ప్రధాని ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర | Conspiracy on Narendra Modi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర

Published Fri, Aug 19 2016 12:17 AM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM

ప్రధాని ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర - Sakshi

ప్రధాని ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర

 
  • టీడీపీతో సహా అన్ని పార్టీలతో అభివృద్ధిపై చర్చకు సిద్ధం
  • బీజేపే సీనియర నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు
నెల్లూరు(బారకాసు):
 ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంతో పాటు దేశంలోని పదకొండు రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో ఉద్యమాలు చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రతిపక్షాలు కుట్ర పన్నాయని బీజేపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. నెల్లూరులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా అనే అంశాన్ని ప్రజల సెంటిమెంట్‌గా మార్చి దాంతో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తున్నాయన్నారు.
కేంద్రంలో అవినీతి రహిత, అభివృద్ధి సహిత ప్రభుత్వం ఉండటంతో వీరి ఆటలు సాగడం లేదన్నారు. దేశంతో పాటు ప్రపంచంలో నరేంద్ర మోదీ ప్రతిష్ట పెరుగుతోందన్నారు. అభివృద్ధి అనే అంశంపై టీడీపీతో సహా ఇతర పార్టీలతో బహిరంగ చర్చకు తాము సిద్ధమని వీర్రాజు ప్రకటించారు. విభజనలో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్రం తగిన కసరత్తు చేస్తోందన్నారు. ఆంధ్రా ప్రజలకు న్యాయం చేయాలనే తపనతో కేంద్రం ఉందన్నారు.
విభజన చట్టంలో ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తోందని వెల్లడించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమీ సాయం చేయడం లేదని  వివిధ పార్టీల నేతలు ఆరోపించడం సరికాదన్నారు. కేంద్రం సాయం చేయడం లేదని టీడీపీ నేతలే ఆరోపిస్తున్నారు కదా..అని విలేకరులు ప్రశ్నించగా ఆ పార్టీ నేతలకు కూడా  ఇదే విషయాన్ని చెబుతున్నానన్నారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధం కావాలని ఆయన సూచించారు. కశ్మీర్‌లో తీవ్ర వాదాన్ని తుదముట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రజలు భారత్‌లో చేరాలని భావిస్తుంటే పాకిస్తాన్‌ వారిని వివిధ రకాలుగా భయభ్రాంతులకు గురి చేస్తోందని విమర్శించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement