MPCC
-
పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధమే : కమల్‌నాథ్
భోపాల్ : రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ముందుకొచ్చారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కమల్‌నాథ్ వెల్లడించారు. గురువారం భోపాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ ఓటమికి నేను పూర్తి భాధ్యత వహిస్తున్నాను. రాహుల్ గాంధీ నిర్ణయం సరైందే. ఎంపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాన’ని తెలిపారు. పార్టీలో అత్యున్నత స్థానాల్లో ఉన్నవారు ఎవరూ కూడా లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహించకపోవడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతిత తెలిసిందే. అంతేకాకుండా అధ్యక్ష పదవి నుంచి తప్పుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కమల్‌నాథ్ కూడా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లోని 29 లోక్‌సభ స్థానాలకు గానూ కాంగ్రెస్ ఒక స్థానంలో విజయం సాధించింది. కాగా, కాంగ్రెస్ అధిష్టానం 2018 ఏప్రిల్‌లో కమల్‌నాథ్‌ను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అద్యక్షునిగా నియమించింది. అయితే గతేడాది డిసెంబర్లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆయన ఎంపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి ముందుకొచ్చారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం కమల్‌నాథ్‌ను ఆ పదవిలో కొనసాగాలని కోరింది. -
మూకుమ్మడి దాడి
- రైలు చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ఒక్కటైన ప్రతిపక్షాలు - టికెట్ లేకుండా సీఎస్టీ నుంచి ఠాణేకు కాంగ్రెస్ నాయకుల ప్రయాణం - రైలు టికెట్ తీసుకోవద్దని ప్రయాణికులకు ఎన్సీపీ పిలుపు - కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించిన ప్రజాసంఘాలు సాక్షి, ముంబై: రైలు చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, ఎన్సీపీలతోపాటు ప్రజాసంఘాలు కేంద్ర ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగాయి. సామాన్య ప్రజలపై భారం మోపే నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలతో నగరంలోని సీఎస్టీ, ఠాణే, బోరివలి తదితర రైల్వే స్టేషన్లు మార్మోగాయి. రాజకీయ పార్టీలకు ప్రజాసంఘాలు కూడా తోడవడంతో ఆందోళన తారాస్థాయికి చేరింది. ఎంపీసీసీ ఆధ్వర్యంలో... మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఎంపీసీసీ) ఆధ్వర్యంలో సోమవారం వినూత్న రీతిలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎస్టీలో నిర్వహించిన ఈ ఆందోళనలో వేలమంది పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ‘ఈసారి మోడీ సర్కార్’(ఇస్‌బార్ మోడీ సర్కార్) అంటూ ఎన్నికలకు ముందు బీజేపీ చేసిన ప్రచారానికి వ్యంగ్యాన్ని జోడిస్తూ.. ‘ఈసారి ఖరీదైన సర్కార్’(ఇస్‌బార్ మెహెంగీ సర్కార్) అంటూ రాసిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ సీఎస్టీ రైల్వే స్టేషన్లో ఆందోళనకు దిగారు. ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే నేతృత్వంలో నిర్వహించిన ఈ ఆందోళనలో పార్టీ నేతలతోపాటు గల్లీస్థాయి నేతలు కూడా పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం సీఎస్టీ నుంచి ఠాణే వరకు టికెట్ లేకుండానే ప్రయాణించి నిరసన తెలిపారు. దారి పొడవునా ఎన్డీయే ప్రభుత్వానికి, మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఠాణే చేరుకున్న తర్వాత అక్కడి ైరె ల్వే స్టేషన్లో నినాదాలు మరింత జోరందుకున్నాయి. ఎన్సీపీ ఆధ్వర్యంలో.. రైల్వేచార్జీల పెంపుపై ఎన్సీపీ కూడా ఆందోళనకు దిగింది. బోరివలి ైరైల్వేస్టేషన్కు పెద్ద ఎత్తున చేరుకున్న కార్యకర్తలు తమదైన రీతిలో ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వానికి, మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వచ్చిపోయే రైళ్లను అడ్డుకునేందుకు ప్రయత్నించగా రైల్వే పోలీసులు వద్దని వారించడంతో వెనక్కు తగ్గారు. సామాన్యులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతోనే రైల్‌రోకోను చేపట్టడంలేదని ఆ పార్టీ నేతలు మీడియాకు తెలిపారు. టికెట్ లేకుండా ప్రయాణించాలి: జితేంద్ర రైల్వేచార్జీల పెంపునకు వ్యతిరేకంగా ప్రయాణికులందరూ టికెట్ లేకుండా ప్రయాణించాలని ఎన్సీపీ నాయకుడు జితేంద్ర అవ్హాడ్ పిలుపునిచ్చారు. ఔరంగాబాద్‌లో జరిగిన ‘కాఫీ విత్ స్టూడెంట్స్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజలను మోడీ ప్రభుత్వం నమ్మించి, మోసగించిందన్నారు. కోర్టును ఆశ్రయించిన ప్రయాణికుల సంఘాలు రైల్వే చార్జీల పెంపును సవాలుచేస్తూ ప్రజాసంఘాలు కోర్టును ఆశ్రయించారు. చార్జీల పెంపుతో ముంబై సబర్బన్ ప్రయాణికులపై భారీ ఎత్తున భారం పడనుందని, వెంటనే నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోరాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ముంబై హై కోర్టులో ప్రయాణికుల సంఘం కూడా మరో పిటిషన్ వేసింది. దీనిపై నేడు విచారణ జరగనున్నట్టు తెలిసింది. -
మరింత పుంజుకున్నాం : ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్‌ఠాక్రే
నాగపూర్: తమ పార్టీ కొంతమేర పుంజుకుందని ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్‌ఠాక్రే పేర్కొన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. సాంగ్లి మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్సీపీ అధికారంలో ఉందని, అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ అద్భుతమైన ఫలితాలను సాధించిందన్నారు. భోర్ మున్సిపల్ కార్పొరేషన్లో సైతం తమ పార్టీ విజయకేతనం ఎగురవేసిందని, తమ భాగస్వామ్యపక్షమైన ఎన్సీపీని ఓడించామన్నారు. ఇక పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ)కి జరిగిన ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ స్థానాన్ని దక్కించుకోవడమే కాకుండా ఎన్సీపీని నాలుగో స్థానంలో నెట్టేశామన్నారు. ఈ నెలాఖరులో జల్గావ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్నాయని, ప్రస్తుతం దానిపై తమ పార్టీ దృష్టి పెట్టిందన్నారు. జల్గావ్లో బాగానే పనిచేస్తున్నప్పటికీ అక్కడి కార్పొరేషన్లో తమ పార్టీకి అసలు ప్రాతినిధ్యమే లేదన్నారు. బలాబలాల ఆధారంగానే... వచ్చే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీతో కలసి బరిలోకి దిగుతారా అని మీడియా ప్రశ్నించగా ఆయా ప్రాంతాల్లో బలాబలాలను ఆధారంగా చేసుకుని ముందుకు సాగుతామన్నారు. ఏదిఏమైనప్పటికీ ఈ విషయంలో పార్టీ అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇంకా అప్పటి రాజకీయ పరిస్థితులు, ఆయా అభ్యర్థుల బలాబలాలు తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. అయితే ఎన్నికల గురించి మాట్లాడడం తొందరపాటే అవుతుందన్నారు. విదర్భపై మౌనం ప్రత్యేక విదర్భ రాష్ట్ర అంశంపై మీడియా ప్రశ్నించగా ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్‌ఠాక్రే ఏమాత్రం స్పందించలేదు. మౌనం వహించారు. -
మరింత పుంజుకున్నాం : ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్‌ఠాక్రే
నాగపూర్: తమ పార్టీ కొంతమేర పుంజుకుందని ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్‌ఠాక్రే పేర్కొన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. సాంగ్లి మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్సీపీ అధికారంలో ఉందని, అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ అద్భుతమైన ఫలితాలను సాధించిందన్నారు. భోర్ మున్సిపల్ కార్పొరేషన్లో సైతం తమ పార్టీ విజయకేతనం ఎగురవేసిందని, తమ భాగస్వామ్యపక్షమైన ఎన్సీపీని ఓడించామన్నారు. ఇక పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ)కి జరిగిన ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ స్థానాన్ని దక్కించుకోవడమే కాకుండా ఎన్సీపీని నాలుగో స్థానంలో నెట్టేశామన్నారు. ఈ నెలాఖరులో జల్గావ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్నాయని, ప్రస్తుతం దానిపై తమ పార్టీ దృష్టి పెట్టిందన్నారు. జల్గావ్లో బాగానే పనిచేస్తున్నప్పటికీ అక్కడి కార్పొరేషన్లో తమ పార్టీకి అసలు ప్రాతినిధ్యమే లేదన్నారు. బలాబలాల ఆధారంగానే... వచ్చే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీతో కలసి బరిలోకి దిగుతారా అని మీడియా ప్రశ్నించగా ఆయా ప్రాంతాల్లో బలాబలాలను ఆధారంగా చేసుకుని ముందుకు సాగుతామన్నారు. ఏదిఏమైనప్పటికీ ఈ విషయంలో పార్టీ అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇంకా అప్పటి రాజకీయ పరిస్థితులు, ఆయా అభ్యర్థుల బలాబలాలు తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. అయితే ఎన్నికల గురించి మాట్లాడడం తొందరపాటే అవుతుందన్నారు. విదర్భపై మౌనం ప్రత్యేక విదర్భ రాష్ట్ర అంశంపై మీడియా ప్రశ్నించగా ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్‌ఠాక్రే ఏమాత్రం స్పందించలేదు. మౌనం వహించారు.