Mobile tariff
-
‘మొబైల్ టారిఫ్‌లు మరింత పెంచాల్సిందే’
ఇప్పటికే పలు విడతలుగా మొబైల్ టెలిఫోన్ చార్జీలను (Tariff Hike) పెంచినప్పటికీ.. మరింత పెంపు అవసరమని భారతీ ఎయిర్టెల్ (Airtel) వైస్ చైర్మన్, ఎండీ గోపాల్ విఠల్ వ్యాఖ్యానించారు. టెలికం రంగ ఆర్థిక స్థిరత్వం కోసం ఇది అవసరమన్నారు. డిసెంబర్ క్వార్టర్ కంపెనీ త్రైమాసిక ఫలితాల అనంతరం ఇన్వెస్టర్లతో ఏర్పాటు చేసిన ఎర్నింగ్స్ కాల్లో భాగంగా ఆయన ఈ అంశంపై మాట్లాడారు.నెట్‌వర్క్‌పై పెట్టుబడులు తగ్గించి, ట్రాన్స్మిషన్ సామర్థ్యం పెంపుపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. తద్వారా కస్టమర్ల అనుభవంలో అంతరాలను తొలగించి, గృహ బ్రాడ్‌బ్యాండ్ సేవలను విస్తరించనున్నట్టు తెలిపారు. ‘‘2023–24 కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయాలు తక్కువగా ఉంటాయి. 2025–26లోనూ మరింత తగ్గుతాయి. డిజిటల్ సామర్థ్యాల ఏర్పాటుపై మేము పెట్టిన దృష్టి ఇప్పుడు ఫలితాలనిస్తోంది’’అని చెప్పారు.భారత్‌లో సగటు టెలికం యూజర్ నుంచి వచ్చే ఆదాయం (ఏఆర్పీయూ) ప్రపంచంలోనే తక్కువగా ఉందన్నారు. ఆర్థికంగా నిలదొక్కుకుని, నిలకడైన రాబడుల కోసం మరో విడత టారిఫ్‌లకు చికిత్స అవసరమని వ్యాఖ్యానించారు. గతేడాది జూలైలో ఎయిర్టెల్ సహా ఇతర టెలికం కంపెనీలు టారిఫ్‌లను సగటున 10–21 శాతం మధ్య పెంచడం గమనార్హం.మార్జిన్లు తక్కువగా ఉండే హోల్‌సేల్ వాయిస్, మెస్సేజింగ్ సేవల నుంచి ఎయిర్టెల్ తప్పుకుంటున్నట్టు విఠల్ ప్రకటించారు. కంపెనీ లాభాలపై దీని ప్రభావం ఉండదన్నారు. డిసెంబర్ త్రైమాసికంలో ఎయిర్టెల్ రూ.16,134 కోట్ల లాభాలను నమోదు చేయడం గమనార్హం. ఒక్కో యూజర్ నుంచి సగటున రూ.245 ఆదాయం సమకూర్చుకుంది. ఇది కనీసం రూ.300 ఉండాలని ఎయిర్టెల్ ఎప్పటినుంచో చెబుతూ వస్తోంది. -
వొడాఫోన్-ఐడియాపై రిలయన్స్ జియో ఫిర్యాదు
టెలికాం కంపెనీలన్నీ ఈ మధ్య వరుసబెట్టి టారిఫ్ రేట్లు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే రకరకాల బాదుడులతో నలిగిపోతున్న సామాన్యులకు.. ఈ పెంపుతో మరో పిడుగు పడినట్లయ్యింది. అయితే ఇందులో ఇప్పుడు ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వొడాఫోన్-ఐడియా(VIL) మీద రిలయన్స్ జియో ఏకంగా ట్రాయ్‌కు ఫిర్యాదు చేసింది తాజాగా.. వొడాఫోన్ ఐడియా తాజాగా 18-25 శాతం రేట్లను పెంచేసిన విషయం తెలిసిందే. అయితే తాజా టారిఫ్ ప్యాకేజీలో ఎంట్రీ లెవల్ కస్టమర్లను తమకు నచ్చిన నెట్‌వర్క్‌కు పోర్ట్ ద్వారా మారేందుకు వీలులేకుండా చేసిందనేది జియో ఆరోపణ. సాధారణంగా ఒక కస్టమర్ తన నెంబర్ నుంచి పోర్ట్ కావాలంటే పోర్ట్ రిక్వెస్ట్ ఎస్సెమ్మెస్ పంపించాలనే విషయం తెలిసిందే కదా. అయితే వొడాఫోన్‌లో ఎంట్రీ లెవల్ రీఛార్జ్ ప్యాక్‌లో ఎస్సెమ్మెస్ పంపే వీలు లేకుండా పోయింది తాజా టారిఫ్‌లో. రూ.75 నుంచి 99రూ.కి 28 రోజుల వాలిడిటీ ప్యాక్ రేటును పెంచిన VIL.. అందులో ఎస్సెమ్మెస్ ఆఫర్ లేకుండా చేసింది. ఇక మెసేజ్‌లు పంపుకోవాలంటే రూ.179, అంతకంటే ఎక్కువ ప్యాకేజ్‌తో రీఛార్జ్ చేయాల్సిందే. సో.. పోర్ట్ మెసేజ్ పంపాలన్నా వొడాఫోన్ ఐడియా కస్టమర్లు కచ్చితంగా 179రూ.తో ముందు రీఛార్జ్ చేసుకోవాలన్నమాట. ఇలా అత్యధిక ప్యాకేజీ రీఛార్జ్‌తో వొడాఫోన్ ఐడియా లిమిటెడ్, కన్జూమర్ని తనకు నచ్చిన నెట్‌వర్క్‌కు పోర్ట్ కాకుండా అడ్డుకుంటోందని జియో తన ఫిర్యాదులో పేర్కొంది. జియో కంటే ముందు స్వచ్ఛంద సంస్థ ‘టెలికాం వాచ్డాగ్’ కూడా ట్రాయ్ Telecom Regulatory Authority of India కు ఇదే విషయమై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కన్జూమర్ హక్కుల్ని పరిరక్షించాల్సిన ట్రాయ్ ..ఈ విషయాన్ని ఎలా పరిగణనలోకి తీసుకోలేదో అర్థం కావట్లేదంటూ ఫిర్యాదులో పేర్కొంది కూడా. చదవండి: ‘ట్రాయ్ నిద్రపోతోందా?’.. జనాగ్రహం ఎంతలా ఉందంటే.. -
మళ్లీ పేలనున్న మొబైల్ ఛార్జీలు
కోల్‌కతా : దేశంలో వంద కోట్లకు పైగా ఉన్న మొబైల్ ఫోన్ యూజర్లపై ఈ ఏడాది అధిక చార్జీల భారం పడనుంది. యూజర్ నుంచి సగటు రాబడి ఇంకా తక్కువగానే ఉండటంతో టెలికాం కంపెనీలు మొబైల్ టారిఫ్‌ను మరోసారి 25 నుంచి 30 శాతం వరకూ పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏజీఆర్ చెల్లింపులపై సుప్రీంకోర్టు నుంచి వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్‌టెల్‌లకు ఎలాంటి ఊరట లేకపోవడంతో వనరుల సమీకరణ కోసం కాల్ చార్జీల పెంపునకు ఇవి మొగ్గుచూపనున్నాయి. యూజర్ నుంచి సగటు రాబడి రూ 180 కంటే తక్కువగా ఉండటం, ప్రపంచ దేశాలతో పోలిస్తే టెలికాంపై వినియోగదారులు వెచ్చించే మొత్తం భారత్‌లో తక్కువే కావడం వంటి అంశాలను పరిశీలిస్తే టెలికాం కంపెనీలు ఈ ఏడాది చివరిలో టారిఫ్‌లను 30 శాతం వరకూ పెంచే అవకాశం ఉందని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ డైరెక్టర్ సంజీవ్ భాసిన్ అంచనా వేశారు. కాగా గత నెలలో భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా, రిలయన్స్ జియో మూడేళ్లలో తొలిసారిగా కాల్ చార్జీలను 14 నుంచి 33 శాతం వరకూ పెంచిన సంగతి తెలిసిందే. టెలికాం కంపెనీలు ఇటీవల టారిఫ్‌ను పెంచినా వినియోగదారులు ఇప్పటికీ వారి కమ్యూనికేషన్ అవసరాలపై కేవలం 0.86 శాతం మాత్రమే తలసరి ఆదాయం వెచ్చిస్తున్నారని ఇది నాలుగేళ్ల కిందటి మొత్తంతో పోలిస్తే చాలా స్వల్పమని సెల్యులార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) డైరెక్టర్ జనరల్ రాజన్ మ్యాథ్యూస్ అన్నారు. మరోవైపు డేటా అందుబాటులోకి రావడంతో మొబైల్ వినిమయం విపరీతంగా పెరిగిన క్రమంలో మొబైల్ బిల్లు కొంత అదనంగా చెల్లించేందుకు యూజర్లు వెనుకాడరని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ డైరెక్టర్ సంజీవ్ భాసిన్ చెప్పుకొచ్చారు. చదవండి : జియో షాక్..కాల్ చేస్తే.. బాదుడే! -
ఉచిత టారిఫ్‌లపై టెలికం కమిషన్ దృష్టి
న్యూఢిల్లీ: ప్రమోషనల్ మొబైల్ టారిఫ్‌లపై అంతర్మంత్రిత్వ శాఖల బృందం టెలికం కమిషన్ దృష్టి సారించింది. పరిశ్రమ వృద్ధికి తోడ్పడేలా ప్రస్తుత నిబంధనలను సమీక్షించాలని, ప్రమోషనల్ టారిఫ్‌లకు సంబంధించిన ఆదేశాలు తూచా తప్పకుండా అమలయ్యేలా చూడాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కి సూచించింది. ద్వితీయ, తృతీయ త్రైమాసికాల్లో టెలికం పరిశ్రమ ఆదాయాలు క్షీణించడంపై చర్చించిన కమిషన్ .. తాజా సూచనలు చేసినట్లు తెలుస్తోంది. రిలయన్స్ జియో ఉచిత ప్రమోషనల్ సర్వీసుల కారణంగా టెలికం పరిశ్రమ దాదాపు 20% ఆదాయం నష్టపోయినట్లు ఇండియా రేటింగ్స్ వెల్లడించిన నేపథ్యంలో కమిషన్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. -
మొబైల్ టారిఫ్‌లకు రెక్కలు !
న్యూఢిల్లీ: స్పెక్ట్రమ్ రిజర్వ్ ధర అధికంగా ఉండటంతో మొబైల్ సర్వీసుల రేట్లు పెరుగుతాయని సీఓఏఐ పేర్కొంది. ఈ అధిక ధర టెలికం కంపెనీల విస్తరణపై ప్రభావం చూపుతుందని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) డెరైక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ వివరించారు. ఫలితంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెస్తున్న డిజిటల్ ఇండి యా కార్యక్రమంపై కూడా ప్రతికూల ప్రభావం చూ పుతుందని పేర్కొన్నారు. స్పెక్ట్రమ్ రిజర్వ్ ధర అధికంగా ఉందని, దీంతో కంపెనీల వ్యాపారంపై ప్రభా వం పడుతుందని ఫలితంగా మొబైల్ కంపెనీలు టారిఫ్ లు పెంచుతాయని వివరించారు. దీంతో చౌక ధరల్లో సేవలందించడం, గ్రామాల్లో విస్తరణ, డిజిట ల్ ఇండియా వంటి కార్యకలాపాలకు విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్‌కు ఒక లేఖ రాశారు.