ఎయిర్ఇండియాకు 600 కోట్ల ప్రభుత్వ బకాయిలు
న్యూఢిల్లీ: అత్యంత ప్రముఖుల(వీవీఐపీ) ప్రయాణ ఖర్చులకు సంబంధించి దాదాపు రూ. 600 కోట్లను ప్రభుత్వం ఎయిర్ ఇండియాకు చెల్లించాల్సి ఉంది. ఎయిర్ ఇండియా సేవలను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు.. తదితరులు పొందుతుంటారు. కేంద్ర హోం, రక్షణ, విదేశాంగ శాఖలు పెద్ద మొత్తాల్లో ఎయిర్ఇండియాకు బకాయి పడ్డాయని గురువారం అధికార వర్గాలు తెలిపాయి.