mother - child
-
Mothersday 2024 ‘బంగారం నువ్వమ్మా’! టాలీవుడ్ అమ్మల్నిచూశారా?
-
అనారోగ్యంతో తల్లి.. దగా చేసిన పెళ్లిళ్ల పేరయ్య!
అనంతపురం క్రైం: పేదరికం, తల్లి అనారోగ్యం కారణాలను ఆసరాగా చేసుకున్న దుర్మార్గులు ఓ బాలికను పోరంబోకుకు కట్టబెట్టారు. తండ్రి స్థానంలో ఉన్న మామ బలాత్కరించబోగా తప్పించుకుని బయటపడిన బాలిక నేరుగా తల్లి చెంతకు చేరింది. వివరాలు... అనంతపురం నగర శివారులోని ఓ కాలనీకి చెందిన బాలిక తండ్రి చిన్నప్పుడే మృతి చెందాడు. అప్పటి నుంచి తల్లి కూలి పనులు చేస్తూ ఏడో తరగతి వరకూ చదివించింది. ఈ క్రమంలోనే ఆమె అనారోగ్యం బారిన పడింది. ఇల్లు గడవడం కష్టంగా మారింది. దీంతో పెళ్లిళ్ల పేరయ్య చాకలి చౌడప్ప ఓ వరుడి తరఫున పెద్ద ఎత్తున కమీషన్ దండుకుని బాలిక తల్లిని మరింత ఆందోళనకు గురి చేశారు. చనిపోతే బిడ్డ భవిష్యత్తు ఏమిటంటూ ఆమెను భయపెట్టాడు. ఈ క్రమంలోనే కంబదూరు మండలం, పాళ్లూరు నివాసి, మరో కులానికి చెందిన యువకుడు హరికృష్ణ, కుటుంబసభ్యులను పిలిపించి పెళ్లి చూపులు సిద్ధం చేయించాడు. తనకు ఇప్పుడే పెళ్లి వద్దని చెప్పిన బాలికను దబాయించి, భయపెట్టారు. పెళ్లికొడుక్కి హిందూపురంలో ఓ పెట్రోలు బంకు, 15 ఎకరాల భూమి, రూ.కోట్లలో డబ్బుందని నమ్మించి ఆగస్టు 27న పాపంపేటలోని రామాలయంలో పెళ్లి జరిపించేశారు. పెళ్లి సమయంలో అనుమానాలు వ్యక్తం చేసిన వారికి అప్పటికే బాలిక వయసు13 ఏళ్లు కాగా, 19 ఏళ్లుగా మార్చేసిన ఆధార్ కార్డును చూపించి మభ్య పెట్టారు. హిందూపురంలో తనదిగా చెప్పుకున్న పెట్రోలు బంకులోనే హరికృష్ణ కాపురం పెట్టాడు. భర్త లేని సమయాల్లో మామ బాలికతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ విషయాన్ని బాలిక అత్తకు తెలిపినా ఫలితం లేకపోవడంతో తనను చూసేందుకు వచ్చిన తల్లితో మొరబెట్టుకుంది. ఆ సమయంలో తల్లీబిడ్డపై కుటుంబసభ్యులంతా దాడి చేయబోగా తప్పించుకున్న అనంతపురానికి చేరుకున్న ఆమె పెళ్లిళ్ల పేరయ్యతో పాటు పెళ్లికి పెద్ద మనుషులుగా వ్యవహరించిన నిలదీసింది. దీనిపై వారు స్పందించకపోవడంతో బుధవారం ఉదయం నాల్గో పట్టణ పోలీసులకు తల్లి, బాలిక ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఏడేళ్లుగా తల్లికి దూరంగా బిడ్డ.. పాపను అనుమానస్పదంగా గుర్తించడంతో..
బిడ్డలను చూడకుండా తల్లి ఒక్కక్షణం కూడా ఉండదు. కంటికి రెప్పలాగా కాపాడుకుంటుంది. తప్పనిస్థితిలో బిడ్డలకు దూరంగా ఉంచాల్సి వచ్చినా.. తల్లి హృదయం వారిమీదే ఉంటుంది. బిడ్డ కనిపించకపోతే ఇక తల్లి హృదయం పడే వేదన అంతా ఇంతా కాదు! అలాంటిది ఒకటి రెండు రోజులు కాదు.. ఏకంగా ఏడేళ్లుగా అనుభవిస్తున్న ఓ తల్లి బాధ నేటికి సుఖాంతమైంది. డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా (తూర్పు గోదావరి జిల్లా) సఖినేటి పల్లి మండలం అంతర్వేదిలో 2016లో తండ్రితో పాటు వెళ్లినప్పుడు అక్ష అనే చిన్నారి తప్పిపోయింది. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో పాప తల్లి ద్వారక అప్పట్లోనే సఖినేటిపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి పాపకోసం తల్లి ద్వారక వెతుకుతోంది. అయితే.. కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలంలో భాగ్యలక్ష్మి అనే మహిళ దగ్గర ఇటీవల పాపను అనుమానస్పదంగా గుర్తించి పోలీసులకు అప్పగించారు స్థానికులు. చిన్నారిని కరీంనగర్ లోని బాల రక్షా భవన్ కు పోలీసులు అప్పగించారు. పాప ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చూసి తమ బిడ్డే అంటూ ఇటీవల వేరువేరు ప్రాంతాల నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిలో పద్మ అనే మహిళ.. ఆ పాప తన మనవరాలేనంటూ ఆధారాలు చూపించింది. విచారణ చేపట్టిన శిశు సంక్షేమ శాఖ అధికారులు నిజానిజాలు తేల్చారు. పద్మ చెప్పింది నిజమేనని నిరూపించుకున్న తర్వాత పాప తల్లి ద్వారకను అధికారులు పిలిపించారు. చిన్నారిని చూసిన తల్లి బోరున విలపించింది. తనతో గొడవపడి భర్త రవి పాపని తీసుకొని వెళ్లిపోయాడని ద్వారక చెప్పింది. పాప కోసం రవి కూడా రావడంతో పాప సమక్షంలోనే ఏడేళ్ల తర్వాత భార్యాభర్తలు కలిసిపోయారు. అన్ని ఆధారాలు ధ్రువీకరించుకున్న తర్వాత అధికారులు పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. Delhi Shahbad Dairy Case:: గాళ్‌ఫ్రెండ్‌తో గొడవ.. అందరూ చూస్తుండగానే..! -
వీపున చంటిబిడ్డ.. వీధులు ఊడుస్తున్న ఓ తల్లి కథ ఇది
వీపున పసిబిడ్డను కట్టుకుని.. బ్రిటిష్ సైన్యంతో వీరోచిత పోరాటం చేసింది వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి. ఇక్కడో లక్ష్మీ వీపున చంటిబిడ్డను కట్టుకుని ఎర్రటి ఎండలో చెమటలు చిందిస్తూ పని చేస్తోంది. సోషల్ మీడియాను విపరీతంగా ఆకట్టుకుంటున్న వీడియో, ఫొటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. లక్ష్మీముఖి.. ఒడిషా మయూర్భంజ్ బర్దిపాడా మున్సిపాలిటీలో పదేళ్లుగా స్వీపర్‌గా పని చేస్తోంది. అక్కడ పని చేస్తుండగానే ఓ దినసరి కూలీకి ఇచ్చి పెళ్లి చేసింది ఆమె కుటుంబం. భర్త పచ్చితాగుబోతు. ఒకరోజు బిడ్డను అమ్మేయాలని ప్రయత్నించాడు. అతని చాచికొట్టి.. బిడ్డతో సహా బయటకు వచ్చేసింది. స్థానికంగా ఓ ఇంట్లో ఒంటరిగానే ఉంటూ.. చంటి బిడ్డను చూసుకుంటోంది. ఇంటి దగ్గర బిడ్డను చూసుకునేవాళ్లు ఎవరూ లేకపోవడంతో బిడ్డను తనతో పాటే పనులను తెచ్చుకుంది. బిడ్డను వీపున కట్టుకోవడం తనకేం ఇబ్బందిగా అనిపించడం లేదని, తన డ్యూటీ తాను చేస్తున్నట్లు చెప్తోందామె. వ్యక్తిగత కారణాలతో ఆమె బిడ్డను తెచ్చుకుంటోందని, ఆమెకు అవసరమైన సాయం, ఇబ్బందులు ఎదురైతే సపోర్ట్ చేయాలని సిబ్బందికి సూచించినట్లు బర్దిపాడా మున్సిపాలిటీ చైర్మన్ బాదల్ మోహంతి చెప్తున్నారు. బిడ్డను వీపున కట్టుకుని వీధులు ఊడుస్తున్నా ఆ తల్లి కష్టానికి పలువురు హ్యాట్సాఫ్ చెప్తున్నారు. అయినా కడుపున బిడ్డను నవమాసాలు మోసే తల్లికి.. వీపున మోయడం ఓ బరువా?.. అని అంటున్నారు మరికొందరు. #WATCH | Odisha: A lady sweeper, Laxmi cleans the road in Mayurbhanj district with her baby tied to her back. pic.twitter.com/g7rs3YMlFn — ANI (@ANI) May 29, 2022 వీడియో వైరల్: ఆ చిన్నారికి నాలుగు చేతులు, నాలుగు కాళ్లు!! -
ఆర్థిక ఇబ్బందులతో..
పటాన్చెరు టౌన్: సమయానికి డబ్బులు చేతికందకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తిచెందిన ఓ మహిళ.. ఐదేళ్ల కుమార్తెతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. పటాన్చెరు పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం దోవుర్ గ్రామానికి చెందిన రాజు పటాన్చెరు శాంతినగర్‌లో ఉంటూ ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. రాజు సోదరి వింధ్య (30)భర్త ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకోగా, అప్పటినుంచి ఐదేళ్ల కూతురు గ్లోరితో కలసి పటాన్‌చెరులోని రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటూ ఓ మెడికల్ కళాశాలలో నర్సుగా పని చేస్తోంది. బుధవారం వింధ్య, తన భర్తకు సంబంధించిన డబ్బుల విషయంలో నారాయణఖేడ్ వెళ్దామని శాంతినగర్‌లో ఉండే సోదరుడు రాజు ఇంటికి వెళ్లింది. కొద్ది సేపటి తర్వాత డబ్బులు అప్పుడే రావడం లేదని తెలుసుకొని, సోదరుడికి చెప్పి వెళ్లిపోయింది. అలా వెళ్లిన వింధ్య.. కూతురు గ్లోరిని తీసుకుని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేశారు. తల్లీకూతుళ్ల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుందని వింధ్య సోదరుడు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పెద్దపులిని చూపిస్తానని తీసుకెళ్లి..
రాయికల్:(జగిత్యాల): ‘మీకు పెద్దపులిని చూపిస్త.. నాతో రండి’అని ఓ తల్లి తన ఇద్దరు కుమారులను గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లింది. అనంతరం అక్కడ పిల్లలతో కలసి బావిలో దూకింది. ఈ ఘటనలో తల్లి, పెద్దకుమారుడు మృతిచెందగా, చిన్నకుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కిష్టంపేటలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కిష్టంపేటకు చెందిన కస్తూరి సంపత్, లావణ్య(25) భార్యాభర్తలు. వీరికి గణేశ్(8), హర్షవర్ధన్ (6) అనే కుమారులు ఉన్నారు. పదేళ్ల క్రితం స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి ఉపాధి కోసం కిష్టంపేట గ్రామానికి వచ్చారు. ఇక్కడే కూలీ పనిచేసుకుంటూ బతుకుతున్నారు. శుక్రవారం భార్యాభర్తలు అల్లీపూర్ గ్రామంలోని ఓ మేస్త్రీ వద్ద కూలీ పనిచేసి ఇంటికి తిరిగి వచ్చారు. కొద్దిసేపటి తర్వాత లావణ్య.. పెద్దపులిని చూపిస్తానంటూ తన ఇద్దరు కుమారులతో కలసి గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావివద్దకు వెళ్లింది. తర్వాత ఇద్దరు కుమారులను పట్టుకుని బావిలో దూకింది. అయితే, ఈ ప్రయత్నంలో తల్లి, పెద్దకుమారుడు బావిలో పడిపోగా హర్షవర్ధన్ బావిగట్టువద్దే ఉండిపోయాడు. వెంటనే బాలుడు అక్కడ ఉన్నవారికి ఈ విషయం చెప్పగా, వారు బావి వద్దకు చేరుకుని లావణ్య, గణేశ్‌ను కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే వారు నీటిలో మునిగి చనిపోయారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలతోనే లావణ్య ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అమ్మతో కలసి కేక్ కట్ చేసిన నిన్న నా పుట్టినరోజు. అమ్మా, నాన్న, అన్నయ్యతో కలసి కేక్ కట్ చేసిన. అందరికీ మిఠాయిలు పంచిన. రాత్రి అందరం బాగానే ఉన్నం. పొద్దునే అమ్మ, నాన్న కలసి పనికి పోయిండ్రు. నాకు పెద్దపులిని చూపిస్తనని అమ్మ నన్ను బాయికాడికి తీసుకెళ్లింది. నన్ను, అన్నను తీసుకుని బావిలో దూకింది. నేను బావిగట్టు వద్దే పడిపోయా. – హర్షవర్ధన్, చిన్నకుమారుడు -
కరోనా ఉన్నా తల్లిపాలు అమృతమే
ప్రపంచమంతా ఇప్పుడు కరోనా కలకలమే. చికిత్సలేని, నివారించేందుకు టీకా కూడా లభ్యం కాని పరిస్థితుల్లో ఈ మహమ్మారిని కట్టడి చేయడం ఎలా అన్నది అందరిలోనూ మెదులుతున్న సందేహం. కోవిడ్–19 కారక కరోనా వైరస్ ఆనుపానులపై మనకు తెలి సింది కొంత, తెలియంది కొండంత. మిగిలిన విషయాల మాటెలా ఉన్నా, తల్లిపాల వారోత్సవాల (ఆగస్టు 1–7) సందర్భంగా చాలామందిలో కలిగే అనుమానాలను పరిశీ లిద్దాం. ఈ వ్యాధి తల్లి నుంచి బిడ్డకు సంక్రమిస్తుందా? తల్లి వ్యాధి బారిన పడితే బిడ్డకు పాలు పట్టవచ్చా? అన్ని రకాల శాస్త్ర విషయాలను పరిగణనలోకి తీసుకున్న తరు వాత తేలిందేమిటంటే, కరోనా సోకినప్పటికీ తల్లిపాలు అమృతమంత స్వచ్ఛమే! పైగా పుట్టిన బిడ్డతో అను బంధం పెంచుకునేందుకు తల్లికీ, తల్లి స్పర్శతో బిడ్డకూ ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అనేక పరిశోధనలు స్పష్టం చేశాయి. ఒకవేళ తల్లి కోవిడ్ బారిన పడ్డా, లేదా ఆ లక్షణాలు ఉన్నా పాలు పట్టడం ఆపాల్సిన అవసరం లేదని సైన్స్ చెబుతోంది. కాకపోతే ముఖానికి మాస్కు తొడుక్కోవడం, చేతులు తరచూ సబ్బుతో లేదా ఆల్కహాల్ ఆధారిత ద్రావ ణంతో కడుక్కోవడం వంటి జాగ్రత్తలు పాటించి బిడ్డను ముట్టుకోవచ్చు. వ్యాధి కారణంగా తల్లి బలహీనంగా ఉంటే శుభ్రం చేసిన స్పూన్ లేదా కప్ ద్వారా తల్లిపాలు అందివ్వవచ్చు. ఇది కూడా సాధ్యం కాదనుకుంటే సరి పోయే కల్చర్ ఉన్న దాతల పాలు కూడా పట్టవచ్చు. రొమ్ముపాలు పట్టేందుకు ఉపయోగించే, పాలు నిల్వచేసే పాత్రలను కోవిడ్–19 సంబంధిత శుద్ధీకరణ పద్ధతులు ఉపయోగించిన తరువాత మాత్రమే వాడటం, శభ్రం చేయడం చేయాలి. ఒకవేళ బిడ్డ వ్యాధి బారిన పడినా స్తన్యం మాత్రం నిలపకూడదని సైన్స్ చెబుతోంది. తల్లి పాలు బిడ్డ రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేస్తాయనీ, తల్లిలోని యాంటీబాడీలు బిడ్డకు అందుతా యనీ, తద్వారా బిడ్డ ఇన్ఫెక్షన్లను సమర్థంగా ఎదుర్కో గలదన్నదీ మనకు తెలిసిన విషయమే. కోవిడ్–19 ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని బలి తీసుకుంది. ఈ మహమ్మారి ప్రభావం పసిపిల్లల పోష ణపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పేద, మధ్యాదాయ దేశాల్లో ఐదేళ్లలోపు పిల్లలు తీవ్రమైన కుపోషణకు గురవుతున్నారు. కోవిడ్–19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 67 లక్షల మంది పిల్లలు పోషకాహార లేమికి గురికానున్నారు. వీరిలో సగం మంది దక్షిణాసియా ప్రాంతంలో ఉన్నారు. భారత్ విషయానికి వస్తే పిల్లల పోషకాహారానికి సంబంధించిన పలు సూచీల్లో గుణాత్మక మార్పు, వృద్ధి కనిపిస్తున్నప్పటికీ సుమారు రెండు కోట్ల మంది ఐదేళ్ల వయసులోపు పిల్లలు తక్కువ కాలంలో తీవ్ర పోషకాహార లోపానికి గురికాగా, మరో నాలుగు కోట్ల మందికి తగినన్ని పోషకాలు అంద డం లేదు. అంతేకాకుండా 14 –19 ఏళ్ల మధ్య వయసు యువతుల్లో సగం మంది రక్తహీనతతో బాధ పడుతు న్నారు. కరోనావల్ల జరిగే నష్టం కంటే, పోషకాహార లోపం వల్ల పిల్లలకు దీర్ఘకాలంలో జరిగే నష్టమే ఎక్కు వగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. పోషకాహార లోపం నిశ్శబ్దంగా మనిషిని చంపే స్తుంది. తగినంత పోషహాకారం తీసుకోకపోతే లేదా తీసు కున్న ఆహారం ద్వారా విటమిన్లు, ప్రొటీన్లు, ఖనిజాలు, సూక్ష్మ పోషకాలు, శక్తి తగినంత శరీరానికి వంటబట్టక పోతే పోషకాల లోపం తలెత్తుతుంది. చిన్నప్పుడు అతి సారం లేదా ప్రేవుల్లో సూక్ష్మక్రిములు చేరినా శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. భారత్‌లో ఐదేళ్లలోపు వయసున్న పిల్లల మరణాల్లో మూడింట రెండు వంతులకు కుపోషణే కారణం. వీటివల్ల భౌతికంగా, మానసికంగానూ ఎదుగుదల సరిగా లేకుండాపోతుంది. దీని ప్రభావం కాస్తా విద్యాభ్యాసం, మేధ, చివరకు పెరిగి పెద్దయ్యాక ఆదాయ ఉత్పత్తిపై కూడా పడుతుంది. పుట్టిన బిడ్డ జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే తొలి రెండేళ్లు అత్యంత కీలకం. పుట్టిన గంట లోపు తల్లి పాలు అందించడం మొదలుకొని, నిర్ణీత కాలం వరకూ తల్లిపాలు మాత్రమే అందించి ఆ తరువాత దశలవారీగా ఇతర ఆహారం అందివ్వడం ద్వారా ఐదేళ్లలోపే మరణి స్తున్న పిల్లల్లో 20 శాతం మందిని కాపాడుకోవచ్చు. దుర దృష్టవశాత్తూ భారతదేశంలో పుట్టిన గంట లోపు బిడ్డకు తల్లిపాలు అందివ్వడం లేదు. కనీసం 57 శాతం మంది పిల్లలు ఈ భాగ్యానికి నోచుకోవడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. తొలినాళ్లలో తల్లిపాలు మాత్రమే అందు కునే పిల్లలకు అతిసారం, నిమోనియా వంటివి సోకే అవకాశాలు తక్కువ. ఆరు నెలల తరువాత తల్లిపాలతో పాటు ఇతర ఆహారం కూడా ఇవ్వడం వల్ల పిల్లలు దృఢంగానే కాకుండా వయసుకు తగ్గ బరువు, ఎత్తు పెరుగుతారు. రెండేళ్ల వరకూ బిడ్డకు అవసరమైన పోష కాల్లో అత్యధికం తల్లిపాల ద్వారానే అందుతాయన్నది మరచిపోకూడదు. కోవిడ్–19 మహమ్మారి విజృంభిస్తున్న ఈ తరు ణంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కుపోషణ సమస్యను ఎదుర్కొనేందుకు యూనిసెఫ్ తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. పసిపిల్లల పోషణావసరాలను తీర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని యూనిసెఫ్ అన్ని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. సురక్షితమైన, చౌకైన ఆహారం అందరికీ అందుబాటులో ఉండేలా చేసేందుకు యత్నిస్తోంది. తల్లి, పిల్లల సంరక్షణ, తల్లిపాల ప్రాము ఖ్యతను చాటడం, పసిపిల్లల ఆహార ఉత్పత్తుల మార్కె టింగ్ సక్రమంగా జరిగేలా చూడటం చేస్తోంది. వయసుకు తగ్గ ఎత్తు, బరువు పెరగని పిల్లలను ముందుగానే గుర్తించి చికిత్స కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. అత్య వసర పరిస్థితుల్లో పిల్లలకు పోషకాహారం అందించేం దుకు పాఠశాలలు, అంగన్ వాడీలు మూతకు గురైన ఈ తరుణంలో వారి ఇళ్లకే ఆహారం అందించేందుకు ప్రయ త్నాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘పోషణ్’ కార్యక్రమానికి యూనిసెఫ్ సాంకేతిక సాయం అందివ్వడం, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లోని అధికారులకు శిక్షణ ఇవ్వడం చేస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ పోషకాహార సంస్థ సాయంతో తెలంగాణలో ఐదేళ్లలోపు వయసున్న, కుపోషణతో బాధపడుతున్న పిల్ల లకు తగిన ఆహారం అందించే ప్రయత్నం చేస్తోంది. వ్యాసకర్త హైదరాబాద్ యూనిసెఫ్ కార్యాలయ ముఖ్యాధికారి -
దెయ్యం పట్టిందని కొట్టిన తల్లి..బాలుడి మృతి
సాక్షి, డిచ్పల్లి(నిజామాబాద్) : అనారోగ్యంతో ఉన్న కొడుకుకు దెయ్యం పట్టిందనే మూఢ నమ్మకంతో కన్నతల్లి జుట్టు పట్టుకుని చెప్పుతో బాగా కొట్టడంతో మృతి చెందిన ఘటన డిచ్పల్లి మండలం ఘన్పూర్ శివారులో చోటుచేసుకుంది. వివరాలు.. నిజామాబాద్ నగరానికి చెందిన జ్యోతికి ఐదుగురు పిల్లలు. ఆమె ఊరూరు తిరుగుతూ ప్లాస్టిక్ వస్తువులు, చిత్తు కాగితాలు ఏరుకుని వాటిని అమ్మగా వచ్చే డబ్బులతో పిల్లలను పోషిస్తోంది. ఏడాదిగా పిల్లలను వెంటేసుకుని డిచ్పల్లి మండలం ఘన్పూర్ శివారులోని మహాలక్ష్మీ ఆలయం సమీపంలో నివసిస్తోంది. బుధవారం సాయంత్రం నుంచి కొడుకు కడమంచి కిశోర్ (7) కు వాంతులు, విరోచనాలు అయ్యాయి. గురువారం ఉదయం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో బాలుడికి వైద్యం చేయించిన జ్యోతి సాయంత్రం ఇంటికి తీసుకొచ్చింది. రాత్రికి కల్లు తాగిన మత్తులో అనారోగ్యంతో పడి ఉన్న కొడుకుకు దెయ్యం పట్టిందని పేర్కొంటూ జుట్టు పట్టుకుని చెప్పుతో బాగా కొట్టింది. గమనించిన స్థానికులు పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. ఎస్సై సురేశ్‌కుమార్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. 108 అంబులెన్స్ సిబ్బంది బాలుడిని పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కిశోర్ అనారోగ్యంతో మృతి చెందాడా లేక తల్లి కొట్టిన దెబ్బలకు చనిపోయాడా అనే విషయం పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు. ఇటీవలే ధర్మారం(బి) గ్రామంలో తల్లి చేతిలో కొడుకు మృతి చెందిన ఘటన మరువక ముందే మరో చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. బాలుడి మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి -
మాతా శిశుమరణాల సంఖ్య గణనీయంగా తగ్గించాలి
విజయవాడ: మాతా శిశు మరణాలు నమోదు లేకుండా, వ్యాధి నిరోధక టీకాలు నూరుశాతం నిర్వహించిన జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. నగరంలోని సూర్యారావుపేట ఐవీ ప్యాలెస్‌లో శనివారం జిల్లా వైద్య, ఆరోగ్య, స్త్రీ, శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖాధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మాతా శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించి జీరోకి తీసుకురావాలన్నారు. ఇమ్యూనైజేషన్ కార్యక్రమం నూరుశాతం జరగాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్న మేము సైతం కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో నిర్వహిం చాలన్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల పనితీరుపై అనేక విమర్శలు వస్తున్నాయని వాటిని మెరుగుపచ్చుకోవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లులో కనీస అవసరాలను సమకూర్చుకోవడం, మరమ్మతులు వంటి పనులను ఆస్పత్రి అభివృద్ధి నిధులను ఖర్చుచేసుకోవాలని సూచించారు. నిధుల సమీకరణకై అమెరికా పర్యటన జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించి మోడల్‌గా అభివృద్ధి చేసే నేపథ్యంలో ప్రవాసాంధ్రులు రూ.6కోట్లు విరాళంగా అందించారని, మరిన్ని నిధుల సమీకరణకు తానా ఆహ్వానంపై జూన్‌లో అమెరికాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇంటిపన్ను వసూలు లక్ష్యం రూ.50కోట్లు జిల్లాలో 970 గ్రామ పంచాయతీల్లో రూ.50 కోట్లు ఇంటిపన్ను వసూలు మార్చి ఆఖరునాటికి పూర్తిచేయాలన్నారు. మాస్ క్లీనింగ్ డేను స్పెషల్ డ్రైవ్‌గా నిర్వహించాలన్నారు. శానిటేషన్ మెరుగుపర్చాలని, తాగునీటి పైపులైన్లు మురుగునీటిలో కలువకుండా పరిశీలించాలన్నారు. బ్లీచింగ్, క్లోరినైజేషన్ నిర్వహించాలన్నారు. విజయవంతంగా కుష్ఠువ్యాధిపై అవగాహన జిల్లాలో 15రోజులపాటు నిర్వహించిన కుష్ఠువ్యాధి అవగాహన కార్యక్రమం విజయవంతం చేయడంపై జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం వైద్య ఆరోగ్యశాఖ అధికారులను అభినందించారు. ఈ ఏడాది జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13వరకు జిల్లావ్యాప్తంగా కుష్ఠు వ్యాధిపై అవగాహన కార్యక్రమం వివరాలతో కూడిన పుస్తకాన్ని నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో 63 కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపారు. 455 మంది వ్యాధిగ్రస్తులకు శారీరక వైఫల్యాలను గుర్తించి మైక్రో సెల్యూలర్ రబ్బర్(యం.సి.ఆర్)తో చేసిన చెప్పులు, సెల్ప్ కేర్ కిట్స్ అందించనున్నామన్నారు. ఆవిష్కరణలో అదనపు వైద్య ఆరోగ్య శా«ఖాధికారి డాక్టర్ టి.వి.ఎస్.ఎన్.శాస్త్రి పాల్గొన్నారు. -
అయ్యో పాపం!
కుటుంబ కలహాలకు తల్లీబిడ్డ బలి కుటుంబ కలహాలకు తల్లీబిడ్డ బలి మృతురాలి మరిది, తోటికోడలుపై కేసు పరారీలో నిందితులు తాండూరు రూరల్ :క్షణికావేశం తల్లీబిడ్డల ప్రాణాలు తీసింది. ధాన్యం విషయంలో మరిది, తోటికోడలు మందలించారిని మనస్తాపంతో ఓ ఇల్లాలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. అయితే మంటలు ఇంట్లో మంచంపై నిద్రిస్తున్న ఎనిమిది నెలల చిన్నారికి వ్యాపించడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృత్యువాత పడింది. ఈ సంఘటన మండలంలోని అంతారం గ్రామంలో గురువారం రాత్రి పొద్దుపోయాక చోటు చేసుకుంది. పట్టణ ఎస్ఐ నాగార్జున కథనం ప్రకారం.. యాలాల మండలం బెన్నూర్ గ్రామానికి చెందిన జోగు రత్నప్ప మూడో కుమార్తె సుక్కమ్మ (30)ను తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన నక్కల రాములుతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇంత కాలం పిల్లలు పుట్టలేదు. కాగా ఎనిమిది నెలల క్రితం చిన్నారి జన్మించింది. కాగా.. నక్కల రాములు అతడి సోదరుడు వీరేందర్‌ల మధ్య పొలం, ఇంటి విషయమై గొడవలు ఉన్నాయి. ఇదే విషయమై తరచూ ఘర్షణ పడేవారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి ధాన్యం విషయంలో రాములు, సుక్కమ్మ - వీరేందర్, లక్ష్మి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో వీరేందర్, లక్ష్మి దంపతులు సుక్కమ్మను తీవ్ర స్థాయిలో మందలించారు. దీంతో తీవ్రమనస్తాపానికి గురైన సుక్కమ్మ ఇంట్లోకి వెళ్లి తలుపులు బిగించుకుని ఒం టిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. అయితే అప్పటికే ఇంట్లో మం చంపైనే ఉన్న పాప సౌజన్య (8 నెలలు) కు కూడా మంటలు వ్యాపించాయి. స్థానికులు సుక్కమ్మ కేకలు విని ఇంటి తలుపులు పగులగొట్టి తీవ్రగాయాలైన తల్లీకూతుళ్లను తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. సుక్కమ్మ అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో మృతి చెందింది. శనివారం ఉదయం ఆ రు గంటల ప్రాంతంలో చిన్నారి కూడా మృతి చెందింది. తల్లీకూతుళ్లు ఇద్దరూ మృతి చెందడంతో అంతారం గ్రామం లో విషాధచాయలు అలుముకున్నాయి. మృతురాలి అక్క దండు అమృతప్ప ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగార్జున తెలి పారు. కాగా వీరేందర్, లక్ష్మీ దంపతులు పరారీలో ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. అప్పుడే నూరేళ్లు నిండాయా? ‘లేక లేక పుట్టిన నీకు అప్పుడే నూరేళ్లు నిండాయా తల్లీ’ అంటూ కుటుంబ సభ్యులు, బంధువులు విలపించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. అల్లారు ముద్దుగా పెరుగుతున్న సౌజన్యను కుటుంబ కలహాలు బలితీసుకోవడంపై గ్రామస్తులను కలచివేసింది. -
ఉత్తరం: కడుపులో బిడ్డకు పంచ ప్రాణాలు
మనిషి మనుగడకు పంచభూతాలు ఎలా అండగా ఉంటాయో... కడుపులో ఉన్న బిడ్డ ఎదుగుదలకు పంచ ఆహార పదార్థాలు అలానే అండగా ఉంటాయి. అవి బిడ్డ ఆరోగ్యంగా పుట్టేందుకు ఉపకరిస్తాయి. అందమైన పాపాయిని మీ చేతుల్లో పెడతాయి. అందుకే బిడ్డకు పంచ ప్రాణాలైన ఆ ఐదు ఆహార పదార్థాలేమిటో కాబోయే ప్రతి తల్లీ తెలుసుకుని తీరాలి. పాలు: సంపూర్ణ ఆహారం. తల్లీబిడ్డకు కావాల్సిన దాదాపు అన్ని పోషకాలను అందిస్తాయి. కాబట్టి రెండు పూటలా పాలు తీసుకోవడం అంటే పండంటి బిడ్డకు పాలు పట్టినట్లే.ఆకుకూరలు: చక్కటి రూపురేఖలు, మంచి మేధస్సుకు ఇవి ప్రధాన ఆహారం. కడుపులో ఉన్న బిడ్డ మంచి తెలివితేటలు, మానసిక వికాసంతో జన్మించడానికి దోహదం చేసేవి ఆకుకూరలే. అందుకే ఫోలిక్ యాసిడ్ మొదటి నెల నుంచే ఇస్తారు. మనం ఆకుకూరల్ని తీసుకుంటామో లేదో అన్న ఆలోచనతో వైద్యులు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇస్తారు. పళ్లు: మనిషికి మంచి ఆరోగ్యాన్నిచ్చేవి... మేలు తప్ప కీడు చేయనవి పళ్లు. అన్ని రకాల పళ్లను తీసుకుంటుంటే ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి పళ్లు తొమ్మిది నెలల పాటు ఆహారంలో తప్పనసరి కావాలి. మాంసకృత్తులు: ఆరోగ్యం, వికాసంతో పాటు బిడ్డకు చక్కటి సౌష్టవం ఉన్న శరీరం కూడా అవసరం కదా. అందుకే మాంసకృత్తులు కావాలి. ఇవి కావాలంటే గుడ్లు, మాంసం, చేపలు, మొలకెత్తిన విత్తనాలు, డ్రైఫ్రూట్స్ తినాలి. ఇవి బలవర్ధకమైన ఆహారం. ఆరోగ్యంతో కూడిన చక్కటి సౌష్టవ దేహాన్ని రూపొందింపజేస్తాయి. ఆరుపూటల ఆహారం: తల్లి తీసుకునే ఆహారంలో తొమ్మిది నెలల పాటు బిడ్డ ఎక్కువ గ్రహిస్తుంది. కాబట్టి... తల్లి సంపూర్ణ ఆహారం తీసుకోవాలి. ఎసిడిటీ రాకుండా చూసుకోవాలి. వేళకు తినాలి. దానర్థం ఇద్దరు తినాల్సినంత తినాలని కాదు. షుష్టుగా భోంచేయాలి. మూడు పూటలా భోజనం, మరో మూడు పూటలు శ్నాక్స్ తినాలి. శ్నాక్స్‌లో మసాలా లేకుండా చూసుకోవాలి. ఇవన్నీ పాటించి తొమ్మిది నెలలు ఆగి, పండంటి బిడ్డ పోటీలకు మీ బేబీని పంపండి!! అందానికి ‘ఉచిత’ సలహాలు - కీర దోస తినడం, అలసిపోయిన కళ్లమీద పెట్టుకోవడం. - మంచి నీళ్లు బాగా తాగడం, చల్లటి నీటితో కనీసం ఆరుసార్లు మొహం కడగటం. - పడుకునేటపుడు సాక్స్ వాడటం, తరచుగా నిమ్మరసం పాదాలకు రాయడం. - వెల్లకిలా పడుకోవడం. తగినంత నిద్ర పాటించడం. - ఆలోచనలు, ఆందోళనలు వీలైనంత తగ్గించుకోవడం. - వాదనలకు దూరంగా, హాస్యానికి దగ్గరగా ఉండడం.