అనవసర గందరగోళం సృష్టించొద్దు. ప్రాజెక్టు విషయంలో కమిట్ మెంట్‌తో పని చేస్తున్నది బీజేపీ మాత్రమేనని ఆయన చెప్పారు. గతంలో రాజ్యసభలో ముంపు మండలాలపై అప్పటి బీజేపీ సీనియర్ నేగా ఉన్న వెంకయ్యనాయుడు ఒక్కరే మాట్లాడారని.. అప్పుడు టీడీపీ తరపున ఎంపీలుగా ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు సమన్యాయం అంటూ కిక్కురుమనకుండా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా వీర్రాజు గుర్తు చేశారు. కేంద్రపై నెపం నెట్టేయటం మంచి సంప్రదాయం కాదని చంద్రబాబుకు ఆయన హితవు పలికారు. సమస్యలను అధ్యయం చేసి ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పారు. చాతగాక కేంద్రానికి వెనక్కి ఇచ్చేస్తాం అన్న సీఎం తీరు సరికాదని సోమువీర్రాజు తెలిపారు. జలీల్‌ఖాన్‌కు ఆ అర్హత లేదు : విష్ణువర్ధన్ రెడ్డి అనంతపురం : కోట్లు తీసుకుని పార్టీ ఫిరాయించిన జలీల్‌ఖాన్‌కు పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత లేదని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు. అవసరమైతే అడుక్కుని అయినా పోలవరం ప్రాజెక్టు కోసం నిధులు సేకరిస్తామని నిన్న జలీల్‌ఖాన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. జలీల్ ఖాన్ నోరు అదుపులో పెట్టుకోవాలని.. పోలవరాన్ని కేంద్రమే పూర్తి చేసి తీరుతుందని విష్ణువర్ధన్ చెబుతున్నారు. -
చంద్రబాబు తీరు కరెక్ట్ కాదు
-
ఏపీలో పాలనపై బీజేపీ ఎమ్మెల్సీ ధ్వజం
కడప: రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పరిపాలన అదుపు తప్పిందని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. బుధవారం వైఎస్సార్ జిల్లా కడపలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని ఆరోపించారు. నదులు, వాగులు, వంకలు అనే తేడా లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారని మండిపడ్డారు. అలా తరలించిన ఇసుకను బెంగళూరు తదితర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయించి రూ.కోట్లు కొల్లగొడుతున్నారని తెలిపారు. సిమెంట్, స్టీల్ ధరలు అమాంతంగా పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. సిమెంట్ ధరలను పెంచి విక్రయాలు జరుపుతుంటే ప్రభుత్వం చూస్తూ ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరతను సృష్టించడం వల్లనే ధరలు సామాన్యులకు అందకుండా పోతున్నాయని వ్యాఖ్యానించారు. కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. మార్కెట్లో కిలో బియ్యాన్ని ప్రజలు ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. అలాంటిది పొలంలో పండించిన వరికి ఎందుకు గిట్టుబాటు లభించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిపాలన అదుపుతప్పడంతోనే ఇలా జరుగుతోందన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే పరిస్థితులు మరింతగా దిగజారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే ఇక్కడ బీజేపీ బలపడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వచ్చేనెల 25న విజయవాడలో జరిగే కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హాజరవుతారని తెలిపారు. -
ప్రధాని ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర
టీడీపీతో సహా అన్ని పార్టీలతో అభివృద్ధిపై చర్చకు సిద్ధం బీజేపే సీనియర నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు నెల్లూరు(బారకాసు): ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశంలోని పదకొండు రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో ఉద్యమాలు చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రతిపక్షాలు కుట్ర పన్నాయని బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. నెల్లూరులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా అనే అంశాన్ని ప్రజల సెంటిమెంట్‌గా మార్చి దాంతో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తున్నాయన్నారు. కేంద్రంలో అవినీతి రహిత, అభివృద్ధి సహిత ప్రభుత్వం ఉండటంతో వీరి ఆటలు సాగడం లేదన్నారు. దేశంతో పాటు ప్రపంచంలో నరేంద్ర మోదీ ప్రతిష్ట పెరుగుతోందన్నారు. అభివృద్ధి అనే అంశంపై టీడీపీతో సహా ఇతర పార్టీలతో బహిరంగ చర్చకు తాము సిద్ధమని వీర్రాజు ప్రకటించారు. విభజనలో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్రం తగిన కసరత్తు చేస్తోందన్నారు. ఆంధ్రా ప్రజలకు న్యాయం చేయాలనే తపనతో కేంద్రం ఉందన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తోందని వెల్లడించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమీ సాయం చేయడం లేదని వివిధ పార్టీల నేతలు ఆరోపించడం సరికాదన్నారు. కేంద్రం సాయం చేయడం లేదని టీడీపీ నేతలే ఆరోపిస్తున్నారు కదా..అని విలేకరులు ప్రశ్నించగా ఆ పార్టీ నేతలకు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నానన్నారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధం కావాలని ఆయన సూచించారు. కశ్మీర్లో తీవ్ర వాదాన్ని తుదముట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రజలు భారత్‌లో చేరాలని భావిస్తుంటే పాకిస్తాన్ వారిని వివిధ రకాలుగా భయభ్రాంతులకు గురి చేస్తోందని విమర్శించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సోము వీర్రాజును బాబు అడ్డుకుంటున్నారా?
హైదరాబాద్: బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడి నియామకం ఎందుకు జరగడం లేదు. దేశవ్యాప్తంగా దాదాపు 24 రాష్ట్రాల్లో ఆయా శాఖల అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ ముగిసినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎందుకు ఆగిపోయింది. ఇందుకు ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా అంటే.. ఔనని వినిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక సజావుగా జరగకుండా టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడ్డుకుంటున్నారని తెలుస్తోంది. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా వరుసక్రమంలో నాలుగైదు రాష్ట్రాలు మినహా బీజేపీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అధ్యక్షుల నియామకాలను పూర్తి చేసింది. ఇటీవలికాలంలోనే జి. కిషన్ రెడ్డి స్థానంలో తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా లక్ష్మణ్ ను నియమించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఏపీ రాష్ట్ర శాఖ కు కూడా అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తి కావలసి ఉంది. అయితే ఆ ప్రక్రియ పూర్తి కాకుండా వాయిదా పడింది. ఏపీ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ప్రస్తుతం విశాఖపట్నం లోక్ సభ సభ్యుడు కంభంపాటి హరిబాబు ఉన్నారు. ఆయన పదవీ కాలం పూర్తికావడంతో ఆయన స్థానంలో కొత్త వారిని నియమించాల్సి ఉంది. ఆ ఎంపిక కోసం పార్టీ సంస్థాగతంగా అన్నీ సిద్ధం చేసింది కూడా. ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిని చేయాలని మెజారిటీ నేతలు నిర్ణయించారు. అయితే చివరి నిమిషంలో ఆయన పేరును ప్రకటించకుండా వాయిదా వేశారు. సోము వీర్రాజును బీజేపీ అధ్యక్షుడిగా నియమించకుండా చంద్రబాబునాయుడు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టు కమలం వర్గాల్లో బాగా వినిపిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నందున ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా తన కనుసన్నల్లో తనమాట వినేవారినే నియమించేలా చూసుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. 2014 సాధారణ ఎన్నికలకు ముందు టీడీపీ-బీజేపీ-జనసేన ల మధ్య పొత్తు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన సోము వీర్రాజు ఆ తర్వాత కాలంలో అధికార టీడీపీపై పలుసార్లు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వ్యవహార శైలిని పలు సందర్భాల్లో ప్రశ్నించారు. ఆ పరిణామాలు చంద్రబాబుకు ఏమాత్రం మింగుడు పడలేదు. ఏపీ రాష్ట్ర శాఖకు సోము వీర్రాజును అధ్యక్షుడిగా నియమిస్తే మిత్రపక్షాల మధ్య సమస్యలు తలెత్తుతాయని బీజేపీ పెద్దల ముందు చెప్పడం ద్వారా చంద్రబాబు ఆయన నియామకాన్ని చివరి నిమిషంలో అడ్డుకున్నారని అంటున్నారు. సోము వీర్రాజు టీడీపీ సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, అలాంటి నేతను పార్టీ అధ్యక్షుడిని చేస్తే ఇరు పార్టీల మధ్య సంబంధాలు బెడిసికొడతాయని చంద్రబాబు బీజేపీ నాయకత్వానికి చెబుతున్నట్టు వినిపిస్తోంది. ప్రస్తుతం ఏపీ కేబినేట్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ తనకు ఎంతో అనుకువగా, అనుకూలంగా ఉంటారని, అలాకాకుండా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే నేతను ఎంపిక చేయొద్దని చంద్రబాబు బీజేపీకి చెందిన ఓ జాతీయ స్థాయి నేత ముందు చెప్పుకున్నారని వినికిడి. అలాగని రాష్ట్ర శాఖ అధ్యక్ష బాధ్యతలు దగ్గుబాటి పురందేశ్వరికి కూడా అప్పగించరాదని ఆయన గట్టిగా కోరినట్టు బీజేపీలో గుప్పుమంటోంది. రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలన్న విషయంలో చంద్రబాబే కొన్ని పేర్లను బీజేపీ నాయకత్వానికి సూచించారని కూడా బలంగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ అంతర్గత విషయాల్లో చంద్రబాబు జోక్యమేంటని పార్టీలోని కొందరు సీనియర్లు జాతీయ నాయకత్వం ముందు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.