mohammad khan
-
కేరళ గవర్నర్‌కు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత పెంపు.. ఎందుకంటే?
తిరువనంతపురం: సీపీఐ(ఎం) అనుబంధ సంస్థ స్టూడెంట్ ఫెడెరేషన్ ఆఫ్ ఇండియా విద్యార్థులు చేపట్టిన నిరసనల నేపథ్యంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్‌కు సీఆర్పీఎఫ్ బలగాలతో Z+ కేటగిరి భద్రతను మరింత విస్తరిస్తున్నామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కేరళ రాజ్‌భవన్‌కు తెలియజేసింది. ఈ విషయాన్ని కేరళ రాజ్‌భవన్ ‘ఎక్స్’ ట్విటర్లో పేర్కొంది. సీపీఐ(ఎం) అనుబంధ సంస్థ అయిన స్టూడెంట్ ఫెడెరేషన్ ఆఫ్ ఇండియా(SFI) శనివారం కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్‌కు వ్యతిరేకంగా నల్ల జెండాలతో నిరసనకు దిగారు. గవర్నర్ ఆరిఫ్ కొట్టారక్కర జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరుకావటానికి వెళుతున్న సమయంలో పెద్ద ఎత్తున ఎస్ఎఫ్ఐ విద్యార్థులు గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. నల్ల జెండాలతో నిరసన తెలిపారు. విద్యార్థుల నిరసనతో విసిగిపోయిన గవర్నర్ ఆరిఫ్.. అనూహ్యంగా రోడ్డు పక్కన్న ఉన్న ఓ షాప్ ముందు బైఠాయించారు. తనపై నిరసన తెలుపుతున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకొని.. అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన కొల్లాం జిల్లాలో జరిగింది. గవర్నర్ అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను పోలీసులకు తెలియజేశారు. నిరసన ఘటనపై గవర్నర్ ఆరిఫ్ .. ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌పై విమర్శలు చేశారు. పినరయ్ విజయన్ ప్రభుత్వం.. రాష్ట్రంలో అధర్మం, అశాంతిని ప్రేరేపిస్తోందని మండిపడ్డారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడితో సహా పలువురి నాయకులపై కోర్టుల్లో క్రిమినల్ కేసులు ఉన్నా సీఎం పినరయ్ విజయన్ వారిని కాపాడటానికి పోలీసులకు దిశానిర్ధేశం చేస్తున్నారని విమర్శించారు. ఇక కొంత కాలంగా కేరళ సీఎం, గవర్నర్ మధ్యలు విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అదేవిధంగా గతంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు సైతం గవర్నర్ ఆరిఫ్పై పలుమార్లు నిరసన వ్యక్తం చేశారు. చదవండి: తలొగ్గిన సర్కార్.. మరాఠా రిజర్వేషన్ల ఆందోళనకు ఫుల్స్టాప్ -
కేరళకు తొలి వందేభారత్.. ప్రారంభించిన ప్రధాని మోదీ
ఢిల్లీ/తిరువనంతపురం: రెండు రోజుల కేరళ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్లు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత తిరువనంతపురంలో సెమీ హైస్పీడ్ రైలుగా పేరున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రధాని మోదీ ప్రారంభించారు. కేరళకు ఇదే తొలి వందేభారత్. తిరువనంతపురం నుంచి కాసరగోడ్ మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుంది. పదకొండు జిల్లాలను కవర్ చేస్తూ సాగిపోనుంది ఈ వందేభారత్ రైలు. ఇక కేరళలో పలుప్రాజెక్టులను ప్రధాని మోదీ ఒక్కొక్కటిగా ప్రారంభించుకుంటూ వెళ్తున్నారు. కేరళ సంప్రదాయ పంచెకట్టులో వేషధారణతో మోదీ అలరించారు. తొలుత.. తిరువనంతపురంలో డిజిటల్ సైన్స్ పార్క్‌కు శంకుస్థాపన చేశారు. అదే వేదికగా పలు ప్రాజెక్టులను సైతం ప్రారంభించారు. కేరళ ప్రధాని మోదీ పర్యటనలో ఆకట్టుకునే అంశం.. కొచ్చి వాటర్ మెట్రో. కొచ్చి చుట్టూరా ఉన్న పది ఐల్యాండ్లను అనుసంధానించేలా.. బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్లను నడిపిస్తారు. ఈ ప్రాజెక్టును మోదీ తన చేతుల మీదుగా ప్రారంభిస్తారు. Kerala | PM Narendra Modi inaugurates various development projects in Thiruvananthapuram. pic.twitter.com/5ZpCKFJcVD — ANI (@ANI) April 25, 2023 #WATCH | Kerala: PM Narendra Modi flags off the Thiruvananthapuram Central-Kasaragod Vande Bharat Express train from Thiruvananthapuram Central railway station. pic.twitter.com/zdqdmwNE3g — ANI (@ANI) April 25, 2023 -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా...
సాక్షి, హైదరాబాద్: సమాజంలోని విభిన్న వర్గాల మేలుకలయికగా ‘దత్తన్న అలయ్–బలయ్’ ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది. సాహితీ, సాంస్కృతిక, సినిమా, రాజకీయ, తదితర రంగాలకు చెందిన ప్రముఖుల ఉపన్యాసాలు.. జానపద, సంగీత, కళారూపాల ప్రదర్శనలు.. నోరూరించే తెలంగాణ వంటకాల మేళవింపుగా.. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ దసరా సమ్మేళనం కొనసాగింది. గురువారం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్–బలయ్ ఫౌండేషన్ చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి సారథ్యంలో సాగిన ఈ కార్యక్రమాన్ని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నీ తానై ముందుండి నడిపించారు. చిరంజీవితో ముచ్చటిస్తున్న గరికపాటి చిరంజీవి సినిమా తీయలేదా?: కేరళ గవర్నర్ రాజకీయాలు, కుల, మతాలకు అతీతంగా మనుషుల మధ్య స్నేహం, సాంస్కృతిక విలువలు పెంపొందించేందుకు అలయ్–బలయ్ ప్రేరణగా నిలుస్తుందని ముఖ్యఅతిథి, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అన్నారు. కేవలం తమ కుటుంబాల కోసమే కాకుండా ఇతరుల కోసం, సమాజం కోసం ముఖ్యంగా అణగారిన వర్గాల కోసం జీవించడం గొప్ప అని పేర్కొన్నారు. ఇంత గొప్పగా ఉన్న దీనిని ఇతివృత్తంగా తీసుకుని సినీహీరో చిరంజీవి ఇంకా సినిమా తీయలేదా? అని ప్రశ్నించారు. భిన్న సంస్కృతులను ఏకం చేసేందుకే: తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజలు సమైక్యంగా కృషి చేస్తే దేశంలోనే అగ్రగామిగా నిలుస్తాయని హరియా ణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. కేవలం శరీరాలే కాదు మనసులు ఆలింగనం చేసుకోవాలనే లక్ష్యంతో పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా భిన్న సంస్కృతులను ఏకం చేయాలనే ఉద్దేశంతో దీనిని ప్రారంభించినట్లు తెలిపారు. గతంలో ఎన్నికలప్పుడే రాజకీయాలుండేవని, ఆ తర్వాత ప్రాంతం, దేశాభివృద్ధి కోసం పాటు పడేవారని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇతర పార్టీల నేతలు కలుసుకుని మాట్లాడలేని పరిస్థితి ఉందన్నారు. అధర్మంపై సత్యం, ధర్మం గెలుపునకు చిహ్నంగా నిలిచే దసరా సందర్భంగా.. స్థానిక సంస్కృతికి చిహ్నంగా దీని నిర్వహణ అద్భుతమని కేంద్ర సహాయ మంత్రి భగవంత్ ఖుబా కొనియాడారు. అభిమానులతో సెల్ఫీలు దిగుతున్న చిరంజీవి దేశవ్యాప్తంగా జరగాలి: గాడ్ ఫాదర్’ సినిమా విడుదలతో హుషారుగా ఉన్న సినీ నటుడు చిరంజీవి ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే అలయ్ –బలయ్ వంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా జరగాలి.. వ్యాపించాలని ఆయన అన్నారు. తెలంగాణ సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్న ఈ సమ్మేళనం అద్భుతమని, స్నేహానికి, సుహృద్భావానికి ప్రతీకగా ఈ కార్యక్రమం సాగుతోందని చెప్పారు. మాటలకు లొంగని వారు, హృదయ స్పందనలకు లొంగుతారని, అలాంటి ఈ సంస్కృతి మరింత ముందుకెళ్లాలన్నారు. స్ఫూర్తిదాయకం గరికపాటి ప్రవచనం: గరికపా టి గారి ప్రవచనాలను తాను ఇష్టపడతానని, అవి స్ఫూర్తిదాయకంగా ఉంటాయని చిరంజీవి పేర్కొ న్నారు. ఆయనకు పద్మశ్రీ వచ్చినప్పుడు అభినందించానని, అయితే ఇన్నిరోజుల్లో ఆయనను కలుసుకోవడం ఇదే తొలిసారని తెలిపారు. ‘మీ ఆశీస్సులతో ముందుకెళతాం. ఎప్పుడైనా సమయం దొరికి తే మా ఇంటికి రండి’ అంటూ ఆహ్వానించారు. ‘ఏపాటి వాడికైనా..’ అంటూ నాగబాబు ట్వీట్ ఫొటో సెషన్ ఆపాలంటూ చిరంజీవిని ఉద్దేశించి ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై చిరంజీవి సోదరుడు నాగబాబు స్పందిస్తూ.. ‘‘ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయపడటం పరిపాటే’’.. అంటూ ట్వీట్ చేశారు. చిరంజీవి ఫొటో సెషన్ ఆపకపోతే వెళ్లిపోతా: గరికపాటి ప్రవచన కర్త గరికపాటి నర్సింహారావు ప్రసంగించేందుకు సిద్ధం కాగా, వేదికకు ఒకవైపు చిరంజీవితో కలిసి పలువురు ఫొటోలు, సెల్ఫీలు దిగుతుండడంతో కొంత గందరగోళం నెలకొంది. దీంతో గరికపాటి.. ‘ఈ ఫొటో సెషన్ చిరంజీవి వెంటనే నిలిపేయాలి. వాళ్లు దానిని ఆపకపోతే నేను మాట్లాడకుండా వెళ్లిపోతా..’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. దీంతో కొంతసేపు అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. మరికొన్ని నిమిషాలు ఫొటోల కార్యక్రమం కొనసాగి ఆగిన తర్వాత గరికపాటి ప్రసంగించారు. మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, ఎంపీలు డా.కె.లక్ష్మణ్, ఆర్.కృష్ణయ్య, బీజేపీ నేతలు ఈటల రాజేందర్, ఎం.రఘునందన్‌రావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, ఏపీ జితేందర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సత్యకుమార్, టి.ఆచారి పాల్గొన్నారు. టీఆర్ఎస్ తరఫున ఎంపీ కె.కేశవరావు, ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, దయానంద్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ హాజరయ్యారు. వివిధ పార్టీల నేతలు మధుయాష్కీ గౌడ్, వి.హనుమంతరావు, ప్రొ.ఎం.కోదండరాం, గిరీష్‌సంఘీ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, డా.కె.నారాయణ, కూనంనేని సాంబశివరావు, కె.రామకృష్ణ, సినీ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్, విశ్రాంత ఐఏఎస్ అధికారులు రత్నప్రభ, విద్యాసాగర్, అజయ్ మిశ్రా, తదితరులు కూడా పాల్గొన్నారు. -
నిరసనకారులపై కేరళ గవర్నర్ ఆగ్రహం
తిరువనంతపురం: ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొనేందుకు కానూర్ వచ్చిన కేరళ గవర్నర్ అరీఫ్ మహ్మద్ ఖాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడానికి శనివారం కానూర్ వచ్చిన గవర్నర్‌కు వ్యతిరేకంగా అక్కడి నిరసనకారులు ఆందోళనకు దిగారు. ఆయన ప్రసంగించే సమయంలో సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వారిపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైనేజ్‌లో మురికి దుర్వాసన వలె ఉన్నారంటూ నిరసనకారులను ఉద్దేశించి గవర్నర్ మండిపడ్డారు. వ్యక్తిగత ఎజెండాతో నిరసనలు చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. శాంతియుతంగా నిరసనలు చేసే హక్కు రాజ్యాంగం కల్పించిందని ప్రతిపక్ష పార్టీ నాయకులు తెలిపారు. కాగా సీఏఏను తొమ్మిది రాష్ట్రాల సీఎంలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. -
మహిళలు ఒక్క ఓటు వేయని గ్రామాలివి
ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రం, ఛక్వాల్ జిల్లాలో అదో గ్రామం. పేరు ధుర్నాల్. ఒకప్పుడు పేరుపోసిన బందిపోటు మొహమ్మద్ ఖాన్ భయం గుప్పిట్లో బ్రతికిన గ్రామం. ఇప్పుడా గ్రామం ఎంతో అభివద్ధి చెందింది. బాలుర కోసం రెండు ప్రభుత్వ హైస్కూల్, బాలికల కోసం ఓ ప్రత్యేక ప్రభుత్వ హైస్కూల్ ఉంది. బాల, బాలికల కోసం రెండు ప్రత్యేక డిగ్రీ కళాశాలలు కూడా ఉన్నాయి. పంజాబ్ రాష్ట్రంలోనే మహిళల అక్షరాస్యత ఈ గ్రామంలో ఎక్కువ. ఈ గ్రామానికో ఓ ప్రత్యేకత ఉంది. 1960 దశకం నుంచి ఈ గ్రామంలోని మహిళలు ఏ ఎన్నికల్లోనూ ఓటు వేయడం లేదు. వారు ఓటు వేయరాదంటూ వారి మగాళ్లు పెట్టిన షరతుకు వారు ఇప్పటికీ కట్టుబడి ఉన్నారు. ఓటర్లుగా వారి పేర్లు నమోదై ఉంటాయి. వారు ఓటు వేయరు. ఓటు వేయాల్సిందిగా పోటీ చేసే అభ్యర్థులు అడగరు. 1962లో ఎన్నికల సందర్బంగా ఎన్నికలకు ముందు ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగి పలువురు చనిపోయారట. ఆ ఘర్షణలు ఆడవాళ్ల కారణంగానే జరగడం వల్ల నాటి నుంచి ఎన్నికలకు దూరంగా ఉండాలంటూ అప్పటి పంచయతీ సర్పంచ్ మెహర ఖాన్ పిలుపునిచ్చారని, ఆ పిలుపునకు కట్టుబడి ఇంట్లోని ఆడవారిని ఎవరిని ఓటుకు అనుమతించమని గ్రామస్థులు ప్రతిజ్ఞ చేశారని గ్రామానికి చెందిన 63 ఏళ్ల జోహర్ ఖాన్ తెలిపారు. ధుర్నాల్ గ్రామం జాతీయ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్ఏ–61, పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గం పీపీ–23 పరిధిలోకి వస్తోంది. ఈ ప్రాంతంలో జాతీయ అసెంబ్లీ, ప్రాంతీయ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసే మహిళల శాతం కూడా చాలా తక్కువే. 2013లో ఎన్ఏ–61 నియోజక వర్గంకు జరిగిన ఎన్నికల్లో 4.42 శాతం మంది మహిళలు ఓటు వేయగా, పీపీ–23 ప్రాంతీయ అసెంబ్లీ నియోజక వర్గానికి జరిగిన ఎన్నికల్లో 5 శాతం మంది ఓటు వేశారు. ఈ రెండు ఎన్నికల్లో ధుర్నాల్ గ్రామంలో ఒక్కరంటే ఒక్క మహిళ కూడా ఓటు వేయలేదు. 15000 మంది జనాభాగల ఈ గ్రామంలో 11000 మంది ఓటర్లు ఉండగా, ఐదువేల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్లలో ఎంతో మంది ఉన్నత విద్యావంతులు ఉన్నప్పటికీ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇష్టపడడం లేదు. ‘నేను పోస్ట్ గ్రాడ్యువేట్‌ను. ఓటు వేయడం రాజ్యాంగపరంగా నాకు సంక్రమించిన ప్రాథమిక హక్కనే విషయం నాకు తెలుసు. నేను ఓటు వేయాలంటే ఇంట్లోని మగవారి అనుమతి తీసుకోవాలి కనుక ఓటు వేయడం లేదు’ పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ మహిళ తెలిపారు. ఎందుకు మీరు మహిళలను ఓటింగ్‌కు అనుమతించడం లేదని మగవాళ్లను ప్రశ్నించగా, అనుమతించమంటూ నాడు శపథం చేసినప్పుటు అల్లా ఉద్దేశించి ఆకాశం వైపు చేతులు చాచామని, అందుకని అల్లాకిచ్చిన మాట తప్పలేమని ఎక్కువ మంది సమాధానం ఇచ్చారు. ఇదే కారణంగా ఒక్క ధుర్నాల్ గ్రామంలోనే కాకుండా సమీపంలో ఉన్న దౌలార్, భల్వా, మోగ్లా, ధోక్దాల్ గ్రామాల్లో కూడా మహిళలు ఓటు వేయలేదు. 2013లో ఈ గ్రామాల్లో 17 పోలీంగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఒక్క మహిళ కూడా ఓటు వేయలేదు. ఈసారి జరుగనున్న ఎన్నికల్లో మహిళల చేత ఓటు వేయించేందుకు కొందరు సామాజిక కార్యకర్తకర్తలు ఈ గ్రామాల్లో ఇల్లిల్లు తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. -
ఆర్ట్స్ కళాశాలకు రూ.లక్ష విరాళం
అనంతపురం ఎడ్యుకేషన్ : ఎండోమెంట్ క్యాష్‌ప్రైజ్‌ల కోసం రిటైర్డ్ ప్రిన్సిపల్ పి. మహమ్మద్‌ఖాన్ ఆర్ట్స్ కళాశాలకు రూ. లక్ష విరాళంగా అందజేశారు. ఈయన ఈ కళాశాలలో 1964–67లో బీఎస్సీ బీజెడ్సీ గ్రూపులో చదివి, ఇదే కళాశాలలో 2000–03 మధ్య బాటనీ అధ్యాపకునిగా పని చేశారు. తర్వాత కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌గా పని చేసి రిటైర్డ్ అయ్యారు. తాను చదివిన, బోధించిన కళాశాల పట్ల అభిమానంతో ఈ విరాళం అందజేశారు. తల్లిదండ్రులైన పి. మహబూబీ, పి. యూసుఫ్‌ఖాన్ జ్ఞాపకార్థం డిపాజిట్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మొత్తంపై వచ్చే వార్షిక వడ్డీని మొదటి, ద్వితీయ, తృతీయ సంవత్సరాల బీఎస్సీ బాటనీ సబ్జెక్టులో మొదటి, ద్వితీయ స్థానాల్లో నిలిచే విద్యార్థులకు ప్రోత్సాహకాలుగా అందజేయాలని కోరారు. మహ్మద్‌ఖాన్‌ను ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. రంగస్వామి అభినందించారు.