Mothers love
-
అడవిలో అమ్మప్రేమ!
పులి – ఆవు.. పాము – కాకి నీతి కథలుఅందరికీ తెలిసే ఉంటాయి. కథల సారాంశం ఏదైనా.. అందులో తల్లి ప్రేమ కనిపిస్తుంది. మనుషుల్లోనే కాదు పశుపక్షాదుల్లో కూడా కమ్మనైన అమ్మతనం ఎంతో మధురం. తల్లి జంతువు ప్రేమ ముందు ఏ ప్రాణి అయినా, జీవి అయినా తలవంచక తప్పదు.తన కళ్లముందు తన బిడ్డకు కష్టం వస్తే తిరగబడి పోరాడుతుంది. ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా అడవుల్లో కనిపిస్తాయి. అతి చిన్న ప్రాణి అయిన గిజిగాడు మొదలు అతి క్రూరమైన జంతువులుగా చెప్పుకునే పులి, చిరుత, ఎలుగుబంటి వంటి జంతువుల వరకు వాటి పిల్లల లాలన చూస్తే ‘తల్లి ప్రేమ అడవంతా’ అని అనకమానరు.– ఆత్మకూరు రూరల్పశుపక్షాదుల్లో తల్లి ప్రేమను దగ్గరిగా పరిశీలిస్తే కొన్ని ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి. కోతి, పిల్లులు తమ పిల్లల పెంపకం అందరికీ తెలిసే ఉంటుంది. మాతృప్రేమలో మాత్రం మర్కటాలు మనుషులకే పాఠాలు చెబుతాయి. ఇక పిల్లి నిండు గర్భంతో ఉన్నపుడే తను ప్రసవించే ప్రదేశాన్ని ఎంచుకుని ప్రసవానంతరం కొంత సమయ వ్యత్యాసంతో పిల్లలను కనీసం ఏడు చోట్లకు మార్చడం దాని విశిష్ట లక్షణం. కీటకాలు, పక్షులు, జంతువుల్లో తల్లి ప్రేమ నిశితంగా పరిశీలిస్తే ఔరా.. అనాల్సిందే.నల్లమల అడవుల్లో పెద్దపులులు ప్రధాన రక్షిత జీవి. అంతరించి పోయే దశకు చేరుకుంటున్న వాటి సంతతిని పెంచి పోషించడంలో ఆడ పులులు ఒక యుద్ధ్ధమే చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఈతలోనూ రెండు నుంచి నాలుగు పిల్లలకు జన్మనిచ్చే ఆడపులి వాటిని పెంచడంతో ఎంతో క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. పులి పిల్లలకు ప్రధాన ముప్పు మగపులుల నుంచే ఉంటుంది. సాధారణంగా పులి తన పిల్లలకు మూడేళ్ల వయçస్సు దాటేంత వరకు అవి స్వయంగా తమ ఆహారం సంపాదించుకునే నైపుణ్యం పొందే వరకు తిరిగి సమాగానికి సిద్ధపడదు. అందుకే మగ పులులు ఈ పిల్లలను అడ్డు తొలగిస్తే ఆడపులితో సమాగానికి సిద్ధ పడవచ్చనే ధోరణే పులి పిల్లలకు ప్రమాదం తెచ్చి పెడుతుంది.అందుకే తన సంతానం సమీపంలోకి మగపులి రాకుండా ఆడపులి తరిమి కొడుతుంది. పులిపిల్లలకు మరో ప్రమాదం నక్క, తోడేలు, కొండ్రాసిగాడుగా పిలువబడే దొమ్మలగొండి (హైనా)వంటి స్కావెంజర్ జంతువుల నుంచి కూడా పొంచి ఉంటుంది. తల్లి పులి ఆహారం కోసం వెళ్లినప్పుడు ఈ జంతువులు పులి పిల్లలకు హాని కలిగిస్తాయి. అందుకే తల్లి పులి తన పిల్లలను గుహల్లో, చెట్టు బొరియల్లో ఉంచి వాటి ఉనికి బయటకు తెలియనంతగా జాగ్రత్త పడుతుంది. ఆహార సేకరణ కోసం పెద్దగా పిల్లలను విడిచి దూరం వెళ్లదు. పిల్లలు కాస్త తిరుగాడే వయస్సు వచ్చినపుడు వాటిని వెంట పెట్టుకునే వేటకు ఉపక్రమిస్తుంది. అప్పుడు పులి పిల్లలు మొదట తల్లి చేసే వేట పద్ధతులను పరిశీలిస్తూ మెల్లమెల్లగా వేటాడేందుకు సిద్ధమవుతాయి.ఆహారం భద్రపరిచి.. కూనల కడుపు నింపిపిల్లి కుటుంబానికే చెందిన చిరుతపులి (లెప్పర్డ్) కూడా రెండు నుంచి మూడు పిల్లలను పెడుతుంది. ఇది కూడా పెద్దపులిలాగే పిల్లల కోసం అత్యంత అప్రమత్తంగా సంచరిస్తుంది. పిల్లి జాతిలో పిల్లి తరువాత చెట్టు ఎక్కగలిగే సామర్థ్యం ఉన్న ఏకైక పులి చిరుత మాత్రమే.ఈ ప్రత్యేకతను తన పిల్లలకు ఆహారం దాచి పెట్టే విషయంలో ఉపయోగించుకుంటుంది. పిల్లలను భధ్రమైన చోట దాచి వేటకు వెళ్లి తాను చంపి తెచ్చిన వేట జంతువు కళేబరాన్ని పిల్లల ముందు ఆహారంగా వేస్తుంది. అవి తినగా మిగిలిన భాగాన్ని చెట్టు కొమ్మపై భద్రపరచి మరుసటి రోజు మళ్లీ ఆకలిగొన్న పిల్లలకు పెడుతుంది.అంతా.. ఏకాంతం..ఎత్తైన, ముదిరిన వృక్షాల కాండాలపై సహజంగా ఏర్పడ్డ తొర్రలను ఆడ హార్న్‌బిల్ గూడుగా ఎంపిక చేసుకుంటుంది. వయస్సు కొచ్చిన మగపక్షి తనతో జతగట్టేందుకు అంగీకరించిన ఆడపక్షితో కలసి ఇలాంటి తొర్రల్లో ప్రవేశిస్తు్తంది. ఆపై ఆడపక్షి తొర్ర ప్రవేశ మార్గాన్ని చెట్ల బెరళ్లు, కర్ర పుల్లలు, బంక మట్టితో కలిపి మూసివేస్తుంది. గాలి చొరబడేందుకు మాత్రం చిన్న రంధ్రాన్ని మాత్రం ఉంచుకుంటుంది. సమాగమనంతరం మగ పక్షి మూసిన ప్రవేశ మార్గాన్ని తిరిగి తెరుచుకుని బయటకు వస్తుంది.ఆడపక్షి మాత్రం గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలను చేసే వరకు గూటిలోనే జైలు జీవితం గడుపుతుంది. మూసివేయబడిన తొర్ర ప్రవేశ మార్గానికి ఏర్పరచిన చిన్నపాటి రంధ్రం ద్వారానే ఆడపక్షికి.. మగపక్షి ఆహారాన్ని అందిస్తుంది. అనంతరం ఆడపక్షి గూటి వెలుపలికి వచ్చి పిల్లలున్న గూటిని తిరిగి మూసి వేస్తుంది. ఆ తరువాత పక్షి దంపతులు కలసి పిల్లల పోషణ భారం వహిస్తాయి. పిల్లలకు రెక్కలొచ్చి గాలిలో ఎగిరే వరకు ఈ తరహా రక్షణలోనే వాటి పోషణ సాగుతుంది.నీ ప్రేమ భల్లూకం గాను..వన్యప్రాణుల్లో తల్లులన్నింటిలోను ఎలుగుబంటి అమితమైన ప్రత్యేక శైలి కలిగినది. ఆడ ఎలుగు బంటి తన పిల్లలను వాటికి వేగంగా పరిగెత్తగల వయçస్సు వచ్చే వరకు తన మూపున మోసుకుని తిరుగుతూ ఉంటుంది. పుట్టలు తవ్వి చెదపురుగులను, చెట్టు ఎక్కి తేనె పట్టును తెచ్చి పిల్లలకు పెడుతూ ఎంతో ప్రేమ పూర్వకంగా పిల్లలను సాకుతుంది. పిల్లలున్న ఎలుగు బంటి మరింత క్రోధంతో సమీపంలోకి వచ్చే జంతువును, మనిషిని చీల్చి చెండాడుతుంది. ళీ నల్లమలలోని హనీబాడ్జర్ నేల బొరియలలో నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. తమ పిల్లలు ఇతర జంతువుల బారిన పడకుండా బొరియలో ప్రత్యేక గదులు తవ్వుకుని రక్షణ కల్పిస్తాయి. గిజిగాడు పక్షి అందమైన గూళ్లను అత్యంత భధ్రమైన ప్రదేశాలలో (చిటారు కొమ్మలకు నీటి తలం అంచున) కట్టి అందులో గుడ్లను పొదిగి పిల్లలకు నిరంతరం కీటకాలను, ధాన్యం గింజలను ఆహారంగా అందించి పెంచుతుంది.కందిరీగలు వివిధ కీటకాల లార్వాలను తీసుకు వచ్చి గూడులో ఉన్న పిల్లలకు ఆహారంగా పెడతాయి.తేనె టీగలు తెట్టెలో షడ్భుజాకారంలో ఉండే గదుల్లో ఉండే పిల్ల ఈగలకు అవి సేకరించిన మకరందాన్ని ఆహారంగా అందిస్తాయి.రేచుకుక్కలు (వైల్డ్ డాగ్స్) వేట జంతువులను చంపి మాంసాన్ని కడుపులో నిల్వ చేసుకుని తమ పిల్లల వద్దకు వెళ్లి వాటి ముందు మాంస కండలను కక్కి తినిపిస్తాయి. -
కూతుళ్ల కోసం ‘తల్లి’గా మారాడు!
క్విటో(ఈక్వెడార్): కన్న కూతుళ్లంటే ఆ తండ్రి ఎంతో ఇష్టం. విడిపోయిన భార్య వద్ద ఉన్న ఇద్దరు కూతుళ్ల కస్టడీ తనకే ఇవ్వాలంటూ కోర్టులో కేసు వేశాడు. అయితే, తల్లి వద్దే కూతుళ్లు ఉండాలంటుంది చట్టం. అందుకే, కూతుళ్లకు తల్లి ప్రేమను పంచేందుకు దుస్సాహసమే చేశాడు ఆ తండ్రి. ఏకంగా లింగమార్పిడి చేసుకుని మహిళగా మారాడు. ఇప్పుడైనా చట్టం కూతుళ్లను తన వద్దకే పంపిస్తుందని ఆశపడుతున్నాడు..! ఈ ఘటన దక్షిణ అమెరికా దేశం ఈక్వెడార్‌లో చోటుచేసుకుంది. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. రెనె సలినాస్ రమోస్(47), అతని భార్య విడిపోయారు. చట్టం ప్రకారం వీరి సంతానం తల్లి సంరక్షణలోనే ఉండాలి. మహిళ మాత్రమే బిడ్డలకు ప్రేమను అందిస్తుందని చట్టం అంటోంది. భార్య ఐదు నెలలుగా కూతుళ్లను కలుసుకునే అవకాశం లేకుండా చేస్తోందని అంటున్నాడు. తనకెంతో ఇష్టమైన కూతుళ్లు దూరం కావడం తట్టుకోలేని రమోస్ మరో మార్గం ఆలోచించాడు. ఏకంగా లింగమార్పిడి చేయించుకుని, మహిళగా మారాడు. అధికార రికార్డుల్లో మహిళగానే ఉన్నా, నిత్య జీవితంలో పురుషుడిగానే చెలామణి అవుతున్నాడు. మహిళగా మారినందున, కోర్టు కేసు గెలుస్తాననే నమ్మకంతో ఉన్నాడు. తల్లి వద్ద ఇబ్బందులు పడుతున్న తన బిడ్డలకు తల్లిగా మారుతానంటున్నాడు. ఈక్వెడార్ ఎల్జీబీటీఐ హక్కుల సంస్థలు మాత్రం రమోస్ చర్యపై మండిపడుతున్నాయి. -
ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. హీరాబెన్ అంటే మోదీకి ఎంత ప్రేమో..
న్యూఢిల్లీ: ఈ ప్రపంచంలో కన్నతల్లిని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. పిల్లలపై తల్లి చూపించే ప్రేమ వెలకట్టలేనిది. మాతృమూర్తిపై కుమారుడు చూపించే ప్రేమ వర్ణించలేనిది. ప్రధాని నరేంద్ర మోదీకి కూడా తన తల్లి హీరాబెన్ మోదీపై అమితమైన ప్రేమ. ఢిల్లీకి రాజైనా ఓ తల్లికి కొడుకే అనే నానుడి ఆయనకు సరిగ్గా సరిపోతుంది. మిగతా రోజుల్లో ఎక్కడున్నా.. తన పుట్టినరోజు వచ్చిందంటే మాత్రం మోదీ కచ్చితంగా ఆమె దగ్గరకు వెళ్తారు. ఆప్యాయంగా మాట్లాడుతారు. ఆమె కాళ్లు మొక్కి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఆమెకు కానుకలు కూడా ఇస్తారు. హీరాబెన్ మోదీ కూడా కుమారుడిపై తన ప్రేమను చూపించేవారు. పుట్టినరోజు నాడు మోదీకి స్వీట్లు తినిపించి ముద్దాడేవారు. తన కుమారుడు ప్రధాని అయిన విషయం మరిచి దాచుకోవడానికి తన దగ్గరున్న డబ్బులు కూడా ఇచ్చిన సందర్బాలు ఉన్నాయి. మోదీ ఎక్కడున్నా ముఖ్యమైన సమయాల్లో కచ్చితంగా తన తల్లి దగ్గరకు వెళ్తారు. పుట్టినరోజుతో పాటు ఎన్నికలకు ముందు ఆమె ఆశీర్వచనాలు తీసుకుంటారు. హీరాబెన్ మోదీ ఇటీవలే 100వ పుట్టినరోజు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా తన తల్లి గొప్పతనాన్ని, కుటుంబం కోసం చేసిన త్యాగాలను మోదీ తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. తన మనస్సు, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసంతో తన తల్లి హీరాబెన్ పాత్ర ప్రధానమని మోదీ చెప్పారు. తన తల్లి చిన్నతనం నుంచే ఎన్నోకష్టాలను, ఒడుదొడుకులను ఎదుర్కొందని మోదీ బ్లాగ్‌లో రాశారు. తన కుటుంబం వాద్నగర్లో మట్టిగోడలతో నిర్మించిన చిన్న ఇంట్లో నివసించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. పరిశుభ్రత పట్ల తన తల్లి ఎంతో ప్రత్యేకంగా ఉండవారని వివరించారు. మోదీ తండ్రి దామోదర్‌దాస్ ముల్చంద్ మోదీ 1989లో క్యాన్సర్‌తో మరణించారు. అప్పటి నుంచి తల్లి హీరాబెన్ మోదీ చిన్నకుమారుడి దగ్గరే ఉంటున్నారు. ఇటీవలే 100వ పుట్టినరోజు చేసుకున్న హీరాబెన్ మోదీ గుజరాత్ అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. నిండు నూరేళ్లు జీవించిన తన తల్లి.. భగవంతుని చెంతకు చేరిందని మోదీ భావోద్వేగ సందేశాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తన తల్లిలో మూడు గుణాలున్నాయని, ఆమెను చూస్తే తనకు ఒక రుషి ప్రయాణం, నిస్వార్థ కర్మయోగి, విలువలకు కట్టుబడి జీవించడం గుర్తుకు వస్తాయని ఎమోషనల్ అయ్యారు. చదవండి: ప్రధాని మోదీకి మాతృ వియోగం -
ఎయిర్‌పోర్టులో కొడుకును చెప్పుతో కొట్టిన తల్లి.. వైరల్ వీడియో..
ఇస్లామాబాద్: సాధారణంగా ఎవరైన మనవారు విదేశాల నుంచి వస్తే.. ఎయిర్‌పోర్టులో చేసే స్వాగత సత్కారాలు మాములుగా ఉండవు. కొందరు పూల బోకేలు ఇచ్చి స్వాగతం పలికితే.. మరికొందరు సర్ప్రైజ్ గిఫ్ట్‌లు, ఫ్లెక్సీలు, బ్యాండ్లను ఏర్పాటు చేస్తారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. కొందరైతే తమ వారిని చూడగానే.. ఎమోషనల్‌గా ఫీలై వారిని ఆనందంతో గట్టిగా హత్తుకుంటారు. ఇలాంటివి మనం తరచుగా చూస్తూనే ఉంటాం. తాజాగా వేరేదేశం నుంచి స్వస్థలానికి వచ్చిన.. ఒక తల్లి ఎయిర్‌పోర్టులో తనకు స్వాగతం పలకడానికి వచ్చిన కొడుకు పట్ల వెరైటీగా స్పందించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఘటన పాక్‌లోని ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకుంది. కాగా, అన్వర్ జలాని అనే వ్యక్తి ఎయిర్ పోర్టులో తన తల్లికోసం బోకే పట్లుకోని, మిస్‌యూ అమ్మ.. అంటూ ఫ్లకార్డు పట్టుకోని మరీ ఎదురుచూస్తున్నాడు. ఇంతలో అతని తల్లి బయటకు వచ్చింది. అప్పుడు ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. స్వాగతం పలకడానికి వచ్చిన కొడుకు అన్వర్‌ను ఆ తల్లి చెప్పుతో చితక్కొట్టింది. ఆ తర్వాత.. ఎమోషనల్‌తో అతడిని హత్తుకుంది. దీన్ని అన్వర్ జిలానీ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘ వావ్.. ఎంతలా మిస్ అయ్యిందో..’,‘ భలే.. కొట్టింది.. ఆ తల్లి..’, ‘నవ్వు ఆపుకోలేక పోతున్నాం..’, ‘నిన్ను ఇలా ఆశీర్వదించింది..’, ‘నీకు వెరైటీగా థైంక్స్ చెప్పిందంటూ..’ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Anwar Jibawi (@anwar) -
డబ్బులుండేవి కావు
‘టెక్నికల్లీ సౌండ్’ అనే మాట ఆటల్లో వినిపిస్తుంటుంది. ఎక్కువగా క్రికెట్లో. ఒడుపు తెలిసిన ఆటగాళ్లను అంటారు టెక్నికల్లీ సౌండ్ అని. ‘సౌండ్ పార్టీ’ అని ఇంకో మాట ఉంది. ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న వ్యక్తిని అంటుంటారు. అజింక్యా రహానే ఇప్పుడు టెక్నికల్‌గా, ఆర్థికంగా కూడా మంచి స్థితిలో ఉన్నాడు. ముంబై కుర్రాడు. తొమ్మిదేళ్ల క్రితం క్రికెట్లోకి వచ్చాడు. 64 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. టెస్ట్ వైస్ కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. క్రికెట్ అంటే ప్రాణం. కష్టపడి పైకొచ్చాడు. కష్టపడి పైకొచ్చిన ఇలాంటి కుర్రాళ్లంతా, ఇంట్లో వాళ్లనూ కష్టపెట్టే ఉంటారు! ‘ఇన్స్పిరేషన్’ అని ఇండియా టుడే టీవీలో ఒక స్పోర్ట్స్ ప్రోగ్రామ్ వస్తుంటుంది. ఆ ప్రోగ్రామ్‌లో రహానే చెప్పిన విషయాలు వింటే, వెంటనే ముంబై వెళ్లి అతడి తల్లిదండ్రులను కలిసి కాసేపు మాట్లాడి వస్తే బాగుండనిపిస్తుంది. పేదరికంలో ఉన్న పిల్లలు బాగా అభివృద్ధిలోకి వచ్చి నలుగురికీ తెలిశారంటే.. వాళ్ల వెనుక వాళ్ల అమ్మానాన్న చేసిన త్యాగాలు కచ్చితంగా ఉంటాయి. ముంబై దగ్గరి డోంబివ్లీలో ఉండేది రహానే కుటుంబం. తండ్రి మధుకర్ బాబూరావ్ రహానే. తల్లి సుజాత. తమ్ముడు శశాంక్, చెల్లి అపూర్వ. ‘‘నాకు బాగా గుర్తు. అప్పుడు నాకు ఏడేళ్లు. ఒక చేత్తో నా కిట్ బ్యాగుని, ఇంకో చేత్తో తమ్ముణ్ని మోస్తూ అమ్మ ఏడెనిమిది కి.మీ నడిచి నన్ను డోంబివ్లీలోనే కోచింగ్ సెంటర్‌కి తీసుకెళ్లేది. రిక్షాలో వెళ్లడానికి మా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. తిరిగి వచ్చేటప్పుడూ అంతే. నేను నడవలేకపోయేవాడిని. ‘‘మనం ఎందుకు రిక్షాలో వెళ్లలేం అమ్మా’’ అని మూలుగుతూ అడిగేవాడిని. అమ్మ దగ్గర సమాధానం ఉండేది కాదు. వారానికి ఒక రోజు మాత్రం రిక్షాలో వెళ్లొచ్చేవాళ్లం’’ అని టీవీ ప్రోగ్రామ్‌లో చెప్పాడు రహానే. వాళ్ల నాన్న కూడా తక్కువ శ్రమేమీ పడలేదు. ఆ ఏడేళ్ల వయసులోనే రహానే కోచింగ్ సెంటర్ మారవలసి వచ్చింది. దోంబివ్లీ నుంచి సిఎస్టికి. అంటే ఛత్రపతి శివాజీ టెర్మినస్. ఇక్కడ ట్రైన్ ఎక్కి అక్కడ దిగాలి. ప్రాక్టీస్ అయ్యాక అక్కడ ట్రైన్ ఎక్కి, ఇక్కడ దిగాలి. అమ్మకు బదులుగా నాన్న రావడం మొదలు పెట్టాడు. అయితే రైలు ప్రయాణం అలవాటు అవడానికి ఒక రోజు వస్తాను. రెండో రోజు నుంచి నువ్వే వెళ్లి వస్తుండాలి అని చెప్పాడు. ఒక రోజు అయింది. గంటన్నర ప్రయాణం. వెళ్లడానికి గంటన్నర, రావడానికి గంటన్నర. రెండో రోజు రహానే ఒక్కణ్ణే ట్రైన్ ఎక్కించి తను ఆగిపోయాడు. ‘‘నాన్న ఆగిపోయారనే అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది. వెనక బోగీలో ఎక్కి నాన్నగారు నన్ను ఫాలో అయ్యేవారని!’’ అని కళ్లు చెమ్మగిల్లుతుండగా చెప్పాడు రహానే. ‘‘నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అది మా అమ్మానాన్న వల్లనే. కోచింగ్ తీసుకుంటున్నప్పుడు, తర్వాత టీమ్‌లోకి వచ్చినప్పుడూ.. ఎప్పుడూ కూడా వాళ్లు గెలుపు ఓటముల కళ్లతో నన్ను చూడలేదు. నన్ను మాత్రమే చూశారు. వాళ్ల కొడుకుగా’’ అన్నాడు రహానే. -
సంశయం! సంకోచం! సందేహం!
ఛత్రపతి శివాజీకి జిజియాబాయి జన్మనిచ్చిన రోజు ఇది. జన్మను మాత్రమే ఇవ్వలేదు జిజియా. జన్మభూమిని కాపాడే శౌర్యాన్ని ఇచ్చింది. స్త్రీలను, పరమతాలను గౌరవించడం నేర్పింది. భారత, రామాయణాల్ని చదివించింది. బలి చక్రవర్తి గాథల్ని వినిపించింది. యుద్ధతంత్రాలలో నిష్ణాతుడిని చేసి, ఖడ్గాన్ని చేతికి ఇచ్చింది. శివాజీ ఖడ్గధారకు అంతటి పదును తల్లి పట్టిన పాల వల్లనే! అతడొక గొప్పచక్రవర్తి అయ్యాడంటే.. ఆమె ఒక ధీశాలి అయిన తల్లి అవడం వల్లనే! మగపిల్లల్ని గొప్ప యోధులుగా తీర్చిదిద్దిన తల్లులే కాదు, గొప్ప యోధులై.. దేశమాతను కాపాడుకున్న ఆడబిడ్డలూ మన దేశ చరిత్రలో ఎందరో ఉన్నారు. రాణీ లక్ష్మీబాయి, రాణీ పద్మిని, రజియా సుల్తానా, అహల్యాబాయ్ హోల్కర్, మాతా భాగ్ కౌర్, ఒనకె ఓబవ్వ, కేలడి చెన్నమ్మ, బెలవాడి మల్లమ్మ, అబ్బక్క రాణి.. ఎన్ని యుగాలకైనా ధ్వని తీవ్రత క్షీణించని శంఖారావాలు. పునీతా అరోరా, పద్మావతీ బందోపాధ్యాయ, మిథాలి మధుమిత, ప్రియా ఝింగన్, దివ్యా అజిత్ కుమార్, నివేదిత చౌదరి, అంజనా బాధురియా, ప్రియా సేవమ్వాల్, దీపికా మిశ్రా, సోఫియా ఖురేషి, శాంటి టిగ్గా, గనెవె లాల్జీ, గంజన్ సక్సేనా, అవని చతుర్వేది, మోహనాసింగ్, భావనాకాంత్.. తానియా శేర్గిల్.. వర్తమాన రక్షణదళ మహిళా క్షిపణులు. ఐక్యరాజ్యసమితి భారతదళ సభ్యులుగా ఆఫ్రికా దేశాలలో, భారత రక్షణ సేనానులుగా పొరుగు దేశాల్లో.. శాంతిని స్థాపించి వచ్చిన లెఫ్ట్‌నెంట్ అనువందన జగ్గీ, మేజర్ గోపికా భట్తీ, మేజర్ మధు రాణా, మేజర్, మేజర్ ప్రీతీసింగ్, మేజర్ అనూజా యాదవ్.. యుద్ధభూముల్లో స్త్రీ శక్తిని చాటిన అస్త్రాలు. మహిళల్ని ఆర్మీలోకి కమాండర్లుగా తీసుకోవడం సాధ్యం కాదు అని సుప్రీంకోర్టులో సోమవారం కేంద్ర ప్రభుత్వం వాదిస్తున్నప్పుడు.. ‘ఎందుకు సాధ్యం కాదూ! సాధ్యం చేసిన, సాధ్యం చేస్తున్న వాళ్ల మాటేమిటి?’ అంటూ పైన ఉదహరించిన వారిలో పదమూడు మంది వర్తమాన మహిళా యోధుల పేర్లను సుప్రీంకోర్టు జడ్జిలు ప్రస్తావించారు. మూడు నెలల్లోగా మహిళల్ని కమాండింగ్ పోస్టులోకి తీసుకోవడం ప్రారంభించాలని తీర్పు చెప్పారు. సైన్యంలోని యుద్ధ విధుల్లో పని చేయాలన్న తపన ఉన్న యువతులకు ఇది ఉత్సాహాన్నిచ్చే తీర్పు. ఐరాస విధుల్లో భారత మహిళా జవాన్లు తొమ్మిదేళ్ల క్రితమే ఢిల్లీ హైకోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చినప్పటికీ, తీర్పును అమలు చేసేందుకు ప్రభుత్వం సంశయించింది. శత్రువుకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉండని ఎయిర్‌ఫోర్స్‌లో, నేవీలో పర్వాలేదు కానీ.. శత్రువుకు ఎదురుగా వెళ్లి పోరాడవలసిన సైనికుల బృందానికి మహిళా కమాండర్లని సేనానులుగా పెట్టడం మంచిది కాదు అని ప్రభుత్వ వాదన. వాదన కాదు.. సంశయం! సంకోచం! సందేహం! మహిళల దేహ ధర్మాలు.. యుద్ధ ధర్మాలను సక్రమంగా నెరవేర్చనివ్వవని, మగ సైనికులు మహిళా కమాండర్ మాట వినరనీ, వీళ్లు బట్టలు మార్చుకుంటుంటే వాళ్లు తొంగిచూస్తుంటారనీ, శత్రువు చేతికి మన మహిళ చిక్కితే దేశ ప్రజల హృదయ స్పందనలు హద్దులు, సరిహద్దులు మీరే ప్రమాదం ఉందనీ స్వయంగా ఆర్మీ చీఫే అన్నారు. అయితే.. ‘‘ఇవన్నీ మీరు ఊహించుకుంటున్నవే కానీ.. కర్తవ్య నిర్వహణలో కమాండ్ చేసేందుకు మహిళలు ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటారు’’ అని తీర్పు వెలువరించడానికి ముందు సుప్రీం జడ్జిలు వ్యాఖ్యానించారు. దేశ రక్షణకు ఉవ్విళ్లూరుతున్న యువతుల్ని నిరుత్సాహపరిచేందుకు మనల్ని ప్రేరేపిస్తున్నది వాళ్ల రక్షణ, వాళ్ల భద్రత మాత్రమేనని అనిపిస్తున్నప్పటికీ దానివెనుక తెలియకుండా ఉన్నది వివక్ష మాత్రమే. అది ఉద్దేశ పూర్వకమైన వివక్ష కాకపోవచ్చు. ‘స్త్రీ, పురుషుడు సమానం కాదు’ అనే ఆదిమ భావన నుంచి నేటి ఆధునిక సమాజం కూడా బయటపడలేక పోతోంది. ఇక ఆర్మీలోనైతే చెప్పే పని లేదు. సైనిక పటాలాలను పురుషుడు మాత్రమే నియంత్రించగలడనీ, సమర వ్యూహాలు, ప్రతిభాపాటవాలు పురుషుడికి మాత్రమే ఉంటాయని దివి నుంచి భువికి ఎవరో చెప్పి పంపించినట్లుగా స్థిరపడిపోయింది. మహిళకు అవకాశం రాక (ఇవ్వక) పురుషుడు దేశ రక్షకుడయ్యాడు కానీ.. దేశ రక్షణ బాధ్యతను మోసే బలం మహిళలకు లేదని కాదు. సోఫియా ఖురేషి భారతదేశ రక్షణ వ్యవస్థలోని సైనిక, వైమానిక, నావికా దళాలలో రెండు రకాౖలñ న నియామకాలు ఉంటాయి. షార్ట్ సర్వీస్ కమిషన్. పర్మినెంట్ కమిషన్. షార్ట్ సర్వీస్‌లో విధి నిర్వహణ పదేళ్లు మాత్రమే. సామర్థ్యాన్ని బట్టి మరో నాలుగేళ్ల పొడిగింపు ఉంటుంది. పర్మినెంట్ సర్వీసులో ఉన్నవారు పదవీ విరమణ వయసు వచ్చేవరకు విధుల్లో ఉండొచ్చు. అయితే మహిళల్ని ఉదారంగా రక్షణ దళాల్లోకి తీసుకుంటున్న ప్రభుత్వం.. అంతే ఔదార్యంతో వారిని పర్మినెంట్ కమిషన్‌లోకి తీసుకోవడం లేదు. కోర్టులో దీనిపై తొమ్మిదేళ్లుగా సాగుతూ వస్తున్న వాదోపవాదనల్లోనే.. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు మహిళల్ని కూడా పర్మినెంట్ కమిషన్‌లోకి తీసుకోవాలని తీర్పు ఇచ్చింది. దీంతో దళాల్ని ముందుకు నడిపించే (కమాండింగ్) బాధ్యతల్లోకి అతి త్వరలోనే మహిళలూ రాబోతున్నారు. ఈ కేసులో ప్రభుత్వం చేసిన ముఖ్యవాదన.. ‘గ్రామాల నుంచి వచ్చిన మగ జవానులు మహిళా కమాండ్ మాట వినరు.. దాంతో యుద్ధ సమయాలలో శుత్రువును కట్టడి చెయ్యడం మనకు కష్టం అవుతుంది. అది దేశ భద్రతకే ప్రమాదం..’ అని! 1992లో భారత సైన్యంలో చేరిన 25 మంది మహిళా అధికారులలో తొలి కేడెట్ అయిన మేజర్ ప్రియా ఝింగన్.. మొన్నటి సుప్రీంకోర్టు తీర్పుకు ఒకరోజు ముందు ఇచ్చిన ఒక ఇంటర్వూ్యలో మన ప్రభుత్వ వాదనకు తగిన సమాధానమే చెప్పారు. ‘‘జవాన్లు మాట వినరని మీరే అనడం ద్వారా.. ‘మహిళా కమాండర్ మాట వినొద్దు’ అని మీరు చెబుతున్నట్లుగా ఉంది’’ అన్నారు ఝింగన్. ఏ సిపాయి అయినా కమాండర్ మాట వినకపోతే సైనిక చట్టాల ప్రకారం పనిష్మెంట్లు ఉంటాయి. పనిష్మెంట్ ఉంటుందన్న భయం ఉంటే.. పై అధికారి పురుషుడైనా, మహిళ అయినా మాట వినే తీరుతారు. ‘మహిళలు కుటుంబం కోసం యుద్ధరంగాన్ని కాదనుకుని పోతారు’ అని మరొక వాదన. అదీ నిజం కాదు. సమర్థతతో, అంకితభావంతో, త్యాగనిర తితో ఏ బాధ్యతనైనా నిర్వర్తించే మనోబలం, నిబద్ధత మహిళల్లో ఉన్నాయి కనుకనే ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పెద్ద వ్యవస్థలు విజయవంతంగా, నిరంతరాయంగా నడుస్తున్నాయి. ప్రియా ఝింగన్ భారతీయ సైనికదళం నూట ఇరవై నాలుగేళ్లుగా ఉంది. అంతకు ఏడేళ్ల ముందు నుంచే సైన్యం కోసం మహిళా నర్సుల సేవలు సిద్ధంగా ఉన్నాయి! మొదటి, రెండు ప్రపంచ యుద్ధాలలో భారత సైన్యంలోని నర్సులు మూడు వందల యాభై మందికి పైగా మరణించడమో, బందీలుగా శత్రువుల చేతికి చిక్కడమో జరిగింది. మరికొందరు అసలు ఏమైపోయారో కూడా తెలీదు. ఆ తర్వాత నలభై ఏడేళ్లకు గానీ మహిళల్ని వైద్యేతర విభాగాల్లోకి తీసుకునే చొరవ చేయలేకపోయింది భారత సైన్యం. తొలిసారి 1992లో నాన్–మెడికల్ విధుల్లోకి మహిళలు ప్రవేశించారు. తర్వాత పదిహేనేళ్లకు మన దేశం నుంచి ఐక్యరాజ్యసమితి తరఫున వందమందికిపైగా మహిళా పోలీసులు శాంతిస్థాపనకోసం లైబీరియా వెళ్లి సమర్థంగా విధులు నిర్వర్తించి వచ్చారు. 2014 నాటికి భారతీయ సైనిక దళంలో 3 శాతానికి, నావికాదళంలో 2.8 శాతానికి, వైమానిక దళంలో 8.5 శాతానికి మహిళ సంఖ్య పెరిగింది. 2015లో తొలిసారి ఫైటర్ పైలట్లుగా మహిళలు యుద్ధవిధుల్లోకీ వచ్చేశారు. -
కన్నీరు పెట్టించిన ఆవు ప్రేమ
-
అమ్మ అయిన రేష్మీమీనన్
ప్రతి స్త్రీ మాతృప్రేమను చవి చూసే తరుణం వ స్తుంది. నటి రేష్మీమీనన్ ప్రస్తుతం అలాంటి తల్లి ప్రేమను అనుభవిస్తున్నారు. అదేంటి ఆమె తల్లి అవ్వడం ఏమిటీ? ఇటీవలేగా నటుడు బాబీ సింహాతో ప్రేమ కలాపాలు అంటూ ప్రచారం హోరెత్తింది అంటారా? నిజమే. అది రియల్ లైఫ్ కథ. ఇది రీల్‌లైఫ్ కహానీ. ఇంతకీ విషయం ఏమిటంటే రేష్మీమీనన్ భయమా ఇరుక్కు అనే చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులో ఆమె ఒక బిడ్డ కు తల్లిగా నటించడం విశేషం. సంతోష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వసంతం ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. కోవైసరళ, నన్కడవుల్ రాజేంద్రన్, విజయ్ టీవీ.జగన్, లోల్లుసభ జీవా, భరణీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.జవహర్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర వివరాలను ఈయన తెలుపుతూ ఇది వినోదం మేళవిం చిన వైవిధ్యభరిత థ్రిల్లర్ కథా చిత్రం అని చెప్పా రు. వివాహానంతరం భార్యాభర్తల మధ్య ప్రేమను ఆవిష్కరించే చిత్రం భయమా ఇరుక్కు అని తెలిపారు. ఇందులో రేష్మీమీనన్ బిడ్డకు తల్లిగా నటించారని చెప్పారు. వీరిద్దరితోపాటు నాన్‌కడవుల్ రాజేంద్రన్ పాత్ర మొదటి నుంచి చివరి వరకూ పయనించే ముఖ్యమైన పాత్రగా ఉంటుందన్నారు. అదేవిధంగా కోవైసరళ స్వామీజీగా కీలక పాత్రలో నటిస్తున్నారని పేర్కొన్నారు. చిత్రం తొలి ఘట్టం షూటింగ్‌ను కేరళలో పూర్తి చేసినట్లు, రెండో ఘట్టం షూటింగ్‌ను చెన్నైలో చిత్రీకరిస్తునట్లు వెల్లడించారు. ఇందులో ఒక ఇల్లు ముఖ్య భూమికగా ఉంటుందన్నారు. కేరళలో జనసంచారానికి దూరంగా ఉన్న ఒక ఇంటిలో కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు చెప్పారు. ఎలాంటి రవాణా వసతులు లేని ఆ ఇంటిని చేరడానికి బోటులో మూడు గంటల పాటు ప్రయాణం చేయాల్సి వచ్చేదన్నారు. -
అయ్యో.. నవనీత
మెదక్ మండల ఎనగండ్ల గ్రామంలో సోమవారం ఉదయం ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతిచెందింది. తమకేం పాపం తెలియదని అత్తింటివారు అంటుంటే... అత్తింటివారే తమ పిల్లను చంపేశారని నవనీత పుట్టింటివారు ఆరోపిస్తున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా నవనీత మృతితో ఏడాదిన్నర వయస్సున్న ఆమె కుమారుడు మాత్రం మాతృప్రేమకు దూరమయ్యాడు. కొల్చారం: మండల పరిధిలోని ఎనగండ్ల గ్రామంలో సోమవారం ఉదయం ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతిచెందింది. ఈ సంఘటనకు సంబంధించి మెదక్ రూరల్ సీఐ రామకృష్ణ, మృతురాలి తల్లిదండ్రుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన రాములు, రామవ్వల కుమారుడు మల్లేశంతో రేగోడ్ మండలం ఖాదిరాబాద్‌కు చెందిన ఏసమ్మ, మల్లయ్య కూతురు నవనీత(24)కు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఏడాదిన్నర వయస్సున్న కుమారుడు ఉన్నాడు. వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఆదివారం కుటుంబ సమేతంగా వెళ్లి.. కౌడిపల్లి మండలం నల్లపోచమ్మ ఆలయం వద్ద మల్లేశం సోదరి కుమారుని పుట్టు వెంట్రుకలు తీసి, ఇంటికి చేరుకున్నారు. అదే రాత్రి కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగినట్లు చుట్టుపక్కల వారు తెలిపారు. సోమవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో భర్త మల్లేశం గణతంత్ర దినోత్సవంలో పాల్గొనేందుకు బయటకు వెళ్లగా.. మామ ఊరిబయట ఉన్న మేకల మంద వద్దకు వెళ్లాడు. అత్త రామవ్వ కల్లాపీ చల్లి.. పిల్లవాడికి పాలు తాగిం చి తాను కూడా మేకల వద్దకు వెళ్లింది. గంట తరువాత ఇంటికి తిరిగివచ్చిన అత్త రామవ్వకు లోపలి నుంచి కాలిన వాసన వచ్చింది. తలుపు తెరచి చూడగా పూర్తిగా కాలిన స్థితిలో నవనీత నిర్జీవంగా కనిపించింది. విషయం తెలుసుకున్న కొల్చా రం ఎస్ఐ రమేష్‌నాయక్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని శవాన్ని తరలించేందుకు ప్రయత్నించా డు. అయితే నవనీతను అత్తింటివారే చంపేశారం టూ మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. తమకు న్యాయం జరిగే వరకూ కదిలేదని లేదం టూ భీష్మించుకు కూర్చున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎస్ఐ రమేష్‌నాయక్ విషయాన్ని మెదక్ రూరల్ సీఐ రామకృష్ణకు తెలపడంతో ఆయన గ్రామానికి చేరుకుని నవనీత బంధువులకు నచ్చజెప్పారు. న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇవ్వడంతో బాధితులు శాంతించారు. అనంతరం నవనీత శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఆస్పత్రికి తరలించారు. -
అమృతాన్ని పంచే అమ్మలు!
తల్లిప్రేమకు సాటి మరేదీ రాదు. అలాగే తల్లిపాలకు కూడా. తల్లిపాలకు ప్రత్యామ్నాయం లేదు. అమ్మ పాలు అంటే అమృతమే... ఆ అమృతాన్ని పంచగలిగింది అమ్మలే!! మరి పురిటిలోనే తల్లికి దూరమైన బిడ్డకు? మరో తల్లి పెద్ద మనసుతో తన బిడ్డతోపాటు తల్లిలేని బిడ్డకూ పాలివ్వడం ఒక్కటే మార్గం. అందుకు ముందుకు వచ్చే వాళ్లెంతమంది? ఆ ప్రశ్నకు సమాధానంగా ‘నేనున్నాను’ అన్నారు లక్ష్మి. అలా ముందుకొచ్చే లక్ష్మిలాంటి ఎంతోమంది నుంచి పాలను సేకరించి, చంటి పాపలకు ఆ అమృతాన్ని అందించేందుకు ఇప్పుడు ఓ ‘అమ్మ పాల బ్యాంకు’ ప్రయత్నం జరుగుతోంది. లక్ష్మి తొమ్మిదవ నెల గర్భిణి. ప్రసవం అయిన తర్వాత తన బిడ్డతోపాటు మరో బిడ్డకు కూడా తన పాలనిచ్చి ఆ బిడ్డకు తల్లిపాల లోటును భర్తీ చేస్తానంటూ ‘అమ్మ పాల బ్యాంకు’కు పాలను దానమిచ్చే తొలి దాత అయ్యారు. తన సంకల్పానికి భగవంతుడు సహకరించి తగినన్ని పాలను ప్రసాదించాలని ప్రార్థిస్తున్నారామె. అమ్మ పాలను నిల్వ చేయడం, దానమివ్వడమనే ఆలోచన ఇప్పుడు ‘అమ్మ పాల బ్యాంకు’గా హైదరాబాద్‌లో ఆచరణలోకి వస్తోంది. తల్లిదండ్రులకు దూరమైన బిడ్డలు, తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యానికి బలైపోయి చెత్తకుప్పలోకి విసిరివేతకు లోనయిన చంటిబిడ్డలకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తోంది. వారిని పెంచి పెద్ద చేసి పిల్లల్లేని వారికి దత్తతనిస్తోంది కూడా. అలాంటి పిల్లలు హైదరాబాద్‌లోని ఒక్క శిశువిహార్‌లోనే వందల్లో ఉంటున్నారు. సరాసరిన రోజుకు పదహారు మంది చంటిబిడ్డలు కొత్తగా వచ్చి చేరుతూనే ఉన్నారు. కొందరిని పెంపకానికి తీసుకునే వాళ్లు తీసుకెళ్లే ప్రక్రియ కొనసాగుతూ ఉండగా... ఏడాదిలోపు పిల్లలు దాదాపు 80 మంది వరకు ఉంటున్నారు. వారందరినీ ప్రభుత్వం పోతపాలతో పోషిస్తోంది. వైద్యం అందిస్తోంది. తల్లిపాలు అందకపోతే అంటువ్యాధులు సులభంగా దాడిచేస్తాయి. పుట్టిన ప్రతి ఐదుగురిలో ఒక బిడ్డ మొదటి పుట్టిన రోజును చూడకనే కన్నుమూస్తోందని, పిల్లలకు తల్లిపాలతోనే ఆరోగ్యకరమైన భావితరం తయారవుతుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఎ.పి బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనూరాధారావు అనాథ పిల్లలకు తల్లిపాలను అందించడానికి ‘అమ్మ పాల బ్యాంకు’ను ఏర్పాటు చేశారు. పాలను దానం చేయాలనుకునే తల్లులను గుర్తించడం, పాలను సేకరించడం, నిల్వ చేయడం, ఆ పాలను అవసరమైన పిల్లలకు చేర్చడం ఈ ప్రక్రియకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రపంచ పిల్లల దినోత్సవం సందర్భంగా ఈ నెల ఒకటో తేదీన ప్రారంభించారు. ప్రస్తుతం హైదరాబాద్‌కే పరిమితమైన ఈ ప్రయత్నంలో పేరు నమోదు చేసుకున్న తల్లుల దగ్గరకు ‘అమ్మపాల బ్యాంకు’ కార్యకర్తలు రోజుకొకసారి వెళ్లి పాలను సేకరిస్తారు. తమతోపాటు సక్కర్, చల్లదనాన్ని నిలిపి ఉంచే ఫ్లాస్కు తీసుకెళ్తారు. ఆ పాలను స్థానిక లోటస్ హాస్పిటల్‌లోని ఫ్రీజర్‌లో ఉంచడానికి హాస్పిటల్ నిర్వాహకులు అంగీకరించారు. ఆ పాలను చంటిబిడ్డలకు చేర్చడం కూడా కార్యకర్తలే చేస్తారు. పాల సేకరణ పనిలో మహిళలే ఉంటారు. మరో బిడ్డకు ప్రాణదానం చేసిన సంతృప్తి! పాల దానం చేయడం ద్వారా మరో బిడ్డకు ప్రాణం పోసిన తల్లిగా సంతృప్తిని పొందవచ్చు. అయితే ‘‘నీ ఉదారత చాటుకోవడం కోసం కన్న బిడ్డను అర్ధాకలితో ఉంచుతావా’’ అని భర్త, అమ్మానాన్నలు, అత్తమామలు ప్రశ్నించడం సహజమే. సంగతిని వివరించి వాళ్లను సమాధానపరచడం చాలా ముఖ్యం. ఈ సందేహాలను నిపుణులు నివృత్తి చేస్తారు. పాలను దానం చేసే తల్లులు క్యాల్షియం లోపం రాకుండా, రక్తహీనతకు లోనుకాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే చాలు... ఇద్దరు బిడ్డలకు పాలివ్వడం కష్టమేమీ కాదు. తల్లిపాలదానం అనే జ్యోతిని లక్ష్మి ఉదాత్తమైన మనసుతో అందుకున్నారు. ఆమె నుంచి ఈ జ్యోతిని అందుకుంటూ ప్రస్థానాన్ని కొనసాగించడానికి మరెందరో తల్లులు ముందుకు వస్తారు. ఇందుకు నిదర్శనం ప్రారంభోత్సవం రోజునే హైదరాబాద్‌లోని మదీనాగూడలోని సత్యవేణి మురుగన్ నుంచి వచ్చిన ఫోన్‌కాలే!. బిడ్డ కోసం తల్లి ఏం చేయడానికైనా సిద్ధమవుతుంది. తల్లి మనసు... తల్లి లేని బిడ్డకు తల్లి ప్రేమను పంచడానికి ఏ మాత్రం సంశయించదు. తల్లి పాలు లేని బిడ్డను కూడా ఆదరించగలుగుతుంది. అందుకే ప్రపంచంలో అన్నింటికంటే తల్లి గొప్పది, తల్లి మనసు ఇంకా గొప్పది. అచ్చం తల్లిపాలలాగే. - వాకా మంజులారెడ్డి ఫొటో: ఠాకూర్ దేశంలో ఇదే తొలి ప్రయత్నం! దేశంలో ఈ ప్రక్రియ దాదాపు పది హాస్పిటళ్లలో ఉంది. అనారోగ్య కారణాల వల్ల తల్లి లేదా బిడ్డ ఐసియులో ఉన్నప్పుడు తల్లి నేరుగా పాలివ్వడం కుదరదు. అలాంటప్పుడు తల్లి నుంచి సేకరించిన పాలను హాస్పిటల్ వాళ్లే బిడ్డకు టైమ్ ప్రకారం పడతారు. అయితే ఈ పద్ధతిని తల్లికి దూరమైన బిడ్డలకు పట్టే ప్రయత్నం చేయడం మాత్రం మన దేశంలో ఇదే మొదటిసారి. గతంలో పురిట్లో తల్లిపోయిన బిడ్డలకు మరో తల్లి విశాల దృక్పథంతో తనబిడ్డతోపాటుగా పాలిచ్చి బతికించేది. అలాంటిదే ఇది కూడా. - అనూరాధారావు, ఎ.పి బాలల హక్కుల సంఘం నిర్వాహకురాలు తల్లులకు ఏ రకంగా మేలు! సెల్ఫ్ కాంట్రాసెప్టివ్... సాధారణంగా పాలిస్తున్నంత కాలం గర్భధారణ జరగదు. బినైన్ కణుతులు... పాలు ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉండి కూడా వినియోగించుకోని వారిలో రొమ్ములలో బినైన్ కణుతులు ఏర్పడడాన్ని గమనిస్తుంటాం. ఇవ్వగలిగినంత కాలం బిడ్డకు పాలివ్వడం వల్ల ఈ కణుతులను నివారించవచ్చు. బిడ్డను కోల్పోయిన మహిళ మానసిక స్థితి ఆందోళనకరంగా ఉంటుంది. అలాంటి వారు ఈ సమయాన్ని మరో బిడ్డకు పాలివ్వడానికి కేటాయిస్తే మానసిక సాంత్వన కలుగుతుంది. ఒక బిడ్డ ప్రాణాన్ని నిలుపుతున్నాననే సంతోషం ఉంటుంది. తల్లి పాల గురించి ... - చంటిబిడ్డకు రోజుకు 150 మిల్లీలీటర్ల తల్లిపాలు కావాలి. - ఆరోగ్యవంతమైన తల్లికి రోజుకు 600- 700 మి.లీ పాలు ఉత్పత్తి అవుతాయి. - ఒక బిడ్డ గరిష్ఠంగా 300 మిల్లీలీటర్ల పాలను మాత్రమే తాగుతుంది. - తల్లి నుంచి సేకరించిన పాలను 63 డిగ్రీల ఫారన్హీట్లోపు ఉష్ణోగ్రతలో నిల్వ చేస్తే 90 రోజులు ఉంటాయి. పాశ్చరైజేషన్ చేస్తే ఆరు నెలలు పాడవవు. - ఎందరు తల్లుల పాలనైనా కలిపి ఒకే పాత్రలో నిల్వ చేయవచ్చు. - మొదటిసారి పాలను సేకరించిన తర్వాత ఆ పాలను స్క్రీనింగ్ చేస్తారు. అవకాశం ఉంటే వదులుకోవద్దు! అవసరం నుంచి వచ్చిన ఆలోచన ఇది. పాలు లేని పిల్లలు ఎదురుగా కనిపిస్తుంటే చూస్తూ ఊరుకోవడం చేతకాలేదు. నా భర్త వెంటనే ఒప్పుకున్నారు. తర్వాత నా బిడ్డకు వచ్చిన నష్టం ఏమీ లేదని అమ్మకు, అత్తగారికి వివరించాను. నేను బాలింతలకు చెప్పేది ఒక్కటే... ‘మరో బిడ్డను కాపాడే అవకాశం ఉంటే దానిని అనవసరమైన భయాలతో వదులుకోవద్దు. ప్రాణం పోయడంలో ఉండే ఆనందాన్ని అనుభవంలోకి తెచ్చుకోండి’ అని. - లక్ష్మి, అమ్మపాల దానానికి సిద్ధపడిన కాబోయే తల్లి