Mobiwik
-
పేటీఎం ఎఫెక్ట్.. ఐపీవోకి భయపడుతున్న కంపెనీలు
Indian Paytm Effect MobiKwik to Delay Planned IPO: ఫిన్‌టెక్ కంపెనీ మొబిక్విక్ సరైన సమయంలో పబ్లిక్ ఇష్యూను చేపట్టనున్నట్లు తాజాగా ప్రకటించింది. దీంతో కంపెనీ ఐపీవో ప్రణాళికల అమలును ఆలస్యం చేసే వీలున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీకి సరైన విలువను ఆకట్టుకోవడంలో కంపెనీకి ఎదురవుతున్న సవాళ్లు ఇందుకు ప్రభావం చూపుతున్నట్లు అభిప్రాయపడ్డాయి. అంతేకాకుండా ఇటీవల డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్ ఐపీవోకు సరైన స్పందన లభించకపోవడం, లిస్టింగ్‌లో నిరాశపరచడం వంటి అంశాలు సైతం కారణమైనట్లు తెలియజేశాయి. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,900 కోట్ల సమీకరణకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి మొబిక్విక్ ఇప్పటికే అనుమతులు పొందిన విషయం విదితమే. కాగా.. తొలి నాలుగేళ్లు తక్కువ పెట్టుబడితోనే వృద్ధిబాటలో సాగిన కంపెనీ ప్రస్తుతం 10.1 కోట్ల యూజర్లను సాధించినట్లు మొబిక్విక్ పేర్కొంది. ఇందుకు కేవలం 10 కోట్ల డాలర్లు(సుమారు రూ. 750 కోట్లు) వెచ్చించినట్లు తెలియజేసింది. ఎల్లప్పుడూ నిలకడైన వ్యూహాలనే అమలు చేస్తూ రావడంతో పటిష్ట వృద్ధిని సాధిస్తున్నట్లు వివరించింది. తద్వారా లాభదాయకతవైపు ప్రయాణిస్తున్నామని, వెరసి సరైన సమయంలో కంపెనీ లిస్టింగ్‌ను చేపడతామని స్పష్టం చేసింది. ప్రస్తుతం కొనుగోలు చేసి తదుపరి చెల్లించే(బీఎన్‌పీఎల్) పథకంపై దృష్టి సారించిన కంపెనీ 2021 మార్చికల్లా అత్యధిక స్థాయిలో 22.3 మిలియన్ల ప్రీఅప్రూవ్డ్ బీఎన్‌పీఎల్ వినియోగదారులను కలిగి ఉన్నట్లు వెల్లడించింది. చదవండి: పేటీఎం ఢమాల్..! రూ.38 వేల కోట్ల లాస్ అతడి వాళ్లే..! నెటిజన్ల ఫైర్..! -
బటన్ నొక్కండి.. లోన్ పట్టండి!
న్యూఢిల్లీ: మీకు డబ్బు అత్యవసరమా..? ఏదైనా లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే, అందుకు రోజుల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మీ స్మార్ట్ ఫోన్ లోని వాలెట్ నుంచి లోన్ తీసుకోవచ్చు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్లను జరిపే ప్రముఖ కంపెనీలు పే వరల్డ్, పేటీఎమ్, వన్ మొబీక్విక్ లు ఈ పద్దతికి పచ్చజెండా ఊపేశాయి. త్వరలో ఈ పద్ధతిలో చిన్న మొత్తాల్లో రుణాలు అందించనున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. మే తొలి అర్ధ భాగంలో ఈ పద్దతిని యూజర్లకు అందుబాటులోకి తేనున్నట్లు మొబీవిక్ వ్యవస్థాపపకుడు బిపిన్ ప్రీత్ సింగ్ తెలిపారు. మొదట రూ.100 నుంచి రూ.500 ఎలిజిబుల్ యూజర్ వాలెట్‌కు చేరుతుందని చెప్పారు. తర్వాత రూ.5000/- వరకు రుణం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు వివరించారు. అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ రుణాలు ఇవ్వడం సాధ్యం కాదని, మామూలు బ్యాంకింగ్ రంగంలో ఎటువంటి రుణబాకీలు లేనివారికే వాలెట్ లోన్ అందిస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. పేటీఎమ్ మాత్రం తాను కొత్తగా ఏర్పాటు చేయబోతున్న బ్యాంకుల్లో ఖాతా తెరిచినవారికి మాత్రమే ఈ సదుపాయం ఉంటుందని తెలిపింది. ఆన్లైన్ మోసాలు ఎక్కువవుతున్న కారణంగా వాలెట్ రుణాలు అందించేముందు కంపెనీలు కఠినతరమైన నిబంధనలను పాటించనున్నట్లు తెలిపాయి. కాగా, టెక్ సైన్స్ రీసెర్చ్ అనే కన్సల్టెన్సీ తాజాగా చేసిన పరిశోధనలో 2020 కల్లా మొబైల్ మార్కెట్ 6.6 బిలియన్ డాలర్లకు చేరనున్నట్లు అంచనా వేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటివరకు 145 బ్యాంకులకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసే అవకాశం కల్పించింది.