విషాదం మిగిల్చిన మొహర్రం
అనంతపురం సెంట్రల్ : మొహర్రం విషాదం మిగల్చింది. ఊరేగింపుగా వస్తున్న పీర్లను చూస్తుండగా గోడ కూ లి ఓ బాలుడు అక్కడికక్కడే మరణించ డం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిం ది. అనంతపురంలోని బాబానగర్‌లో సోఫియా, మహమ్మద్ రఫీ దంపతుల కుమారుడు షబ్బీర్ అలీ(8) పాత గోడ కూలి మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మొహర్రం పురస్కరించుకుని ఆదివారం రాత్రి పానకాల పూజ నిర్వహించారు. మరోవైపు కాలనీలోకి పీర్లు ఊరేగింపుగా వచ్చాయి. వాటిని అందరూ ఆసక్తిగా తిల కిస్తున్నారు.
పీర్లను చూసేందుకు వీధిలోకి వచ్చిన అలీ ఓ ఇంటిపక్కన గోడ చాటున నిలబడ్డాడు. అంతలోనే గోడ కూలి రాళ్లు, మట్టి దిబ్బల కిం ద కూరుకుపోయాడు. స్థానికులు గుమనించి వెంటనే రాళ్లను తొలగిం చారు. అప్పటికే తీవ్రంగా గాయపడ్డ అలీని స్థానిక సర్వజనాస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. దీంతో కుటుంబంలో కన్నీరుమున్నీరయ్యారు. మహ్మద్ రఫీకి ఇద్దరు కుమారులు. షబ్బీర్ అలీ రెండో వాడు. స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో యూకేజీ చదివేవాడు.