MPTC member
-
రా..చూసుకుందాం!
♦ రసాభాసగా కనిగిరి మండల పరిషత్ సమావేశం ♦ ఒకరినొకరు తోసుకున్న అధికార పార్టీ సభ్యులు ♦ మైక్ విసిరికొట్టిన ఎంపీటీసీ గురవయ్య ప్రకాశం కనిగిరి : ఏం.. ఏంటి నువ్వు మాట్లాడేది.. దమ్ముంటే బయటకు రా.. చూసుకుందాం.. ఇవి ఎక్కడో వీధి రౌడీల మాటలు కాదు. కనిగిరి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో అధికార పార్టీ నాయకుల హెచ్చరికలు. అంతటితో ఆగకుండా ఒకరినొకరు తోసుకోవడంతో సభ రసాభాసగా ముగిసింది. మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ నంబుల వెంకటేశ్వర్లు అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఏఈఓ మాట్లాడిన తర్వాత ఎంపీటీసీ సభ్యుడు కాసుల గురవయ్య జోక్యం చేసుకుని పంట నష్టపరిహారానికి సంబంధించి యడవల్లి పంచాయతీ నుంచి 200 మంది రైతుల పేర్లు ఇచ్చారని, అందులో 90 మందినే అర్హులుగా గుర్తించారని, కేవలం ఒక వర్గం వారికే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ గురవయ్య నిలదీశాడు. ఆ 90 మందిలో కూడా 20 మంది అనర్హులు, ఇతర గ్రామాల వారున్నారని, వారికి రూ.5 లక్షలు వస్తాయని, మీరు, నాయకులు కుమ్మక్కై పంచుకుంటున్నారా..అంటూ ఘాటుగా ఆరోపించారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు కూడా ఎంపీపీ వర్గానికే ఇచ్చారని, మేం అధికార పార్టీ నాయకులం కాదా అంటూ.. ఎంపీడీఓపై ధ్వజమెత్తారు. పరిహారం జాబితాపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అధికారులు, నాయకులపై ఆరోపణలు చేయడం సరికాదని వైస్ ఎంపీపీ పాలూరి రమణారెడ్డి సర్ది చెప్పే ప్రయత్నం చేయడంతో వారిద్దరి మధ్య దాదాపు అరగంట సేపు వాదులాట జరిగింది. నీన్ను అడగలేదు.. నేను ఎంపీపీని అడుగుతున్నా.. అసలు నీవు ఎవరు స్పందించడానికని ఎంపీటీసీ కాసుల గురవయ్య వైస్ ఎంపీపీపై మండిపడ్డారు. తనకు సమాధానం చెప్పేంత వరకూ సమావేశం జరగన్వినని గురవయ్య అనడంతో అసలు నువ్వు ఎవరంటే.. నువ్వ ఎవరంటూ.. ఎంపీటీసీ కాసుల, వైస్ ఎంపీపీ పాలూరి మధ్య పెద్ద రగడే జరిగింది. ఈ క్రమంలో ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యుల మధ్య కూడా వాదన జరిగింది. గురవయ్య మైక్ పీకేయడంతో రచ్చ మరింత పెరిగింది. రా..చూసుకుందాం రా.. అంటూ ఒకరిపైకి మరొకరు వెళ్లి తోసుకున్నారు. జెడ్పీటీసీ దంతులూరి ప్రకాశం, మిగిలిన సభ్యులు, ఎంపీడీఓ జోక్యం చేసుకోవడంతో సమస్య సద్దుమణిగింది. సమస్యలపై ధ్వజమెత్తిన వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యుడు సభలో పలు సమస్యలపై వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యుడు బాల మాలకొండారెడ్డి అధికారులను నిలదీశారు. బల్లిపల్లిలో డ్వాక్రా గ్రూపు అధ్యక్షురాలు రూ 2.09 లక్షలు స్వాహా చేసినా ఎందుకు పట్టించుకోలేదని ఏపీఎంను నిలదీశారు. విషయం తన దృష్టికి ఆలస్యంగా వచ్చిందని, బ్యాంక్ మేనేజర్‌తో మాట్లాడి విచారణ చేయిస్తామని ఆయన వివరణ ఇచ్చారు. పారిశుద్ధ్యం, పాఠశాలలో పరిశుభ్రత, తదితర అంశాలపై సభ్యులు మాట్లాడారు. సమావేశంలో డిప్యూటీ డీఈఓ జి.సుబ్బరత్నం, డాక్టర్ రాజ్యలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు
కొడవలూరు: తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని కమ్మపాళెం ఎంపీటీసీ సభ్యురాలు మాణికల చెంచమ్మ తహసీల్దారు రామకృష్ణ, ఎస్ఐ అంజిరెడ్డిల వద్ద శనివారం స్పష్టం చేశారు. ఎంపీటీసీ సభ్యురాలు చెంచమ్మను కిడ్నాప్ చేశారని ఆమె భర్త రమణయ్య స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయడం తెల్సిందే. ఈ క్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు చెంచమ్మ స్వతహాగా శనివారం తహసీల్దార్ రామకృష్ణ, ఎస్సై అంజిరెడినిు కలిసి తననెవరూ కిడ్నాప్ చేయలేదంటూ రాతపూర్వకంగా స్టేట్మెంట్ ఇచ్చారు. తన భర్త రమణయ్యతో విడిపోయి నాలుగేళ్లయిందని, ఇద్దరం వేర్వేరుగా ఉంటున్నట్లు స్టేట్మెంట్లో పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా కొందరు తనపై కిడ్నాప్ కేసు పెట్టించారే తప్ప తననెవరూ కిడ్నాప్ చేయలేదని, బుచ్చిరెడ్డిపాళెంలో ఉంటున్న తన సోదరికి ఆరోగ్యం సక్రమంగా లేకపోతే అక్కడ పది రోజులపాటు ఉండి తిరిగి వచ్చినట్లు చెప్పారు. గ్రామానికి వచ్చిన వెంటనే కిడ్నాప్‌నకు గురైనట్లు కేసు నమోదైన విషయాన్ని తన తల్లి ద్వారా తెలుసుకొని తహసీల్దార్, ఎస్సైకి తెలిపేందుకు వచ్చానన్నారు. ఎంపీటీసీ సభ్యురాలు ఇచ్చిన స్టేట్మెంట్ను ధ్రువీకరించిన తహసీల్దార్ ఆ స్టేట్మెంట్ కాపీని ఎస్సైకు పంపారు. ఎంపీటీసీ సభ్యురాలి వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాపా వెంకటేశ్వర్లునాయుడు, మండల కన్వీనర్ వెంకటశేషయ్య, సర్పంచ్ నాగిరెడ్డి రమేష్, యువజన విభాగ జిల్లా కార్యదర్శి రాజేష్‌రెడ్డి, న్యాయవాది శ్యామాచార్యులు ఉన్నారు. -
సెల్ టవర్ ఎక్కిన ఎంపీటీసీ సభ్యురాలు
పెంటపాడు : గ్రామంలో నివాసాల మధ్య ఉన్న మద్యం షాపును తొలగించాలని పెంటపాడులో మహిళలు శుక్రవారం నిరసన తెలిపారు. పెంటపాడు ఊరవు చెరువుగట్టు వద్ద గూడెం-భీమవరం రోడ్డు పక్కన మద్యం షాపు ముందు రాస్తారోకో చేశారు. నిరసనకు నాయకత్వం వహించిన వైఎస్సార్ సీపీ నాయకురాలు, ఎంపీటీసీ సభ్యురాలు పోతంశెట్టి లక్ష్మి స్థానిక గేట్ సెంటర్లో సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. ఆమె మట్లాడుతూ తాగునీటి చెరువు పక్కన ఉన్న మద్యం షాపుతో చెరువులో పడి పలువురు తాగుబోతులు మరణించారని చెప్పారు. షాపుకు సమీపంలో సాయి మందిరం, కొద్ది దూరంలో జూనియర్, డిగ్రీ కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నా ఎక్సైజ్ అధికారులు మద్యం షాపుకు ఎలా అనుమతి ఇచ్చార ని ప్రశ్నించారు. గతంలో ఇక్కడ నుంచి మద్యం షాపు ఎత్తేయాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించిన అనంతరం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు షాపును ఇక్కడినుంచి మార్చాలని తెలిపినా యజమానులు ఖాతరు చేయ లేదన్నారు. దీనిపై పంచాయతీ కూడా తీర్మానం చేసి మద్యం షాపును ఊరికి దూరంగా పంపాలన్నారు. సెల్ టవర్ ఎక్కిన లక్ష్మిని ఆందోళన విరమించాలని గూడెం ఎక్సైజ్ సీఐ సుంకర సాయి స్వరూప్ కోరారు. అధికారులు పుష్కరాల డ్యూటీలో ఉన్నారన్నారు. షాపు యజమాని ఇక్కడి నుంచి షాపును మార్చుకొనేందుకు అంగీకరించారన్నారు. అభ్యంతరాలను లిఖితపూర్వకంగా ఏలూరు ఎక్సైజ్ కార్యాలయానికి అందజేయాలని సూచించారు. లక్ష్మి ఆందోళన విరమించారు. సీపీఐ నాయకులు కళింగ లక్ష్మణరావు పాల్గొన్నారు. -
హత్యకు గురైన MPTC సలీం
-
కేవీబీపురం ఎంపీపీగా సులోచన
కేవీబీపురం : కేవీబీపురం మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలిగా వైఎస్సార్సీపీ అభ్యర్థి, కళత్తూరు ఎంపీటీసీ సభ్యురాలు తుపాకుల సులోచన (ఎస్టీ) ఎన్నికయ్యారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల అధికారి సోడవరం రాజు ఎన్నికలు నిర్వహించా రు. గతంలో ఇప్పటివరకు నాలుగు సార్లు ఎన్నికల కోసం సమావేశం నిర్వహించారు. కోరం లేదని రెండుసార్లు, మద్దతు లేదని రెండు సార్లు ఎన్నిక ను వాయిదా వేశారు. తాజాగా మంగళవారం కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీ సభ్యులు నందకుమార్, సులోచన మాత్రమే హాజరయ్యూరు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎంపీపీ పదవికి అర్హతగల అభ్యర్థి తుపాకుల సులోచన ఒక్కరే ఉండడంతో ఆమెను ఎన్నుకోవాలని ఆదేశాలు అందించారు. దీంతో సులోచన ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఉత్తర్వులు అందజేశారు. చట్టపరంగా సులోచనను ఎన్నుకున్నట్లు ఆయన తెలిపా రు. ఈ ఎన్నికల సందర్భంగా స్థానిక ఎస్ఐ విశ్వనాథ్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపీడీవో మోహన్‌రావు, చిత్తూరు డీఎస్పీ కమలాకర్‌రెడ్డి, పుత్తూరు సీఐ చంద్రశేఖర్, పిచ్చాటూరు ఎస్ఐ పురుషోత్తంరెడ్డి, నారాయణవనం ఎస్ఐ శివకుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఇదీ సంగతి : కేవీబీ పురం ఎంపీపీ పదవి ఎస్టీ మహిళకు రిజర్వ్ అరుుంది. మండలంలో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలుండగా, పదింటిని టీడీపీై కెవశం చేసుకుంది. అరుుతే వారిలో ఒకరు కూడా ఎస్టీ మహిళ లేరు. కష్టానికి ఫలితం దక్కింది ఎన్నికల్లో పడిన కష్టానికి ఫలితం దక్కిం దని ఎంపీపీ తుపాకుల సులోచన చెప్పా రు. మంగళవారం ఆమె ఎంపీడీవో కార్యాలయంలో మాట్లాడుతూ మూడు నెలలుగా ఎంతో ఉత్కంఠ రేపిన ఎంపీ పీ ఎన్నికలకు ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నానని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు రిజర్వేషన్ అమలు చేయడంతో అధికారులు న్యాయంగావ్యవహరించారని సులోచన చెప్పారు. అధికార పార్టీ నాయకులు ఎన్నో ప్రలోభాలకు గురిచేసినా జగనన్నపై ఉన్న అభిమానంతోనే పార్టీలో ఉన్నానన్నారు. తనను ఎంపీటీసీ సభ్యురాలిగా గెలిపించిన కలత్తూరు గ్రామ ప్రజలకు రుణపడి ఉన్నానని చెప్పారు. -
కిడ్నాప్ పై హైకోర్టులో పిటిషన్