న్యూఢిల్లీ: ప్రమోషనల్ మొబైల్ టారిఫ్‌లపై అంతర్‌మంత్రిత్వ శాఖల బృందం టెలికం కమిషన్ దృష్టి సారించింది. పరిశ్రమ వృద్ధికి తోడ్పడేలా ప్రస్తుత నిబంధనలను సమీక్షించాలని, ప్రమోషనల్ టారిఫ్‌లకు సంబంధించిన ఆదేశాలు తూచా తప్పకుండా అమలయ్యేలా చూడాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కి సూచించింది.
ద్వితీయ, తృతీయ త్రైమాసికాల్లో టెలికం పరిశ్రమ ఆదాయాలు క్షీణించడంపై చర్చించిన కమిషన్ .. తాజా సూచనలు చేసినట్లు తెలుస్తోంది. రిలయన్స్ జియో ఉచిత ప్రమోషనల్ సర్వీసుల కారణంగా టెలికం పరిశ్రమ దాదాపు 20% ఆదాయం నష్టపోయినట్లు ఇండియా రేటింగ్స్ వెల్లడించిన నేపథ్యంలో కమిషన్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.