Mosquitoes Attack
-
రాజమౌళి ఈగలాగ.. దోమలు కూడా రివెంజ్ తీర్చుకుంటాయా?
వర్షాకాలం వచ్చేసింది.. ఈ సీజన్లో దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే దోమలు మనుషులనే ఎందుకు కుడతాయి? ఎంతమంది ఉన్నా అదేపనిగా కొందరినే ఎందుకు టార్గెట్ చేసి అటాక్ చేస్తాయి? మరికొందరిని మాత్రం అస్సలు కుట్టవు ఎందుకో? ఇలా మనలో మనమే చాలాసార్లు ప్రశ్నలు వేసుకుంటుంటాం. అయితే నిజానికి ఈ విషయంలో దోమలకేమీ పక్షపాతం ఉండదట. దీని వెనుక సైన్స్ ఉందంటున్నారు పరిశోధకులు. మనకు నచ్చిన ఆహారాన్ని తీసుకున్నట్లే దోమలు కూడా వాటికి నచ్చిన వాళ్ల రక్తం తాగేస్తాయి. అంతలా దోమలను ఆకర్షించే అంశాలేంటి? దీని వెనకున్న స్టోరీ ఏంటీ చదివేద్దాం. ► సాధారణంగా దోమల్లో మగదోగమలు మనిషిని కుట్టవు. ఇవి చెట్ల రసాలపై ఆధారపడి జీవిస్తాయి. ఆడదోమల్లోనే మనిషిని కుట్టేందుకు అవసరమైన ముఖ విన్యాసం ఉంటుంది. అందువల్ల ఇవే మనిషి రక్తాన్ని పీలుస్తాయి.అట్లాగని రక్తం వీటి ఆహారం అనుకోవద్దు. కేవలం గుడ్లు పెట్టడానికి అవసరమైన ప్రొటీన్ దోమలకు మనిషి రక్తం ద్వారా లభిస్తుంది. దీనికోసమే అవి మనుషులను కుడతాయి. Yesterday, we visited Kyenjojo SS who are making mosquito repellent Vaseline.In 2021, Uganda had the 3rd highest global burden of malaria cases (5.1%) and the 7th highest level of deaths (3.2%). In creating this Vaseline, the students are looking to prevent rather than cure. pic.twitter.com/97EEujl6Tl— Investors Club Ltd Ug (@InvestorsClubUg) July 12, 2023 ► ఏ, బీ బ్లడ్ గ్రూపుల వారితో పాటు ఏబీ పాజిటివ్ ఉన్న బ్లడ్ గ్రూపుల వారిని దోమలు ఎక్కువగా కుడతాయని కొన్ని అధ్యయానాలు చెబుతున్నాయి. ఎందుకంటే వీరి శరీరం నుంచి వచ్చే ఒక రకమైన వాసనను పసిగట్టి దోమలు అటాక్ చేస్తాయట. ► చర్మంపై సహజంగా లభించే యాసిడ్ల వచ్చే వచ్చే వాసనకు దోమలు ఆకర్షితమం అవుతాయని రాక్ ఫెల్లర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చారు. ► ఆల్కహాల్ ఎక్కువ తీసుకునేవారి శరీర ఉష్ఱోగ్రత ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు దోమ కాటుకు గురికాక తప్పదట. Imagine not killing a mosquito that is sitting on your arm sucking your blood pic.twitter.com/jv7ts5uSvt— greg (@greg16676935420) July 17, 2023 ► కార్బన్ డై ఆక్సైడ్ అంటే దోమలుకు అమితమైన ఇష్టం, ఎకువగా సిఓ2 వదిలేవాళ్ళ చుట్టూ దోమలు వాలిపోతుంటాయట. ► గర్బవతులు, ఒబేసిటీతో బాధపడేవారి రక్తంలో మెటబాలిక్ రేట్స్ అధికంగా ఉంటాయట. అందుకే వీరిని దోమలు టార్గెట్ చేస్తాయట. ► చెమట ఎక్కువగా వచ్చేవారిలో లాక్టిక్ యాసిడ్, అమ్మోనియా రసాయనాల వల్ల దోమలు కుడతాయి. ► అంతేకాకుండా నల్లరంగు దుస్తులు ఎక్కువగా వేసుకుంటే దోమలు అట్రాక్ట్ అవుతాయట. దోమతెరల్లో ఎన్నో వినూత్న రకాలు, ఇవి ట్రై చేయండి The mosquitoes in Haiti would just fold it back https://t.co/RJi3hXsrQG— 💲LEX💲 (@Zoboylex) July 17, 2023 -
ఒంటివాసనే దోమకాటుకు మూలం
న్యూయార్క్: దోమలు. మనందరికీ ఉమ్మడి శత్రువులు. మలేరియా, జైకా, డెంగీ ప్రాణాంతక జ్వరాలకు కారణం. ఇవి కొందరినే ఎక్కువగా కుట్టడానికి కారణం ఏమిటి? ఫలానా రక్తం గ్రూప్ ఉన్నవారిని, రక్తంలో చక్కెర స్థాయిలు బాగా ఉన్నవారిని, వెల్లుల్లి, అరటిపండ్లు ఎక్కువగా తినేవారిని, మహిళలను దోమలు అధికంగా కుడుతుంటాయని అనుకుంటుంటారు. కానీ, ఇవేవీ నిజం కాదని అమెరికాలోని రాక్ఫెల్లర్ వర్సిటీ పరిశోధకులు తేల్చిచెప్పారు. శరీరం నుంచి వెలువడే ఓ రకం వాసనే దోమలను ఆయస్కాంతంలా ఆకర్షిస్తుందని, అలాంటి వారినే అవి ఎక్కువగా కుడుతుంటాయని తేల్చారు. ఈ వాసనకు కారణం శరీరంలోని కొవ్వు అమ్లాలు (ఫ్యాటీ యాసిడ్స్). ఇవి దోమలను ఆకర్షించే వాసనను ఈ ఉత్పత్తి చేస్తాయట! అధ్యయనం వివరాలను ‘జర్నల్ సెల్’లో ప్రచురించారు. మస్కిటో మ్యాగ్నెట్ మారదు చర్మంలో కార్బోజైలిక్ యాసిడ్స్ స్థాయిలు అధికంగా ఉన్నవారి పట్ల దోమలు విపరీతంగా ఆకర్షణకు గురవుతాయని అమెరికాలోని ‘రాక్ఫెల్లర్స్ ల్యాబొరేటరీ ఆఫ్ న్యూరోలింగ్విస్ట్ అండ్ బిహేవియర్’ ప్రతినిధి లెస్లీ వూషెల్ చెప్పారు. చర్మంలో భారీగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటే దోమల ముప్పు అధికమేనని వివరించారు. జైకా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్, చికున్‌గున్యా వంటి జ్వరాలకు కారణమయ్యే ‘ఎడిస్ ఈజిప్టి’ దోమలపై మూడేళ్లు అధ్యయనం చేశారు. చర్మంలో ఫ్యాటీ యాసిడ్స్ స్థాయిలు బాగా ఉన్నవారే ఎక్కువగా దోమకాటుకు గురవుతున్నట్లు గుర్తించారు. ఆ అమ్లాల నుంచి ఉత్పత్తయ్యే గ్రీజులాంటి కార్బోజైలిక్ యాసిడ్స్ చర్మంపై కలిసి పొరలాగా పేరుకుంటాయి. వాటి నుంచి వచ్చే ఒక రకమైన వాసన దోమలను ఆకట్టుకుంటుందట!. -
మలేరియా వ్యాప్తిని నిరోధించే దోమలు
లండన్: మలేరియా.. మానవాళికి పెనుముప్పుగా మారిన అతిపెద్ద వ్యాధి. దోమల నుంచి వ్యాపించే మలేరియా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా లక్షలాది మంది మరణిస్తున్నారు. వ్యాధి నివారణకు ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. మలేరియా వ్యాప్తిని అరికట్టే దోమలను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇందుకోసం సాధారణ దోమల్లో జన్యుపరమైన మార్పులు చేశారు. మలేరియాకు కారణమయ్యే పారాసైట్లు జన్యుపరంగా మార్పు చేసిన ఈ దోమల్లో వేగంగా పెరగవని చెబుతున్నారు. మలేరియాను అరికట్టడంలో ఇదొక శక్తివంతమైన ఆయుధం అవుతుందని పేర్కొంటున్నారు. యూకేలోని ఇంపీరియల్ కాలేజీ లండన్‌తోపాటు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌కు చెందిన ‘ఇన్స్టిట్యూట్ ఫర్ డిసీజ్ మోడలింగ్’ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. ఈ వివరాలను సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురించారు. మలేరియా సోకిన వ్యక్తిని కుట్టిన ఆడ దోమ మరో వ్యక్తిని కుడితే అతడికి కూడా వ్యాధి సోకుతుంది. అంటే దోమల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. మలేరియా పారాసైట్లు తొలుత దోమ ఆంత్రంలోకి చేరుకుంటాయి. అక్కడే ఇన్ఫెక్షన్ కలిగించే స్థాయికి ఎదుగుతాయి. అనంతరం లాలాజల గ్రంథుల్లోకి చేరుకుంటాయి. ఆంత్రంలో పారాసైట్లు ఎదగడానికి ఎక్కువ సమయం పట్టేలా చేశారు. పారాసైట్లు అభివృద్ధి చెంది, మనిషిని కుట్టే లోపే దోమల జీవితకాలం ముగుస్తుందని చెబుతున్నారు. ప్రపంచంలో సగం జనాభాకు మలేరియా రిస్క్ పొంచి ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. 2021లో ప్రపంచవ్యాప్తంగా 24.10 కోట్ల మలేరియా కేసులు నమోదయ్యాయి. 6,27,000 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. -
Mosquitoes: ఆ రంగుల బట్టలేసుకుంటే మాత్రం ‘అంతే’
సాయంత్రమైందంటే చాలు పరుగెత్తుకొస్తాయి దోమలు. చెవుల పక్కన చేరి వాటి భాషలో హలో చెబుతుంటాయి. కుట్టి కుట్టి రక్తాన్ని పీల్చేస్తుంటాయి. అంతటితో అయి పోతుందా.. లేనిపోని రోగాలను కూడా అంటి స్తాయి. అందుకే దోమ తెరలు, ఆల్ అవుట్లు, రకరకాల ప్రయోగాలతో దోమల్ని దూరం పెట్టేందుకు ప్రయత్నిస్తుంటాం. ఇవన్నీ సరే.. మనం ఎక్కడున్నా సరే అసలు దోమలు మన దగ్గరకే రాకుండా ఉండాలంటే ఏం చేయాలని చాలా మంది అనుకునే ఉంటారు. తాజాగా శాస్త్రవేత్తలు కూడా ఇదే ఆలోచనపై పరిశోధన చేశారు. 4 రకాల రంగుల బట్టలు వేసుకుంటే దోమలు మనల్ని కాస్త తక్కువగా కుడతాయని, ఇంకో 4 రకాల రంగుల బట్టలేసుకుంటే మాత్రం ‘అంతే’ సంగతులని కనుగొన్నారు. ఆ రంగుల కథేంటో, దోమలు రంగులను ఎలా గుర్తిస్తు న్నాయో తెలుసుకుందాం. వాసన, రంగుతో పసిగట్టేసి.. మనుషులు విడుదల చేసే కార్బన్ డై ఆక్సైడ్, చెమట వాసన, శరీర ఉష్ణోగ్రతను గుర్తించాక నేరుగా మనుషుల దగ్గరకు దోమలు వస్తున్నాయని ఇదివరకే కనుగొన్నారు. తాజా పరిశోధనలో నాలుగో అంశాన్ని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. అదే ‘రంగు’. చెమట, కార్బన్ డై ఆక్సైడ్ వాసన గుర్తించనంత వరకు మనుషులున్నా, ఇంకేమున్నా దోమలు పట్టించుకోలేదని.. కానీ వాటి వాసనను పసిగట్టాక మాత్రం ఆ వాసన వస్తున్న వైపు ఎగురుతున్నాయని గుర్తించారు. అయితే ఇందులోనూ ఇంకో ఆసక్తికరమైన అంశాన్ని కనుగొన్నారు. వాసన వచ్చే ప్రాంతంలో ఎరుపు, నారింజ, నలుపు, సియాన్ రంగులవైపు దోమలు ఎక్కువగా వెళ్లాయని.. ఆకుపచ్చ, ఊదా, నీలం, తెలుపు రంగులను పట్టించుకోలేదని గమనించారు. మనుషుల శరీరం దోమలకు ఎరుపు–నారింజ రంగు రూపంలో కనిపిస్తుందని, అందుకే నేరుగా మన దగ్గరకు వచ్చేస్తాయని తెలుసుకున్నారు. మన శరీర ఛాయతో వాటికి సంబంధం లేదని, అన్ని శరీరాలూ వాటికి ఎరుపు–నారింజ రంగులోనే కనిపిస్తాయని చెబుతున్నారు. కాబట్టి ఎరుపు, నారింజ, నలుపు, సియాన్ రంగుల బట్టలు వేసుకుంటే మన శరీర రంగుకు ఆ బట్టల రంగు తోడై దోమలు మరింత ఎక్కువగా మన దగ్గరకు వస్తాయని అంటున్నారు. ఆకుపచ్చ, ఊదా, నీలం, తెలుపు రంగుల బట్టలు వేసుకుంటే కాస్త తక్కువగా ఆకర్షితమవుతాయని వివరిస్తున్నారు. ప్రయోగం ఎలా చేశారు? పరిశోధన కోసం ఒక్కో దోమను ఒక్కో టెస్ట్ చాంబర్లో పెట్టి మరీ శాస్త్రవేత్తలు పరీక్ష చేశారు. ఈ చాంబర్లలోకి రకరకాల వాసనలు పంపారు. అదే సమయంలో రకరకాల రంగులను ప్రదర్శించి చూశారు. ఎలాంటి వాసన లేనప్పుడు చాంబర్లో ఎలాంటి రంగును ప్రదర్శించినా దోమలు పట్టించుకోలేదు. కార్బన్ డై ఆక్సైడ్‌ను పంపాక ఆకుపచ్చ, నీలం, ఊదా రంగులను ప్రదర్శించినా పెద్దగా స్పందించలేదు. కానీ కార్బన్ డై ఆక్సైడ్‌తోపాటు ఎప్పుడైతే ఎరుపు, నారింజ, నలుపు, సియాన్ రంగులను ప్రదర్శించారో ఆ రంగుల వైపు వెళ్లడం గమనించారు. మామూలుగా మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు మంచి బిర్యానీ వాసన వస్తే ‘ఎక్కడినుంచబ్బా’ అని అటూ ఇటూ చూస్తాం. దోమలు కూడా కార్బన్ డై ఆక్సైడ్ వాసన రాగానే ‘వాటి బిర్యానీ’ ఎక్కడని చూస్తాయని శాస్త్రవేత్తలు సరదాగా చెప్పారు. శాస్త్రవేత్తలు తమ చేతికి రకరకాల గ్లోవ్స్ వేసుకొని కూడా పరిశీలించారని, అందులోనూ ఎరుపు, నారింజ, నలుపు, సియాన్ రంగు గ్లోవ్స్ వైపు దోమలు ఎక్కువగా వెళ్లాయని.. ఆకుపచ్చ, ఊదా, నీలం, తెలుపు రంగుల గ్లోవ్స్‌ను పట్టించుకోలేదని తెలిపారు. దోమలు వాటి ఆహారాన్ని ఎలా వెతుకుతాయో తెలుసుకోవడానికి ఇది తొలిమెట్టేనని, మనుషుల శరీరం నుంచి వచ్చే వాసనలను ఎలా అవి గుర్తిస్తున్నాయో తెలుసుకోవాల్సి ఉందని చెప్పారు. – సాక్షి సెంట్రల్‌డెస్క్ -
మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా.. ఇక డెంగీ దోమలు మీ దగ్గరే!
సాక్షి, హైదరాబాద్: ఆ మొక్క పేరు మనీ ప్లాంట్. ఇంటి ఆవరణలో ఇది పెంచితే సంపద సంప్రాప్తిస్తుందని కొందరి నమ్మకం. డబ్బు మాటేమోగానీ ఈ ప్లాంట్‌తో డెంగీ దోమలు కచ్చితంగా వచ్చి తీరుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందం, ఆహ్లాదం కోసం సిటీజనులు పెంచుతున్న పూలు, తీగజాతి మొక్కలు.. వాటి కోసం ఏర్పాటు చేసిన పూల కుండీలు ప్రస్తుతం డెంగీ దోమలకు నిలయంగా మారుతున్నాయడంలో అతిశయోక్తి లేదేమో. హైదరాబాద్ జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు దేశంలోనే అత్యధికంగా 537 డెంగీ కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆ తర్వాత స్థానాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా లు ఉన్నాయి. సాధారణంగా పారిశుద్ధ్య లోపం ఎ క్కువగా ఉన్న మూసీ పరీవాహక ప్రాంతాల్లో డెంగీ జ్వరాలు రావాలి కాని.. సంపన్నులు ఎక్కువగా నివసించే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో నమోదవుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. చదవండి: మీ ఇష్టం.. గణేష్ విగ్రహాల విషయంలో ఆంక్షల్లేవ్ 30 శాతం కేసులు అక్కడే.. ► ప్రస్తుతం హైదరాబాద్ సహా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో నమోదైన కేసుల్లో 30 శాతం సంపన్నులు అధికంగా నివాసం ఉండే ప్రాంతాల్లోనే నమోదయ్యాయి. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట్, యూసఫ్‌గూడ, సికింద్రాబాద్‌లలో నమోదైనట్లు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ►పేద, మధ్య తరగతి ప్రజలతో పోలిస్తే సంపన్నుల నివాసాలు విశాలంగా ఉంటాయి. వీరు ఇంటి ఆవరణలో అందం, ఆహ్లాదకర వాతావరణం కోసం మనీప్లాంట్లు, రకరకాల పూల మొక్కలు పెంచుకుంటారు. వీటికోసం భారీ కుండీలను ఏర్పాటు చేస్తుంటారు. వర్షపు నీరు వీటిలో చేరి రోజుల తరబడి నిల్వ ఉంటుంది. ► వీటిలో డెంగీ దోమలు గుండ్లు పెట్టి వాటి వృద్ధికి కారణమవుతున్నట్లు వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త కాలనీలు, నిర్మాణాలు, సెల్లార్లు ఎక్కువగా ఉన్న శివారు ప్రాంత మున్సిపాలిటీల్లోనూ డెంగీ కేసులు భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. చదవండి: World Mosquito Day: ఫీవర్ సర్వేలో.. డెంగీ కలకలం.. గుర్తించినట్టు.. పెన్సిల్‌తో రాసి.. ► దోమల నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు జీహెచ్ఎంసీ చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడం లేదని సిటీజన్లు ఆరోపిస్తున్నారు. ► వారానికోరోజు కూడా ఫాగింగ్ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఇంటింటికీ తిరిగి యాంటిలార్వా మందును పిచికారీ చేయాల్సిన జీహెచ్ఎంసీ సిబ్బంది.. మంచినీటి ట్యాంకుల్లో మందు చల్లకుండానే చల్లినట్లు ఇంటిగోడలపై పెన్సిల్‌తో రాసి చేతులు దులుపుకొంటున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. ►రెండు వారాల్లోనే గాంధీ ఆస్పత్రిలో డెంగీతో 54 మంది చిన్నారులు ఆస్పత్రిలో చేరారు. వీరిలో ఇద్దరు డెంగీ షాకింగ్ సిండ్రోమ్‌తో (బాలిక, బాలుడు) మృతి చెందారు.నిలోఫర్ ఆస్పత్రిలో రోజుకు కనీసం 20 నుంచి 30 డెంగీ కేసులు నమోదవుతున్నట్లు సమాచారం. దోమలకు నిలయాలివే.. ► ఇంటి ఆవరణలోని పూల కుండీలు ► మనీప్లాంట్స్, ఇతర చెట్ల పొదలు ► టైర్లు, ఖాళీ సీసాలు, కొబ్బరి బోండాలు ► ఇంటిపై మూతల్లేని నీటి ట్యాంకులు ► కొత్త నిర్మాణాలు, సెల్లార్లు ► తాళం వేసిన నివాసాలు ► విద్యా సంస్థలు, ఫంక్షన్ హాళ్లు ► ముంపు ప్రాంతాల్లో నిల్వ నీరు గాందీలో 40 మంది డెంగీ బాధితులకు చికిత్స గాంధీ ఆస్పత్రి: మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మహమ్మారి కరోనాకు తోడుగా డెంగీ వ్యాధి పంజా విసురుతోంది. డెంగీ లక్షణాలతో సికింద్రాబాద్ గాం«దీ ఆస్పత్రికి రోగులు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం గాంధీలో 40 మంది డెంగీ బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నారు. వీరిలో సింహభాగం చిన్నారులే కావడం గమనార్హం. గత నాలుగు రోజులుగా డెంగీ లక్షణాలతో వచ్చిన మరో 16 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. చిన్నారుల్లో ముగ్గురుకి డెంగీతోపాటు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. గాంధీ పిడియాట్రిక్ వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారి మూడు రోజుల క్రితం డెంగీ షాక్ సిండ్రోమ్‌తో మృతి చెందింది. అందుబాటులో ప్లేట్లెట్లు, మందులు గాంధీ ఆస్పత్రిలో డెంగీ వ్యాధి నివారణకు అన్నిరకాల మందులు, ప్లేట్లెట్లు అందుబాటులో ఉన్నాయని సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు తెలిపారు. సుమారు 40 మంది డెంగీ బాధితులకు ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నామని, వారం రోజులుగా డెంగీ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు డెంగీ కేసులు హైదరాబాద్ 537 రంగారెడ్డి 140 మేడ్చల్ 120 వికారాబాద్ 45 -
ఊపిరి పీల్చుకునే లోపే.. దోమల దాడి మొదలైంది!
సాక్షి, హైదరాబాద్: కరోనా సెకండ్‌వేవ్ ఉద్ధృతి మిగిల్చిన విషాదాన్ని సిటిజన్లు ఇంకా పూర్తిగా మరిచిపోకముందే.. డెంగీ, మలేరియా, డయేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు వెంటాడుతున్నాయి. కొద్ది రోజులుగా చాపకింద నీరులా విస్తరిస్తున్న సీజనల్ వ్యాధులు గ్రేటర్ వాసుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రులకు జ్వర పీడితుల తాకిడి పెరుగుతోంది. కోవిడ్ కారణంగా ప్రభుత్వం గత ఏడాది ఇళ్లు, వీధులు, కాలనీలను శానిటైజ్ చేసింది. దోమల నియంత్రణ కోసం ఫాగింగ్ కూడా చేసింది. ఫలితంగా డెంగీ, మలేరియా కేసులు తక్కువగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం దోమలు విజృంభిస్తున్నాయి. సిటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఊపిరి పీల్చుకునే లోపే.. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలు కూడా ఎత్తేసింది. ఏప్రిల్, మే నెలల్లో రోజుకు సగటున 1500 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో సగటున కేసులు 200 మించి నమోదు కావడం లేదు. వైరస్ ఉద్ధృతి తగ్గిందని అంతా ఊపిరి పీల్చుకునే లోపే.. డెంగీ, మలేరియా, డయేరియా వంటి సీజనల్ వ్యాధులు చాపకిందనీరులా విస్తరిస్తున్నాయి. ఇలా దాడి.. మలేరియాకు ‘ఆడ అనాఫిలన్’ దోమ కారణం. ఇది మురుగునీటిలో ఎక్కువగా పెరుగుతోంది. ఈ మలేరియా జ్వరాలు రెండు రకాలు కాగా, వీటిలో ఒకటి ప్లాప్మోడియం వైవాక్స్(పీవీ)కాగా, రెండోది ప్లాస్మోడియం పాల్సీఫారం (పీఎఫ్). రెండోది అత్యంత ప్రమాదకరం. నగరంలో ఏటా పాల్సీఫారం కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. చలిజ్వరం, తలనొప్పి, వాంతులతో పాటు తీవ్రమైన నీరసం ఉంటుంది. సాయంత్రం వేళల్లో జ్వరం ఎక్కువగా ఉంటుంది. చికిత్సను నిర్లక్ష్యం చేస్తే.. కాలేయం, మెదడు, మూత్ర పిండాలు దెబ్బతిని వ్యక్తి చనిపోయే ప్రమాదం ఉంది. ఈడిస్ఈజిప్టే (టైగర్) దోమ కుట్టడంతో డెంగీ సోకుతుంది. మూతల్లేని మంనీటి ట్యాంకులు, ఇంట్లోని పూలకుండీలు, కొబ్బరి బొండాలు, టైర్లు, ప్లాస్టిక్ డబ్బాలు, అపార్ట్మెంట్ సెల్లార్లు, కొత్త నిర్మాణాల్లో ఈ దోమలు ఎక్కువగా పెరుగుతాయి. ఈ దోమ కుట్టిన 7 నుం 8 రోజుల తర్వాత తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, కండరాల నొప్పులు, శరీరంపై ఎర్రటి దద్దుర్లు, కళ్లు కదలించలేకపోవడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. కిత్సను నిర్లక్ష్యం చేస్తే.. సాధారణంగా శరీరంలో 1.50 లక్షల నుం 4 లక్షల వరకు ఉండే ప్లేట్లెట్స్ సంఖ్య 20 వేలలోపు పడిపోయి కోమాలోకి వెళ్లిపోతారు. కలుషిత నీరు, ఆహారం ద్వారా డయేరియా అతిసారం వ్యాపిస్తుంది. కలుషితమైన నీటిని సరిగా శుభ్రం చేయకుండా తాగడం వల్ల వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, టైఫాయిడ్ జ్వరాల బారినపడుతుంటారు. నిల్వ ఉన్న ఆహార పదార్థాలపై ఈగలు వాలడం వల్ల ఆహారం కలుషితం అవుతుంది. అప్పుడే ఉడికించిన తాజా ఆహారంతో పాటు వేడిచేసి చల్లార్చిన నీటిని తాగడం వల్ల ఈ వ్యాధులు దరిచేరకుండా చసు కోవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకోండి.. ఒకవైపు కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే.. మరో వైపు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటికి సమీపంలో చెత్త కుప్పులు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కూలర్లు, నీటి ట్యాంకులను శుభ్రం చేసుకోవాలి. వారానికోసారి డ్రై డేగా పాటించాలి. ఇంట్లోని పూలకుండీలు, ఇంటిపై ఉన్న పాత ప్లాస్టిక్ డబ్బాలు, టైర్లు, సీసాలు, కుండలు లేకుండా చూసుకోవాలి. -
రాకాసి దోమల గుంపు: జంతువులు మటాష్!
లూసియానా : రాకాసి దోమల గుంపు వందల సంఖ్యలో పాడి జంతువుల్ని, అడవి వన్య ప్రాణుల్ని బలితీసుకుంది. ఈ సంఘటన అమెరికాలోని లూసియానాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గత నెల ఆగస్టు 27న హరికేన్ లారా కారణంగా పెద్ద సంఖ్యలో రాకాసి దోమలు లూసియానాలోకి వచ్చిపడ్డాయి. అక్కడి గేదెలు, ఆవులు, గుర్రాలు, జింకలపై దాడి చేశాయి. వాటి రక్తం పీల్చి చంపేశాయి. దాదాపు లక్ష డాలర్లకు పైగా నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన కొంతమంది హెలికాఫ్టర్ల సహాయంతో దోమల మందు పిచికారీ చేశారు. ఎద్దు పొట్ట చుట్టూ చేరిన భారీ దోమల గుంపు దీంతో దోమల ఉధృతి కొద్దిగా తగ్గింది. ఈ దోమల దాడిలో దాదాపు 400 పాడి జంతువులు, 30 వరకు జింకలు మృత్యువాత పడ్డాయి. సెప్టెంబర్ 2న ఓ వ్యక్తి తీసిన ఫొటో ఒకటి రాకాసి దోమల రక్త పిపాసకు అద్దం పడుతోంది. చనిపోయిన ఎద్దు పొట్ట చుట్టూ చేరిన భారీ దోమల గుంపు దాని రక్తం పీలుస్తున్న ఫొటో అది. -
ఏజెన్సీకి మలేరియా.. పట్నానికి డెంగీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మళ్లీ జ్వరాలు విజృంభించాయి. వివిధ జిల్లాల్లో భారీ వర్షాలతో మలేరియా, డెంగీ జ్వరాలు తీవ్రమయ్యాయి. రెండు నెలలుగా డెంగీ జ్వరాలు అంతకంతకూ పెరుగుతున్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖ, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో మలేరియా జ్వరాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు మలేరియా జ్వరాలతో కిటకిటలాడుతున్నాయి. పీహెచ్‌సీల్లో ప్రతి రోజూ మలేరియా కేసులు నమోదవుతున్నట్టు రంపచోడవరం, మారేడుమిల్లి, శ్రీశైలం తదితర ఐటీడీఏల్లో పనిచేస్తున్న వైద్యులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో 135 వరకూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా గత నెల రోజుల్లో 2,800కు పైనే మలేరియా కేసులు నమోదయ్యాయి. ఏటా సీజన్ వచ్చేవరకూ ఎవరూ పట్టించుకోరని, తీరా జ్వరాలు మొదలయ్యాక వైద్య బృందాలు వచ్చి హడావిడి చేస్తారని అక్కడి పీహెచ్సీలలో పనిచేసే వైద్యులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందులు లేకపోతే ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ (హెచ్‌డీఎస్) నుంచి కొనుగోలు చేయాలని చెబుతున్నారని, అయితే దీనివల్ల జాప్యం జరుగుతోందని అంటున్నారు. మలేరియా, డెంగీతోపాటు వర్షాలకు నీరు కలుషితమవడంతో ఎక్కువ మంది చిన్నారులు టైఫాయిడ్, న్యూమోనియా బారినపడుతున్నారని పేర్కొన్నారు. అదుపులోకి రాని డెంగీ పట్టణాల్లో ఇప్పటికీ డెంగీ జ్వరాలు అదుపులోకి రావడం లేదని స్వయానా ప్రజారోగ్య శాఖ చెబుతోంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా మూడు నెలలుగా డెంగీ జ్వరాలు రోజురోజుకూ అధికమవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ప్రకాశం, తూర్పుగోదావరి, అనంతపురం, విశాఖ జిల్లాల్లో గత నెల రోజుల్లో 3 వేలకు పైగా డెంగీ కేసులు నమోదైనట్టు తేలింది. ఒక్క విశాఖçలోనే 900కు పైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. డెంగీబారిన పడ్డ బాధితులు ప్రభుత్వాస్పత్రులకు వెళ్తూ ఉంటే అక్కడి వైద్యులు సరిగా స్పందించడం లేదని, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తేనేమో ప్లేట్లెట్లు తగ్గిపోతున్నాయని రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకూ పిండుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. ముందస్తు చర్యలు లేవు దోమకాటుతో వచ్చే జ్వరాలను ముందస్తు చర్యలు తీసుకుంటే నివారించే అవకాశం ఉంటుంది. కానీ చర్యలు తీసుకోలేదు. ఆరోగ్యశాఖలో మలేరియా విభాగమనేది ప్రత్యేకంగా ఉన్నా అది పడకేసింది. మలాథియాన్, పైరిథ్రిమ్ అనే ద్రావణాలను ప్రతి ఊళ్లో మురికి కాలువలు, నీళ్లు నిల్వ ఉన్న ప్రాంతాలు, డంపింగ్ ప్రాంతాల్లో పిచికారీ చేయాలి. కానీ అలా చేయలేదు. కనీసం పారిశుధ్య చర్యలు కూడా చేపట్టలేదు. దీంతో దోమలు విజృంభించాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంది. అక్కడ గిరిజనులకు ఇవ్వాల్సిన దోమతెరలు అందరికీ అందలేదు. ప్రాణాధార మందులే కరువు పామ్ ఇంజక్షన్ అనేది ఎవరైనా పాయిజన్ (విషం) తీసుకున్నప్పుడు దానికి విరుగుడుగా ఇస్తారు. అట్రోపిన్, అడ్రినల్ ఇంజక్షన్లు సర్జరీ సమయంలో ఇస్తారు. వీటిని లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌గా పేర్కొంటారు. కానీ ఈ రెండు ఇంజక్షన్లు రెండు మాసాలుగా ఏజెన్సీ ఏరియాల్లోని పీహెచ్సీలలో లేవు. పారాసెట్మాల్ ఇంజక్షన్, డైసైక్లోమైన్ తదితర మందులూ లేవు. కళ్లలో వేసుకునే సిప్రోఫ్లాక్సిన్ డ్రాప్స్ లేవు. చిన్నారులకు దగ్గు వస్తే వేసుకోవడానికి ఆంబ్రోక్సిల్ సిరప్ లేదు. చర్యలు తీసుకుంటున్నాం పట్టణాల్లో ఇప్పటికీ డెంగీ కేసులు ఉన్నాయి. ఈ ఏడాది ఎక్కువగా ఉన్న మాట నిజమే. ఇప్పటికే విజయనగరం జిల్లాలో ఎంటమలాజికల్ బృందం పనిచేస్తోంది. ఏజెన్సీ ప్రాంతాలతోపాటు అన్ని ప్రాంతాలకూ మందుల కొరత లేకుండా చూస్తున్నాం. –డా.గీతాప్రసాదిని, అదనపు సంచాలకులు, ప్రజారోగ్య శాఖ దోమకుట్టకుండా చూసుకోవాలి ఇంటి పరిసరాల్లో కొబ్బరి చిప్పలు, టైర్లు, పాత బాటిళ్లు, కప్పులు ఇవన్నీ లేకుండా చూసుకోవడంతోపాటు వాటిలో నీళ్లు నిల్వ లేకుండా చేస్తే దోమలు వృద్ధి చెందవు. ముఖ్యంగా చిన్నారులకు దోమతెరలు వాడాలి. టైఫాయిడ్, న్యూమోనియా జ్వరాలూ ఈ సీజన్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాచి చల్లార్చిన నీళ్లు తాగడం, బాగా ఉడికించిన భోజనం తినడం మంచిది. – డా.వంశీధర్, చిన్నపిల్లల వైద్యులు, రిమ్స్, కడప -
దోమ.. ఈగల వేట
సిటీవాసులకు దోమలు, ఈగలతో జీవనం సర్వసాధారణమే. కానీ అగ్రదేశాల నుంచి వచ్చే ప్రతినిధులకు దోమలంటే మహా భయం. విష ప్రాణులు, క్రూర జంతువుల దాడిలో మరణించే వారికంటే ప్రపంచ వ్యాప్తంగా దోమకాటు మరణాలే ఎక్కువ. దీంతో వారు ఈ చిన్న ప్రాణి అంటే ఆయా దేశాలవారు వణికి పోతారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రతినిధులను దోమ కుట్టకుండా జీహెచ్ఎంసీ రేయింబళ్లు వేట సాగిస్తోంది. సదస్సు జరుగనున్న హెచ్ఐసీసీ, విందు ఇచ్చే గోల్కొండ కోట, ఫలక్‌నుమా ప్యాలెస్ పరిసరాల్లో పెద్ద ఎత్తున ఫాగింగ్ చేస్తున్నారు. చెరువుల్లో గుర్రపుడెక్కను తొలగిస్తున్నారు. దోమల ఉనికి లేకుండా పనులు చేస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: విదేశీ ప్రతినిధులకు 28వ తేదీ రాత్రి విందు జరుగనున్న ఫలక్‌నుమా ప్యాలెస్ పరిసరాల్లో ఐఆర్ఎస్ స్ప్రే చేస్తున్నారు. స్రేయింగ్కు అల్ఫా సైపర్ మెథ్రిన్, ఫాగింగ్‌కు సిఫనోథ్రిన్తో పాటు ఆలౌట్ మాదిరిగా పనిచేసే పొగ రాకుండా ఏరియల్ స్ప్రే కోసం ఫైరిథ్రమ్ను ప్రత్యేకంగా వినియోగిస్తున్నారు. గోల్కొండ కోట మొత్తం ఏసీఎం పౌడర్‌తో నాలుగు రోజులుగా ముమ్మరంగా దోమల వేట సాగిస్తున్నారు. శక్తివంతమైన నాలుగు భారీ స్ప్రేయర్లతో ఫైరిథ్రమ్ను చల్లుతున్నారు. కోట పరిసరాల్లోని శాతం తలాబ్, హుడా పార్కు పరిసరాల్లో భారీ సిబ్బందితో నాలుగు రోజులుగా గుర్రపుడెక్క తొలగిస్తున్నారు. ఫలక్‌నుమా, హెచ్ఐసీసీ పరిసర ప్రాంతాల్లోని చెరువుల్లోనూ గుర్రపు డెక్క తొలగింపుతో పాటు ఐదేసి భారీ వాహనాలు, 15 పోర్టబుల్ యంత్రాలతో నిరంతరం ఫాగింగ్ చేస్తున్నారు. అతిథులు ఉండే మూడు రాత్రులు దోమల బెడద లేకుండా చేసేందుకు మహా యుద్ధం చేస్తున్నారు. గోల్కొండ కోట వద్ద 150 మంది, ఫలక్‌నుమా వద్ద 54 మంది, హెచ్ఐసీసీ వద్ద 36 మంది సిబ్బంది 24్ఠ7గా దోమల నిర్మూలనలో నిమగ్నమయ్యారు. వీరితోపాటు ఐదుగురు అసిస్టెంట్ ఎంటమాలజిస్టులు, 10 మంది సూపర్వైజర్లు ఇవే పనుల్లో ఉన్నారు. గత నాలుగైదు రోజుల్లో మూడెకరాల పరిధిలోని శాతం చెరువులో గుర్రపుడెక్క పనులు పూర్తయ్యాయని జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ వెంకటేశ్ తెలిపారు. అతిథులు పర్యటించే ప్రాంతాల్లోని నాలాలు, చెరువుల్లోనూ గుర్రడపుడెక్క తొలగింపు పనులు ముమ్మరంగా చేస్తున్నారు. నిలోఫర్‌లో 24 గంటల ఫార్మసీ నాంపల్లి: నవ జాత శిశువుల సంరక్షణా కేంద్రం నిలోఫర్ ఆస్పత్రిలో 24 గంటల ఫార్మసీని ప్రారంభించాలని డీఎంఈ డాక్టర్ రమేష్‌రెడ్డి ఆదేశించారు. దీనిని 27 నుంచి అందుబాటులోకి తేవాలని నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణకు సూచించారు. గురువారం రెడ్‌హిల్స్‌లోని ఆస్పత్రిని సందర్శించిన డాక్టర్ రమేష్‌రెడ్డి వైద్యాధికారులతో సమావేశమై పలు సమస్యలపై సమీక్షించారు. నర్సుల పోస్టుల భర్తీని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. రాజీవ్ ఇంటెన్సివ్ కేర్ బ్లాక్‌లో 24 గంటల ఫార్మసీ అందుబాటులోకి వస్తుందన్నారు. ఆర్ఎంఓ డాక్టర్ నరహరి, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు. రొటేషన్ పద్ధతిలో టెక్నిషియన్ల విధులు నిలోఫర్ రేడియాలజీ, పాథాలజీ, మైక్రో బయాలజీ విభాగాల్లో సుమారు 40 మంది టెక్నిషియన్లు పని చేస్తున్నారు. వీరంతా ఏళ్ల తరబడి ఒకేచోట పాతుకపోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదే అంశంపై ఇటీవల 13 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. రొటేషన్ పద్ధతిలో టెక్నిషియన్లకు విధులు అప్పగించడం వల్ల వారి పనితీరు మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే వైద్యులు సహా నాలుగో తరగతి ఉద్యోగులు రొటేషన్ పద్థతిలో పని చేస్తున్నారు. టెక్నిషియన్లను కూడా అలా పని చేయించడం వల్ల మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. -
ప్రియమైన శరీర వాసన ఉన్నవారిపైనే దోమల దాడి!
కొత్త పరిశోధన మిమ్మల్ని దోమలు విపరీతంగా కుడుతున్నాయంటే కారణం... మీ శరీరం నుంచి వెలువడే వాసనే అంటున్నారు బ్రిటిష్ అధ్యయనవేత్తలు. దీన్ని నిరూపించడం కోసం 36 మంది కవల పిల్లలను ఎంచుకున్నారు. వీరంతా ఒకేలాంటి కవలలన్నమాట. అంటే ఐడెంటికల్ ట్విన్స్. ఇక ఐడెంటికల్ ట్విన్స్ కాని కవల పిల్లలను మరో 38 మందినీ ఎంచుకొని వారిని మరో గదిలో ఉంచారు. ఈ రెండు గదుల్లోకీ ఒకేసారి వెళ్లేలా ఇంగ్లిష్ అక్షరం ‘వై’ ఆకృతిలో ఉండే ఒక గొట్టాన్ని ఏర్పాటు చేసి... ఈ రెండు గదుల్లోకీ ఒకేసారి దోమల్ని పంపారు. ఐడెంటికల్ ట్విన్స్ ఉన్న గదిలోనికే ఎక్కువ దోమలు వెళ్లాయి. ఐడెంటికల్ ట్విన్స్ అంటే వారిలో శరీర వాసనను వెలువరించే ఒకేలాంటి జన్యువులు ఉంటాయి కాబట్టి... వారి మీదకే ఎక్కువ సంఖ్యలో దోమలు వెళ్లాయన్నమాట. అదే ఒకేలాంటి కవలలు కానివారి విషయంలో వేర్వేరు జీన్స్ వల్ల వేర్వేరు శరీర వాసనలు వెలువడ్డాయి కాబట్టి... వాటిలో దోమలకు ప్రియంగా లేని శరీర వాసనలు వెలువడేవారిదగ్గరకు అస్సలు దోమలే వెళ్లలేదట. వీటన్నింటినీ సమీక్షించి చూస్తే తమకు ప్రియమైన శరీర వాసనను వెలువరించే వారిపైకే దోమలు దాడి చేస్తాయని వెల్లడైందని ఈ పరిశోధనవేత్తలు పేర్కొంటూ ఇదే విషయాన్ని ‘ప్లాస్ ఒన్’ అనే జర్నల్‌లో సైతం పొందుపరిచారు. మరో కొత్త విషయం ఏమిటంటే... ఈ శరీరవాసనకు కారణమయ్యే జన్యువుకూ... ఎత్తుతో పాటు, ఐక్యూకూ కారణమయ్యే జన్యువుతో దగ్గరి పోలికలున్నాయట.