MNP
-
టెలికాం కంపెనీలపై ట్రాయ్ కన్నెర్ర! ఇష్టారీతిగా ఆఫర్లు ఇవ్వొద్దంటూ ఆదేశం!!
మొబైల్ ఫోన్ ఆపరేటర్లపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కన్నెర్ర చేసింది. తమకు తెలియకుండా కస్టమర్లకు ఎటువంటి ఆఫర్లు ఇవ్వొద్దంటూ తేల్చి చెప్పింది. తమ ఆదేశాలు హద్దు మీరితే చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయంటూ ట్రాయ్ వెల్లడించింది. ఫిర్యాదుల వెల్లువ ఇండియన్ మొబైల్ మార్కెట్లో తీవ్రమైన పోటీ నెలకొంది. కొత్త చందాదారులను ఆకట్టుకోవడానికి మొబైల్ కంపెనీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దీని కోసం వినియోగదారులను ఆకట్టుకునేలా రకరకాల టారిఫ్‌లను ప్రకటిస్తున్నాయి. అయితే ఈ టారిఫ్‌లు ప్రకటించే ముందు ట్రాయ్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధన సరిగా అమలు కావడం లేదని, ట్రాయ్ అనుమతి తీసుకోకుండానే మొబైల్ ఆపరేటర్లు ప్రత్యేక టారిఫ్‌లు అమలు చేస్తున్నారంటూ ఒక సంస్థపై మరో సంస్థ తరచుగా ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. కారణం ఏంటీ మొబైల్ నంబర్ పోర్టబులిటీ (ఎంఎన్‌పీ) ద్వారా కస్టమర్లు తమ నంబర్ మారకుండానే ఆపరేటర్‌ను మార్చుకునే వీలుంది. అయితే ఎంఎన్‌పీ అమలు చేసే సమయంలో ప్రత్యర్థి కంపెనీకి చెందిన చందాదారున్ని ఆకట్టుకునేందుకు ట్రాయ్ దగ్గర అనుమతి తీసుకోని పలు రకాల ఆఫర్లు కస్టమర్లకు ప్రకటిస్తున్నాయి. ఇదే సందర్భంలో తమ దగ్గరి నుంచి కస్టమర్ బయటకు వెళ్లకుండా కూడా అనుమతి లేని ఆఫర్లను అందుబాటులో ఉంచుతున్నాయి. ఇదంతా థర్డ్‌పార్టీల ద్వారా జరుగుతోంది. ఇంత కాలం ఈ వ్యవహారం జరుగుతూ వస్తోన్నా .. ఇటీవల మొబైల్ ఆపరేటర్లు ఈ అనధికారిక టారిఫ్‌లపై చర్యలు తీసుకోవాలంటూ ట్రాయ్‌ని ఆశ్రయించారు. తక్షణమే అమలు మొబైల్ సర్వీస్ ఆపరేటర్ల నుంచి వస్తున్న ఫిర్యాదులపై స్పందించిన ట్రాయ్ అనధికారిక టారిఫ్‌లను అమలు చేయోద్దంటూ ఆదేశించింది. ఈ టారిఫ్ అమలు చేయాలన్నా తమ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయంది. చదవండి : హైదరాబాద్‌కి వస్తున్న మరో అంతర్జాతీయ సంస్థ -
నచ్చని టెల్కోలకు గుడ్‌బై!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ నంబర్ పోర్టబిలిటీ(ఎంఎన్‌పీ) కోసం దేశవ్యాప్తంగా దరఖాస్తులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఆశించిన స్థాయిలో సేవలు అందకపోతే కస్టమర్లు మరో ఆపరేటర్‌కు సులువుగా మారుతున్నారు. 2019 జూలై 31 నాటికి 44.74 కోట్ల మంది ఎంఎన్‌పీ సేవలను వినియోగించుకున్నారంటే వినియోగదార్లలో చైతన్యం అర్థం చేసుకోవచ్చు. ఇలా అభ్యర్థనలు వచ్చిన రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 4.14 కోట్ల దరఖాస్తులతో కర్ణాటక తొలి స్థానంలో ఉండగా.. 3.78 కోట్ల రిక్వెస్టులతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ రెండో స్థానంలో నిలిచింది. తమిళనాడు, రాజస్తాన్, మహారాష్ట్ర సర్కిళ్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక ఈ ఏడాది జూలైలో ఎంఎన్‌పీ కోసం 59.2 లక్షల విన్నపాలు వచ్చాయి. 2010 నవంబరు 25న హరియాణా సర్వీస్ ఏరియాలో తొలుత ఎంఎన్‌పీ అందుబాటులోకి వచ్చింది. దశలవారీగా అన్ని సర్కిళ్లకు ఈ సర్వీసును విస్తరించారు. పెరుగుతున్న ఫిర్యాదులు.. టెలికం రంగంలో భారత్‌లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. 2జీ తర్వాత 3జీ విస్తరణ కంటే వేగంగా 4జీ సేవలు దూసుకుపోయాయి. ప్రధానంగా రిలయన్స్ జియో రాకతో టెలికం రంగంలో పోటీ తీవ్రమైంది. 2019 జూలై నాటికి భారత్‌లో వైర్లెస్ చందాదారులు 97.2 కోట్ల మంది ఉన్నారు. మెరుగైన సేవల కోసం వినియోగదార్లు ఖర్చుకు వెనుకంజ వేయడం లేదు. మరోవైపు కస్టమర్ల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఉత్తమ కవరేజ్, సర్వీసుల కోసం ఏటా అన్ని టెలికం కంపెనీలు ఎంత కాదన్నా రూ.10,000 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఎయిర్టెల్ ప్రాజెక్ట్ లీప్ కింద రూ.10,000 కోట్లు వ్యయం చేస్తోంది. టవర్ల ఏర్పాటును రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు అడ్డుకోరాదన్న సుప్రీం తీర్పు తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. మరోవైపు కేంద్ర టెలికం మంత్రిత్వ శాఖ చొరవతో టవర్ల ఏర్పాటుకు ప్రభుత్వ భవనాలను వినియోగించుకునే వెసులుబాటు టెలికం కంపెనీలకు లభించింది. ప్రధాన సమస్యలు ఇవే.. కవరేజ్, డేటా స్పీడ్, కాల్ డ్రాప్, కాల్ కనెక్టివిటీ, కాల్ క్వాలిటీ వంటి నెట్వర్క్ సంబంధ ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. అలాగే బిల్లింగ్ పారదర్శకత, కాల్ సెంటర్‌తో అనుసంధానం, అందుబాటులో ఔట్లెట్ల వంటి సర్వీస్ విషయాలనూ కస్టమర్లు పరిగణలోకి తీసుకుంటున్నారు. ఫిర్యాదు చేయాలంటే కాల్ సెంటర్‌కు లైన్ కలిసే అవకాశమే ఉండడం లేదు. యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని టెల్కోలు చెబుతున్నా అంతిమంగా పరిష్కారం అయ్యే చాన్స్ తక్కువ. వినియోగం కంటే మొబైల్ బిల్లు ఎక్కువగా ఉందని భావించే కస్టమర్లు మెరుగైన ప్యాకేజీ కోసం ఆపరేటర్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నారు. ఎంఎన్‌పీ ప్రత్యేకత ఏమంటే వినియోగదారు మరో రాష్ట్రానికి (టెలికం సర్కిల్) మారినా వినియోగిస్తున్న నంబరు మారకపోవడం. ఈ అంశమే కస్టమర్లకు అస్త్రం. టెల్కోను మార్చిన 90 రోజులకు మరో ఆపరేటర్‌ను ఎంచుకునే వెసులుబాటు ఉండడం వినియోగదార్లకు కలిసి వస్తోంది. -
ఇతర సర్వీసుల నుంచి జియోకు మారండి!
ముంబై: ‘జియో’ ఫోన్లే వాడాలని తమకు ఉద్యోగులకు రిలయన్స్ ఇండస్ట్రీస్(రిల్) సూచింది. ప్రస్తుతం ఇతర సెల్‌ఫోన్ సంస్థల సేవలు వాడుతున్న ఉద్యోగులు 'జియో'కు మారాలని రిల్ కోరింది. ఎయిర్ టెల్, వొడా ఫోన్ లాంటి ఇతర ఆపరేటర్ల సర్వీసులు వాడుతున్న రిలయన్స్ ఉద్యోగులు తమ సొంత కంపెనీ ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన హైస్పీడ్ 4జీ జియోకు మారాలని విజ్ఞప్తి చేసింది. దేశంలో అతిపెద్ద ప్రైవేటు వాణిజ్య సంస్థ అయిన 'రిల్'లో 40 వేల మందిపైగా ఉద్యోగులున్నారు. 'మన కంపెనీ చరిత్రలో మరో మైలురాయిని అందుకోబోతున్నాం. ప్రస్తుతం మనం వాడుతున్న సెల్‌ఫోన్ కనెక్షన్లు జియోకు మార్చుకోవాల్సిన అవసరముంద'ని రిలయన్స్ ఉద్యోగులకు రాసిన లేఖలో హెచ్ ఆర్ విభాగం పేర్కొంది. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ(ఎంఎన్ పీ) ద్వారా ఆపరేటర్ ను మార్చుకోవచ్చని సూచించింది. అంతేకాదు ఎంఎన్ పీకి బంధించిన విధానాన్ని స్టెప్-బై-స్టెప్ ఉద్యోగులకు వివరించింది. కాగా, జియోకు 15 లక్షల మంది టెస్ట్ యూజర్లు ఉన్నారని రిల్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. దేశవ్యాప్తంగా 22 సర్వీస్ ఏరియాల ద్వారా 18వేల పట్టణాలు, 2 లక్షలకుపైగా గ్రామాల్లో జియో సేవలు అందించనున్నట్టు వెల్లడించారు.