mohammad rafi
-
యుగళధారతో మ్యూజిక్ థె‘రఫీ’
రఫీ సోలోలు వేన వేలు... వాటికి అభిమానులు ఉన్నారు. రఫీ డ్యూయెట్లు వేలకు వేలు... వాటికీ అభిమానులు ఉన్నారు. ఈ స్వీటు కావాలా ఆ జున్ను కావాలా అంటే చాయిస్ ఏమైనా ఉంటుందా ఎవరికైనా? రెండూ కావాలి. కాని రఫీతో డ్యూయెట్లు పాడి సరిజోడుగా నిలిచి సంగీతాభిమానులను మెప్పించిన అద్భుత గాయనీమణులను రఫీతో పాటు స్మరించుకోవాలి. డిసెంబర్ 24 రఫీ శతజయంతి. మరి ఆయనతో కలిసి పాడుదామా యుగళగీతం.లాహోర్ నుంచి ఒక అన్నను తోడు చేసుకుని బాంబేకు బయలుదేరిన రఫీ (Mohammed Rafi) తాను గాయకుడిగా బతకాలంటే ముందు సంగీత దర్శకుణ్ణి మెప్పించాలని తెలుసుకున్నాడు. ఆ రోజుల్లో నౌషాద్ చాలా పెద్ద డిమాండ్‌లో ఉన్నాడు. కాని ఆయనను నేరుగా కలిసే శక్తి రఫీకి లేదు. అందుకని అన్నాదమ్ములు ఆలోచించి నేరుగా లక్నో వెళ్లారు. అక్కడ నౌషాద్ తండ్రి ఉంటారు. ఆయన దగ్గర సిఫార్సు ఉత్తరం తీసుకుని బాంబే తిరిగి వచ్చి అప్పుడు నౌషాద్‌ను కలిశారు. ‘లాహోర్ నుంచి వచ్చావా? పాడతావా? ఏం పాడతావ్... నిన్ను వద్దనడానికి లేనంత పెద్ద రికమండేషన్ తెస్తివి’ అని నౌషాద్ రఫీని పరికించి చూసి తన టీమ్‌లోకి తీసుకున్నాడు. అప్పటికి తలత్ ఊపు మీదున్నాడు. అయినా సరే ‘దులారీ’ (1949)లో రఫీ పాడిన సోలో ‘సుహానీ రాత్ ఢల్ చుకీ నా జానే తుమ్ కబ్ ఆవొగే’ పాట పెద్ద హిట్ అయ్యి రఫీ దేశానికి పరిచయం అయ్యాడు. అయినప్పటికీ రావలసినంత పేరు రాలేదు. అప్పుడు నౌషాదే ‘బైజూ బావరా’ (1952)లో మళ్లీ పాడించాడు. ఆ సినిమాలో రఫీ పాడిన సోలో పాటలు ‘ఓ దునియాకే రఖ్వాలే’, ‘మన్ తర్పత్ హరి దర్శన్ కో ఆజ్’ పాటలు ఇక రఫీని తిరుగులేని గాయకుని స్థానంలో కూచోబెట్టాయి. రఫీ రేంజ్‌ను తెలిపిన పాటలు అవి. అయితే అప్పటికే నూర్జహాన్ పాకిస్తాన్ వెళ్లిపోగా ప్రతిభను, ప్రొఫెషనలిజాన్ని నిలబెట్టుకుంటూ లతా మంగేశ్కర్ ‘మహల్’ (1949)లో ‘ఆయేగా ఆయేగా ఆనేవాలా ఆయేగా’ పాటతో స్థిరపడింది. రఫీ, లతా తొలి పాట కామెడీ సాంగ్ అయినా ఆ తర్వాత వారి డ్యూయెట్లు సరైన రొమాంటిక్ టచ్‌ను అందుకున్నాయి. అందుకు ‘బైజూ బావరా’లోని ఈ పాటే సాక్ష్యం.తూ గంగాకి మౌజ్ మై యమునా కా ధారహో రహేగా మిలన్ యే హమారా హోహమారా తుమ్హారా రహేగా మిలన్...మేల్ సింగర్ కొందరికి సరిపోతాడు.. కొందరికి సరిపోడు అనే ధోరణి ఉంది. రఫీ.. రాజ్‌కపూర్‌కు(Raj Kapoor) మేచ్ కాడు. దిలీప్ కుమార్, దేవ్ ఆనంద్‌లకు బాగా సరిపోయేవాడు. కాని లతాకు ఆ అడ్డంకి లేదు. ఏ హీరోయిన్ గొంతైనా లతా గొంతే. మీనా కుమారి, నర్గిస్, వైజయంతీ మాల, మాలా సిన్హా.. అందరికీ లతా గొంతు. అందువల్ల రఫీ, లతాల పాటలు రాజ్ కపూర్ సినిమాల్లో తప్ప తక్కిన అన్నింటిలో కొనసాగాయి. అందరు సంగీత దర్శకులు సరైన తీపితో తయారైన రవ్వలడ్ల వంటి పాటలను వారి చేత పాడించారు.∙దో సితారోంకా జమీ పర్ హై మిలన్ ఆజ్ కీ రాత్ (కోహినూర్)∙ఓ జబ్ యాద్ ఆయే బహుత్ యాద్ ఆయే (పరాస్మణి)∙దిల్ పుకారే ఆరె ఆరె ఆరె (జువెల్ థీఫ్)∙జిల్ మిల్ సితారోంక ఆంగన్ హోగా (జీవన్ మృత్యు)∙వాదా కర్లే సాజ్నా (హాత్ కీ సఫాయి)..వీటికి అంతే లేదు. రఫీ తన కెరీర్లో షమ్మీ కపూర్‌కు పాడటానికి ఎక్కువ సరదా చూపాడు. వాళ్లిద్దరిదీ హిట్ పెయిర్. షమ్మీ కపూర్ సినిమాలో రఫీ డ్యూయెట్లు ఎక్కువగా ఆశా భోంస్లేకు (Asha Bhosle) వెళ్లినా లతా కూడా పాడింది. రఫీ–లతాల జోడి వెన్నెల–వెలుతురు లాంటిది. ఆ చల్లదనం వేరు.→ ఆశా భోంస్లేవ్యాంప్లకు పాడుతూ మెల్లమెల్లగా కుదురుకున్న గాయని ఆశా రఫీతో కలిసి గొప్ప పాటలు పాడింది. అన్నింటిలోకి కలకాలం నిలిచే పాట ‘అభీ నా జావో ఛోడ్ కర్ కె దిల్ అభీ భరా నహీ’ (హమ్ దోనో). ఈ పాటలో రఫీ బాగా పాడుతున్నాడా ఆశానా అనేది చెప్పలేం. ఓపి నయ్యర్ ఆశా చేత ఎక్కువ పాడించడం వల్ల ‘కశ్మీర్ కి కలీ’లో రఫీతో ‘దీవానా హువా బాదల్’, ‘ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా’లో ‘బహుత్ షుక్రియా బడీ మెహర్బానీ’ వంటి సూపర్హిట్లు సాధించింది. ఆర్.డి.బర్మన్ తన సంగీతంలో రఫీ, ఆశాలను అద్భుతమైన పాటల్లో కూచోబెట్టాడు. ‘ఓ మేరే సోనరే సోనరే సోనరే’ (తీస్రీ మంజిల్), ‘చురాలియా హై తుమ్నే జో దిల్‌కో’ (యాదోంకి బారాత్)... ఒంట్లో నిస్సత్తువను వదలగొట్టే పాటలు.→ గీతా దత్ఎంతో గొప్ప గాయని అయి ఉండి తక్కువ కాలం పాడిన గీతా దత్ (గీతా రాయ్) గురుదత్ సినిమాల్లో రఫీతో మురిపమైన పాటలు పాడింది. ‘సున్ సున్ సున్ జాలిమా’ (ఆర్ పార్), ‘హమ్ ఆప్కే ఆంఖోమే ఇస్ దిల్ కో బసాదేతో’(ప్యాసా) ఇవి రెండు గురుదత్ మీద తీసినవి. ‘సిఐడి’లో దేవ్ ఆనంద్, షకీలా మీద తీసిన ‘ఆంఖోహి ఆంఖోమే ఇషారా హోగయా’..పెద్ద హిట్. గురుదత్ సినిమాల్లో కమెడియన్ జానీ వాకర్‌కు పాటలు ఉంటాయి. జానీ వాకర్‌కు కూడా రఫీనే పాడతాడు. తోడు గీతా దత్. ‘అయ్ దిల్ ముష్కిల్ హై జీనా యహా’ (సిఐడి), ‘జానే కహా మేరా జిగర్ గయా జీ’(మిస్టర్ అండ్ మిసెస్ 55)... ఇవన్నీ దశాబ్దాలైనా నిలిచి ఉన్న పాటలు. రఫీతో పాటు గాయనీమణులు నిలబెట్టిన పాటలు.→ సుమన్ కల్యాణ్పూర్రాయల్టీ విషయంలో లతా మంగేష్కర్‌కు (Lata Mangeshkar) రఫీకు విభేదాలు వచ్చాయి. రాయల్టీ కావాలని లతా, అక్కర్లేదని రఫీ మూడేళ్లు విభేదించి పాడలేదు. 1961 నుంచి 63 వరకు సాగిన ఈ కాలంలో రఫీతో డ్యూయెట్లు పాడిన గాయని సుమన్ కల్యాణ్‌పూర్. ‘పూర్‌మేన్స్ లతా’గా పేరుబడ్డ సుమన్‌కు గొప్ప ప్రతిభ ఉన్నా తక్కువ అవకాశాలు దొరికాయి. అయినా సరే రఫీ, సుమన్ కలిసి మంచి హిట్స్ ఇచ్చారు. వీటిలో ‘బ్రహ్మచారి’ కోసం పాడిన ‘ఆజ్ కల్ తెరె మెరె ప్యార్ కే చర్చే హర్ జబాన్ పర్’, ‘జబ్ జబ్ ఫూల్ ఖిలే’లో ‘నా నా కర్తే ప్యార్ తుమ్హీసే కర్బైఠే’ పెద్ద హిట్స్‌గా నిలిచాయి. ‘రాజ్ కుమార్’లోని ‘తుమ్నే పుకారా ఔర్ హమ్ చలే ఆయే’ కూడా పెద్ద హిట్టే. అయితే లతా, రఫీల మధ్య సంధి కుదరడంతో సుమన్ వెనక్కు వెళ్లిపోయింది.వీళ్లే కాదు ఎందరో గాయనులతో రఫీ డ్యూయెట్స్ పాడాడు. షంషాద్ బేగంతో ‘లేకె పెహలా పెహలా ప్యార్’, ముబారక్ బేగంతో ‘ముజ్కో అప్నే గలే లగాలో’, హేమలతాతో ‘తూ ఇస్ తర్హా మేరి జిందగీమే’... లాంటి ఎన్నో మంచి పాటలు ఉన్నాయి. సుశీలతో ‘ఇద్దరి మనసులు ఒకటాయె’, జానకితో ‘నా మది నిన్ను పిలిచింది గానమై’... ఈ పాటలు అపురూపం. రఫీ ఘనతలో రఫీ ఫ్రతిభకు మరో సగమై నిలిచిన గాయనీమణులందరికీ రఫీ శతజయంతి సందర్భంగా జేజేలు పలకాలి. రఫీకి జిందాబాద్‌లు కొట్టాలి. -
మహమ్మద్ రఫీ కుటుంబ సభ్యుల వివాహానికి హాజరైన సీఎం జగన్
-
మొహమ్మద్ రఫీ విజృంభణ
సాక్షి, ఒంగోలు: ఆంధ్ర జట్టు బౌలర్లు మళ్లీ మెరిశారు. రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో భాగంగా కేరళతో ఇక్కడి సీఎస్ఆర్ శర్మ కాలేజీ మైదానంలో సోమవారం ఆరంభమైన మ్యాచ్‌లో తొలి రోజు ఆంధ్ర జట్టు పైచేయి సాధించింది. ఆంధ్ర బౌలర్లు మొహమ్మద్ రఫీ (5/62)తోపాటు పృథ్వీ రాజ్ (3/37), శశికాంత్ (2/38) హడలెత్తించడంతో కేరళ తమ తొలి ఇన్నింగ్స్ లో 49.5 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. రంజీ అరంగేట్రం మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు తీసిన తొమ్మిదో ఆంధ్ర బౌలర్‌గా రఫీ గుర్తింపు పొందాడు. ఆట ముగిసే సమయానికి ఆంధ్ర వికెట్ నష్టపోయి 57 పరుగులు చేసింది. హైదరాబాద్ 171 ఆలౌట్ రాజస్తాన్‌తో ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మరో మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకు ఆలౌటైంది. సుమంత్ (51; 7 ఫోర్లు) రాణించాడు. రాజస్తాన్ బౌలర్లు రితురాజ్, అనికేత్ చెరో 3 వికెట్లు తీశారు. సర్ఫరాజ్ డబుల్ సెంచరీ... ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ ట్రిపుల్ సెంచరీతో కదం తొక్కిన ముంబై బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్... హిమాచల్‌ప్రదేశ్‌తో ప్రారంభమైన మ్యాచ్‌లో అజేయ డబుల్ సెంచరీ (226 బ్యాటింగ్; 32 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో చెలరేగాడు. ఫలితంగా ముంబై తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు నష్టపోయి 372 పరుగులు చేసింది. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ మహ్మద్ రఫీ
-
మానవత్వం చాటిన పోలీసులు, వైద్యులు
ఉస్మానియా వైద్యులు, పోలీసుల మానవత్వం ఓ అమ్మాయిని తన ఇంటికి చేర్చింది. గత ఆరు నెలలుగా ఉస్మానియా ఆసుపత్రి పరిసరాలు, ఫుట్‌పాత్‌లపై పడుకుంటూ కాలం వెల్లదీస్తున్న అభాగ్యురాలిని తన ఊరికి చేర్చారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా మాల్ గ్రామానికి చెందిన స్వాతి(20) గత ఆరునెలల క్రితం ఊరు నుంచి నగరానికి వచ్చింది. ఇటీవల ఉస్మానియా ఆసుపత్రి పరిసరాలలో తిరుగుతుండగా గురువారం గుర్తించిన ఎస్పీఎఫ్ పోలీసులు అఫ్జల్‌గంజ్ సీఐ అంజయ్య, ఉస్మానియా వైద్యులు మహ్మద్ రఫీకి సమాచారం ఇవ్వడంతో అమ్మాయి నుంచి తగిన వివరాలు సేకరించి ఆసుపత్రిలో చికిత్స చేశారు. స్వాతి తన ఊరు పేరు, తన పేరు మాత్రమే చెప్తుండడంతో తన ఊరికి పంపాలని వారు నిర్ణయించి శుక్రవారం పోలీసులు వాహనాన్ని సమాకూర్చి పోలీసుల చేత స్వాతి ఊరు మాల్‌కు పంపించారు. సాక్షితో ఆర్ఎంఓ రఫి మాట్లాడుతూ... స్వాతి మతిస్ధిమితం కోల్పోలేదని, ఏదో భయాందోళనకు గురై ఇంటి నుండి వచ్చి ఇక్కడ ఇబ్బంది పడుతుందని, ఏ విషయమడిగినా ఏడుస్తుండడంతో ఇన్స్పెక్టర్ అంజయ్యతో మాట్లాడి తన గ్రామానికి పంపేలా ఏర్పాటు చేశామన్నారు. -
సహజీవనం చేస్తున్న యువతితో గొడవపడి...
హైదరాబాద్: సహజీవనం చేస్తున్న మహిళతో గొడవపడి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన మహ్మద్ రఫీ (29) పోలీస్ శాఖలో అటెండర్‌గా విధులు నిర్వహించేవాడు. అయితే ఏడాదిన్నర కిందట సస్పెండ్ అయ్యాడు. రఫీకి కరీంనగర్‌కు చెందిన కవిత అనే బీ-ఫార్మసీ చదివిన మహిళ పరిచయమైంది. వీరిద్దరూ ప్రేమించుకుని గత రెండు సంవత్సరాలుగా పంజగుట్ట దుర్గానగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఇద్దరి మధ్య స్వల్ప గొడవలు జరగడంతో గురువారం కవిత తన ఇంటికి వెళ్లిపోయేందుకు సిద్ధపడింది. రఫీ వద్దని వారించినా వినకపోవడంతో చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇంటి బయట ఉన్న కవిత ఈ విషయాన్ని గమనించి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి తలుపు పగులగొట్టి అతన్ని కిందకు దింపి సోమాజిగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రఫీ ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మహమ్మద్ రఫీని విస్మయానికి గురి చేసిన ఘంటసాల పాట
వాయిద్యానికి ప్రాణం వచ్చి సాహిత్యాన్ని పలుకుతున్నట్లుంటుంది ఘంటసాల మాస్టారి గాత్రం. దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు లోగిళ్లను పునీతం చేసిన కంఠం ఆయనది. తెలుగు సినిమా స్వర్ణయుగ వైభవానికి ప్రతీక ఘంటసాల పాట. గాయకునిగా, సంగీత దర్శకునిగా, నిర్మాతగా తెలుగు సినీ చరిత్రలో ఘంటసాలది ఓ సువర్ణాధ్యాయం. నేడు ఆ గానగంధర్వుడి జయంతి. ఈ సందర్భంగా ఆయన స్మృతుల్ని కాసేపు నెమరువేసుకుందాం. అక్కినేని, అంజలీదేవి జంటగా వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో రూపొందిన ‘సువర్ణసుందరి’(1957) సినిమా ఆ రోజుల్లో ఓ సంగీత సంచలనం. ఆదినారాయణరావు స్వరపరిచిన ఈ సినిమా గీతాలు శ్రోతల్ని శ్రవణానందభరితుల్ని చేశాయి. ఇందులోని ప్రతి పాటా ఆణిముత్యమే అయినా... అందులో మేలిముత్యం మాత్రం ‘హాయి హాయిగా ఆమని సాగె’ పాట. రాగమాలికలో స్వరపరిచినఈ పాటను ఘంటసాల, జిక్కీ ఆలపించారు. సంగీత జ్ఞానుల ప్రశంసలందుకున్న పాట ఇది. ఘంటసాల గురించి మాట్లాడుకునే ముందు ఈ పాట గురించి తప్పకుండా చెప్పుకోవాలి. ఎందుకంటే.. గాయకునిగా ఘంటసాల సామర్థ్యాన్ని తెలియజేసిందీ పాట. 1958లో ‘సువర్ణసుందరి’ చిత్రాన్ని హిందీలో నిర్మించడానికి తలపెట్టారు ఆ చిత్రానికి నిర్మాత కూడా అయిన ఆదినారాయణరావు. మద్రాసులో పాటల రికార్డింగ్ మొదలైంది. ‘హాయి హాయిగా ఆమని సాగె’ పాట హిందీ వెర్షన్‌ని మహమ్మద్ఫ్రీ, లతామంగేష్కర్లపై రికార్డ్ చేస్తున్నారు ఆదినారాయణరావు. ఎంతటి కష్టతరమైన గీతాన్నైనా సునాయాసంగా పాడేయగల మహా గాయకుడు రఫీ... రాగమాలికలో స్వరపరిచిన ఈ పాటను పాడటానికి ప్రారంభంలో కాస్త ఇబ్బంది పడ్డారు. ఈ పాటను ఘంటసాల రెండే టేకుల్లో ఓకే చేశారని తెలిసి ఆయన విస్మయానికి లోనయ్యారు. ఈ పాటను అంత తేలిగ్గా ఘంటసాల ఎలా పాడగలిగారో రఫీకి అంతుపట్టలేదు. యాదృచ్ఛికంగా.. అప్పుడే... అదే రికార్డింగ్ థియేటర్లోకి అడుగుపెట్టారు ఘంటసాల. వేరే సినిమా పాటల రికార్డింగ్ పనిమీద ఆయన అక్కడకు రావడం జరిగింది. ఒక్కసారిగా అక్కడ ఘంటసాలను చూడగానే రఫీ ఉద్వేగానికి లోనయ్యారు. గట్టిగా ఆయన్ను ఆలింగనం చేసుకున్నారు. అక్కడే ఉన్న లతాజీ అయితే... ఆ పాటను ఒక్కసారి తనతో కలిసి ఆలపించాలని ఘంటసాలను అభ్యర్థించారు. అయితే.. లతామంగేష్కర్ అభ్యర్థనను ఘంటసాల తోసిపుచ్చారు. ఆమె ఎంత బతిమాలినా ఘంటసాల ఏదో ఒక సాకు చెప్పి అక్కడ్నుంచీ తప్పుకున్నారు. ఇంటికెళ్లి ఈ విషయాన్ని తన భార్య సావిత్రమ్మకు చెప్పారు ఘంటసాల. ‘లతాజీ స్వయంగా పాడమని అడిగినప్పుడు... పాడొచ్చు కదా..’ అని అమె అంటే.. ‘‘రఫీగారు ఓ వైపు ఆ పాట పాడుతున్నప్పుడు.. నేనెళ్లి అదే పాటను లతాజీతో పాడటం రఫీగారిని అవమానించడమే అవుతుంది. అది సంస్కారం కాదు’’ అన్నారట ఘంటసాల. సరిగ్గా ఇది జరిగిన 11ఏళ్ల తర్వాత ఘంటసాల, రఫీల మధ్య మరో సంఘటన చోటుచేసుకుంది. ఎన్టీఆర్ ‘భలేతమ్ముడు’ సినిమాలోని పాటలను కొన్ని కారణాలవల్ల ఘంటసాలతో గాక, మహమ్మద్ఫ్రీతో పాడించాలని నిర్ణయించుకున్నారు ఆ చిత్ర నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య. ‘భలేతమ్ముడు’ పాటల పనిమీద మద్రాస్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన రఫీ.. సరాసరి ఘంటసాల ఇంటికే వెళ్లారు. ‘మీరుండగా తెలుగు సినిమాకు నేను పాడటం నాకు ఇబ్బందిగా అనిపిస్తోంది’ అని రఫీ వాపోయారు. ‘మీ గొంతునుంచి జాలువారే తెలుగు పాట వినాలన్న ఆకాంక్ష.. మా శ్రోతలతో పాటు, నాకూ ఉంది. ఇంకేమీ ఆలోచించకుండా పాడండి’ అని నచ్చజెప్పి రఫీని రికార్డింగ్ థియేటర్‌కి పంపారట ఘంటసాల. రఫీ పాటకు ఘంటసాల ఎలాగైతే అభిమానో... ఘంటసాల పాటకు రఫీ కూడా అంతే అభిమాని. పలు సందర్భాల్లో ఈ విషయాన్ని మహమ్మద్ రఫీ వ్యక్తం చేశారు. తెలుగు భాష ఉన్నంతవరకూ ఘంటసాల పాట ఉంటుంది. తెలుగు శ్రోతల హృదయాల్లో ఘంటసాల ఎప్పటికీ చిరంజీవే.